ఓడను త్వరగా చేయుము నోవహు(సీయోను పిల్లల పాటలు) / Oodanu Thwaragaa Cheyumu Noahu

…ఆ ఓడలో కొందరు…. నీటిద్వారా రక్షణపొందిరి. 1 పేతురు 3:20

ఓడను త్వరగా చేయుము నోవహు-మహావర్షం కురియును త్వరలో          (1)

లోబడెను, ఆ భక్తుడు కట్టెను ఓడను స్వయముగా                                                  (2)

కట్టెను ఓడను టక్, టక్, టక్ – హోరని కురిసెను మహావర్షం                            (1)

వరదలు పొంగెను పై పైకి – కేకలు వేసిరి జనులెల్ల                                                  (1)

నోవా! నోవా! తలుపు తీయ్                                                                                         (2)

దేవుడే ఓడ తలుపు బిగించెను – నశించిరి లోబడని ప్రజలు                               (1)

రక్షణ ఓడ క్రీస్తు యేసే – తడవు చేయక రండి నేడే                                                  (1) పిలుచుచున్నాడు అందరిని (1) రక్షణ ఓడ లోపలికి                                             (2)

ఓ ప్రభువా నిన్నే నేను సేవింతున్ (సీయోను పిల్లల పాటలు) / O Prabhiuvaa Ninne Nenu Sevinthun

… నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము … యెహోషువ 24:15

పల్లవి : ఓ ప్రభువా నిన్నే నేను సేవింతున్ (2)

1. రాహాబువలె నీతిని పొంది – రూతువలె నిన్ హత్తుకొని (1)

    యెహోషువవలె వాక్యం పాటించి – ప్రార్థన ద్వారా బలము పొంది(1)

    నిన్ను నే, నిన్ను నే – సేవింతు నిరతం (2)                ॥ ఓ ప్రభువా॥

2. ఏలీయావలె విశ్వాసముంచి – పలు శ్రమలలో ధైర్యము గల్గి

    ఏలీషావలె దీనుడనై – రెండింతల ఆత్మను పొంది

    నిన్ను నే, నిన్ను నే సేవింతు నిరతం                        ॥ ఓ ప్రభువా॥

3. ఇశ్రాయేలు నిన్ విడచినట్లు – బయలుకు బలి నర్పించినట్లు

    నిన్ను నేను విడువనెన్నడు – సాతానుని చూడనెన్నడు

    నిన్ను నే, నిన్ను నే – సేవింతు నిరతం                      ॥ ఓ ప్రభువా॥

ఓ దేవా మన్నే తీసి / O Deva Manne Theesi

ఓ దేవా మన్నే తీసి

చక్కనైన నిన్నే చూసి

ముచ్చటగా నన్నే చేశావా

ఓ భల్లె భల్లె భల్లె

నీ రూపం నాకిచ్చుటయే

గొప్పగా ఉన్నదయా

జీవాత్మ నాలో నింపగనే

జీవిగనైతినయా

భల్లె భల్లె భల్లెగా (2)

భల్లె భల్లె భల్లెగా చేసావు

భల్లె భల్లె భల్లెగా (2)

హల్లెలూయ నీకే చేస్తాను

ఓ మేఘమా నీకు వర్షించుట / O Meghamaa Neeku Varshinchuta

1. ఓ మేఘమా నీకు వర్షించుట

ఎవరు నేర్పారమ్మా

భూమి ఆకాశము చేసినవాడు.

భూమి మీద సమస్తం ఉంచినవాడు

వర్షించుట నాకు నేర్పించాడు

భూమిని తడుపుటకు నన్నుంచాడు.

2. వసంతమా నీలో అందాలన్నీ

ఎవరు కూర్చారమ్మా

సృష్టికర్తయైన యెహోవా దేవుడు

సృష్టియంతటిని కలిగించినవాడు 2

నన్నింత అందంగా తీర్చిదిద్దాడు

ఆహ్లాదం పంచంగ సొగసులద్దాడు

ఓ చిన్ని పుష్పమా / O Chinni Pushpama

1. ఓ చిన్ని పుష్పమా

నీ సంతోషమునకు

కారణమేమొ చెప్పుమా

నన్ను చేసినవాడు

అందం ఇచ్చినవాడు

నాకు ఏమి కావాలో

ఆయనే చూసుకుంటాడు

రేపటిని గూర్చి

నాకు దిగులు లేదుగా

సృష్టికర్తను స్తుతించుటయే

నా పనిగా

2. ఓ లేత హృదయమా

నీవు విచారపడుట

తగదని తెలిసికొనుమా

నిన్ను చేసినవాడు

ఎన్నడూ మరువడు

మాట తప్పనివాడు

నీ చేయి విడువడు

పువ్వులను చూసి

నేర్చుకొనుమా

చింత యేసుపై వేసి

సంతోషించుమా