విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి… మత్తయి 13:18
పల్లవి : విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలుదేరెను (2)
అవి విత్తుచుండగా కొన్ని త్రోవ ప్రక్క పడెను (2)
పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను (2)
1.మరికొన్ని విత్తనాలు – రాతినేల మీద పడెను (2)
వాటిలో వేరు లేనందున – అవి ఎండిపోయెను (2) ॥విత్త॥
2. మరికొన్ని విత్తనాలు – ముండ్లపొదలలోన పడెను
ముండ్ల పొదలు ఎదిగి – వాటి నణచి వేసెను ॥విత్త॥
3. మరికొన్ని విత్తనాలు – మంచి నేల మీద పడెను
ముప్ప – దరువదంతల్ – నూరంతలు ఫలియించెన్ ॥విత్త॥
4. వాక్యమును విని, గ్రహించి – దాని ననుసరించువారు
సఫలులై ప్రభు యేసులో – బహుగా ఫలించెదరు ॥విత్త॥
దేవా, పాపినైన నన్ను కరుణించుము… లూకా 18:13
1. వెళ్లుచున్నది బండి వెళ్లుచున్నది – సంతసముగా వెళ్లుచున్నది (1)
వచ్చి చేరుడి-వచ్చి చేరుడి – వేగముగ వచ్చి చేరుడి (1)
స్వర్ణ పట్టణం – చేరు స్థలము – స్వర్ణ గృహము అందుగలదు (1)
సదా సంగీతం ఉప్పొంగు సంతోషం – సదా వేచియుండునచ్చట (1)
2. వెళ్లిపోతుంది – బండి వెళ్లిపోతుంది – తామసిస్తే వెళ్లిపోతుంది
రాని వారలు రాజులైనను – వేడినను బండి నిలువదు
శిక్షను నీవు తప్పించుకొనుటకు – తప్పక యేసు రాజును
చేరి నీవు క్షమాపణ పొందు – వచ్చి నిన్ను కొనిపోవును
… యేసుక్రీస్తు … జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. 2 పేతురు 3:18, మత్తయి 13:18
1. విత్తువాడేసిన విత్తనములలో – పడినవి కొన్ని త్రోవ ప్రక్కన (1)
ఆ… ఆ… ఆ… వాటిలో – కొన్నింటిని పక్షులు తినెను (2)
దేవుని వాక్యమను విత్తనం – మన హృదయమందు పడకుండిన (1)
ఆ.. ఆ.. ఆ… వాటిని శత్రువు ఎత్తుకొని పోవును (2)
2. త్తువాడేసిన విత్తనములలో – పడినవి కొన్ని రాతినేల పై (1)
ఆ… ఆ… ఆ… అవి యన్ని – ఎండిపోయి మాడిపోయినవే (2)
వుని వాక్యమను విత్తనం – హృదయములో వేరుపారనిచో (1)
ఆ… ఆ… ఆ… అవియన్ని శ్రమలు కలుగ అభ్యంతరమగును (2)
3. విత్తువాడేసిన విత్తనములలో – పడినవి కొన్ని ముండ్ల పొదలలో (1)
ఆ… ఆ… ఆ… వాటిని – ముండ్ల తుప్పలు అణచివేసెను (2)
దేవుని వాక్యమను విత్తనం – హృదయములో ఫలింపనిచో (1)
ఆ… ఆ… ఆ… వాటిని లోక ప్రేమ చింతలు అణచివేయున్ (2)
4. విత్తు వాడేసిన విత్తనములలో – పడినవి కొన్ని మంచి నేలపై (1)
ఆ.. ఆ.. ఆ..అవియన్ని అరువదంతలు-నూరంతలు ఫలియించెన్ (2)
దేవుని వాక్యమను విత్తనం – హృదయములో నిలిపి ధ్యానించిన (1)
ఆ… ఆ… ఆ… అవియన్ని ఆత్మాభివృద్ధి కలిగించును (2)
క్రీస్తుయేసుయొక్క మంచి సైనికుడు… 2 తిమోతి 2:3
పల్లవి : విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని (2)
1. నిత్యజీవము చేపట్టి – సత్యవేదము చేబూని (2)
పవిత్ర హృదయములతో – పోరాడుడి విజయముతో (2) ॥విశ్వాస॥
2. నీతిని భక్తిని గోరి – నిజమైన విశ్వాసులుగా
ఓర్పును ప్రేమను గల్గి – పోరాడుడి విజయముతో ॥విశ్వాస॥
3. ప్రథమ పాపినైన – నను ప్రేమించెను ప్రభువు
ప్రభు కనికరమును పొంది – పోరాడుడి విజయముతో ॥విశ్వాస॥
4. అంధకార హృదయములను – అద్భుతముగ వెలిగించె
ప్రకాశించుచు ప్రభులో – పోరాడుడి విజయముతో ॥విశ్వాస॥
5. ఆకాశమున నుండి – కలిగిన దర్శనమునకు
అవిధేయత చూపకను – పోరాడుడి విజయముతో ॥విశ్వాస॥
6. అన్యజనుల మధ్య – భూరాజుల యెదుట (2)
క్రీస్తుని నామము భరించి – పోరాడుడి విజయముతో (2) ॥విశ్వాస॥
7. క్రీస్తేసు మనస్సు కలిగి – సత్రియలను జరిగించి
యోధులుగా నిలుచుండి – పోరాడుడి విజయముతో ॥విశ్వాస॥
8. దీన మనస్సు కలిగి – పిల్లలారా లోబడియు
మహిమ కిరీటముకై – పోరాడుడి విజయముతో ॥విశ్వాస॥
9. ఆత్మల రక్షణ కొరకై – అర్పించుడి జీవితము
అంతము వరకు నిలిచి – పోరాడుడి విజయముతో ॥విశ్వాస॥
వాక్యపు వెలుగులో నడచెదం
జీవపు బాటలో వెళ్ళెదం
1. సత్యవాక్యమే మనకు దీపము
నిత్యజీవము మనకు చూపును
నిత్యము లోకమందు వెలుగుచుండెను
2. రక్షణనే వెలుగు సౌలు మీద పడెను
తక్షణమే అతడు నేల మీద పడెను
ఆ క్షణమే తెలిసికొనె యేసే వెలుగని
వర్షాకాలంలో ఎండాకాలంలో
చలి చలి గాలులలో
అన్ని వేళలలో మన దేవుడు
తోడుగా ఉన్నాడు.
ఘన మహిమలు ఎన్నో పొందాడు.
1. కోయిల పాటలతో
సిరిసిరి మువ్వలతో చప్పట్లు కొట్టెదను
గంతులు వేసెదను
మన యేసుని కొరకై జీవింతును
నా జీవితమంతా స్తుతియింతును
విత్తనాలు మూటకట్టి
ఎడ్లబండి మీద పెట్టి
విత్తనాలు విత్తుటకు బయలుదేరే ఛల్
విత్తనాలు విత్తుటకు బయలుదేరే
పొలములోన విత్తనాలు విత్తబోయే ఛల్
పొలములోన విత్తనాలు విత్తబోయే
యేసయ్య మాటలు బల్ బల్ బల్
అద్భుత సత్యం ఛల్ ఛల్ ఛల్
బల్ బల్ బల్ ఛల్ ఛల్ ఛల్
1. గంపలోన విత్తనాలు
చేతిలోకి తీసుకొని
పొలములోన విత్తనాలు వెదజల్లె
దారిపక్క విత్తనాలు కొన్ని పడితే
పక్షులొచ్చి రివ్వున ఎత్తుకెళ్ళెనే దేఖో
2 గంపలోన విత్తనాలు
చేతిలోకి తీసుకొని
పొలములోన విత్తనాలు వెదజల్లె
మంచినేల విత్తనాలు కొన్ని పడితే
నూరంతలూ పంట చేతికొచ్చె దేఖో.
వచ్చె వచ్చె తిరిగొచ్చె
చిన్న కుమారుడు ఇంటికొచ్చె
చనిపోయి మరల బ్రతికి వచ్చె
తప్పిపోయి మరల తిరిగి వచ్చె
యు టర్న్ తీసుకున్నాడు
తన మిస్టేక్ తెలుసుకున్నాడు.
1. అల్లంత దూరాన కనిపించగా.
ప్రేమతో పరుగెత్తి ముద్దు పెట్టెగా
మంచి వస్త్రం తెచ్చి తొడిగించెను
ఇరుగుపొరుగు పిలిచి
-విందు చేసెను
విశాల నీలాకాశంలో
వింతైన అంతరిక్షంలో
ఎత్తైన పర్వత శ్రేణులలో
లోతైన పచ్చని లోయలలో (2)
దేవుని చేతిపని
ప్రచురమగుచున్నది
యేసుక్రీస్తు మహిమ
వివరించబడుచున్నది
1. మిలమిల మెరిసే తారలలో
కిలకిల అరిచే పక్షులలో
గలగల ఉరికే ఏరులలో
కళకళ వెలిగే చిన్నారులలో ॥దేవు ॥
వెలుగైన యేసు దేవుడు
వెలుగు కలుగజేసిన వాడు
తన వెలుగును వెదజల్లుటకు
లోకములో నిన్ను నన్నుంచాడు.
లెమ్ము లోకమును వెలిగించుము
మండే జ్వాలవై ప్రకాశించుము
1. యేసుని వెంబడిరచువారు
చీకటిలో నడువలేరు
జీవపు కాంతులు కలిగి
ధరణిలో వెలుగొందెదరు
2. యేసుని ఎరుగని వారు
చీకటిలో నడచుచున్నారు
నిజమైన వెలుగును పొంద
మార్గము చూప బయలుదేరు