భూపునాది మునుపే / Bhoopunaadhi Munupe

బ్యూలా దేశము నాది / Beulah Deshamu Naadi

పాట రచయిత: ఆర్ ఆర్ కే మూర్తి
Lyricist: RRK Murthy

బ్యూలా దేశము నాది
సుస్థిరమైన పునాది (2)
కాలము స్థలము లేనిది (2)
సుందర పురము – నందనవనము (2)      ||బ్యూలా||

స్పటిక నది తీరము నాది
అన్నిటిలో ఘనం అనాది (2)
అపశ్రుతి లేని రాగములు (2)
అలరెడు పురము యేసుని వరము (2)      ||బ్యూలా||

జీవ వృక్ష ఫల సాయము నాది
దేవుని మహిమ స్పర్శ వేది (2)
మరణం బాధే లేనిది (2)
అమరుల పురము మంగళకరము (2)      ||బ్యూలా||

పాట రచయిత: ఆర్ ఆర్ కే మూర్తి
Lyricist: RRK Murthy

Beulah Deshamu Naadi
Susthiramaina Punaadi (2)
Kaalamu Sthalamu Lenidi (2)
Sundara Puramu – Nadanavanamu (2)     ||Beulah||

Spatika Nadi Theeramu Naadi (2)
Annitilo Ghanam Anaadi (2)
Apashruthi Leni Raagamulu (2)
Alaredu Puramu Yesuni Varamu (2)     ||Beulah||

Jeeva Vruksha Phala Saayamu Naadi (2)
Devuni Mahima Sparsha Vedi (2)
Maranam Baadhe Lenidi (2)
Amarula Puramu Mangalakaramu (2)     ||Beulah||

బ్రతుకుట నీ కోసమే / Brathukuta Nee Kosame

పాట రచయిత: ఆడమ్ బెన్నీ
Lyricist: Adam Benny

బ్రతుకుట నీ కోసమే
మరణమైతే నాకిక మేలు (2)
సిలువ వేయబడినానయ్యా (2)
నీవే నాలో జీవించుమయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2)

ఏ క్షణమైనా ఏ దినమైనా
నీ కొరకే నే జీవించెద (2)
శ్రమలైనా శోధనలైనా
ఇరుకులైనా ఇబ్బందులైనా (2)
ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో సాగెదనయ్యా (2)
సేవలో సాగెదనయ్యా..       ||యేసయ్యా||

లోకములోని నిందలు నాపై
రాళ్ళై రువ్విన రంపాలై కోసిన (2)
రాజులైనా అధిపతులైనా
ఉన్నవి అయినా రాబోవువైనా (2)
నీదు ప్రేమ నుండి ఏవి ఎడబాపవయ్యా (2)
ఏవి ఎడబాపవయ్యా..          ||యేసయ్య||

పాట రచయిత: ఆడమ్ బెన్నీ
Lyricist: Adam Benny

Brathukuta Nee Kosame
Maranamaithe Naakika Melu (2)
Siluva Veyabadinaanayyaa (2)
Neeve Naalo Jeevinchumayyaa (2)
Yesayyaa Yesayyaa Yesayyaa Naa Yesayyaa (2)

Ae Kshanamainaa Ae Dinamainaa
Nee Korake Ne Jeevincheda (2)
Shramalainaa Shodhanalainaa
Irukulainaa Ibbandulainaa (2)
Oopiri Unnantha Varaku Nee Sevalo Saagedanayyaa (2)
Sevalo Saagedanayyaa..          ||Yesayyaa||

Lokamulona Nindalu Naapai
Raallai Ruvvina Rampaalai Kosina (2)
Raajulainaa Adhipathulainaa
Unnavi Ainaa Raabovuvainaa (2)
Needu Prema Nundi Aevi Edabaapavayyaa (2)
Aevi Edabaapavayyaa..           ||Yesayya||

ప్రభువా నీ పరిపూర్ణత నుండి / Prabhuvaa Nee Paripoornatha Nundi

ప్రభువా నీ పరిపూర్ణత నుండి
పొందితిమి కృప వెంబడి కృపను

ప్రభువైన యేసు క్రీస్తు – పరలోక విషయములో
ప్రతి ఆశీర్వాదమును – ప్రసాదించితివి మాకు       ||ప్రభువా||

జనకా నీ-వెన్నుకొనిన – జనుల క్షేమము జూచి
సంతోషించునట్లు – నను జ్ఞాపకముంచుకొనుము        ||ప్రభువా||

నీదు స్వాస్థ్యమైనట్టి – నీ ప్రజలతో కలిసి
కొనియాడునట్లుగా – నను జ్ఞాపకముంచుకొనుము        ||ప్రభువా||

దేవా నీదు స్వరూప – దివ్య దర్శనమును
దినదినము నాకొసగి – నను జ్ఞాపకముంచుకొనుము        ||ప్రభువా||

మీ మధ్యన నా ఆత్మ – ఉన్నది భయపడకు
డనిన మహోన్నతుడా – నను జ్ఞాపకముంచుకొనుము        ||ప్రభువా||

ముదమారా నన్నెన్నుకొని – ముద్ర యుంగరముగను
చేతుననిన ప్రభువా – నను జ్ఞాపకముంచుకొనుము        ||ప్రభువా||

కృపా సత్య సమ్మిళిత – సంపూర్ణ స్వరూప
హల్లెలూయా నీకే ప్రభో – ఎల్లప్పుడూ కలుగుగాక        ||ప్రభువా||

Prabhuvaa Nee Paripoornatha Nundi
Pondithimi Krupa Vembadi Krupanu

Prabhuvaina Yesu Kreesthu – Paraloka Vishayamulo
Prathi Aasheervaadamunu – Prasaadinchithivi Maaku            ||Prabhuvaa||

Janakaa Nee-vennukonina – Janula Kshemamu Joochi
Santhoshinchunatlu – Nanu Gnaapakamunchukonumu            ||Prabhuvaa||

Needu Swaasthyamainatti – Nee Prajalatho Kalisi
Koniyaadunatlugaa – Nanu Gnaapakamunchukonumu            ||Prabhuvaa||

Devaa Needu Swaroopa – Divya Darshanumunu
Dinadinamu Naakosagi – Nanu Gnaapakamunchukonumu            ||Prabhuvaa||

Mee Madhyana Naa Aathma – Unnadi Bhayapadaku
Danina Mahonnathudaa – Nanu Gnaapakamunchukonumu            ||Prabhuvaa||

Mudamaara Nannennukoni – Mudra Yungaramuganu
Chethunanina Prabhuvaa – Nanu Gnaapakamunchukonumu            ||Prabhuvaa||

Krupaa Sathya Sammilitha – Sampoorna Swaroopa
Hallelooyaa Neeke Prabho – Ellappudu Kalugugaaka            ||Prabhuvaa||

ప్రతి రోజు చూడాలని / Prathi Roju Choodaalani

ప్రతి రోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను
పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను (2)
తనివి తీర చూసినా నా యేసయ్య రూపం
నా హృదయమే పొంగి పొర్లును
నా మనసే సంతోషించును (2)        ||ప్రతి||

పరలోకమందున పరిశుద్ధ దూతలతో
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతియించబడుచుండెను (2)
జీవ జలము యొద్దకు నడిపించును
ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును
నా హృదయమే పొంగి పొర్లును
నా మనసే సంతోషించును (2)        ||ప్రతి||

ఆకాశమందున రారాజుగా వచ్చును
భూజనులందరు రొమ్ము కొట్టుకొనుచుందురు (2)
కడబూరధ్వని వినిపించును
పరలోక సైన్యముతో వచ్చును
నా హృదయమే పొంగి పొర్లును
నా మనసే సంతోషించును (2)        ||ప్రతి||

Prathi Roju Choodaalani Naa Prabhuvaina Yesayyanu
Palumaarlu Choodaalani Naa Priyudaina Yesayyanu (2)
Thanivi Theera Choosinaa Naa Yesayya Roopam
Naa Hrudayame Pongi Porlunu
Naa Manase Santhoshinchunu (2)          ||Prathi||

Paralokamanduna Parishuddha Doothalatho
Parishuddhudu Parishuddhudu Ani Sthuthiyinchabaduchundenu (2)
Jeeva Jalamu Yoddaku Nadipinchunu
Prathi Baashpa Binduvu Thudichiveyunu
Naa Hrudayame Pongi Porlunu
Naa Manase Santhoshinchunu (2)          ||Prathi||

Aakaashamanduna Raaraajugaa Vachchunu
Bhoojanulandaru Rommu Kottukonuchunduru (2)
Kadabooradhwani Vinipinchunu
Paraloka Sainyamutho Vachchunu
Naa Hrudayame Pongi Porlunu
Naa Manase Santhoshinchunu (2)          ||Prathi||

పరుగెత్తెదా పరుగెత్తెదా / Parugetthedaa Parugetthedaa

పరుగెత్తెదా పరుగెత్తెదా
పిలుపుకు తగిన బహుమతికై
ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో
గురి యొద్దకే నేను పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా||

దైవ భయము కలిగి – శరీరేఛ్చలను విడిచి (2)
అక్షయ కిరీటము కొరకే – ఆశతో పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా||

ఆత్మాభిషేకము కలిగి – ఆత్మల భారముతో (2)
అతిశయ కిరీటము కొరకే – అలయక పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా||

యేసు వైపు చూచుచు – విశ్వాసము కాపాడుకొనుచు (2)
వాడబారని కిరీటముకే – వాంఛతో పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా||

Parugetthedaa Parugetthedaa
Pilupuku Thagina Bahumathikai
Prabhu Yesuni Aagnala Maargamulo
Guri Yoddake Nenu Parugetthedaa (2)        ||Parugetthedaa||

Daiva Bhayamu Kaligi – Shareerechchalanu Vidichi (2)
Akshaya Kireetamu Korake – Aashatho Parugettheda (2)        ||Parugetthedaa||

Aathmaabhishekamu Kaligi – Aathmala Bhaaramutho (2)
Athishaya Kireetamu Korake – Alayaka Parugetthedaa (2)        ||Parugetthedaa||

Yesu Vaipu Choochuchu – Vishwaasamu Kaapaadukonuchu (2)
Vaadabaarani Kireetamuke – Vaanchatho Parugetthedaa (2)        ||Parugetthedaa||

పరలోకము నా దేశము / Paralokamu Naa Deshamu

పరలోకము నా దేశము
పరదేశి నేనిల మాయలోకమేగ
నేను యాత్రికుడను (2)

ఎంతో అందమైనది పరలోకము
అసమానమైనది నా దేశము (2)
ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును (2)          ||పరలోకము||

దూతలు పాడుచుందురు పరమందున
దీవా రాత్రమునందు పాడుచుందురు (2)
పావనుని చూచి నేను హర్షింతును నిత్యము (2)          ||పరలోకము||

రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్
వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని (2)
కాంక్షించెద నా మదిలో ఆయన చెంతనుండ (2)          ||పరలోకము||

అద్దరికి ఎప్పుడు నేను వెళ్లెదన్
అగుపడుచున్నది గమ్యస్థానము (2)
అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరిన్ (2)          ||పరలోకము||

నిత్యానందముండును పరమందున
నీతి సమాధానము ఉండునచ్చట (2)
పొందెదను విశ్రాంతిని శ్రమలన్నియు వీడి (2)          ||పరలోకము||

Paralokamu Naa Deshamu
Paradeshi Nenila Maayalokamega
Nenu Yaathrikudanu (2)

Entho Andamainadi Paralokamu
Asamaanamainadi Naa Deshamu (2)
Ellappudu Vishwaasamutho Yaathranu Saaginthunu (2)         ||Paralokamu||

Doothalu Paaduchunduru Paramanduna
Deevaa Raathramunandu Paaduchunduru (2)
Paavanuni Choochi Nenu Harshinthunu Nithyamu (2)         ||Paralokamu||

Rakshakuni Chenthaku Eppudegedan
Veekshincheda Neppudu Naadu Priyuni (2)
Kaankshincheda Naa Madilo Aayana Chenthanunda (2)         ||Paralokamu||

Addariki Eppudu Nenu Velledan
Agupaduchunnadi Gamyasthaanamu (2)
Achchatane Choochedanu Parishuddhulellarin (2)         ||Paralokamu||

Nithyaanandamundunu Paramanduna
Neethi Samaadhaanamu Undu Nachchata (2)
Pondedanu Vishraanthini Shramalanniyu Veedi (2)         ||Paralokamu||

పరదేశులమో ప్రియులారా / Paradeshulamo Priyulaaraa

పరదేశులమో ప్రియులారా మన
పురమిది గాదెపుడు (నిజముగ) (2)        ||పరదేశుల||

చిత్ర వస్తువులు చెల్లెడి యొకవి
చిత్రమైన సంత (లోకము) (2)        ||పరదేశుల||

సంత గొల్లు క్షమ సడలిన చందం
బంతయు సద్దణగన్ (నిజముగ) (2)        ||పరదేశుల||

స్థిరమని నమ్మకు ధర యెవ్వరికిని
బరలోకమే స్థిరము (నిజముగ) (2)        ||పరదేశుల||

మేడలు మిద్దెలు మేలగు సరకులు
పాడై కనబడవే (నిజముగ) (2)        ||పరదేశుల||

ధర ధాన్యంబులు దరగక మానవు
పని పాటలు పోయె (నిజముగ) (2)        ||పరదేశుల||

ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన
మన్నై పోవునుగా (దేహము) (2)        ||పరదేశుల||

వచ్చితి మిచటికి వట్టి హస్తముల
దెచ్చిన దేదియు లే (దు గదా) (2)        ||పరదేశుల||

ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు
అట్లు వెళ్ళవలయున్ (మింటికి) (2)        ||పరదేశుల||

యేసు నందు విశ్వాసం బుంచిన
వాసిగ నిను జేర్చున్ (బరమున) (2)        ||పరదేశుల||

యేసే మార్గము యేసే సత్యము
యేసే జీవముగా (నిజముగ) (2)        ||పరదేశుల||

Paradeshulamo Priyulaaraa Mana
Puramidi Gaadepudu (Nijamuga) (2)       ||Paradeshula||

Chithra Vasthuvulu Chelledi Yokavi
Chithramaina Santha (Lokamu) (2)       ||Paradeshula||

Santha Gollu Kshama Sadalina Chandam
Banthayu Saddanagan (Nijamuga) (2)       ||Paradeshula||

Sthiramani Nammaku Dhara Yevvarikini
Baralokame Sthiramu (Nijamuga) (2)       ||Paradeshula||

Medalu Middelu Melagu Sarakulu
Paadai Kanabadave (Nijamuga) (2)       ||Paradeshula||

Dhara Dhaanyambulu Daragaka Maanavu
Pani Paatalu Poye (Nijamuga) (2)       ||Paradeshula||

Enni Naallu Mana Milalo Brathikina
Mannai Povunugaa (Dehamu) (2)       ||Paradeshula||

Vahchithi Michatiki Vatti Hasthamula
Dechchina Dediyu Le (du Gadaa) (2)       ||Paradeshula||

Etlu Vachchithimi Yee Lokamunaku
Atlu Vellavalayun (Mintiki) (2)       ||Paradeshula||

Yesu Nandu Vishwaasam Bunchina
Vaasiga Ninu Jerchun (Baramuna) (2)       ||Paradeshula||

Yese Maargamu Yese Sathyamu
Yese Jeevamugaa (Nijamuga) (2)       ||Paradeshula|

నీతి సూర్యుడవై / Neethi Sooryudavai

నీతి సూర్యుడవై వెలుగుతున్న యేసయ్య
నీ ఏర్పాటులోన నీ దేహము మేమయ్య (2)
నీదు రక్షణతో మమ్ము కాచినందుకు
నీదు సంఘముగా మమ్ము నిలిపినందుకు (2)
నీకే వందనం – నీకే వందనం
నీకే వందనం – యేసు రాజ వందనం (2)     ||నీతి||

త్వరలో రానై ఉన్నావయ్యా మా ప్రభువా
నీదు విందులోన చేరాలని మా దేవా (2)
సిద్ధపాటుకై కృపలను చూపుమని
నిన్నే వేడితిమి నీవే మా బలమని (2)    ||నీకే||

నీ నామము రుచిని ఎరిగిన వారము మేము
నిరతము నీ మంచి మన్నాతో బ్రతికెదము (2)
నీ ఆశ్రయములో కురిసెను దీవెనలు
నీలో నిలిచెదము చాటగా నీ తేజము (2)    ||నీకే||

Neetho Sooryudavai Veluguthunna Yesayya
Nee Erpaatulona Nee Dehamu Memayya (2)
Needu Rakshanatho Mammu Kaachinanduku
Needu Sanghamugaa Mammu Nilipinanduku (2)
Neeke Vandanam – Neeke Vandanam
Neeke Vandanam – Yesu Raaja Vandanam (2)     ||Neethi||

Thvaralo Raani Unnaavayyaa Maa Prabhuvaa
Needu Vindulona Cheraalani Maa Devaa (2)
Siddapaatukai Krupalanu Choopumani
Ninne Vedithimi Neeve Maa Balamani (2)     ||Neeke||

Nee Naamamu Ruchini Erigina Vaaranamu Memu
Nirathamu Nee Manchi Mannaatho Brathikedamu (2)
Nee Aashrayamulo Kurisenu Deevenalu
Neelo Nilichedamu Chaatagaa Nee Thejamu (2)     ||Neeke||

నిబంధనా జనులం / Nibandhanaa Janulam

నిబంధనా జనులం
నిరీక్షణా ధనులం
ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం
మేము నిబంధనల జనులం
యేసు రాజు వచ్చును – ఇంకా కొంత కాలమే
మోక్షమందు చేరెదము (2)           ||నిబంధనా||

అబ్రాహాము నీతికి వారసులం
ఐగుప్తు దాటిన అనేకులం (2)
మోషే బడిలో బాలురము (2)
యేసయ్య ఒడిలో కృతాజ్ఞులం – ప్రియ పుత్రులం
మేము నిబంధనా జనులం           ||యేసు రాజు||

విశ్వాసమే మా వేదాంతం
నిరీక్షణే మా సిద్ధాంతం (2)
వాక్యమే మా ఆహారం (2)
ప్రార్ధనే వ్యాయామం – అనుదినము
మేము నిబంధనా జనులం           ||యేసు రాజు||

అశేష ప్రజలలో ఆస్తికులం
అక్షయుడేసుని ముద్రికులం (2)
పునరుత్తానుని పత్రికలం (2)
పరిశుద్ధాత్ముని గోత్రికులం – యాత్రికులం
మేము నిబంధనా జనులం           ||యేసు రాజు||

నజరేయుని ప్రేమ పొలిమేరలో
సహించుటే మా ఘన నియమం (2)
క్షమించుటే ఇల మా న్యాయం (2)
భరించుటే మా సౌభాగ్యం – అదే పరమార్ధం
మేము నిబంధనా జనులం           ||యేసు రాజు||

క్రీస్తేసే మా భక్తికి పునాది
పునరుత్తానుడే ముక్తికి వారధి (2)
పరిశుద్ధాత్ముడే మా రథ సారథి (2)
ప్రభు యేసే మా ప్రధాన కాపరి – బహు నేర్పరి
మేము నిబంధనా జనులం           ||యేసు రాజు||

ఎవరీ యేసుని అడిగేవో
ఎవరోలే యని వెళ్ళేవో (2)
యేసే మార్గం యేసే జీవం (2)
యేసే సత్యం కాదు చోద్యం – ఇదే మా సాక్ష్యం
నిబంధనా జనులం           ||యేసు రాజు||

Nibandhanaa Janulam
Nireekshanaa Dhanulam
Ghanudagu Yesuni Siluva Rakthapu Sambandhulam
Memu Nibandhanaa Janulam
Yesu Raaju Vachchunu – Inkaa Kontha Kaalame
Mokshamandu Cheredamu (2)               ||Yesu Raaju||

Abrahaamu Neethiki Vaarasulam
Aiguputhu Daatina Anekulam (2)
Moshe Badilo Baaluramu (2)
Yesayya Odilo Kruthaagnulam – Priya Puthrulam
Memu Nibandhanaa Janulam               ||Yesu Raaju||

Vishwaasame Maa Vedaantham
Nireekshane Maa Siddhaantham (2)
Vaakyame Maa Aahaaram (2)
Praardhane Vyaayaamam – Anudinamu
Memu Nibandhanaa Janulam               ||Yesu Raaju||

Ashesha Prajalalo Aasthikulam
Akshayudesuni Mudrikulam (2)
Punarutthaanuni Pathrikalam (2)
Parishuddhaathmuni Gothrikulam – Yaathrikulam
Memu Nibandhanaa Janulam               ||Yesu Raaju||

Najareyuni Prema Polimeralo
Sahinchute Maa Ghana Niyamam (2)
Kshaminchute Ila Maa Nyaayam (2)
Bharinchute Maa Soubhaagyam – Ade Paramaardham
Memu Nibandhanaa Janulam               ||Yesu Raaju||

Kreesthese Maa Bhakthiki Punaadi
Punarutthaanude Mukthiki Vaaradhi (2)
Parishuddhaathmude Maa Ratha Saarathi (2)
Prabhu Yese Maa Pradhaana Kaapari – Bahu Nerpari
Memu Nibandhanaa Janulam               ||Yesu Raaju||

Evaree Yesani Adigevo
Evarole Yani Vellevo (2)
Yese Maargam Yese Jeevam (2)
Yese Sathyam Kaadu Chodyam – Ide Maa Saakshyam
Nibandhanaa Janulam               ||Yesu Raaju||