బంధించెదము (సీయోను పిల్లల పాటలు) / Bandhinchedamu

.. వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున… ఆ దయ్యముతో చెప్పెను,… అపొ. 16:18

1 .బంధించెదము – గద్దించెదము – పారద్రోలెదము (2)

    యేసుని నామమున (3) రక్త శక్తితో(2)

    సైతాను వాని సేనలను – పారద్రోలెదము(1)

2. తెగిపోవును సంకెళ్ళు-విడిపోవును బందాలు-రక్షింపబడు ఆత్మల్ (2)

    యేసుని నామమున (3) రక్త శక్తితో(2)

    సైతాను వాని సేనలకు – ఓటమి నిశ్చయము(1)

Aur ve memne ke lahoo ke kaaran,… us par jayvanth hue,… Rev. 12:11

1. బాంధ్ సక్ తే హై – డాంట్ సక్ తే హై – భగా సక్ తే హై(2)

    ఈశుకి నామ్ మే (3) రక్త్ కి శక్తి సే (2)

    సైతాన్ ఔర్ ఉస్ కీ సేనా కో – దూర్ భగాతే హై(1)

2. జంజీర్ టూటే హై-బంధన్ ఖులే హై-ఆత్మాయే బచ్చీ హై (2)

    ఈశుకి నామ్ మే (3) రక్త్ కి శక్తి సే (2)

    సైతాన్ ఔర్ ఉస్ కీ సేనాకీ – హార్ నిశ్చయ్ హై(1)

యేసు చెప్పెను నేనే మార్గమును (సీయోను పిల్లల పాటలు) / Yesu Cheppenu Nene Maargamunu

యేసు – నేనే మార్గమును, సత్యమును, జీవమును;… యోహాను సువార్త 14:6

యేసు చెప్పెను నేనే మార్గమును,                                               (1)

యేసు చెప్పెను నేనే సత్యమును,                                                (1)

యేసు చెప్పెను నేనే జీవమును,                                   (1)

నా ద్వారానే తప్ప – యెవడును తండ్రి యొద్దకు     (2)

రాడు, రాడు తండ్రి యొద్దకు రాడు                              (2)

యోహాను సువార్త పదునాలుగు ఆరు                        (2)

యేసు చెప్పెను                                                                  (4)

సంపూర్ణ జ్ఞానము కలిగి (సీయోను పిల్లల పాటలు) / Sampoorna Gyanamu Kaligi

….(ప్రభువునకు) ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను… కొలొస్స 1:11

పల్లవి : సంపూర్ణ జ్ఞానము కలిగి-ఆత్మఫలమునందు అభివృద్ధి నొందుడి(1)

సంపూర్ణ జ్ఞానము కలిగి (1)

1. క్రీస్తేసునందు మనకు పాప- క్షమాపణ కలిగెను                                  (2)

    అంధకార సంబంధమైన – అధికారమునుండి విడుదల దొరికె      (2)

    ప్రభున కన్ని విషయములలో – తగినట్టుగా నడుచుకొనుము        (2)

    నీవు ప్రేమను కలిగియుండుము                                                               (2) ॥సంపూర్ణ॥

2. ప్రభు యేసు అదృశ్యుండైన – దేవుని రూపము గలవాడు                (2)

    సర్వసృష్టికి కర్తయు తానె – నిన్ను నూతన సృష్టిగజేసె                      (2)

    ప్రభున కన్ని విషయములలో – తగినట్టుగా నడుచుకొనుము        (2)

    నీవు ఎల్లప్పుడు ఆనందించుము                                                                (2) ॥సంపూర్ణ॥

3. మృతులలోనుండి మొదటలేచి – యున్నవాడు యేసుప్రభు          (2)

    మనలను తండ్రి రాజ్యమునకు – వారసులుగ జేసియున్నాడు       (2) 

    ప్రభున కన్ని విషయములలో – తగినట్టుగా నడుచుకొనుము        (2)

    నీలో ఏలనియ్యుము – సమాధానము                                                   (2)  ॥సంపూర్ణ॥

4. క్రీస్తేసు నందు సర్వ సంపూర్ణత – నిండి యున్నది                              (2)

    సిలువ మరణము ద్వారానే మనల – తండ్రితో సమాధానపరచే     (2)

    ప్రభున కన్ని విషయములలో – తగినట్టుగా నడుచుకొనుము        (2)

    నీవు దీర్ఘ శాంతము కలిగియుండుము                                 (2)  ॥సంపూర్ణ॥

5. సమస్త సృష్టికి ప్రకటించబడిన – సువార్తను విడువక                         (2)

    విశ్వాసమందు నిలిచిన యెడల – నీవా మహిమను పొందెదవు (2)

    ప్రభు కన్ని విషయములలో – తగినట్టుగా నడచుకొనుము              (2)

    నీవు దయాళుత్వము కనుపరుచుము                                                   (2)  ॥సంపూర్ణ॥

6. దైవ చిత్తమును సంపూర్ణ – ముగా గ్రహించినవారై                            (2)

    సకల సత్కార్యంబులలో – ప్రభుని సంతోషపరచుచు                       (2)

    ప్రభున కన్ని విషయములలో తగినట్టుగా నడుచుకొనుము           (2)

    మంచితనము సాత్వికము చూపుము                                                    (2)  ॥సంపూర్ణ॥

7. దేవుని విషయమైన జ్ఞానమందు – అభివృద్ధి నొందుచు                 (2)

    ఆయన శక్తితో బలపర్చ – బడి క్రీస్తేసులో సంపూర్ణులై                         (2)

    ప్రభున కన్ని విషయములలో – తగినట్టుగా నడుచుకొనుము        (2)

    నీలో ఆశా నిగ్రహము నలవరచుము                                                     (2) ॥సంపూర్ణ॥

సంధింతు-నేసు రాజును (సీయోను పిల్లల పాటలు)/ Sandhinthu Nenu Raajunu

రాజులకు రాజు… ప్రకటన 19:16

పల్లవి : సంధింతు-నేసు రాజును (3 సార్లు) సంధించుట నిక్కము (1)

1. ప్రార్థనలో సంధింతు నేసు రాజును (3) సంధించుట నిక్కము (1)               ॥సం॥

2. దూతలతో సంధింతు – నేసు రాజును (3)సంధించుట నిక్కము                  ॥సం॥

3. శత్రుభయమార్చిన-యేసు రాజును (3) సంధించుట నిక్కము                      ॥సం॥

4. రోగులకు వైద్యుడగు యేసురాజును (3) సంధించుట నిక్కము                    ॥సం॥

5. శుద్ధులు స్తుతించెడు యేసురాజును (3) సంధించుట నిక్కము                    ॥సం॥

6. సిల్వమీద సమసిన యేసురాజును (3)సంధించుట నిక్కము                         ॥సం॥

7. మేఘములతో వచ్చెడు యేసు రాజును (3) సంధించుట నిక్కము                ॥సం॥

చిన్న గొట్టెపిల్ల ఒకటి (సీయోను పిల్లల పాటలు) / Chinna Gorrepilla Okati

నేను గొఱ్ఱాలకు మంచి కాపరిని… యోహాను 10:11

1.చిన్న గొట్టెపిల్ల ఒకటి – గంతులేసి ఆడెను

    మందవీడి మెల్లగా – వేరు ప్రక్క గెంతెను

    బర్మని పరుగిడెన్ – దారి తప్పిపోయెను

    రాత్రి సమయమాయెను – చలికి వణకిపోయెను

    దారి తప్పిన తప్పు తలచి – వెక్కి వెక్కి

    ఏడ్చెను గడగడ వణికెను – కన్నీరు కార్చెను.

2. గొట్టెల కాపరి కొండ లోయలో – నడచి నడచి చూచెను  (1)

   గొట్టెనతడు వెదకి వెదకి – ముండ్ల పొదలో కనుగొనెన్          (1)

    భుజము మీద మోసెను – ఆనందముగ వెళ్ళెను.      (1)

3. నిన్ను నన్ను ప్రేమించు – మంచి కాపరి యేసుడే                   (1)

    ఆయన స్వరము వింటివా? – అదియు నీకు తెలియునా? (1)

    యేసు వైపు తిరుగవా? – ఆశతోడ వత్తువా?                          (1)

అందమైన దేశము పరలోకము (సీయోను పిల్లల పాటలు) . Andamaina Deshamu Paralokamu

పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది… మత్తయి 13:11

పల్లవి : అందమైన దేశము పరలోకము

ఆనందముగా ఉంటుంది చిరకాలము(2)

1. పాపముండదు – అచట శాపముండదు

    దుఃఖముండదు – అచట చీకటుండదు(2)

    ఆహా మా యేసు రాజుగా – చిరకాల మేలుతాడు (2) ॥అంద॥

2. దూతలుంటారు – జీవ గ్రంథముంటుంది

    భక్తులుంటారు – జీవ వృక్షముంటుంది

    ఆహా మాయేసు రాజుగా – చిరకాల మేలుతాడు       ॥అంద॥

పాత క్రొత్త నిబంధనలందున (సీయోను పిల్లల పాటలు) / Patha krotha nibandanalanduna

… వచనముల భావము వారికి తెలిపెను. లూకా 24:27

1. పాత క్రొత్త నిబంధనలందున – అరవైయారు పుస్తకముల్

    పేర్లు తెలియవలెననిన – దైవ కృపచే విభజించి పాడ వలయున్

2. పాత నిబంధన యందలి గ్రంథముల్-ముప్పది తొమ్మిదియు

    మరి క్రొత్త నిబంధన – యందున ఇరవై-ఏడు పుస్తకములును

3. ఆదికాండము, నిర్గమకాండము, లేవీయుల కాండము,

    సంఖ్యా, ద్వితీయోపదేశ కాండముల్, యెహోషువ,

    న్యాయాధి పతులు, రూతు

4. మొదటి సమూయేలు, రెండు సమూయేలు

    మొదటి రెండు రాజులును

    మరి ఒకటి రెండు దినవృత్తాంతములును, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు,

5. యోబు, కీర్తనలు, సొలొమోను సామెతల్, ప్రసంగి, పరమ గీతము

    యెషయా, యిర్మీయా, విలాపములు, యెహెజ్కేలు,

    దానియేల్, హోషేయా, యోవేలు,

6. ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, మరి హబక్కూకు,

    జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ, చెప్పితి ముప్పై తొమ్మిది

7. మత్తయి, మార్కు, లూకా, యోహాన్, అపొస్తలుల కార్యములు,

    రోమా, ఒకటి, రెండు కొరింథీయులు, గలతీయ, ఎఫెసీయులు

8.  ఫిలిప్పీయు, కొలొస్సయు, ఒక థెస్సలోనికైయ,

    రెండు థెస్సలోని కైయులు

    ఒకటి, రెండు తిమోతి పత్రికలును – తీతు, ఫిలేమోన్ పత్రిక,

9. హెబ్రీయులును, యాకోబు, పేతురు – ఒకటి, రెండు పత్రికలన్

    యోహాను వ్రాసిన పత్రికలు మూడును – యూదా, ప్రకటనయు

10. అరవై ఆరును దేవుని చేత – నీయబడిన వేదము

     దాని మోకాళ్ళ మీద ప్రార్థన తోడ – అనుదినము చదువుడి

స్వీకరించుము విశ్వాసముతో (సీయోను పిల్లల పాటలు) / Sweekarinchumu vishwasamtho

…అయితే ఆత్మ ఫలమేమనగా,… గలతీ 5:22

స్వీకరించుము విశ్వాసముతో – పాపక్షమాపణ రక్షణను     (1)

పరిశుద్ధాత్మను పొందిన నీవు – ఆత్మ ఫలము ఫలించుము (1)

ఆత్మఫలములో తొమ్మిది – రుచులున్నవి గమనించుము     (1)

ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము                                (2)

దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము (1)

ఆశానిగ్రహము                                                                                  (2)

విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలుదేరెను  (సీయోను పిల్లల పాటలు)/ Vithanalu vithutaku Bayaluderenu

విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి… మత్తయి 13:18

పల్లవి : విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలుదేరెను        (2)

అవి విత్తుచుండగా కొన్ని త్రోవ ప్రక్క పడెను             (2)

పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను                                (2)

1.మరికొన్ని విత్తనాలు – రాతినేల మీద పడెను         (2)

    వాటిలో వేరు లేనందున – అవి ఎండిపోయెను      (2)      ॥విత్త॥

2. మరికొన్ని విత్తనాలు – ముండ్లపొదలలోన పడెను

    ముండ్ల పొదలు ఎదిగి – వాటి నణచి వేసెను                        ॥విత్త॥

3. మరికొన్ని విత్తనాలు – మంచి నేల మీద పడెను

    ముప్ప – దరువదంతల్ – నూరంతలు ఫలియించెన్          ॥విత్త॥

4. వాక్యమును విని, గ్రహించి – దాని ననుసరించువారు

    సఫలులై ప్రభు యేసులో – బహుగా ఫలించెదరు                ॥విత్త॥

సిద్ధపడుము – దేవుని సేవకై (సీయోను పిల్లల పాటలు) Siddhapadumu Devuni Sevakai

…నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు… యెషయా 42:1

సిద్ధపడుము – దేవుని సేవకై (2) నిన్నేర్పరచుకొనె – దేవుడు                (1)

నీతో నిలిచి – నీకు తోడైయుండున్-లేచి నడువుము దేవునితో         (2)