…ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే… కీర్తన 4:1
పల్లవి : కొండల తట్టు-కన్నులనెత్తి, కోరుదును-సహాయమును (2)
కొండయు-బండయు ఆయనే, కోట ఆయనే వేడెదము (2) ॥కొండల॥
1. ఇరుకులో మొరలిడిన – విశాలములో ఉత్తరమిచ్చును (2)
తన్ను ప్రేమించు వారి మొరలన్ – తప్పక యేసయ్య ఆలకించును(2) ॥కొండల॥
దేవునికి స్తుతి యాగము చేయుము… కీర్తన 50:14
1. కూ కూ కూయుచుండె – కోవెల యనెడి పక్షులన్ని (1)
కా కా యని అరచుచుండె – కాకులు అనెడి పక్షులన్ని (1)
అరచినను కూసినను (2) యేసు ప్రభునే స్తుతియించుచున్నవి (2)
2. చెల్లీ, తమ్ములారా – యేసుని మీరును స్తుతియించరా (2)
స్తుతులకు మధ్యన వసియించెడు (2)
ఆయన నీ స్తుతి అంగీకరించున్ (2)
Repeat first 2 lines
క్రీస్తుయేసుయొక్క మంచి సైనికుడు… 2 తిమోతి 2:3
1. క్రీస్తుని వీరులం-సాతానున్ జయింతుమ్-గీతముల్ పాడెదము (2)
లోకము ధ్వనింప సువార్త చాటించి (2) పాడెదము (1)
పల్లవి : రక్షకుడు యేసు, నా మిత్రుడు యేసు
నా కాపరి యేసు, నా యుద్ధ నాయకుడు
2. ఆత్మ ఖడ్గమును ధరించి మేము – ఆయత్తమయ్యెదము (2)
శోధనలెన్నైన శోకము ఎంతైన (2) వీరులము (1) ॥రక్షకుడు॥
3.పోరాటం పోరాడి పరుగు తుదముట్టించి – కృపను పొందెదము (2)
మహానందముతో కిరీటమున్ పొంది (2) వెళ్లెదము (1) ॥రక్షకుడు॥
కూ అని పాడే ఓ కోయిలా
గల గల పారే ఓ సెలయేరా
నన్ను పిలచినాడు ప్రేమించినాడు.
నా పాపము కడిగి నను రక్షించినాడు.
1. నన్ను సేద దీర్చి నన్నాదరించి
నా స్నేహితుడేసు
నన్ను నడుపుతాడు
కొండల తట్టు కన్నులనెత్తి
కోరెదము సహాయమును
కొండయు బండయు ఆయనే
కోట ఆయనే వేడేదము
ఇరుకులో మొరలిడినన్
విశాలములో ఉత్తరమిచ్చును
తన్ను ప్రేమించు వారి మొరలన్ తప్పక యేసయ్య ఆలకించున్
కోపగించకు ఓ చిన్ని పాప
పాపము చేయకు చిన్ని బాబు
1. అసూయ వలన ద్వేషము
ద్వేషము వలన కోపము
కోపము వలన పాపము
పాపము వలన శాపము కల్గును
2. క్రీస్తు ప్రేమను కలిగియుండుము
కయీను కోపము విడిచి పెట్టుము
నిజము చెప్పెను హేబెలు రక్తము
కయీను కాదన లేకపోయెను
1. కూ అనే కూసే కోకిల
కమ్మని గానం ఎవరిచ్చారే
ఆ యేసుడే ఆ యేసుడే
ఆ యేసుడే నాకిచ్చెను
2. మిల మిల మెరిసే తారాలారా
చక్కని కాంతిని ఎవరిచ్చారే
ఆ యేసుడే ఆ యేసుడే
ఆ యేసుడే మాకిచ్చెను
3. చక చక ఈదే చేపలారా
ఈదుట మీకు ఎవరు నేర్పిరి
ఆ యేసుడే ఆ యేసుడే
ఆ యేసుడే మాకు నేర్పెను
4.గల గల పారే సెలయేరు
పరుగు తీయుట ఎవరు నేర్పిరి?
ఆ యేసుడే ఆ యేసుడే
ఆ యేసుడే నాకు నేర్పెను
కోరుకో నేడే కోరుకో
నీకేమి కావాలో కోరుకో
1. సినిమా కధలు అల్లరి ఆటపాటలు
దొంగతనాలు చిలిపి చేష్టలు
వీటిని నీవు కోరితే
నరకమే నిత్య నరకమే ॥కోరు॥
2. యేసు రాజు పట్టణం
బంగరు వీధులమయం
నిత్యము ఆనందం
సుఖ సంతోషాలమయం
వీటిని నీవు కోరితే
అర్పించు హృదయమర్పించు ॥కోరు॥
కలిసి వచ్చిరి నడుం కట్టిరి
నెహెమ్య వెంట నడిచి వచ్చిరి
గోడకట్టు వారు
హోయిరబ్బ హోయిరబ్బ
బండలెత్తు వారు
హోయిరబ్బ హోయిరబ్బ
బల్లె బల్లె బల్లె బల్లె హోయిరబ్బ
కత్తి పట్టి గోడ కట్టినారబ్బ
1. యెహోవా మన పక్షమున
యుద్ధము చేయుననుచు
పాడైపోయిన యెరుషలేమును
ప్రార్ధించి కట్టెను నెహెమ్య