నోరారగా చేతును / Noraaragaa Chethunu

నోరారగా చేతును
దైవారాధనను (2)
ధారాళముగా పాడెదను
స్తోత్ర గీతమును (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హాల్లేలూయా (2)      ||నోరారగా||

భరియించితివి నా పాపపు శిక్షన్
జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో (2)      ||హల్లెలూయా||

విడిపించితివి పాప శిక్ష నుండి
నడిపించితివి జీవ మార్గము నందు (2)      ||హల్లెలూయా||

దయచేసితివి మోక్ష భాగ్యము నాకు
క్రయమిచ్చితివి నా విమోచనకై (2)      ||హల్లెలూయా||

వెలిగించితివి నా మనోనేత్రములు
తొలగించితివి నా పాప చీకటి బ్రతుకు (2)      ||హల్లెలూయా||

Noraaragaa Chethunu
Daivaaraadhananu (2)
Dhaaraalamugaa Paadedanu
Sthothra Geethamunu (2)
Hallelooyaa Hallelooyaa
Hallelooyaa Haallelooyaa (2)       ||Noraaragaa||

Bhariyinchithivi Naa Paapapu Shikshan
Jariginchithivi Nee Rakshana Kaaryamu Naalo (2)    ||Hallelooyaa||

Vidipinchithivi Paapa Shiksha Nundi
Nadipinchithivi Jeeva Maargamu Nandu (2)    ||Hallelooyaa||

Dayachesithivi Moksha Bhaagyamu Naaku
Krayamichchithivi Naa Vimochanakai (2)    ||Hallelooyaa||

Veliginchithivi Naa Manonethramulu
Tholaginchithivi Naa Paapa Cheekati Brathuku (2)    ||Hallelooyaa||

నేస్తమా ప్రియ నేస్తమా / Nesthamaa Priyanesthamaa

నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా
మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా (2)

వేదన బాధలలో కృంగిన సమయములో
నీ ప్రేమతో నన్ను తాకి ఆదరించినావు
చీకటి తొలగించి మహిమతో నింపినావు
పరిశుద్ధాత్మతో అభిషేకించి నను విమోచించినావు         ||నేస్తమా||

Nesthamaa Priyanesthamaa Madhuramaina Bandhamaa
Maruvalenu Needu Premanu Yesu Daivamaa (2)

Vedana Baadhalalo Krungina Samayamulo
Nee Prematho Nannu Thaaki Aadarinchinaavu
Cheekati Tholaginchi Mahimatho Nimpinaavu
Parishuddhaathamtho Abhishekinchi Nanu Vimochinchinaavu           ||Nesthamaa||

నేనేమైనా ప్రభువా / Nenemainaa Prabhuvaa

పాట రచయిత: శ్యామ్ వేదాల
Lyricist: Shyam Vedala

నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను
నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2)
నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2)
నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2)       ||నేనేమైనా||

లేక లేక వృద్ధాప్యమందు
ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2)
ఇచ్చిన నీవే బలి కోరగా (2)
తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా            ||నేనేమైనా||

సర్వము పోయి శరీరము కుళ్ళిన
నా అనువారే వెలివేసినా (2)
ఆప్తులంతా శత్రువులైనా (2)
అంతము వరకు సహియించిన ఆ యోబులా          ||నేనేమైనా||

నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైనా అది నాకెంతో మేలే (2)
ఇదిగో నేను ఉన్నానయ్యా (2)
దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా            ||నేనేమైనా||

పాట రచయిత: శ్యామ్ వేదాల
Lyricist: Shyam Vedala

Nenemainaa Prabhuvaa Ninne Sthuthisthaanu
Naakemunnaa Prabhuvaa Neeke Arpisthaanu
Nenemaiyunnaano Nee Daya Valanenayyaa
Naakunnavanniyu Neevichchinavenayyaa (2)          ||Nenemainaa||

Leka Leka Vruddhaapyamandu
Ekaika Kumaaruni Ichchindi Neeve (2)
Ichchina Neeve Bali Koragaa (2)
Thechchi Neeku Arpinchina Abrahaamulaa        ||Nenemainaa||

Sarvamu Poyi Shareeramu Kullina
Naa Anuvaare Velivesinaa (2)
Aapthulanthaa Shathruvulainaa (2)
Anthamu Varaku Sahiyinchina Aa Yobulaa            ||Nenemainaa||

Naa Mattukaithe Brathukuta Kreesthe
Chaavainaa Adi Naakentho Mele (2)
Idigo Nenu Unnaanayyaa (2)
Dayatho Nannu Gaikonumayyaa Naa Yesayyaa           ||Nenemainaa||

నేనెల్లప్పుడు యెహోవా నిను / Nenellappudu Yehovaa Ninu

నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2)
నిత్యము నా కీర్తి నా నోట నుండును (2)
మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా
చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా (2) ||నేనెల్లప్పుడు||

కలిమి చేజారి నను వంచినా
స్థితిని తలకిందులే చేసినా (2)
రెండింతలుగా దయచేసెదవని (2)
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||

పరుల ఎగతాళి శృతి మించినా
కలవరము గుండెనే పిండినా (2)
నా మొఱ విని కృప చూపెదవని (2)
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||

శ్రమలు చెలరేగి బెదిరించినా
ఎముకలకు చేటునే తెచ్చినా (2)
ఆపదలలో విడిపించెదవని (2)
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||

Nenellappudu Yehovaa Ninu Sannuthinchedanu (2)
Nithyamu Naa Keerthi Naa Nota Nundunu (2)
Melainaa Keedainaa Neethone Yesayyaa
Chaavainaa Brathukainaa Neekosamenayyaa (2) ||Nenellappudu||

Kalimi Chejaari Nanu Vanchinaa
Sthithini Thalakindule Chesinaa (2)
Rendinthalugaa Dayachesedavani (2)
Naaku Thelusunayyaa.. Manchi Yesayyaa ||Melainaa||

Parula Egathaali Shruthi Minchinaa
Kalavaramu Gundene Pindinaa (2)
Naa Mora Vini Krupa Choopedavani (2)
Naaku Thelusunayyaa.. Manchi Yesayyaa ||Melainaa||

Shramalu Chelaregi Bedirinchinaa
Emukalaku Chetune Thechchinaa (2)
Aapadalalo Vidipinchedavani (2)
Naaku Thelusunayyaa.. Manchi Yesayyaa ||Melainaa||

నేనెరుగుదును ఒక స్నేహితుని / Nenerugudunu Oka Snehithuni

నేనెరుగుదును ఒక స్నేహితుని
అతడెంతో పరిశుద్ధుడు
ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ
కారణ భూతుడు (2)
అతడే యేసుడు… అతడే యేసుడు (2)        ||నేనెరుగుదును||

చీకటి దారులలో – చితికిన బ్రతుకులకు (2)
వెలుగు కలుగజేసే – జీవ జ్యోతి యేసే (2)        ||నేనెరుగుదును||

చెరిగిన మనసులతో – చెదరిన మనుజులకు (2)
శాంతి కలుగజేసే – శక్తిమంతుడేసే (2)        ||నేనెరుగుదును||

Nenerugudunu Oka Snehithuni
Athadentho Parishuddhudu
Aa Parishuddhude Naa Jeevana Rakshana
Kaarana Bhoothudu (2)
Athade Yesudu… Athade Yesudu (2)         ||Nenerugudunu||

Cheekati Daarulalo – Chithikina Brathukulaku (2)
Velugu Kalugajese – Jeeva Jyothi Yese (2)         ||Nenerugudunu||

Cherigina Manasulatho – Chedarina Manujulaku (2)
Shaanthi Kalugajese – Shakthimanthudese (2)         ||Nenerugudunu||

నేనునూ నా ఇంటి వారును / Nenunu Naa Inti Vaarunu

నేనునూ నా ఇంటి వారును
యెహోవాను సేవించెదము
ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని (2)
సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని        ||నేనునూ||

శ్రమలో శోధనలో మరణ బంధకంలో
శాంతి సమాధానం దయచేసి దేవుడు (2)
ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో (2)
ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు (2)          ||నేనునూ||

ఏ పాపము నన్ను ఏలనీయని వాడు
ఏ అపాయమును రాకుండా కాపాడును (2)
కునుకు పాటు లేనివాడు నిదురపోని దేవుడు (2)
నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు (2)          ||నేనునూ||

దీర్ఘాయువు చేత దీవించు దేవుడు
దీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును (2)
మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు (2)
మేలు చేత కీడునెలా జయించాలో నేర్పును (2)          ||నేనునూ||

Nenunu Naa Inti Vaarunu
Yehovaanu Sevinchedamu (2)
Aayane Sajeevudani Aayane Vijeyudani (2)
Siluvalona Neeku Naaku Vijayamu Chekoorchenani          ||Nenunu||

Shramalo Shodhanalo Marana Bandhakamlo
Shaanthi Samaadhaanam Dayachesina Devudu (2)
Aashaa Niraashalalo Aavedana Valayamlo (2)
Ae Devudu Cheyaleni Adbhuthamulu Chesinaadu (2)        ||Nenunu||

Ae Paapamu Nannu Aelaneeyani Vaadu
Ae Apaayamunu Raakunda Kaapaadunu (2)
Kunuku Paatu Lenivaadu Niduraponi Devudu (2)
Nenu Namminavaadu Nammadagina Devudu (2)        ||Nenunu||

Deerghaayuvu Chetha Deevinchu Devudu
Deergha Shaanthamutho Deenathvamu Nerpunu (2)
Melu Chetha Naa Hrudayam Thrupthiparachu Devudu (2)
Melu Chetha Keedunelaa Jayinchaalo Nerpunu (2)        ||Nenunu||

నేనున్నా నేనున్నా / Nenunnaa Nenunnaa

Paapaaniki Naaku Ae Sambandhamu Ledu
Paapaaniki Naapai Ae Adhikaaramu Ledu
Paapaaniki Naaku Ae Sambandhamu Ledu
Paapaaniki Naapai Ae Ajamaayishi Ledu
Naa Paapamulu Anni Naa Prabhuvu Aenaado Kshamiyinchivesaadugaa
Mari Vaatinennadunu Gnaapakamu Chesikonanu Ani Maata Ichchaadugaa
Nenunnaa Nenunnaa Naa Yesuni Krupa Krinda
Ne Lenu Ne Lenu Dharma Shaasthram Krinda (2)         ||Paapaaniki||

Krupa Undani Paapam Cheyochchaa – Atlanaraadu
Krupa Undani Neethini Viduvochchaa – Atlanaraadu
Krupa Undani Paapam Cheyochchaa – Atlanaraadu
Krupa Undani Neethini Viduvochchaa – No
Krupa Ante License Kaadu
Krupa Ante Free Pass Kaadu – Paapaanni Chesenduku
Krupa Ante Devuni Shakthi
Krupa Ante Devuni Neethi – Paapaanni Gelichenduku

Grace is not a License to Sin
is a Power of God to Overcome (4)        ||Nenunnaa||

Krupa Dwaaraa Dharma Shaasthramuku – Mruthudanu Ayyaa
Krupa Valana Kreesthulo Swaathanthryam – Ne Pondithinayyaa
Krupa Dwaaraa Dharma Shaasthramuku – Mruthudanu Ayyaa
Krupa Valane Kreesthulo Swaathanthryam
Kriyala Moolamugaa Kaadu
Krupaye Nanu Rakshinchinadi – Naa Bhaaram Tholaginchinadi
Krupa Nannu Maarchesinadi
Neethi Sadbhakthula Thoda – Brathukamani Bodhinchinadi

Grace took away burden from me
and taught to me live righteously (4)        ||Nenunnaa||

Paapaaniki Mruthudanu Nenayyaa – Hallelooyaa
Krupa Valene Idi Naaku Saadhyam – Ayyindira Bhayyaa
Paapaaniki Mruthudanu Nenayyaa – Hallelooyaa
Krupa Valene Idi Naaku Saadhyam
Krupanu Ruchi Choochina Nenu
Devunike Lobaduthaanu – Paapaaniki Chotivvanu
Parishuddhatha Pondina Nenu
Neethi Saadhanamulugaane – Deham Prabhukarpinthunu

Yield your bodies unto the Lord
as Instruments of Righteousness (2)
Yield your members unto the Lord
as Instruments of Righteousness (2)        ||Nenunnaa||

Dharmashaasthram Paapam Ayyindaa – Atlanaraadu
Dharmashaasthram Vyardham Ayyindaa – Atlanaraadu
Dharmashaasthram Paapam Ayyindaa – Atlanaraadu
Dharmashaasthram Vyardham Ayyindaa – No
Dharmashaasthram Kontha Kaalamegaa
Dharmashaasthram Baalashikshayegaa – Prabhu Noddaku Nadipenduku
Kreesthochchi Krupa Thechchenugaa
Dharmashaasthram Neraverchenugaa – Manalanu Vidipinchenduku

Law has lead the people to Christ
Now grace will make His conquerors (4)        ||Nenunnaa||

పాపానికి నాకు ఏ సంబంధము లేదు
పాపానికి నాపై ఏ అధికారము లేదు
పాపానికి నాకు ఏ సంబంధము లేదు
పాపానికి నాపై ఏ అజమాయిషీ లేదు
నా పాపములు అన్ని నా ప్రభువు ఏనాడో క్షమియించివేసాడుగా
మరి వాటినెన్నడును జ్ఞాపకము చేసికొనను అని మాట ఇచ్చాడుగా
నేనున్నా నేనున్నా నా యేసుని కృప క్రింద
నే లేను నే లేను ధర్మ శాస్త్రం క్రింద (2)        ||పాపానికి||

కృప ఉందని పాపం చేయొచ్చా – అట్లనరాదు
కృప ఉందని నీతిని విడువొచ్చా – అట్లనరాదు
కృప ఉందని పాపం చేయొచ్చా – అట్లనరాదు
కృప ఉందని నీతిని విడువొచ్చా – నో
కృప అంటే లైసెన్స్ కాదు
కృప అంటే ఫ్రీ పాస్ కాదు – పాపాన్ని చేసేందుకు
కృప అంటే దేవుని శక్తి
కృప అంటే దేవుని నీతి – పాపాన్ని గెలిచేందుకు

గ్రేస్ ఈస్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్
ఈస్ ఎ పవర్ ఆఫ్ గాడ్ టు ఓవర్ కం (4)         ||నేనున్నా||

కృప ద్వారా ధర్మ శాస్త్రముకు – మృతుడను అయ్యా
కృప వలన క్రీస్తులో స్వాతంత్య్రం – నే పొందితినయ్యా
కృప ద్వారా ధర్మ శాస్త్రముకు – మృతుడను అయ్యా
కృప వలెనే క్రీస్తులో స్వాతంత్య్రం
క్రియల మూలముగా కాదు
కృపయే నను రక్షించినది – నా భారం తొలగించినది
కృప నను మార్చేసినది
నీతి సద్భక్తుల తోడ – బ్రతుకమని బోధించినది

గ్రేస్ టుక్ అవే బర్డెన్ ఫ్రమ్ మి
అండ్ టాట్ టు మి లివ్ రైటియస్లీ (4)          ||నేనున్నా||

పాపానికి మృతుడను నేనయ్యా – హల్లెలూయా
కృప వలెనె ఇది నాకు సాధ్యం – అయ్యిందిరా భయ్యా
పాపానికి మృతుడను నేనయ్యా – హల్లెలూయా
కృప వలెనె ఇది నాకు సాధ్యం
కృపను రుచి చూచిన నేను
దేవునికే లోబడుతాను – పాపానికి చోటివ్వను
పరిశుద్ధత పొందిన నేను
నీతి సాధనములుగానే – దేహం ప్రభుకర్పింతును

యీల్డ్ యువర్ బాడీస్ అంటు ద లార్డ్
యాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైటియస్నెస్ (2)
యీల్డ్ యువర్ బాడీస్ అంటు ద లార్డ్
యాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైటియస్నెస్ (2)          ||నేనున్నా||

ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు
ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా – అట్లనరాదు
ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు
ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా – నో
ధర్మశాస్త్రం కొంత కాలమేగా
ధర్మశాస్త్రం బాలశిక్షయేగా – ప్రభు నొద్దకు నడిపేందుకు
క్రీస్తొచ్చి కృప తెచ్చెనుగా
ధర్మశాస్త్రం నెరవేర్చెనుగా – మనలను విడిపించేందుకు

లా హాస్ లెడ్ ది పీపుల్ టు క్రైస్ట్
నౌ గ్రేస్ విల్ మేక్ హిస్ కాన్క్వరర్స్ (4)          ||నేనున్నా||

నేను వెళ్ళే మార్గము / Nenu Velle Maargamu

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును
శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను (2)     ||నేను||

కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున (2)
గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2)

జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు (2)
అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2)

విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు (2)
సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2)         ||నేను||

Nenu Velle Maargamu – Naa Yesuke Theliyunu (2)
Shodhinchabadina Meedata – Nenu Suvarnamai Maaredanu (2)      ||Nenu||

Kadaleni Kadali Theeramu – Edamaaye Kadaku Naa Brathukuna (2)
Gurileni Tharunaana Veruvaga – Naa Darine Nilicheva Naa Prabhu
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2)

Jalamulalo Badi Ne Vellinaa – Avi Naa Meeda Paaravu (2)
Agnilo Nenu Nadachinaa – Jwaalalu Nanu Kaalchajaalavu
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2)

Vishwaasa Naava Saaguchu – Payaninchu Samayaana Naa Prabhu (2)
Saathaanu Sudigaali Repagaa – Naa Yedute Nilichevaa Naa Prabhu
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2)      ||Nenu||

నేను పిలిస్తే పరుగున / Nenu Pilisthe Paruguna

నేను పిలిస్తే పరుగున విచ్ఛేస్తారు
నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు
నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు
అల కరుణతో నన్ను నడిపిస్తారు (2)
శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

నన్ను వెంబడించమని యేసు పిలిచారు
తానే వెలుగై నాకు మార్గమయ్యారు (2)
కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

Nenu Pilisthe Paruguna Vichchesthaaru
Nenu Sthuthisthe Naa Praarthanaalakisthaaru
Nenu Edisthe Laalinchi Odaarusthaaru
O Entha Goppa Prema Naa Yesudi – (2) ||Nenu Pilisthe||

Nenu Alasipothe Thana Chethini Andisthaaru
Alaa Karunatho Nannu Nadipisthaaru (2)
Shakthinisthaaru Naaku Soukhyamisthaaru
O Entha Goppa Prema Naa Yesudi – (2) ||Nenu Pilisthe||

Nannu Vembadinchamani Yesu Pilichaaru
Thaane Velugai Naaku Maargamayyaaru (2)
Kaanthinichchi Naaku Shaanthinisthunnaaru
O Entha Goppa Prema Naa Yesudi – (2) ||Nenu Pilisthe||

నేను తగ్గాలి యేసు / Nenu Thaggaali Yesu

నేను తగ్గాలి యేసు – నీవే హెచ్చాలి (2)
నేను పూర్తిగా మరుగై – నీవే కనబడాలి (2)
ఇదియే నా ప్రార్థన – నీ చిత్తము (2)      ||నేను||

నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి (2)
నా స్వార్ధ్య జీవితమంతా లయమైపోవాలి (2)
యేసూ నీ స్వభావము నాలో అధికమౌతు ఉండాలి (2)
పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి (2)      ||ఇదియే||

ఆదాము పాపము నాలో వసియించియుండగా (2)
యేసూ నీ రక్తమే దాని నశియింప చేయును (2)
ఆటంకమేమియు లేక జీవధారలుండాలి (2)
యేసూ నీ జీవము నాలో నింపబడుతు పోవాలి (2)      ||ఇదియే||

Nenu Thaggaali Yesu – Neeve Hechchaali (2)
Nenu Poorthigaa Marugai – Neeve Kanabadaali (2)
Idiye Naa Praarthana – Nee Chitthamu (2)        ||Nenu||

Nenu Yesutho Koodaa Siluva Veyabadaali (2)
Naa Swaardhya Jeevithamanthaa Layamaipovaali (2)
Yesu Nee Swabhaavamu Naalo Adhikamauthu Undaali (2)
Paraloka Jeevamu Naalo Abhivruddhi Chendaali (2)        ||Idiye||

Aadaamu Paapamu Naalo Vasiyinchiyundagaa (2)
Yesu Nee Rakthame Daani Nashiyimpa Cheyunu (2)
Aatankamemiyu Leka Jeevadhaaralundaali (2)
Yesu Nee Jeevamu Naalo Nimpabaduthu Povaali (2)        ||Idiye||