మనిషిగా పుట్టినోడు / Manishigaa Puttinodu

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: AR Stevenson

మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా
మరల మంటిలో కలవవలయురా
తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా
ఇల సంపాదన వదలవలయురా (2)
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో
ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో (2)

ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలి
ఆరిపోని అగ్నిలో యుగయుగాలు కాలాలి (2)
క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు
స్వర్గానికి ఆయనతో వారసులౌతారు (2)        ||మనిషిగా||

జన్మనిచ్చినవాడు యేసు క్రీస్తు దేవుడే
జన్మించకముందే నిన్నెరిగిన నాథుడే (2)
ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే
నీ జన్మకు నిజమైన అర్ధముందిలే (2)        ||మనిషిగా||

నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు
చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు (2)
నీలోని ఆత్మకు స్వర్గమో నరకమో
నిర్ణయించు సమయమిదే కళ్ళు తెరుచుకో (2)        ||మనిషిగా||

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: AR Stevenson

Manishigaa Puttinodu Mahaathmudainaa
Marala Mantilo Kalavavalayuraa
Theesukoni Poledu Poochika Pullainaa
Ila Sampaadana Vadalavalayuraa (2)
Deepamundagaane Illu Chakkabettuko
Praanamundagaane Neevu Prabhuni Nammuko (2)

Okesaari Janmisthe Rendu Saarlu Chaavaali
Aariponi Agnilo Yugayugaalu Kaalaali (2)
Kreesthulo Puttinollu Rendava Maaru
Swargaaniki Aayanatho Vaarasulauthaaru (2)        ||Manishigaa||

Janmanichchinavaadu Yesu Kreesthu Devude
Janminchakamunde Ninnerigina Naathude (2)
Aayananu Nammi Punarjanma Pondithe
Nee Janmaku Nijamaina Ardhamundile (2)        ||Manishigaa||

Neelo Unna Oopiri Gaalani Bhramapadaku
Chachchinaaka Emauno Evariki Thelusanaku (2)
Neeloni Aathmaku Swargamo Narakamo
Nirnayinchu Samayamide Kallu Theruchuko (2)        ||Manishigaa||

ధ్యానించుచుంటిమి / Dhyaaninchuchunitimi

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన – విలువైన నీ మాటలు
ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు (2)
మోక్షమునకు చేర్చు బాటలు
పరిశుద్ధతలో పరిపూర్ణుడా – ఉన్నత గుణ సంపన్నుడా (2)
శ్రేష్టుడా…                                  ||ధ్యానించుచుంటిమి||

తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు
వీరిని దయతో క్షమించుము (2)
అని ప్రార్ధన చేసావా బాధించే వారికి (2)
శత్రువులను ప్రేమించుట నేర్పుటకై (2)           ||పరిశుద్ధతలో||

నేడే నాతోను పరదైసులో నీవుందువు
నిశ్చయముగ ప్రవేశింతువు (2)
అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి (2)
అధికారముతో పాపిని రక్షించి (2)           ||పరిశుద్ధతలో||

ఇదిగో నీ తల్లి ఇతడే నీ కుమారుడు
కష్టము రానీయకు ఎప్పుడు (2)
అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను (2)
తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను (2)           ||పరిశుద్ధతలో||

దేవా నా దేవా నను విడనాడితివెందుకు
చెవినీయవె నా ప్రార్థనకు (2)
అని కేక వేసావా శిక్షననుభవిస్తూ (2)
పరలోక మార్గం సిద్ధము చేస్తూ (2)           ||పరిశుద్ధతలో||

సర్వ సృష్టికర్తను నే దప్పిగొనుచుంటిని
వాక్యము నెరవేర్చుచుంటిని (2)
అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు (2)
జీవ జలమును అనుగ్రహించుటకు (2)           ||పరిశుద్ధతలో||

సమాప్తిమయ్యింది లోక విమోచన కార్యం
నెరవేరెను ఘన సంకల్పం (2)
అని ప్రకటన చేసావా కల్వరి గిరి నుంచి (2)
పని ముగించి నీ తండ్రిని ఘనపరచి (2)           ||పరిశుద్ధతలో||

నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని
నీ యొద్దకు వచ్చుచుంటిని (2)
అని విన్నవించావా విధేయత తోటి (2)
తల వంచి తృప్తిగ విజయము చాటి (2)           ||పరిశుద్ధతలో||

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Dhyaaninchuchuntimi Siluvapai Palikina – Viluvaina Nee Maatalu
Praanaathmalanu Sedadeerchu Jeeva Ootalu (2)
Mokshamunaku Cherchu Baatalu
Parishuddhathalo Paripoornudaa – Unnatha Guna Sampannudaa (2)
Sreshtudaa…                                  ||Dhyaaninchuchuntimi||

Thandri Veeremi Cheyuchunnaaro Erugaru
Veerini Dayatho Kshaminchumu (2)
Ani Praardhana Chesaavaa Baadhinche Vaarikai (2)
Shathruvulanu Preminchuta Nerputakai (2)        ||Parishuddhathalo||

Nede Naathonu Paradaisulo Neevunduvu
Nischayamuga Praveshinthuvu (2)
Ani Maata Ichchaavaa Donga Vaipu Choochi (2)
Adhikaaramutho Paapini Rakshinchi (2)        ||Parishuddhathalo||

Idigo Nee Thalli Ithade Nee Kumaarudu
Kashtamu Raaneeyaku Eppudu (2)
Ani Shishyunikichchaavaa Amma Baadhyathanu (2)
Theliyajeya Kutumba Praadhaanyathanu (2)        ||Parishuddhathalo||

Devaa Naa Devaa Nanu Vidanaadithivenduku
Chevineeyave Naa Praardhanaku (2)
Ani Keka Vesaavaa Shikshananubhavisthu (2)
Paraloka Maargam Siddhamu Chesthu (2)        ||Parishuddhathalo||

Sarva Srushtikarthanu Ne Dappigonuchuntini
Vaakyamu Neraverchuchuntini (2)
Ani Sathyamu Thelipaavaa Kannulu Therachutaku (2)
Jeeva Jalamunu Anugrahinchutaku (2)        ||Parishuddhathalo||

Samaapthmayyindi Loka Vimochana Kaaryam
Neraverenu Ghana Sankalpam (2)
Ani Prakatana Chesaavaa Kalvari Giri Nunchi (2)
Pani Muginchi Nee Thandrini Ghanaparachi (2)        ||Parishuddhathalo||

Naa Aathmanu Nee Chethiki Appaginchuchuntini
Nee Yoddaku Vachchuchuntini (2)
Ani Vinnavinchaavaa Vidheyatha Thoti (2)
Thala Vanchi Thrupthiga Vijayamu Chaati (2)        ||Parishuddhathalo||

అంబరానికి అంటేలా (ఏ ఆర్ స్టీవెన్సన్) / Ambaraaniki Antelaa (Yesayya Puttaadani)  A R Stevenson

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్

అంబరానికి అంటేలా
సంబరాలతో చాటాలా (2)
యేసయ్య పుట్టాడని
రక్షింప వచ్చాడని (2)

ప్రవచనాలు నెరవేరాయి
శ్రమ దినాలు ఇక పోయాయి (2)
విడుదల ప్రకటించే
శిక్షను తప్పించే (2)           ||యేసయ్య||

దివిజానాలు సమకూరాయి
ఘనస్వరాలు వినిపించాయి (2)
పరముకు నడిపించే
మార్గము చూపించే (2)           ||యేసయ్య||

సుమ వనాలు పులకించాయి
పరిమళాలు వెదజల్లాయి (2)
ఇలలో నశియించే
జనులను ప్రేమించే (2)           ||యేసయ్య||

Lyricist: A R Stevenson

Ambaraaniki Antelaa
Sambaraalatho Chaataalaa (2)
Yesayya Puttaadani
Rakshimpa Vachchaadani (2)

Pravachanaalu Neraveraayi
Shrama Dinaalu Ika Poyaayi (2)
Vidudala Prakatinche
Shikshanu Thappinche (2)          ||Yesayya||

Divijanaalu Samakooraayi
Ghanaswaraalu Vinipinchaayi (2)
Paramuku Nadipinche
Maargamu Choopinche (2)          ||Yesayya||

Suma Vanaalu Pulakinchaayi
Parimalaalu Vedajallaayi (2)
Ilalo Nashiyinche
Janulanu Preminche (2)          ||Yesayya||