జగములనేలే శ్రీ యేసా / Jagamulanele Shree Yesaa

జగములనేలే శ్రీ యేసా
మా రక్షణ ప్రాకారమా
మా అనుదిన జీవాహారమా (2) ||జగములనేలే||

వేల్పులలోన నీవంటి దేవుడు
ఎవరున్నారు ప్రభు (2)
పూజ్యులలోన పూజార్హుడవు (2)
నీవే మా ప్రభువా నీవే మా ప్రభువా (2)
అడిగిన ఇచ్ఛే దాతవు నీవే దేవా
శరణము వేడిన అభయము నొసగే దేవా (2)
అవధులు లేని నీ ప్రేమను (2)
వర్ణింప చాలనయ్యా వర్ణింప చాలనయ్యా  ||జగములనేలే||

జీవనమంతయు నీకర్పించి
పానార్పణముగా నే పోయబడుదును (2)
శ్రేష్టఫలములను ఫలియించెదను (2)
నీదు సన్నిధిలో నీదు సన్నిధిలో (2)
విరిగిన మనస్సే నీకతి ప్రియమో దేవా
నలిగిన హృదయం నీ ఆలయంలో దేవా (2)
అన్ని వేళలలో మాతో ఉండి (2)
మమ్ము నడిపించు ప్రభో మమ్ము నడిపించు ప్రభో  ||జగములనేలే||

Jagamulanele Shree Yesaa
Maa Rakshana Praakaaramaa
Maa Anudina Jeevaahaaramaa (2)         ||Jagamulanele||

Velpulalona Neevanti Devudu
Evarunnaaru Prabhu (2)
Poojyulalona Poojaarhudavu (2)
Neeve Maa Prabhuvaa Neeve Maa Prabhuvaa (2)
Adigina Ichche Daathavu Neeve Devaa
Sharanamu Vedina Abhayamu Nosage Devaa (2)
Avadhulu Leni Nee Premanu (2)
Varnimpa Chaalanayyaa
Varnimpa Chaalanayyaa         ||Jagamulanele||

Jeevanamanthayu Neekarpinchi
Paanaarpanamugaa Ne Poyabadudunu (2)
Shreshtaphalamulanu Phaliyinchedanu (2)
Needu Sannidhilo Needu Sannidhilo (2)
Virigina Manasse Neekathi Priyamo Devaa
Naligina Hrudayam Nee Aalayamo Devaa (2)
Anni Velalalo Maatho Undi (2)
Mammu Nadipinchu Prabho
Mammu Nadipinchu Prabho         ||Jagamulanele||

చేయి పట్టుకో / Cheyi Pattuko

చేయి పట్టుకో నా చేయి పట్టుకో
జారిపోకుండా నే పడిపోకుండా
యేసు నా చేయి పట్టుకో (2)        ||చేయి||

కృంగిన వేళ ఓదార్పు నీవేగా
నను ధైర్యపరచు నా తోడు నీవేగా (2)
మరువగలనా నీ మధుర ప్రేమను
యేసు నా జీవితాంతము (2)
యేసు నా జీవితాంతము              ||చేయి||

శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా
విశ్వాస నావలో కలకలమే రేగిననూ (2)
విడువగలనా ఒక నిమిషమైననూ
యేసు నా జీవితాంతము (2)
యేసు నా జీవితాంతము              ||చేయి||

Cheyi Pattuko Naa Cheyi Pattuko
Jaaripokundaa Ne Padipokundaa
Yesu Naa Cheyi Pattuko (2)            ||Cheyi||

Krungina Vela Odaarpu Neevegaa
Nanu Dhairyaparachu Naa Thodu Neevegaa (2)
Maruvagalanaa Nee Madhura Premanu
Yesu Naa Jeevithaanthamu (2)
Yesu Naa Jeevithaanthamu              ||Cheyi||

Shodhana Baadhalu Ennenno Kaliginaa
Vishwaasa Naavalo Kalakalame Reginanoo (2)
Viduvagalanaa Oka Nimishamainanoo
Yesu Naa Jeevithaanthamu (2)
Yesu Naa Jeevithaanthamu               ||Cheyi||

చెవులు ఉన్నాయా / Chevulu Unnaayaa

చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2)
ఫస్ట్ వినాలి… నెక్స్ట్ నమ్మాలి
చెవులు ఉంటే తప్పక నీవు వినాలి (2)
చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2)
విను ఇదే ఆఫర్ వినకపోతే డెంజర్!
యేసు మాట వింటే నీవు బతుకుతావు – (2)
చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2)

సాతాను మాటలా? దేవుని మాటలా?
ఏది వింటావు? ఏది చేస్తావు?
కాకి విన్నది చేప విన్నది
గాడిద విన్నది సృష్ఠి విన్నది (2)
యేసయ్య విన్నాడు ప్రాణం పెట్టాడు
వింటేనే రక్షణ యేసు కర్పణ         ||చెవులు||

ఫ్రెండ్స్ మాటలా? పేరెంట్స్ మాటలా?
ఏది వింటావు? ఏది చేస్తావు?
భూతు మాటలా సినిమా పాటలా
వద్దు బాబోయ్ దురద చెవులు (2)
దేవుని మాటలు వినే చెవులు ఉండాలని
బైబిల్లో మన కోసమే వ్రాయబడినది         ||చెవులు||

Chevulu Unnaayaa – Vine Chevulu Unnaayaa (2)
FIrst Vinaali… Next Nammaali
Chevulu Unte Thappaka Neevu Nammaali (2)
Chevulu Unnaayaa – Vine Chevulu Unnaayaa (2)
Vinu Ide Offer Vinakapothe Danger
Yesu Maata Vinte Neevu Bathukuthaavu – (2)
Chevulu Unnaayaa – Vine Chevulu Unnaayaa (2)

Saathaanu Maatalaa Devuni Maatalaa?
Edi Vintaavu? Edi Chesthaavu?
Kaaki Vinnadi Chepa Vinnadi
Gaadida Vinnadi Srushti Vinnadi (2)
Yesayya Vinnaadu Praanam Pettaadu
Vintene Rakshana Yesu Karpana      ||Chevulu||

Friends Maatalaa? Parents Maatalaa?
Edi Vintaavu? Edi Chesthaavu?
Boothu Maatalaa Cinema Paatalaa
Vaddu Baaboi Durada Chevulu (2)
Devuni Maatalu Vine Chevulu Undaalani
Bible lo Mana Kosame Raayabadinadi      ||Chevulu||

చెప్పలేను బాబోయ్ / Cheppalenu Baaboi

చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని
చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో ||చెప్పలేను||

ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు (2)
ఐదు వేల పీపుల్ కి పంచిపెట్టాడు (2) బాబోయ్ ||చెప్పలేను||

కానానులో పెళ్లి విందులో (2)
వాటర్ ని వైన్ గా మార్చివేసాడు (2) బాబోయ్ ||చెప్పలేను||

సమాధిలో శవాన్ని చూచి (2)
కమాన్ గెట్ అప్ అంటూనే పైకి లేపాడు (2) బాబోయ్ ||చెప్పలేను||

Cheppalenu Baaboi Prabhu Goppathanaanni
Cheppi Cheppi Chesthaadu Chithramaina Panulenno ||Cheppalenu||

Aidu Rottelu Rendu Chinni Chepalu (2)
Aidu Vela People Ki Panchipettaadu (2) Baaboi ||Cheppalenu||

Kaanaanulo Pelli Vindulo (2)
Water ni Vinega Maarchivesaadu (2) Baaboi ||Cheppalenu||

Samaadhilo Shavaanni Choochi (2)
Common Get Up Antoone Paiki Lepaadu (2) Baaboi ||Cheppalenu||

చెప్పనా చెప్పనా / Cheppanaa Cheppanaa

చెప్పనా చెప్పనా  యేసు నీ ప్రేమను
చూపనా చూపనా మార్చిన బ్రతుకును
గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా
ప్రాణమే పెట్టిన ఈ ప్రేమ మరుతునా (2)            ||చెప్పనా||

చీకటి రాత్రిలో చీరు దీపమైన లేక
ఏ ఒడ్డుకు చేరుతానో తెలియని వేళ
కంటినిండ కన్నీళ్ళతో బరువెక్కిన గుండెతో
అయిపోయిందంతా అనుకున్నవేళ
నా చేయి పట్టావు నా వెన్నుతట్టావు
నేనున్నానని నన్ను నిలబెట్టావు               ||చెప్పనా||

నిందలన్ని తొలగించి ఆనందము నాకిచ్చి
బాధ కలుగు దేశమందు బలమిచ్చావు
ఒంటరైన నన్ను చేర్చి పదివేలుగ నన్ను మార్చి
అవమానము తొలగించి బలపరిచావు
అంతులేని ప్రేమ చూపి హద్దులేని కృపనిచ్చి
నీ చల్లని నీడలో నను దాచావు              ||చెప్పనా||

Cheppanaa Cheppanaa Yesu Nee Premanu
Choopanaa Choopanaa Maarchina Brathukunu
Gundello Gudi Katti Yesayyakivvanaa
Praaname Pettina Ee Prema Maruthunaa (2)            ||Cheppanaa||

Cheekati Raathrilo Chiru Deepamaina Leka
Ae Odduku Cheruthaano Theliyani Vela
Kanti Ninda Kanneellatho Baruvekkina Gundetho
Aipoyindanthaa Anukunna Vela
Naa Cheyi Pattaavu Naa Vennu Thattaavu
Nenunnaanani Nannu Nilabettaavu              ||Cheppanaa||

Nindalanni Tholaginchi Aanandamu Naakichchi
Baahd aKalugu Dehsmandu Balamichchaavu
Ontaraina Nannu Cherchi Padiveluga Nannu Maarchi
Avamaanamu Tholaginchi Balaparichaavu
Anthuleni Prema Choopi Hadduleni Krupanichchi
Nee Challani Needalo Nanu Daachaavu           ||Cheppanaa||

చెట్టు చూస్తే పచ్చగుంది / Chettu Choosthe Pachchagundi

చెట్టు చూస్తే పచ్చగుంది
పూత లేదు కాత లేదు (2)
వేసినెరువు వ్యర్ధమాయెనా నా యేసయ్యా
రెక్కల కష్టం వృథా ఆయేనా నా యేసయ్యా (2)

కాపు గాసి కలుపు తీసి నీరు కట్టి పెంచితే (2)
కండ్లెర్రికి చెట్టు పెరిగెనా నా యేసయ్యా
కాత లేదు పూత లేదుగా నా యేసయ్యా (2) ||చెట్టు||

కాపెంతో గాస్తదని కలలెన్నో కన్నాను (2)
ఫలములెన్నో ఇస్తదని పరవశించి పాడినాను (2)
పూతకంత పురుగు తగిలెనా నా యేసయ్యా
కలలన్ని కల్లలాయెనా నా యేసయ్యా (2) ||చెట్టు||

పందిరెలుపు తీగ ఉంది కాయ లేదు పండు లేదు (2)
ప్రేమతోని పెంచుకుంటిని నా యేసయ్యా
నరకనీకి ప్రాణమొప్పదు నా యేసయ్యా (2) ||చెట్టు||

కొత్త కొత్త ఎరువులేసి కొన్ని నాళ్ళు మళ్ళి జూస్తి (2)
పనికిరాని తీగలొచ్చెనా నా యేసయ్యా
పరికి కంపకు పాకిపాయెనా నా యేసయ్యా (2) ||చెట్టు||

పనికిరాని తీగలన్ని పట్టి కత్తిరించేస్తి (2)
పాడు నాటి పందిరేసి ప్రభుకు అంటు కట్టినాను (2)
కాత పూత ఇవ్వమని కన్నీళ్ళతో ప్రభునడిగితి (2)
పూత కాత బలముగాయెనా నా యేసయ్యా
ఫలాలన్నీ పంచబట్టెనా నా యేసయ్యా (2) ||చెట్టు||

Chettu Choosthe Pachchagundi
Pootha Ledu Kaatha Ledu (2)
Vesineruvu Vyardhamaayenaa Naa Yesayyaa
Rekkala Kashtam Vrudhaa Aayenaa Naa Yesayyaa (2)

Kaapu Gaasi Kalupu Theesi Neeru Katti Penchithe (2)
Kandlerriki Chettu Perigenaa Naa Yesayyaa
Kaatha Ledu Pootha Ledugaa Naa Yesayyaa (2) ||Chettu||

Kaapentho Gaasthadani Kalalenno Kannaanu (2)
Phalamulenno Isthadani Paravashinchi Paadinaanu (2)
Poothakanthaa Purugu Thagilenaa Naa Yesayyaa
Kalalanni Kallalaayenaa Naa Yesayyaa (2) ||Chettu||

Pandirelupu Theega Undi Kaaya Ledu Pandu ledu (2)
Premathoni Penchukuntini Naa Yesayyaa
Narakaneeki Praanamoppadu Naa Yesayyaa (2) ||Chettu||

Kotha Kotha Eruvulesi Konni Naallu Malli Joosthi (2)
Panikiraani Theegalochchenaa Naa Yesayyaa
Pariki Kampaku Paakipaayenaa Naa Yesayyaa (2) ||Chettu||

Panikiraani Theegalanni Patti Kaththirinchesthi (2)
Paadu Naati Pandiresi Prabhuku Antu Kattinaanu (2)
Kaatha Pootha Ivvamani Kanneellatho Prabhunadigithi (2)
Pootha Kaatha Balamugaayenaa Naa Yesayyaa
Phalaalanni Panchabattenaa Naa Yesayyaa (2) ||Chettu||

చూపుల వలన కలిగేది / Choopula Valana Kaligedi

Choopula Valana Kaligedi Prema Kaadammaa
Aakarshanaku Longipoyi Baanisa Kaakammaa
Choopula Valana Kaligedi Prema Kaaduraa
Aakarshanaku Longipoyi Baanisa Kaakuraa
Swaardhyamthone Nindiyunnadi Loka Premaraa
Sathyamainadi Pavithramainadi Yesu Premaraa (2)

Thallidandrulu Ninnu Goppa Cheyaalani
Kashtinchi Chematodchi Dabbanthaa Neeke Pedithe (2)
Kannanduku Kanneerenaa Prathiphalam
Paddu Geesukovatamaa Nee Jeevitham (2)
Vyardhamainavaatini Vidichi
Paramaardhamloki Nadichi
Daiva Yesu Vaakyam Sweekarinchumaa (2)         ||Choopula||

చూపుల వలన కలిగేది ప్రేమ కాదమ్మా
ఆకర్షణకు లొంగిపోయి బానిస కాకమ్మా
చూపుల వలన కలిగేది ప్రేమ కాదురా
ఆకర్షణకు లొంగిపోయి బానిస కాకురా
స్వార్ధ్యంతోనే నిండియున్నది లోక ప్రేమరా
సత్యమైనది పవిత్రమైనది యేసు ప్రేమరా (2)

తల్లిదండ్రులు నిన్ను గొప్ప చేయాలని
కష్టించి చెమటోడ్చి డబ్బంతా నీకే పెడితే (2)
కన్నందుకు కన్నీరేనా ప్రతిఫలం
పద్దు గీసుకోవటమా నీ జీవితం (2)
వ్యర్ధమైనవాటిని విడిచి
పరమార్ధంలోకి నడిచి
దైవ యేసు వాక్యం స్వీకరించుమా (2)        ||చూపుల||

చూడాలని ఉన్నది / Choodaalani Unnadi

చూడాలని ఉన్నది
నా యేసుని చూడాలని ఉన్నది (2)
కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని
కొనియాడుచుండగా చూడాలని (2)       ||చూడాలని||

పగలు ఎగురు బాణమైనను
రాత్రి కలుగు భయముకైనను (2)
కదలక నను కాపాడే నా నాథుడే నీవే
ఉన్నవాడవు అను వాడవు రానున్న వాడవు (2)       ||చూడాలని||

నా పాదములకు దీపమై
నా త్రోవలకు వెలుగువై (2)
నను వీడని ఎడబాయని నా తోడువు నీవే
కంటికి రెప్పలా కాపాడే నాథుడ నీవే (2)       ||చూడాలని||

Choodaalani Unnadi
Naa Yesuni Choodaalani Unnadi (2)
Kotlaadi Doothalu Nithyamu Parishuddhudani
Koniyaaduchundagaa Choodaalani (2)      ||Choodaalani||

Pagalu Eguru Baanamainanu
Raathri Kalugu Bhayamukainanu (2)
Kadalaka Nanu Kaapaade Naa Naathuda Neeve
Unnavaadavu Anu Vaadavu Raanunna Vaadavu (2)      ||Choodaalani||

Naa Paadamulaku Deepamai
Naa Throvalaku Veluguvai (2)
Nanu Veedani Edabaayani Naa Thoduvu Neeve
Kantiki Reppala Kaapaade Naathuda Neeve (2)      ||Choodaalani||

చూడరే సిలువను / Choodare Siluvanu

చూడరే సిలువను వ్రే-లాడు యేసయ్యను
పాడు లోకంబునకై – గోడు జెందె గదా        ||చూడరే||

నా చేతులు చేసినట్టు – దోషంబులే గదా
నా రాజు చేతులలో ఘోరంపు జీలలు        ||చూడరే||

దురితంపు దలఁపులే – పరమ గురిని శిరముపై
నెనరు లేక మొత్తెనయ్యొ – ముండ్ల కిరీటమై        ||చూడరే||

పరుగెత్తి పాదములు – చేసిన పాపంబులు
పరమ రక్షకుని – పాదములలో మేకులు        ||చూడరే||

పాపేఛ్చ తోడ గూడు – నాడు చెడ్డ పడకలే
పరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోటులు        ||చూడరే||

Choodare Siluvanu Vre-laadu Yesayyanu
Paadu Lokambunakai – Godu Jende Gadaa         ||Choodare||

Naa Chethulu Chesinatti – Doshambule Gadaa
Naa Raaju Chethulalo Ghorampu Jeelalu         ||Choodare||

Durithampu Dalapule – Parama Gurini Shiramupai
Nenaru Leka Motthenayyo – Mundla Kireetamai         ||Choodare||

Parugetthi Paadamulu – Chesina Paapambulu
Parama Rakshakuni – Paadamulalo Mekulu         ||Choodare||

Paapechcha Thoda Goodu – Naadu Chedda Padakale
Parama Guruni Prakkaloni – Ballempu Potulu         ||Choodare||

చూచుచున్నాము నీ వైపు / Choochuchunnaamu Nee Vaipu

పాట రచయిత: పులిపాక జగన్నాధము

చూచుచున్నాము నీ వైపు
మా ప్రియ జనక – చూచుచున్నాము నీ వైపు
చూచుచు నీ ప్రేమ – సొంపు సువార్తను
జాచుచు గరములు – చక్కగా నీవైపు        ||చూచు||

మేమరులమై యుంటిమి
మార్గము వీడి – మేమందరము పోతిమి
ప్రేమచే నప్పుడు – ప్రియ తనయు నంపించి
క్షేమ మార్గము మాకు – బ్రేమను జూపితివి          ||చూచు||

నిను నమ్ము పాపులకు
వారెవరైనా – నీ శరము జొచ్చువారలకు
ఇనుడవు కేడెంబు – నీ జగతిలో నగుచు
గనుపరచుచుందువు – ఘనమైన నీ కృప         ||చూచు||

నీ భయము మాయెదలను
నిలుపుము నీదు – ప్రాభవ మొనరంగను
నీ భయముచే మేము – వైభవ మొందుచు
నే భయము లేకుండ – నీ భువిని గొన్నాళ్ళు         ||చూచు||

దయ జూచి మము నెప్పుడు
మంచివి యన్ని – దయచేయు మెల్లప్పుడు
దయచేయరానివి – దయచేయుమని కోర
దయ జూపి మన్నించు – దయగల మా తండ్రి        ||చూచు||

Lyricist: Pulipaaka Jagannaathamu

Choochuchunnaamu Nee Vaipu
Maa Priya Janaka – Choochuchunnaamu Nee Vaipu
Choochuchu Nee Prema – Sompu Suvaarthanu
Jaachuchu Garamulu – Chakkagaa Neevaipu     ||Choochu||

Memarulamai Yuntimi
Maargamu Veedi – Memandaramu Pothimi
Premache Nappudu – Priya Thanayu Nampinchi
Kshema Maargamu Maaku – Bremanu Joopithivi       ||Choochu||

Ninu Nammu Paapulaku
Vaarevaraina – Nee Sharamu Jochchuvaaralaku
Inudavu Kedembu – Nee Jagathilo Naguchu
Ganuparachuchunduvu – Ghanamaina Nee Krupa       ||Choochu||

Nee Bhayamu Maayedalanu
Nilupumu Needu – Praabhava Monaranganu
Nee Bhayamuche Memu – Vaibhava Monduchu
Ne Bhayamu Lekunda – Nee Bhuvini Gonnaallu         ||Choochu||

Daya Joochi Mamu Neppudu
Manchivi Yanni – Dayacheyu Mellappudu
Dayacheyaraanivi – Dayacheyumani Kora
Daya Joopi Manninchu – Dayagala Maa Thandri         ||Choochu||