లోకము నిన్ను నిందించినను (సీయోను పిల్లల పాటలు) Lokamu Ninnu Nindinchinanu

తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. మత్తయి 10:38

1. లోకము నిన్ను నిందించినను – నిజముగ నన్ను ప్రేమింతువా?(1)

    పరులెల్లరు నిను ద్వేషించినన్ (1)

    నీ సిలువను నీవు మోసెదవా? (2)

పల్లవి:  నీకై నే మరణించితినే – నా కొరకేమి చేసితివి? (2)

నా కొరకేమి చేసితివి?(1)

2. లోక మహిమ యిది వ్యర్థమని – లోకైశ్వర్యము మన్నేయని (1)

    పలికెదవా నీ మది నుండి? (1)

    విడువక నన్ను సేవించెదవా? (2)॥నీకైనే॥

పిల్లలారా లోబడుడి / Pillalara Lobadudi

పిల్లలారా లోబడుడి

యేసన్న మాటలకు (2)

1. ఆదాము హవ్వలు వినలేదు

సాతాను వారిని మోసగించెను

యేసయ్య ఎంతో విచారించెను

ఏదెనులో నుండి తోలివేసెను.

2. చెప్పినట్టు చేయుట దేవునికిష్టం

లోబడకుండుట నీకే నష్టం

ఆజ్ఞాతిక్రమం పాపానికి మూలం

అవిధేయతపై విజయానికి

యేసే మూలం

ల ల లా పాటలే పాడెదన్‌ / La La Laa Paatale Paadedan

లల్లలాల లల్లలాల లల్ల లల్ల

ల ల లా లా లల్లా లలా

1. పాటలే పాడెదన్‌

నేను బలే బలే పాడెదన్‌ (2)

యేసు రక్షించె

నేను బలే బలే పాడెదన్‌ ॥లల్ల॥

2. డాన్స్‌ చేస్తాను నేను బాగా చేస్తాను

పాపము క్షమియించెన్‌

నేను డాన్స్‌ చేస్తాను

యేసు పాపము క్షమియించెన్‌

నేను డాన్స్‌ చేస్తాను          ॥లల్ల॥

3. గంతులు వేస్తాను

నేను గంతులు వేస్తాను

విడుదల చేసాడు

నేను గంతులు వేస్తాను   

యేసు విడుదల చేసాడు

నేను గంతులు వేస్తాను    ॥లల్ల॥

లోతునకు నీ పడవ నడిపించుము / lothunaku Nee Padava Nadipinchumu

లోతునకు నీ పడవ నడిపించుము

ఆ పైన నీటిలోకి వల వేయుము

రాత్రంతా కష్టించి అలసిపోతిమి

కడలంతా గాలించి విసిగిపోతిమి

అనుభవమెంతున్నా ఫలితమే శూన్యం

అయినా నీ మాట చొప్పున వలలు వేసెదం

వలనిండా చేపలే ఎంత ఆశ్చర్యం

యేసు మాటలో ఉంది ఎంత ప్రభావం

సోదరులారా మాకు సాయం చెయ్యండి.

మీరును యేసుప్రభువు మహిమ చూడండి

లోకములోనికి వెళ్ళుమని / Lokamuloniki Vellumani

లోకములోనికి వెళ్ళుమని

సువార్తను ప్రకటించుమని

పరలోకమార్గము చూపుమని

యేసయ్య సెలవిచ్చెను

1. కోతెంతో ఎక్కువని

పనివారు అతి తక్కువని

తన పొలములో పనిచేయుమని యేసయ్య సెలవిచ్చెను ॥లోక॥

లెఫ్ట్‌ రైట్‌ లెఫ్ట్‌ రైట్‌ / Left Right Left Right

లెఫ్ట్‌ రైట్‌ లెఫ్ట్‌ రైట్‌ (2)

చేతులు పట్టి సాగిపోదమా

దేవుని స్తుతించెదమా

నాట్యమాడి సాగిపోదమా

మార్గము సిద్ధపరతుమా

హలో తమ్ముడా ఎగిరి ఆడుదాం

హలో చెల్లెలా చప్పట్లు కొట్టుదాం