…ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. యోహాను 4:24
పల్లవి : ఆరాధించెదము (3) ఆరాధింతుము (1)
అ.ప.: తండ్రీ నిన్నే ఆరా-ధింతుము(2)
నిన్నే స్తుతించి ఆరా-ధింతుము(2)
1.యేసువా నిన్నే ఆరా-ధింతుము(2)
నిన్నే పొగడి ఆరా-ధింతుము (2) ॥ఆరా॥
2. శుద్ధాత్మా నిన్నే ఆరా-ధింతుము(2)
నీతో నిండి ఆరా-ధింతుము(2) ॥ఆరా॥
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును… కీర్తన 91:4
1. ఆయనాశ్చర్యకరుడు (2)
నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును – ఆయనాశ్చర్యకరుడు (2)
2. ఆయనే మహోన్నతుడు (2)
గద్దించును గాలిని అలలను – ఆయనే మహోన్నతుడు
3. ఆయనే నా ఆశ్రయము(2)
తన రెక్కలతో నను కప్పును – ఆయనే నా ఆశ్రయము(2)
He shall cover thee with His feathers,… Psalms 91:4
I know He is wonderful (2)
He\’s a Saviour, Keeper, Sanctifier
I know He is wonderful(2)
ఆయన కొండలోయలలో నీటిబుగ్గలను పుట్టించును… కీర్తన 104:10
1. ఆకాశములో చూడుము – సూర్య చంద్ర తారలు (2)
నలుదిక్కుల చూడుము – గడ్డి పువ్వులను (2)
వీటన్నిటిని – ప్రభువే చేసెను (2)
2. ఉన్నత పర్వతములు – మంచుతో కప్పబడెను
అచ్చటనుండి నీరు – నదిగా ప్రవహించున్
వీటన్నిటిని – ప్రభువే చేసెను
3. మోకాళ్లూని ప్రార్ధింతున్ – ప్రభును ఆరాధింతున్
యేసు నా ప్రభువా! రక్షకుడవు
చిన్న పిల్లలము – మమ్ము దీవించు
ఆ-మేన్ ఆ-మేన్ ఆ.. ఆ.. ఆ.. ఆ-మేన్
… సమస్త సమూహమును… దేవుడు… యేడవదినములోగా సంపూర్తిచేసి,… ఆది 2:1,2
పల్లవి : ఆదిలో మన దేవుడు – భూమి ఆకాశంబుల సృజియించెను (2)
1. శూన్యము నుండి సృష్టిని చేసే – చీకటిని వెలుగుగ మార్చెను (2)
సూర్య చంద్ర నక్షత్రములను తన నోటి మాటతో సృజియించెను(1) ॥ఆ॥
2. అడవి పువ్వులను ఆకాశపక్షులను
జల చరముల సృజియించెను తన వాక్కుతో(2)
తన స్వరూపము నందు నరులను సృజియించె
ఆరు రోజులలో సంపూర్ణము చేసెను(2) ॥ఆ॥
3. ఏడవ దినమును పరిశుద్ధ పరచి – ఆ దినమును ఆశీర్వదించే ఆత్మతో సత్యముతో ఆరాధించి – ఆనందించుమనే మనదేవుడు ॥ఆ॥
ఆత్మ ఫలములు ఫలియించెద
ఆత్మలో వికసించెద
ఫలించు తీగవలె నేనుండెద
ద్రాక్షవల్లిలో నిలచియుండె
ప్రభుయేసులో ఫలియించెద
ప్రభు ప్రేమలో నిలచియుండెద
ఆదియంతమైన దేవుడు
అవనిని ఏలెడి రారాజు
ఆశ్చర్యకరుడైన నా ప్రభువు
ఆకాశమందు ఉన్నాడు
అ.ప.: హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
1. అందమైన పరలోకం
అందు మంచి ఈవులను (2)
బంగారపు వీధులలోనే
యేసు వెంట నడచెదను ॥హల్లె॥
2. వేలాది దూతలతో
పరిశుద్ధ సమూహముతో
వాయిద్యం వాయిస్తూనే ఉ
యేసు వెంట నడిచెదను ॥హల్లె॥
ఆకాశంలో చూడుము
సూర్యచంద్ర తారలు
నలుదిక్కులను చూడుము
గడ్డి పువ్వులను
వీటన్నిటిని ప్రభువే చేసెను
1. ఉన్నత పర్వతములు
మంచుతో కప్పబడెను
అక్కడ నుండి నీరు
నదిలా ప్రవహించున్
2. మోకాళ్ళూని ప్రార్ధింతున్
ప్రభుని ఆరాధింతున్
యేసే మా ప్రభువా రక్షంకుండవు
చిన్ని బిడ్డలము మమ్మును దీవించు
ఆరాధించెదన్ స్తుతియించెదన్
పూజించెదన్ నా యేసుని
1. నా చిన్ని మనసుతో ఆరాధించెదన్
నా చిన్ని ఆత్మతో ఆరాధించెదన్
నా చిన్ని హృదయముతో
ఆరాధించెదన్ నాకున్న శక్తితో
ఆరాధించెదన్ ॥ఆరా॥
ఆదాము హవ్వ హో హో హో
బ్యూటిఫుల్ తోటలో హో హో హో
అనుదినం జాలిగా గడిపినారు.
1. కలర్ఫుల్ పండు చూసి
హో హో హో
వండర్పుల్ దేవుని మరచి
హో హో హో
కలర్ఫుల్ పండు తీసి
వండర్పుల్ దేవుని మరచి
తిన్నారు అయ్యో తిన్నారు.
2. సినఫ్ఫుల్ ఫ్యామిలి అయినారు
పీస్ పుల్ ఏదెను పొగొట్టుకొన్నారు.
చెల్లెలారా మాట వినుట ఎంతో శ్రేష్ఠము
తమ్ముడా లోబడుట దేవుని కిష్టము
జయించువానికి దేవుని పరదైసులో
జీవవృక్షఫలము భుజింపనిత్తును
హో హో హో హో హో హో
ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది
వింత వింత కాంతులు పంచిపెట్టింది.
1. ప్రజలందరికీ మంచి వార్త తెచ్చింది
లోకరక్షకుని జన్మ చాటి చెప్పింది
2. జ్ఞానులకు సరియైన దారి చూపింది
బాలుడైన యేసురాజు చెంత చేర్చింది.