మనసులొకటాయే భువిలో / Manasulokataaye Bhuvilo

పాట రచయిత: మైఖెల్ కళ్యాణపు
Lyricist: Michael Kalyanapu

మనసులొకటాయే భువిలో
ఇరువురొకటాయే హృదిలో (2)
మనసు పరవశమై మధుర లాహిరిలో (2)
మనసులోని భావాలు
ఉరకలు వేసే ఈ వేళా        ||మనసులొకటాయే||

ఎవరికెవరొక నాడు ఈ క్షణాన ఇచ్చోట
దేవ దేవుని సంకల్పం ఈ శుభ ఘడియా (2)
ఈ మధురమైన శుభవేళ (2)
ఒకరికొకరు తోడు నీడగా
సాగే ఈ తరుణం        ||మనసులొకటాయే||

అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమై
జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా (2)
ఘన యేసుని దివ్య ఆశీస్సు (2)
జీవితాంతం నిండుగ మెండుగ
నీతో నిలిచే ఈ తరుణం        ||మనసులొకటాయే||

పాట రచయిత: మైఖెల్ కళ్యాణపు
Lyricist: Michael Kalyanapu

Manasulokataaye Bhuvilo
Iruvurokataaye Hrudhilo (2)
Manasu Paravashamai Madhura Laahirilo (2)
Manasuloni Bhaavaalu
Urakalu Vese Ee Velaa       ||Manasulokataaye||

Evarikevaroka Naadu Ee Kshanaana Ichchota
Deva Devuni Sankalpam Ee Shubha Ghadiyaa (2)
Ee Madhuramaina Shubhavela (2)
Okarikokaru Thodu Needagaa
Saage Ee Tharunam       ||Manasulokataaye||

Anuraagam Nee Praanamai Abhimaanam Nee Snehamai
Jeevithaantham Okarikokaru Premamoorthulugaa (2)
Ghana Yesuni Divya Aasheessu (2)
Jeevithaantham Ninduga Menduga
Neetho Niliche Ee Tharunam       ||Manasulokataaye||

మధురం ఈ శుభ సమయం / Madhuram Ee Shubha Samayam

మధురం ఈ శుభ సమయం
అతి మధురం వివాహ బంధం (2)
ఆనందమే ఇరువురి హృదయం (2)
జత కలిసె ఈ తరుణంలో (2)
నవ దంపతులకు స్వాగతం         ||మధురం||

ఆ దేవుని దీవెనలు ఎల్లవేళలా మీకుండగా
అబ్రహాము శారా వాలే ఏ క్షణమైనా వీడక (2)
మీ జీవిత సంద్రాన – ఎన్ని కష్టాలు ఎదురైనా (2)
ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి         ||మధురం||

ప్రేమకు ప్రతి రూపమే మీ పరిణయము
మనసులో వెలియగ మమతలు విరబూయగా (2)
అనురాగ పూవులే మీ ఇంట పూయగా (2)
మీ దాంపత్యం అందరికి కలకాలం నిలవాలి         ||మధురం||

Madhuram Ee Shubha Samayam
Athi Madhuram Vivaaha Bandham (2)
Aanandame Iruvuri Hrudayam (2)
Jatha Kalise Ee Tharunamlo (2)
Nava Dhampathulaku Swaagatham       ||Madhuram||

Aa Devuni Deevenalu Ellavelala Meekundagaa
Abrahaamu Saaraa Vale Ae Kshanamaina Veedaka (2)
Mee Jeevitha Sandraana – Enni Kashtaalu Edurainaa (2)
Okarikokaru Thodugaa Kalakaalam Nilavaali        ||Madhuram||

Premaku Prathi Roopame Mee Parinayamu
Manasule Veliyaga Mamathalu Virabooyagaa (2)
Anuraaga Poovule Mee Inta Pooyagaa (2)
Mee Dhaampathyam Andariki Kalakaalam Nilavaali        ||Madhuram||

పరిశుద్ధ పరిశుద్ధ / Parishudhdha Parishudhdha

పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా (2)
వరదూతలైనా నిన్ – వర్ణింప గలరా
వరదూతలైనా నిన్ (3) వర్ణింప గలరా

పరిశుద్ధ జనకుడ – పరమాత్మ రూపుడ (2)
నిరుపమ బలబుద్ధి – నీతి ప్రభావా
నిరుపమ బలబుద్ధి (3) నీతి ప్రభావా

పరిశుద్ధ తనయుడ – నర రూప ధారుడ (2)
నరులను రక్షించు – కరుణా నముద్రా
నరులను రక్షించు (3) కరుణా నముద్రా

పరిశుద్ధ మగు నాత్మ – వరము లిడు నాత్మ (2)
పరమానంద ప్రేమ – భక్తుల కిడుమా
పరమానంద ప్రేమ (3) భక్తుల కిడుమా

జనక కుమారాత్మ – లను నేక దేవ (2)
ఘన మహిమ చెల్లును – దనర నిత్యముగా
ఘన మహిమ చెల్లును (3) దనర నిత్యముగా

Parishudhdha Parishudhdha – Parishudhdha Prabhuvaa (2)
Vara Doothalainaa Nin – Varnimpa Galaraa
Vara Doothalainaa Nin (3) Varnimpa Galaraa

Parishudhda Janakuda – Paramaathma Roopuda (2)
Nirupama Bala Budhdhi – Neethi Prabhaavaa
Nirupama Bala Budhdhi (3) Neethi Prabhaavaa

Parishudhdha Thanayuda – Nara Roopa Dhaaruda (2)
Narulanu Rakshinchu – Karunaa Samudraa
Narulanu Rakshinchu (3) Karunaa Samudraa

Parishudhdha Magu Naathma – Varamu Lidu Naathma (2)
Paramaananda Prema – Bhakthula Kidumaa
Paramaananda Prema (3) Bhakthula Kidumaa

Janaka Kumaaraathma – Lanu Neka Deva (2)
Ghana Mahima Chellunu – Danara Nithyamugaa
Ghana Mahima Chellunu (3) Danara Nithyamugaa

ఎక్కడెక్కడో పుట్టి/Ekkadekkado Putti

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్

ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి (2)
చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో
దేవుని సంకల్పం ఇది సృష్టిలోని చిత్రం – (2)

ఒంటరి బ్రతుకును విడిచెదరు
ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు (2)
పెళ్లినాటి నుండి తల్లి దండ్రుల వదలి
భార్య భర్తలు హత్తుకొనుటేమిటో        ||దేవుని||

గత కాల కీడంతా మరచెదరు
వీనులతో సంతసించెదరు (2)
పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు
ఇష్టముతో పంచుకొనుటేమిటో        ||దేవుని||

ఫలియించి భూమిని నింపెదరు
విస్తరించి వృద్ధి పొందెదరు (2)
పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ
ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో        ||దేవుని||

Lyricist: A R Stevenson

Ekkadekkado Putti Ekkadekkado Perigi (2)
Chakkanaina Jantagaa Iddarokkatagutemito
Devuni Sankalpam Idi Srushtiloni Chithram – (2)

Ontari Brathukunu Vidichedaru
Okari Koraku Okaru Brathikedaru (2)
Pellinaati Nundi Thalli Dandrula Vadali
Bhaarya Bharthalu Hatthukonutemito       ||Devuni||

Gatha Kaala Keedantha Marachedaru
Veenulatho Santhsinchedaru (2)
Pellinaati Nundi Okari Kashtam Okaru
Ishtamutho Panchukonutemito       ||Devuni||

Phaliyinchi Bhoomini Nimpedaru
Vistharinchi Vruddhi Pondedaru (2)
Pellinaati Nundi Maa Kutumbam Antu
Prathyekamugaa Enchukonutemito         ||Devuni||

దేవర నీ దీవెనలు / Devara Nee Deevenalu

పాట రచయిత: అల్లారి పెద్ద వీరాస్వామి
Lyricist: Allaari Pedda Veeraaswaami

దేవర నీ దీవెనలు
ధారాళముగను వీరలపై
బాగుగ వేగమే దిగనిమ్ము
పావన యేసుని ద్వారగను (2)

దంపతులు దండిగ నీ
ధాత్రిలో వెలయుచు సంపదలన్
సొంపుగ నింపుగ పెంపగుచు
సహింపున వీరు సుఖించుటకై       ||దేవర నీ||

ఈ కవను నీ కరుణన్
ఆకరు వరకును లోకములో
శోకము లేకయే ఏకముగా
బ్రాకటముగను జేకొనుము            ||దేవర నీ||

ఇప్పగిది నెప్పుడును
గొప్పగు ప్రేమతో నొప్పుచు దా
మొప్పిన చొప్పున దప్పకను
మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్      ||దేవర నీ||

తాపములు పాపములు
మోపుగ వీరిపై రాకుండగా
గాపుగ బ్రాపుగ దాపునుండి
యాపదలన్నియు బాపుచును        ||దేవర నీ||

సాధులుగన్ జేయుటకై
శోధనలచే నీవు శోధింపగా
కదలక వదలక ముదమున నీ
పాదము దాపున బాదుకొనన్          ||దేవర నీ||

మెండుగ భూమండలపు
గండములలో వీరుండగను
తండ్రిగ దండిగ నండనుండి
వెండియు వానిని ఖండించావే         ||దేవర నీ||

యిద్దరు వీరిద్దరును
శుద్ధులై నిన్ను సేవించుటకై
శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్
దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్        ||దేవర నీ||

వాసిగ నీ దాసులము
చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని
మా సకలేశ్వర నీ సుతుడ
యేసుని పేరిట బ్రోవుమామేన్        ||దేవర నీ||

పాట రచయిత: అల్లారి పెద్ద వీరాస్వామి
Lyricist: Allaari Pedda Veeraaswaami

Devara Nee Deevenalu
Dhaaraalamuganu Veeralapai
Baaguga Vegame Diganimmu
Paavana Yesuni Dvaaraganu (2)

Dampathulu Dandiga Nee
Dhaathrilo Velayuchu Sampadalan
Sompuga Nimpuga Pempaguchu
Sahimpuna Veeru Sukhinchutakai      ||Devara Nee||

Ee Kavanu Nee Karunan
Aakaru Varakunu Lokamulo
Shokamu Lekaye Ekamugaa
Braakatamuganu Jekonumu              ||Devara Nee||

Ippagidi Neppudunu
Goppagu Prematho Noppuchu Daa
Moppina Choppuna Dappakanu
Meppuga Brathukaga Bampu Krupan      ||Devara Nee||

Thaapamulu Paapamulu
Mopuga Veeripai Raakundagaa
Gaapuga Braapuga Daapunundi
Yaapadalanniyu Baapuchunu                  ||Devara Nee||

Saadhulugan Jeyutakai
Shodhanalache Neevu Shodhinpagaa
Kadalaka Vadalaka Mudamuna Nee
Paadamu Daapuna Baadukonan              ||Devara Nee||

Menduga Bhoomandalapu
Gandamulalo Veerundaganu
Thandriga Dandiga Nandanundi
Vendiyu Vaanini Khandinchave           ||Devara Nee||

Iddara Veeriddarunu
Shudhdhulai Ninnu Sevinchutakai
Shradhdhatho Budhdhiga Sidhdhapadan
Didhdhumu Nee Priya Biddalugaan       ||Devara Nee||

Vaasiga Nee Daasulamu
Chesina Ee Moral Deesikoni
Maa Sakaleshwara Nee Suthuda
Yesuni Perita Brovumaamen                ||Devara Nee||

గొర్రెపిల్ల వివాహోత్సవ / Gorrepilla Vivaahotsava

గొర్రెపిల్ల వివాహోత్సవ
సమయము వచ్చెను రండి (2)

సర్వాధికారియు సర్వోన్నతుండైన (2)
మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2) ||గొర్రెపిల్ల||

సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2)
నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల||

పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2)
గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) ||గొర్రెపిల్ల||

తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2)
నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2) ||గొర్రెపిల్ల||

దేవుని వాక్యమను నామము గలవాడు (2)
రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె (2) ||గొర్రెపిల్ల||

ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు (2)
పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల||

శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు (2)
వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె (2) ||గొర్రెపిల్ల||

Gorrepilla Vivaahotsava
Samayamu Vachchenu Randi (2)

Sarvaadhikaariyu Sarvonnathundaina (2)
Mana Thandrini Ghanaparachi Manamutsahinchedamu (2) ||Gorrepilla||

Sidhdhapadenu Vadhuvu Suprakaashamu Gala (2)
Nirmala Vasthramulatho Nalankarinchukonen (2) ||Gorrepilla||

Parishudhdhula Neethi Kriyale Yaa Vasthramulu (2)
Gorre Pilla Rakthamulo Shudhdhi Nondina Vaaru (2) ||Gorrepilla||

Thellani Gurramupai Koorchundinavaadu (2)
Nammakamai Yunnatti Pendli Kumaarundu (2) ||Gorrepilla||

Devuni Vaakyamanu Naamamu Galavaadu (2)
Rakthamulo Munchina Vasthramun Dhariyinche (2) ||Gorrepilla||

Preminchi Sanghamukai Praanambu Nide Prabhuvu (2)
Parishudhdha Parachuta Korakai Thaanappaginchukonen (2) ||Gorrepilla||

Sree Yesu Kreesthunde Sanghambunaku Shirassu (2)
Vaakya Udakamu Thoda Shudhdhi Parachuchunde (2) ||Gorrepilla||

Dm              A#   Dm
Gorrepilla Vivaahotsava
         C      Dm  C Dm
Samayamu Vachchenu Randi (2)
              C     A#          Dm
Sarvaadhikaariyu Sarvonnathundaina (2)
                        C      A#  C        Dm 
Mana Thandrini Ghanaparachi Manamutsahinchedamu (2) ||Gorrepilla||
Dm                  C     A#          Dm
Sidhdhapadenu Vadhuvu Suprakaashamu Gala (2)
                  C      A#   C        Dm
Nirmala Vasthramulatho Nalankarinchukonen (2) ||Gorrepilla||
Dm                    C     A#             Dm
Parishudhdhula Neethi Kriyale Yaa Vasthramulu (2)
                    C      A#   C         Dm
Gorre Pilla Rakthamulo Shudhdhi Nondina Vaaru (2) ||Gorrepilla||
Dm               C      A#         Dm
Thellani Gurramupai Koorchundinavaadu (2)
                 C    A#   C       Dm
Nammakamai Yunnatti Pendli Kumaarundu (2) ||Gorrepilla||
Dm            C    A#         Dm
Devuni Vaakyamanu Naamamu Galavaadu (2)
                     C         A#  C    Dm
Rakthamulo Munchina Vasthramun Dhariyinche (2) ||Gorrepilla||
Dm                C       A#              Dm
Preminchi Sanghamukai Praanambu Nide Prabhuvu (2)
                        C       A#    C          Dm
Parishudhdha Parachuta Korakai Thaanappaginchukonen (2) ||Gorrepilla||
Dm               C       A#              Dm
Sree Yesu Kreesthunde Sanghambunaku Shirassu (2)
                 C      A#    C          Dm
Vaakya Udakamu Thoda Shudhdhi Parachuchunde (2) ||Gorrepilla||

గుర్తుండిపోయే ఈ క్షణాలలో / Gurthundipoye Ee Kshanaalalo

గుర్తుండిపోయే ఈ క్షణాలలో
ప్రతి గుండె నిండా ఆనందమే
ఘనమైన ఈ వివాహ వేడుక
చేసావు మాకు తీపి జ్ఞాపిక
దేవా నీకు వందనం (4)

చిన్ని మొగ్గలా లేత సిగ్గులా
చిరునవ్వుల ఈ నవ వధువు
నింగి చుక్కలా కాంతి రేఖలా
సుందరుడు ఈ నవ వరుడు (2)
దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను (2)
దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని
దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని        ||గుర్తుండిపోయే||

నీ బాటలో నీ మాటలో
సాగనీ అనురాగమై
నీ ధ్యాసలో నీ ఊసులో
ఎదగనీ అనుబంధమై (2)
దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను (2)
దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని
దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని       ||గుర్తుండిపోయే||

Gurthundipoye Ee Kshanaalalo
Prathi Gunde Nindaa Aanandame
Ghanamaina Ee Vivaaha Veduka
Chesaavu Maaku Theepi Gnaapika
Devaa Neeku Vandanam (4)

Chinni Moggalaa Letha Siggulaa
Chirunavvula Ee Nava Vadhuvu
Ningi Chukkalaa Kaanthi Rekhalaa
Sundarudu Ee Nava Varudu (2)
Devaa Nee Sannidhilo Nilichina Ee Jantanu (2)
Deevinchu… Noorellu… Challagaa Undaalani
Deevinchu… Noorellu… Nindugaa Undaalani      ||Gurthundipoye||

Nee Baatalo Nee Maatalo
Saaganee Anuraagamai
Nee Dhyaasalo Nee Oosulo
Edaganee Anubandhamai (2)
Devaa Nee Sannidhilo Nilichina Ee Jantanu (2)
Deevinchu… Noorellu… Challagaa Undaalani
Deevinchu… Noorellu… Nindugaa Undaalani      ||Gurthundipoye||

గుణవతి అయిన భార్య / Gunavathi Aina Bhaarya

గుణవతి అయిన భార్య
దొరుకుట అరుదురా (2)
ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా
జీవితాంతము…
జీవితాంతము తోడురా
వెన్నెల బాటరా (2)
వెన్నెల బాటరా (4)       ||గుణవతి||

అలసినపుడు తల్లిలా
కష్టాలలో చెల్లిలా (2)
సుఖ దుఃఖములలో భార్యగా (2)
భర్త కన్నుల మేడరా        ||జీవితాంతము||

మరచిపోనిది మాసిపోనిది
పెండ్లనే బంధము (2)
మరచిపోకుమా జీవితమున (2)
పెండ్లి నాటి ప్రమాణము           ||జీవితాంతము||

Gunavathi Aina Bhaarya
Dorukuta Aruduraa (2)
Aame Manchi Muthyamu Kanna Viluvaindiraa
Jeevithaanthamu…
Jeevithaanthamu Thoduraa
Vennela Baataraa (2)
Vennela Baataraa (4)          ||Gunavathi||

Alasinapudu Thallilaa
Kashtaalalo Chellilaa (2)
Sukha Dukhamulalo Bhaaryagaa (2)
Bhartha Kannula Medaraa          ||Jeevithaanthamu||

Marachiponidi Maasiponidi
Pendlane Bandhamu (2)
Marachipokumaa Jeevithamuna (2)
Pendli Naati Pramaanamu        ||Jeevithaanthamu||

కల్యాణం కమనీయం / Kalyaanam Kamaneeyam

కల్యాణం కమనీయం
ఈ సమయం అతి మధురం (2)
దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా (2) ||కల్యాణం||

ఏదెను వనమున యెహోవ దేవా
మొదటి వివాహము చేసితివే (2)
ఈ శుభ దినమున
నవ దంపతులను (2)
నీ దీవెనలతో నింపుమయ్యా        ||దేవా రావయ్యా||

కానా విందులో ఆక్కరనెరిగి
నీళ్ళను రసముగ మార్చితివే (2)
కష్టములలో నీవే
అండగా నుండి (2)
కొరతలు తీర్చి నడుపుమయ్యా      ||దేవా రావయ్యా||

బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు
గుప్తమైయున్నవి నీయందే (2)
ఇహ పర సుఖములు
మెండుగ నొసగి (2)
ఇల వర్ధిల్లగ చేయుమయ్యా      ||దేవా రావయ్యా||

Kalyaanam Kamaneeyam
Ee Samayam Athi Madhuram (2)
Devaa Raavayyaa Nee Deevenaleevayyaa (2)      ||Kalyaanam||

Edenu Vanamuna Yehova Devaa
Modati Vivaahamu Chesithive (2)
Ee Shubha Dinamuna
Nava Dampathulanu (2)
Nee Deevenalatho Nimpumayyaa      ||Devaa Raavayyaa||

Kanaa Vindulo Akkaranerigi
Neellanu Rasamuga Maarchithive (2)
Kashtamulalo Neeve
Andaga Nundi (2)
Korathalu Theerchi Nadupumayyaa      ||Devaa Raavayyaa||

Budhdhiyu Gnaanamu Sampadalanniyu
Gupthamai Yunnavi Neeyande (2)
Iha Para Sukhamulu
Menduga Nosagi (2)
Ila Vardhillaga Cheyumayyaa      ||Devaa Raavayyaa||