భేదం ఏమి లేదు / Bhedam Emi Ledu

పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesley

భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు
దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు (2)
ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా
దేవుని దృష్టిలో అందరు పాపులే (2)          ||భేదం||

ఆస్తిపాస్థులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వవు
విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు
సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు
కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు
నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా
యేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా (2)          ||భేదం||

పుణ్య కార్యాలు చేసినా పవిత్రత నీకు రాదుగా
తీర్థ యాత్రలు తిరిగినా తరగదు నీ పాపము
పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కార్చెను కలువరిలో
కోరి కోరి నిను పిలిచెను పరమ రాజ్యము నీకివ్వగా
నీ స్థితి ఏదైనా గతి ఏడైన వృత్తేదైనా భృతి ఏదైనా
కలువరి నాథుడే రక్షణ మార్గము (2)          ||భేదం||

పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesley

Bhedam Emi Ledu Andarunu Paapam Chesiyunnaaru
Devaadi Devudu Ichche Unnatha Mahimanu Pogottukunnaaru (2)
Ae Kulamainaa Mathamainaa Jaathainaa Rangainaa
Devuni Drushtilo Andaru Paapule (2)        ||Bhedam||

Aasthipaasthulu Ennunnaa Nithya Raajyam Neekivvavu
Vidyaarhathalu Ennunnaa Santhoshaanni Neekivvavu
Samasipoye Ee Lokamu Aashrayaanni Neekivvadu
Karigipoye Ee Kaalamu Kalavaraanni Theerchadu
Neevevarainaa Neekenthunnaa Evarunnaa Lekunnaa
Yesu Lekunte Neekunnavanni Sunnaa (2)        ||Bhedam||

Punya Kaaryaalu Chesinaa Pavithratha Neeku Raadugaa
Theertha Yaathralu Thiriginaa Tharagadu Nee Paapamu
Paramunu Veedina Parishuddhudesu Rakthamu Kaarchenu Kaluvarilo
Kori Kori Ninu Pilichenu Parama Raajyam Neekivvagaa
Nee Sthithi Edainaa Gathi Edainaa Vruththedainaa Bhruthi Edainaa
Kaluvari Naathude Rakshana Maargamu (2)        ||Bhedam||

భూమియు దాని సంపూర్ణత / Bhoomiyu Daani Sampoornatha

భూపునాది మునుపే / Bhoopunaadhi Munupe

భీకరుండౌ మా యెహోవా / Bheekarundau Maa Yehovaa

భాసిల్లెను సిలువలో / Bhaasillenu Siluvalo

పాట రచయిత: ఏ బి మాసిలామని
Lyricist: AB Maasilaamani

భాసిల్లెను సిలువలో పాపక్షమా
యేసు ప్రభూ నీ దివ్య క్షమా      ||భాసిల్లెను||

కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి (2)      ||భాసిల్లెను||

దోషము చేసినది నేనెకదా
మోసముతో బ్రతికిన నేనెకదా
మోసితివా నా శాపభారం (2)     ||భాసిల్లెను||

పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి (2)     ||భాసిల్లెను||

నీ మరణపు వేదన వృధా గాదు
నా మది నీ వేదనలో మునిగెను
క్షేమము కలిగెను హృదయములో (2)     ||భాసిల్లెను||

ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని (2)     ||భాసిల్లెను||

నమ్మిన వారిని కాదన వనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను (2)      ||భాసిల్లెను||

పాట రచయిత: ఏ బి మాసిలామని
Lyricist: AB Maasilaamani

Bhaasillenu Siluvalo Paapa Kshamaa
Yesu Prabhu Nee Divya Kshamaa         ||Bhaasillenu||

Kaluvarilo Naa Paapamu Ponchi
Siluvaku Ninnu Yaahuthi Chesi
Kalusha Haraa Karuninchithivi (2)       ||Bhaasillenu||

Doshamu Chesinadi Nene Kadaa
Mosamutho Brathikina Nene Kadaa
Mosithivaa Naa Shaapa Bhaaram (2)       ||Bhaasillenu||

Paapamu Chesi Gadinchithi Maranam
Shaapamegaa Nenaarjinchinadi
Kaaparivai Nanu Brochithivi (2)       ||Bhaasillenu||

Nee Maranapu Vedana Vrudhaa Gaadu
Naa Madi Nee Vedanalo Munigenu
Kshemamu Kaligenu Hrudayamulo (2)       ||Bhaasillenu||

Endulako Naapai Ee Prema
Andadayyaa Swamee Naa Madiki
Andulake Bhayamondithini (2)       ||Bhaasillenu||

Nammina Vaarini Kaadana Vaniyu
Nemmadi Nosagedi Naa Prabhudavani
Nammithi Nee Paadambulanu (2) ||Bhaasillenu||

భారత దేశమా యేసుకే / Bhaaratha Deshamaa Yesuke

భారత దేశమా యేసుకే
నా భారత దేశమా ప్రియ యేసుకే (2)
నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన
నిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం (2)
యేసు నామమే జయము జయమని ఇహమంత మారుమ్రోగిపోవాలి
పని చేయుచున్న సాతాను శక్తులు పటా పంచలైపోవాలి (2)
భారత దేశమా నా భారత దేశమా
నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా
ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి

సృష్టికర్తనే మరచి – భారత దేశమా
సృష్టిని పూజించుట తగునా – నా భారత దేశమా (2)
ఈ లోకమును సృష్టించిన యేసే – భారత దేశమా
నిను రక్షించుటకు ప్రాణం పెట్టెను – భారత దేశమా (2)
భారత దేశమా యేసుని చేరుమా
నూతన సృష్టిగ మార్చబడుదువు భారత దేశమా (2)
భారత దేశమా నా భారత దేశమా
నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా
ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి

శాంతికి అధిపతి ఆ యేసే – భారత దేశమా
శాంతి రాజ్యమును స్థాపించును – నా భారత దేశమా (2)
లోకమంతయు లయమైపోవును – భారత దేశమా
లోకాశలన్నియు గతించిపోవును – భారత దేశమా (2)
భారత దేశమా యేసుని చేరుమా
శాంతి సమాధానములను పొందుము భారత దేశమా (2)
భారత దేశమా నా భారత దేశమా
నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా
ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి

రాజుల రాజుగ మన యేసే – భారత దేశమా
పెండ్లి కుమారుడై రానుండె – నా భారత దేశమా (2)
యేసుని నమ్మిన దేశములన్ని – భారత దేశమా
యేసుతో కూడ కోనిపోబడును – భారత దేశమా (2)
భారత దేశమా యేసుని చేరుమా
సువర్ణ దేశముగ మార్చబడుదువు భారత దేశమా (2)
భారత దేశమా నా భారత దేశమా
నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా
ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి

భారత దేశమా నా యేసుకే
భారత దేశమా ప్రియ యేసుకే (2)
నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన
నిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం (2)
యేసు నామమే జయము జయమని ఇహమంత మారుమ్రోగిపోవాలి
పని చేయుచున్న సాతాను శక్తులు పటా పంచలైపోవాలి (2)
భారత దేశమా నా భారత దేశమా
నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా
ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి

Bhaaratha Deshamaa Yesuke
Naa Bhaaratha Deshamaa Priya Yesuke (2)
Nuvvu Sontham Kaavaalannade Naa Praarthana
Ninu Sontham Cheyaalannade Naa Dhyeyam (2)
Yesu Naamame Jayamu Jayamani Ihamantha Maarumrogipovaali
Pani Cheyuchunna Saathaanu Shakthulu Pataa Panchalaipovaali (2)
Bhaaratha Deshamaa Naa Bhaaratha Deshamaa
Naa Priya Yesunike Neevu Sontham Kaavaali
Bhaaratha Deshamaa Naa Bhaaratha Deshamaa
Ugrathalonundi Neevu Rakshana Pondaali

Srushtikarthane Marachi – Bhaartha Deshamaa
Srushtini Poojinchuta Thagunaa – Naa Bhaaratha Deshamaa (2)
Ee Lokamunaku Srushtinchina Yese – Bhaaratha Deshamaa
Ninu Rakshinchutaku Praanam Pettenu – Bhaaratha Deshamaa (2)
Bhaaratha Deshamaa Yesuni Cherumaa
Noothana Srushtiga Maarchabaduduvu Bhaaratha Deshamaa (2)
Bhaaratha Deshamaa Naa Bhaaratha Deshamaa
Naa Priya Yesunike Neevu Sontham Kaavaali
Bhaaratha Deshamaa Naa Bhaaratha Deshamaa
Ugrathalonundi Neevu Rakshana Pondaali

Shaanthiki Adhipathi Aa Yese – Bhaaratha Deshamaa
Shaanthi Raajyamunu Sthaapinchunu – Naa Bhaaratha Deshamaa (2)
Lokamanthayu Layamaipovunu – Bhaaratha Deshamaa
Lokaashalanniyu Gathinchipovunu – Bhaaratha Deshamaa (2)
Bhaaratha Deshamaa Yesuni Cherumaa
Shaanthi Samaadhaanamulanu Pondumu Bhaaratha Deshamaa (2)
Bhaaratha Deshamaa Naa Bhaaratha Deshamaa
Naa Priya Yesunike Neevu Sontham Kaavaali
Bhaaratha Deshamaa Naa Bhaaratha Deshamaa
Ugrathalonundi Neevu Rakshana Pondaali

Raajula Raajuga Mana Yese – Bhaaratha Deshamaa
Pendli Kumaarudai Raanunde – Naa Bhaaratha Deshamaa (2)
Yesuni Nammina Deshamulanni – Bhaaratha Deshamaa
Yesutho Kooda Konipobadunu – Bhaaratha Deshamaa (2)
Bhaaratha Deshamaa Yesuni Cherumaa
Suvarna Deshamuga Maarchabaduduvu Bhaaratha Deshamaa (2)
Bhaaratha Deshamaa Naa Bhaaratha Deshamaa
Naa Priya Yesunike Neevu Sontham Kaavaali
Bhaaratha Deshamaa Naa Bhaaratha Deshamaa
Ugrathalonundi Neevu Rakshana Pondaali

Bhaaratha Deshamaa Naa Yesuke
Bhaaratha Deshamaa Priya Yesuke (2)
Neevu Sontham Kaavaalannade Naa Praarthana
Ninu Sontham Cheyaalannade Naa Dhyeyam (2)
Yesu Naamame Jayamu Jayamanihamantha Maarumrogipovaali
Pani Cheyuchunna Saathaanu Shakthulu Pataa Panchalaipovaali (2)
Bhaaratha Deshamaa Naa Bhaaratha Deshamaa
Naa Priya Yesunike Neevu Sontham Kaavaali
Bhaaratha Deshamaa Naa Bhaaratha Deshamaa
Ugrathalonundi Neevu Rakshana Pondaali

భారత దేశ సువార్త సంఘమా / Bhaaratha Desha Suvaartha

భారత దేశ సువార్త సంఘమా – భువి దివి సంగమమా
ధర సాతానుని రాజ్యము కూల్చే – యుద్ధా రంగమా     ||భారత||

ఎవని పంపుదును నా తరపున – ఇల ఎవరు పోవుదురు నాకై
నేనున్నాను నన్ను పంపమని – రమ్మూ సంఘమా
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా         ||భారత||

అడవి ప్రాంతములు, ఎడారి భూములు – ద్వీపవాసులను గనుమా
అంధకార ప్రాంతములో ప్రభుని – జ్యోతిని వెలిగించను కనుమా
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా         ||భారత||

బ్రతుకులోన ప్రభు శక్తిలేని – క్రైస్తవ జనాంగమును గనుమా
కునుకు దివ్వెలను సరిచేయగ – ఉజ్జీవ జ్వాలగొని చనుమా
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా         ||భారత||

Bhaaratha Desha Suvaartha Sanghamaa – Bhuvi Divi Sangamamaa
Dhara Saathaanuni Raajyamu Koolche – Yuddha Rangamaa      ||Bhaaratha||

Evani Pampudunu Naa Tharapuna – Ila Evaru Povuduru Naakai
Nenunnaanu Nannu Pampani – Rammu Sanghamaa
Bhaaratha Deshamulo Velige Kreesthu Sanghamaa       ||Bhaaratha||

Adavi Praanthamulu, Edaari Bhoomulu – Dweepa Vaasulanu Ganumaa
Andhakaara Praanthamulo Prabhuni – Jyothini Veliginchinanu Kanumaa
Bhaaratha Deshamulo Velige Kreesthu Sanghamaa          ||Bhaaratha||

Brathukulona Prabhu Shakthileni – Kraisthava Janaangamunu Ganumaa
Kunuku Divvelanu Saricheyaga – Ujjeeva Jwaalagoni Chanumaa
Bhaaratha Deshamulo Velige Kreesthu Sanghamaa      ||Bhaaratha||

భయము లేదు మనకు / Bhayamu Ledu Manaku

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

భయము లేదు మనకు
ఇకపై ఎదురు వచ్చు గెలుపు
అదిగో యేసు పిలుపు
వినుమా పరము చేరు వరకు (2)
ఫలితమేదైన ప్రభును వీడకు
కష్టమెంతైన కలత చెందకు
అలుపు లేకుండ పరుగు సాగని
శోధనలు నిన్ను చూసి బెదరని          ||భయము||

సంధించిన బాణమల్లె నీ గురి కొనసాగని
మన తండ్రి వాగ్ధానాలే ఊపిరిగా మారని (2)
కష్టాలే మెట్లుగా మారి యేసులో ఎదిగించని
తన వాక్యం నీలో వెలిగి చీకటి తొలగించని (2)           ||ఫలిత||

మండించే అగ్గితోనే మెరయును బంగారము
శోధనల కొలిమిలోనే బలపడు విశ్వాసము (2)
నీ తరపున యుద్ధం చేసే యెహోవా నీ అండ
తొలగిపోకు ఆ మార్గన్నీ తన ఆజ్ఞను వినకుండా (2)           ||ఫలిత||

కనలేదా సిలువలోన యేసు రాజు కష్టము
తానొందిన శ్రమల ద్వారా నశియించే పాపము (2)
నీ శ్రమల కాలంలోనే మనసు దృఢము కావాలి
తిరిగి నీలో పుట్టే పాపం బీజము నశియించాలి (2)           ||ఫలిత||

ప్రియమైన పుత్రుని మనకై నలిగించిన దేవుడు
అప్పగించలేడా సకలం సర్వశక్తిమంతుడు (2)
తన సన్నిధి రావాలంటూ నిన్ను కోరుతున్నాడు
నీతి నీలో పెంచేటందుకు తపన పడుతూ ఉన్నాడు (2)           ||ఫలిత||

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Bhayamu Ledu Manaku
Ikapai Eduru Vachchu Gelupu
Adigo Yesu Pilupu
Vinumaa Paramu Cheru Varaku (2)
Phalithamedaina Prabhunu Veedaku
Kashtamenthaina Kalatha Chendaku
Alupu Lekunda Parugu Saagani
Shodhanalu Ninnu Choosi Bedarani           ||Bhayamu||

Sandhinchina Baanamalle Nee Guri Konasaagani
Mana Thandri Vaagdhaanale Oopirigaa Maarani (2)
Kashtaale Metlugaa Maari Yesulo Ediginchani
Thana Vaakyam Neelo Veligi Cheekati Tholaginchani (2)        ||Phalitha||

Mandinche Aggithone Merayunu Bangaaramu
Shodhanala Kolimilone Balapadu Vishwaasamu (2)
Nee Tharapuna Yuddham Chese Yehovaa Nee Anda
Tholagipoku Aa Maargaanni Thana Aagnanau Vinakundaa (2)        ||Phalitha||

Kanaledaa Siluvalona Yesu Raaju Kashtamu
Thaanondina Shramala Dwaaraa Nashiyinche Paapamu (2)
Nee Shramala Kaalamlone Manasu Drudamu Kaavali
Thirigi Neelo Putte Paapam Beejamu Nashiyinchaali (2)        ||Phalitha||

Priyamaina Puthruni Manaki Naliginchina Devudu
Appaginchaledaa Sakalam Sarva Shakthimanthudu (2)
Thana Sannidhi Raavaalantu Ninnu Koruthunnaadu
Neethi Neelo Penchetanduku Thapana Paduthu Unnaadu (2)        ||Phalitha||

భయము చెందకు / Bhayamu Chendaku

భయము చెందకు భక్తుడా
ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2)
భయము చెందకు నీవు
దిగులు చెందకు నీవు (2)
జీవమిచ్చిన యెహొవున్నాడు
ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు           ||భయము||

బబులోను దేశమందున
ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా (2)
పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే (2)
నాల్గవ వాడు ఉండలేదా
ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా         ||భయము||

చెరసాలలో వేసినా
తన దేహమంతా.. గాయాలతో నిండినా (2)
పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ (2)
భూకంపం కలుగ లేదా
ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా           ||భయము||

ఆస్తి అంతా పోయినా
తన దేహమంతా.. కురుపులతో నిండినా (2)
అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె (2)
అని యోబు పలుక లేదా
ఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా         ||భయము||

Bhayamu Chendaku Bhakthudaa
Ee Maaya Loka Chaayalu Choochinappudu (2)
Bhayamu Chendaku Neevu
Digulu Chendaku Neevu (2)
Jeevamichchina Yehovunnaadu
O Bhakthudaa.. Praanam Pettina Yesayyunnaadu           ||Bhayamu||

Babulonu Deshamanduna
Aa Bhakthulu Mugguru.. Bommanku Mrokkanandunaa (2)
Patti Bandhinchi Raaju Agnilo Padavesthe (2)
Naalgava Vaadu Undaledaa
O Bhakthudaa.. Naalgava Vaadu Undaledaa           ||Bhayamu||

Cherasaalalo Vesinaa
Thana Dehamanthaa.. Gaayaalatho Nindinaa (2)
Paadi Keerthinchi Poulu Seelalu Koniyaada (2)
Bhookampam Kaluga Ledaa
Aa Bhakthulu Mugguru.. Cheranundi Vidudala Kaaledaa            ||Bhayamu||

Aasthi Anthaa Poyinaa
Thana Dehamanthaa.. Kurupulatho Nindinaa (2)
Anni Ichchina Thandri Anni Theesuku Poye (2)
Ani Yobu Paluka Ledaa
O Bhakthudaa.. Ani Yobu Paluka Ledaa         ||Bhayamu||

భజియింతుము రారే యేసుని / Bhajiyinthumu Raare Yesuni

భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో
గళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో (2)
కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము (4)       ||భజియింతుము||

రారాజు క్రీస్తు రమ్యముగా సేవించి
ప్రభువుల ప్రభువును పూజించి స్తుతియించి (2)
సుందరుడగు యేసు నామం (2)
స్తుతించి భజించి పాడెదము         ||భజియింతుము||

పాపములను బాపును ప్రభు యేసుని రక్త ధారలు
పరమున నిన్ను చేర్చును ప్రభుని దివ్య వాక్కులు (2)
పాపముల వీడి యేసుని (2)
స్తుతించి భజించి పాడెదము         ||భజియింతుము||

Bhajiyinthumu Raare Yesuni Sthothra Geethamutho
Galamuletthi Keerthinthumu Shreshta Gaanamutho (2)
Koniyaadi Paadedamu Keerthinchi Pogadedamu (4)       ||Bhajiyinthumu||

Raaraaju Kreesthu Ramyamugaa Sevinchi
Prabhuvula Prabhuvunu Poojinchi Sthuthiyinchi (2)
Sundarudagu Yesu Naamam (2)
Sthuthinchi Bhajinchi Paadedamu ||Bhajiyinthumu||

Paapamulanu Baapunu Prabhu Yesuni Raktha Dhaaralu
Paramuna Ninnu Cherchunu Prabhuni Divya Vaakkulu (2)
Paapamula Veedi Yesuni (2)
Sthuthinchi Bhajinchi Paadedamu ||Bhajiyinthumu||