యేసు – నేనే మార్గమును, సత్యమును, జీవమును,… యోహాను 14:6
పల్లవి : రెండే రెండు మార్గములు – కలవని బైబిలు చెప్పుచున్నది (1)
మార్గము కావలయునో – నేడే నిశ్చయించుకొను (1)
1. విశాల మార్గము అపాయము నడుపును నిన్ను నరకముకు(2)
ఇరుకు మార్గమును కోరుకొను నడుపును నిన్ను జీవానికి (2) ॥రె॥
2. నేనే మార్గము సత్యమని – జీవము నిచ్చెడు వాడనని నా (2)
ద్వారానే తప్పమరి – చేరరు ఎవ్వరు పరమునకు (2) ॥రె॥
3. పాపికి జీతము మరణంబు – పరిశుద్ధ యేసే మార్గంబు (2)
తెరువు నీదు హృదయద్వారం – స్వీకరించు ప్రభు యేసుని(2) ॥రె॥
…చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి… మార్కు 10:14
1. రారండి చిన్న పిల్లల్లారా-మన ప్రియ యేసుతో మాట్లాడను(2)
పల్లవి : కలసి రండి కలసి రండి-మన ప్రియ యేసుతో మాట్లాడను (2)
2. ప్రేమతో యేసు పిలుచుచుండె వాద్యములతో పాడుచు వెళ్లెదం(2) ॥కలసి॥
3. బైబిలు యేసునకు ప్రియము-బాగుగా దానిని వినెదము(2) ॥కలసి॥
4. యేసెన్నడు కలహించలేదు-మనమెవ్వరితో కలహించరాదు(2) ॥కలసి॥
5. అన్న వస్త్రములను మాతపితా-సోదరి సోదరుల నిచ్చెన్ (2) ॥కలసి॥
6. ప్రియ యేసు తెచ్చెను మనకొరకై చూడుము ఎన్నో దీవెనలు (2) ॥కలసి॥
…మీ నిమిత్తము దరిద్రుడాయెను. 2 కొరింథీ 8:9
పల్లవి : రాజుల రాజా యేసు – ప్రభువుల ప్రభువా! (1)
పశువుల తొట్టిలో – శిశువుగ నైతివా!
ముక్తి దాతా యేసువా!
రాజుల రాజ యేసు (1)
1. మన నిమిత్తమే – దరిద్రుడాయే ప్రభూ
కౄర సిల్వనెక్కి – రక్తము కార్చి బాధించబడెను ప్రభూ (2)
దేవా! దేవా! నన్నేల విడిచితివని అరచి ప్రాణమిడెను (1)
తిరిగి జీవితుడై పరమునకేగి సింహాసనాసీనుడాయె (2) ॥రాజు॥
2. పిల్లలారా! మీరందరు – విశ్వాసముంచుడి యేసు పై
పాప క్షమాపణ పొందు మీ దినమే – నూతన జీవమొసగున్
నీదు హృదయములో నివసింపవచ్చున్ సృష్టికర్త యేసుడు
నీ జీవమునకు రాజుగ తానై నిన్ను కొనిపోవవచ్చును ॥రాజు॥
రైలుబండి రైలూ
చుకుబుకు చుకుబుకు రైలు
1. యేసు నా డ్రైవర్
ఆయనే నా మాస్టర్
ఆ రైలులో కూర్చుంటే
భయమేమి లేదు
2. డబ్బులేమి అడగడు
రక్షణ టికెట్టు చాలు
పరలోకానికి నన్ను తీసుకుపోతాడు.
మమ్మి టాటా డాడీ టాటా
అంకుల్ టాటా ఆంటీ టాటా
అన్న టాటా తమ్ముడు టాటా
అక్క టాటా చెల్లి టాటా
రావద్దనవద్దు నన్ను
బ్రతిమాలవద్దు
నిన్నే నేను వెంబడిరతున్
నీ జనమే నా జనము
నీ దేవుడే దేవుడని
మోయాబు విడచెన్
నయోమితో వచ్చెన్
1. రొట్టెల ఇల్లైన బేత్లహేమునకు
పట్టు విడువకను వచ్చెను రూతు
నూతన జీవమును
నూతన బ్రతుకును నూతన మార్గములో నడిచెను
రాత్రియందు వెలుగు జ్యోతులవలె
వెలుగుదును నేను ఈ లోకంలో
యేసు జ్యోతిగా దివ్య జ్యోతిగా
వెలుగుదును నేను ఈ లోకంలో
1. మాటలలోను చేతలలోను
చూపులలోను వినికిడిలోను
యేసు చెప్పినట్లుగా నే చేసెదను (2)
యేసు ప్రతిబింబముగా నే సాగెదను
2. మోసము వీడి దోషము వదలి
ఇశ్రాయేలువలె నేనుండెదను
వీరుడైన యేసునే నే చాటెదను
రోషముతో సాతానుని ఓడిరచెదను
రక్షణ బండి రమ్మంటూ
చేతులు చాచింది
రాకడ బండి వేగంగా వచ్చేస్తున్నది
రక్షణ నీకు లేనిచో మోక్షం లేదు (2)
అగ్ని గుండమే యేసు లేనిచో
రక్షణ యేసే మోక్షం యేసే
1. వెళ్ళిన బండి మరల రాదు
ఆగమంటే ఆగదు
వెళ్ళక ముందే రక్షణ పొందు
యేసే మార్గము
యేసు దొరికే సమయమిదే
యేసే దేవుడు
యేసు వార్త చాటి చెప్పే
తరుణం నేడేరా ఇక సమయం లేదురా
రారా ఓ తమ్ముడా
రావేఓ చెల్లెలా
సండేస్కూలుకు పరుగున రారండి
1. సండేస్కూల్లో పాటలు ఉంటాయిరా
యేసయ్య మాటలు నేర్పుతారురా
బైబిల్లో కధలెన్నో చెబుతారురా
ఆనందం ఆనందం సంతోషమే
2. మాట్లాడే బొమ్మలు చూపిస్తారురా
చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారురా
ఆటల పోటీలెన్నో పెడతారుగా
స్కిట్స్ గిఫ్ట్స్ కూడా ఉంటాయిరా
రెప రెప లాడె పతాకం
గుస గుస లాడె చిరు గాలి (2)
మిల మిల మెరిసె కెరటాలు
బిర బిర సాగే సెలయేరు (2)
చెప్పేదొకటే చెల్లెమ్మ
చెప్పేదొకటే తమ్మయ్యా (2)
జయము మనదే (2)
యేసులో విజయం మనదే
బిర బిర సాగిపో
మిల మిల మెరిసిపో
గుస గుస ప్రార్ధించు
రెప రెప జయించు
జయము మనదే
యేసులో విజయం మనదే
రారండి చిన్న పిల్లలారా
మన ప్రియ యేసుతో మాట్లాడను
కలసి రండీ (2)
మన ప్రియ యేసుతో మాట్లాడను
1. ప్రేమతో యేసు పిలచుచుండే
వాద్యములతో పాడుచు వెళ్ళెదం
2. బైబిలు యేసునకు ప్రియము
బాగుగా దానిని వినెదము
3. అన్న వస్త్రములను మాత పిత
సోదరి సోదరులనిచ్చెన్
4. ప్రియ యేసు తెచ్చెను మన కొరకై
చూడుము ఎన్నో దీవెనలు