జీవించువాడు ఇక నేను కాను
నాలో యేసుక్రీస్తే
క్రీస్తుతో కూడను
సిలువ వేయబడితిన్
నను ప్రేమించి నాకై బలియైన
యేసుకై జీవింతును
జీవించువాడు ఇక నేను కాను
నాలో యేసుక్రీస్తే
క్రీస్తుతో కూడను
సిలువ వేయబడితిన్
నను ప్రేమించి నాకై బలియైన
యేసుకై జీవింతును
జాబిల్లి కంటే చల్లనా
నా యేసు ప్రేమ
ఆ మంచు కంటే తెల్లనా..
నా యేసు ప్రేమ
అమ్మ కంటే చక్కన
తేనె కంటే తియ్యన
నా యేసు ప్రేమ (4)
1. సంపంగి కంటే సువాసన
నా యేసు ప్రేమ
శరాత్ర కంటే సుభావన
నా యేసు ప్రేమ
చెలిమి కంటే తియ్యన
కలిమి కంటే చక్కన
నా యేసు ప్రేమ (4)
జీవిత నావలో నే సాగెదన్
ప్రార్ధనతోనే పయనించెదన్
1. ఎస్తేరువలెనే నిన్ను విడువక
హన్నావలె నీకై వేచియుందును
ప్రార్ధించెదన్ ప్రార్ధించెదన్
యేసుతో కలసి నే సాగెదన్
2. నా చిన్న దోనెను యేసుకిత్తును
నా యేసు నేను కలసి పయనింతుము
ప్రార్ధించెదన్ ప్రార్ధించెదన్
యేసుతో కలసి నే సాగెదన్
జీవముగలవాడు నా దేవుడు
జీవించుచున్నవాడు
1. గుడ్డివాడు కాడు నా దేవుడు
నా క్రియలన్ చూచును
చెవిటివాడు కాడు నా దేవుడు
నా మొర వినుచుండును ॥జీవ॥
2. మూగవాడుకాడు నా దేవుడు
నాతో మాట్లాడును
కురుచకాదు మరి ఆయన హస్తము
నన్నిల రక్షించు
3. మనుషులు చేసిన
వట్టి విగ్రహం కాదు నా దేవుడు
ఆత్మ రూపిగ మాతో నుండి
మమ్మును కాపాడును
జోకర్ బాబాయ్ జోకర్ బాబాయ్
రావ రావ రావ
మేము ఎదురు చూస్తు వున్నాం
నీ మైండు షార్పుగుంది
నీ డ్రస్సు మస్తుగుంది
మనమంతా ప్రభునివారం
అల్లరి చెయ్యం ఫైటు చెయ్యం
హే… హే… హే… హే… హే..
జాగ్రత్త జాగ్రత్త పిల్లలూ జాగ్రత్త
సైతాను మోసగాడూ
నేనే అసలు క్రీస్తునని
నన్నే మీరు నమ్మండని
అబద్ధాలెన్నో చెపుతాడు
అయ్యో, అయ్యో ఎంత మోసమో
మీరు చాటి చెప్పండి విషయము
వాక్యముతో ప్రార్ధనతో దైవశక్తితో
సాతానుని చితక త్రొక్కండి
నిజ యేసుకై ఎదురు చూడండి