అత్యున్నతమైనది యేసు నామం / Athyunnathamainadi Yesu Naamam

పాట రచయిత: షూలమ్మీతీ ఫిన్నీ పచిగళ్ల

అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామం
అత్యంత శక్తి గలది యేసు నామం – యేసు నామం
ఉన్నత నామం – సుందర నామం
ఉన్నత నామం – శ్రీ యేసు నామం
అన్ని నామములకు పై నామం – పై నామం – పై నామం
యేసు నామం – యేసు నామం (2)

ప్రతి మోకాలు యేసు నామంలో నేల వంగును
ప్రతి నాలుక యేసే దైవమని అంగీకరించును (2)
పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా
పరలోక దీవెనలు పొందగ చేరుము
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ          ||అత్యున్నత||

పరిశుద్ధుడైన యేసు నామంలో సాతాను పారిపోవున్
మృతిని గెల్చిన యేసు నామంలో స్వస్థత దొరుకును (2)
పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా
పరలోక దీవెనలు పొందగ చేరుము
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ          ||అత్యున్నత||

Lyricist: Shulammite Finny Pachigalla

Athyunnathamainadi Yesu Naamam – Yesu Naamam
Athyantha Shakthi Galadi Yesu Naamam – Yesu Naamam
Unnatha Naamam – Sundara Naamam
Unnatha Naamam – Shree Yesu Naamam
Anni Naamamulaku Pai Naamam – Pai Naamam – Pai Naamam
Yesu Naamam – Yesu Naamam (2)

Prathi Mokaalu Yesu Naamamlo Nela Vangunu
Prathi Naaluka Yese Daivamani Angeekarinchunu (2)
Parishuddha Chethuletthi Sthuthinchi Paadumaa
Paraloka Deevenalu Pondaga Cherumu
Hallelooya – Hallelooya – Hallelooya – Hallelooya         ||Athyunnatha||

Parishuddhudaina Yesu Naamamlo Saathaanu Paaripovun
Mruthine Gelchina Yesu Naamamlo Swasthatha Dorukunu (2)
Parishuddha Chethuletthi Sthuthinchi Paadumaa
Paraloka Deevenalu Pondaga Cherumu
Hallelooya – Hallelooya – Hallelooya – Hallelooya        ||Athyunnatha||

అంబరాన్ని దాటే సంబరాలు నేడు / Ambaraanni Daate Sambaraalu Nedu

పాట రచయిత: సాయారాం గట్టు

అంబరాన్ని దాటే సంబరాలు నేడు
నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు (2)
రండయ్యో రండి రండి దావీదు పురముకు (2)
రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు (2)    ||అంబరాన్ని||

దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము
ఏకైక తనయుని పంపెను ఈ దినము (2)
పశువుల పాకలో ఒదిగేను శిశువుగా (2)
అవతరించే నేడు లోక రక్షకునిగా (2)         ||రండయ్యో||

దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ
శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ (2)
లోకాల కారకుడు లోకమున పుట్టెను (2)
మనిషి మరణము ఆయువు తీరెను (2)         ||రండయ్యో||

Lyricist: Sayaram Gattu

Ambaraanni Daate Sambaraalu Nedu
Ningilo Chukka Butti Vachchindi Manaku Thodu (2)
Randayyo Randi Randi Daaveedu Puramuku (2)
Raaraaju Putti Ila Pilichenu Koluvuku (2)          ||Ambaraanni||

Devudu Enthagaano Preminchi Lokamu
Ekaika Thanayuni Pampenu Ee Dinamu (2)
Pashuvula Paakalo Odigenu Shishuvugaa (2)
Avatharinche Nedu Loka Rakshakunigaa (2)       ||Randayyo||

Devaadi Devudu Manishigaa Maarina Vela
Shaapaalu Paapaalu Raddaayina Shubhavela (2)
Lokaala Kaarakudu Lokamunu Puttenu (2)
Manishi Maranamu Aayuvu Theerenu (2)       ||Randayyo||

అంబరానికి అంటేలా (ఏ ఆర్ స్టీవెన్సన్) / Ambaraaniki Antelaa (Yesayya Puttaadani)  A R Stevenson

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్

అంబరానికి అంటేలా
సంబరాలతో చాటాలా (2)
యేసయ్య పుట్టాడని
రక్షింప వచ్చాడని (2)

ప్రవచనాలు నెరవేరాయి
శ్రమ దినాలు ఇక పోయాయి (2)
విడుదల ప్రకటించే
శిక్షను తప్పించే (2)           ||యేసయ్య||

దివిజానాలు సమకూరాయి
ఘనస్వరాలు వినిపించాయి (2)
పరముకు నడిపించే
మార్గము చూపించే (2)           ||యేసయ్య||

సుమ వనాలు పులకించాయి
పరిమళాలు వెదజల్లాయి (2)
ఇలలో నశియించే
జనులను ప్రేమించే (2)           ||యేసయ్య||

Lyricist: A R Stevenson

Ambaraaniki Antelaa
Sambaraalatho Chaataalaa (2)
Yesayya Puttaadani
Rakshimpa Vachchaadani (2)

Pravachanaalu Neraveraayi
Shrama Dinaalu Ika Poyaayi (2)
Vidudala Prakatinche
Shikshanu Thappinche (2)          ||Yesayya||

Divijanaalu Samakooraayi
Ghanaswaraalu Vinipinchaayi (2)
Paramuku Nadipinche
Maargamu Choopinche (2)          ||Yesayya||

Suma Vanaalu Pulakinchaayi
Parimalaalu Vedajallaayi (2)
Ilalo Nashiyinche
Janulanu Preminche (2)          ||Yesayya||

అంబరానికి అంటేలా మనమంతా / Ambaraaniki Antelaa Manamanthaa

లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా (2)
అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం (2)
సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం (2)        ||లాల||

దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడు
దీనులను రక్షించే దేవ తనయుడు (2)
దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చె
విజయ వీరుడై ఉద్భవించెనే (2)
పశుల పాకలో పరుండియుండెనే         ||లాల||

ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసే
లోకానికి రక్షకుడు వెలిసెనని (2)
తార వెంబడి వెళ్లి వారు
కానుకలర్పించి ఆరాధించారు (2)
ఆత్మ పూర్ణులై తిరిగి వెళ్లిరి         ||లాల||

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
సమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే (2)
పొత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు
దూత గణములే జోల పాడగా (2)
సృష్టికి బహు సంబరమాయెగా         ||లాల||

Laala Laalalalaa Laalalalaa Laa Laa Laa… Laala Laalalalaalaa (2)
Ambaraaniki Antelaa Manamanthaa Sambaraalu Cheseddaam (2)
Sangeetha Swaraalatho Ee Maata Andariki Chakkaga Chaati Cheppudam (2)    ||Laala||

Divi Nundi Deenudigaa Bhuviki Ethenchinaadu
Deenulanu Rakshinche Deva Thanayudu (2)
Deenula Shramalu Vyaadhi Baadhalalo Vidudalichche
Vijaya Veerudai Udbhavinchene (2)
Pashula Paakalo Parundiyundene           ||Laala||

Aa Naadu Oka Thaara Gnaanulaku Theliyajese
Lokaaniki Rakshakudu Velisenani (2)
Thaara Vembadi Velli Vaaru
Kaanukalarpinchi Aaraadhinchaaru (2)
Aathma Poornulai Thirigi Velliri         ||Laala||

Aascharyakarudu Aalochana Kartha
Samaadhanamichche Ee Chinni Baalude (2)
Potthi Guddalalo Chuttabade Paramaathmudu
Dootha Ganamule Jola Paadagaa (2)
Srushtiki Bahu Samabaramaayegaa           ||Laala||

అంధకార చెరసాలలో / Andhakaara Cherasaalalo

పాట రచయిత: జోయెల్ కొడాలి

అంధకార చెరసాలలో – బంధకాల ఇరుకులో
పౌలు సీలలు ప్రార్ధించిరి – కీర్తనలు పాడిరి – (2)
భూమియే కంపించెను – చెరసాల అదిరెను
వారి సంకెళ్లు ఊడిపోయెను – విడుదల దొరికెను – (2)

వ్యాధులు ఆవరించగా – మరణము తరుముచుండగా
రండి పారి పోదుము – ఇంక దాగి యుందుము
ఏ తెగులు దరిచేరని – ఏ దిగులు ఉండని
మన దాగు స్థలములో – యేసుని సన్నిధిలో          ||అంధకార||

ప్రార్ధన చేసెదము – దేవుని సముఖములో
ఈ శోధన సమయములో – విరిగిన హృదయముతో
ఈ లోక రక్షణకై – జనముల స్వస్థతకై
యేసుని వేడెదము – శోకము తొలగించమని          ||అంధకార||

మొరలను ఆలకించును – యేసు మనలను విడిపించును
ఈ లోకమును శుద్ధిచేయును – మరణమును తప్పించును
మన రక్షణ వలయముగా – తన రెక్కలు చాపును
దుఃఖమును సంతోషముగా – మార్చివేయును త్వరలో          ||అంధకార||

Lyricist: Joel Kodali

Andhakaara Cherasaalalo – Bandhakaala Irukulo
Poulu Seelalu Praardhinchiri – Keerthanalu Paadiri – (2)
Bhoomiye Kampinchenu – Cherasaala Adirenu
Vaari Sankellu Oodipoyenu – Vidudala Dorikenu – (2)

Vyaadhulu Aavarinchagaa – Maranamu Tharumuchundagaa
Randi Paari Podumu – Inka Daagi Yundumu
Ae Thegulu Dari Cherani – Ae Digulu Undani
Mana Daagu Sthalamulo Yesuni Sannidhilo        ||Andhakaara||

Praardhana Chesedamu – Devuni Samukhamulo
Ee Shodhana Samayamulo – Virigina Hrudayamutho
Ee Loka Rakshanakai – Janamula Swasthathakai
Yesuni Vededamu – Shokamu Tholaginchamani        ||Andhakaara||

Moralanu Aalakinchunu – Yesu Manalanu Vidipinchunu
Ee Lokamunu Shudhdhi Cheyunu – Maranamunu Thappinchunu
Mana Rakshana Valayamugaa – Thana Rekkalu Chaapunu
Dukhamunu Santhoshamugaa – Maarchiveyunu Thvaralo ||Andhakaara||

అందాలు చిందే శుభ వేళ /Andaalu Chinde Shubha Vela

పాట రచయిత: రమేష్

అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ (2)
కోరుకున్నావు ఈ వరుని – చేరియున్నాడు నీ జతనే (2)       ||అందాలు||

చిననాటి పుట్టింటి నడకా
సాగాలి అత్తింటి దాకా (2)
ఎంత ఘనమైన బంధం
వెయ్యేండ్ల వివాహ బంధం (2)       ||అందాలు||

సంసార సాగర పయనం
తెర చాటు అనుభూతి వినయం (2)
సాగిపోవాలి పయనం
చేరుకోవాలి గమ్యం (2)       ||అందాలు||

యేసయ్య పాదాల చెంత
వదలాలి ఎదలోని చింత (2)
క్రీస్తు పుట్టాలి నీలో
చేర్చుకోవాలి హృదిలో (2)       ||అందాలు||

Lyricist: Ramesh

Andaalu Chinde Shubha Vela – Anduko Ee Vela (2)
Korukunnaavu Ee Varuni – Cheriyunnaadu Nee Jathane (2)        ||Andaalu||

Chinanaati Puttinti Nadakaa
Saagaali Atthinti Daakaa (2)
Entha Ghanamaina Bandham
Veyyendla Vivaaha Bandham (2)        ||Andaalu||

Samsaara Saagara Payanam
Thera Chaatu Anubhoothi Vinayam (2)
Saagipovaali Payanam
Cherukovaali Gamyam (2)        ||Andaalu||

Yesayya Paadaala Chentha
Vadalaali Edaloni Chintha (2)
Kreesthu Puttaali Neelo
Cherchukovaali Hrudilo (2)        ||Andaalu||

అందాల బాలుడు ఉదయించినాడు / Andaala Baaludu Udayinchinaadu

పాట రచయిత: సాయారాం గట్టు

అందాల బాలుడు ఉదయించినాడు
లోకాలు వెలిగించు నీతి సూరీడు (2)
రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను
ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2)          ||అందాల||

భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి
ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2)
గొల్లలము మేము కల్లలు ఎరుగము (2)
కళ్లారా జూసాము తేజోమయుని మోము (2)         ||రండయ్యో||

తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి
లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము (2)
దారి చూపే తార రారాజునే జేర (2)
మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా (2)         ||రండయ్యో||

తనలోని వెలుగంత పంచేటి పావనుడు
మనలోని పాపమంత తీసేయు రక్షకుడు (2)
చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు (2)
నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు (2)         ||రండయ్యో||

Andaala Baaludu Udayinchinaadu
Lokaalu Veliginchu Neethi Sooreedu (2)
Randayyo Mana Koraku Raaraaju Puttenu
Premanu Pancheti Rakshananu Thecchenu (2)        ||Andaala||

Bheethilli Poyaamu Aa Velugune Joosi
Ennadu Erugani Thejassune Gaanchi (2)
Gollalamu Memu Kallalu Erugamu (2)
Kallaaraa Joosaamu Thejomayuni Momu (2)        ||Randayyo||

Thoorupu Gnaanulamu Velige Thaaranu Joosi
Lekkalenno Vesi Maharaaju-nethikaamu (2)
Daari Choope Thaara Raahune Jera (2)
Mokkaamu Mokarilli Baalunni Manasaaraa (2)        ||Randayyo||

Thanaloni Velugantha Pancheti Paavanudu
Manaloni Paapamantha Theeseyu Rakshakudu (2)
Cheekatlu Tholagincha Udayinchinaadu Nedu (2)
Nee Thappulenni Unnaa Manninchuthaadu Redu (2)        ||Randayyo||

అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో / Andaala Thaara Arudenche Naakai Ambara Veedhilo

పాట రచయిత: మాసిలామణి గారు

అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో
ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని               ||అందాల తార||

విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను
వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున
విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్         ||అందాల తార||

యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు
ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి
యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు      ||అందాల తార||

ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ జీవితమెంత పావనమాయెను
ప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యము
బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన           ||అందాల తార||

Lyricist: Masilamani

Andaala Thaara Arudenche Naakai Ambara Veedhilo
Avathaaramurthy Yesayya Keerthi Avani Chaatuchun
Aanandasandra Mupponge Naalo Amarakaanthilo
Aadi Devuni Jooda – Aashimpa Manasu
Payanamaithini                                     ||Andaala Thaara||

Vishwaasa Yaathra Dooramenthaina Vindugaa Dochenu
Vinthaina Shaanthi Varshinche Naalo Vijayapathamuna
Vishwaala Neledi Deva Kumaaruni Veekshinche Deekshalo
Virajimme Balamu – Pravahinche Prema
Vishraanthi Nosaguchun                         ||Andaala Thaara||

Yerushalemu Raajanagarilo Yesunu Vedakuchu
Erigina Daari Tholagina Vela Edalo Krungithi
Yesayya Thaara Eppativole Eduraaye Throvalo
Entho Yabburapaduchu – Vismayamonduchu
Aegithi Swaami Kadaku                          ||Andaala Thaara||

Prabhu Janmasthalmu Paakaye Gaani Paraloka Soudhame
Baaluni Jooda Jeevithamentha Paavanamaayenu
Prabhu Paada Pooja Deevena Kaagaa Prasarinche Punyamu
Brathuke Mandiramaaye – Arpanale Sirulaaye
Phaliyinche Praarthana                           ||Andaala Thaara||

అందాల ఉద్యానవనమా / Andaala Udyaanavanamaa

అందాల ఉద్యానవనమా
ఓ క్రైస్తవ సంఘమా (2)
పుష్పించలేక ఫలియింపలేక (2)
మోడై మిగిలావ నీవు (2) ||అందాల||

ప్రభు ప్రేమలో బాగు చేసి
శ్రేష్టమౌ ద్రాక్షాగ నాటాడుగా (2)
కాచావు నీవు కారు ద్రాక్షాలు (2)
యోచించు ఇది న్యాయమేనా (2)   ||అందాల||

ప్రభు యేసులో నీవు నిలచి
పరిశుద్ధాత్మతో నీవు పయనించుమా (2)
పెరిగావు నీవు ఫలియింపలేక (2)
యోచించు ఇది న్యాయమేనా (2)    ||అందాల||

ఆకలిగొని నీవైపు చూడ
ఆశ నిరాశాయే ప్రభు యేసుకు (2)
ఇకనైన నీవు నిజమైన ఫలముల్ (2)
ప్రభు కొరకై ఫలియింపలేవా (2)   ||అందాల||

Andaala Udyaanavanamaa
O Kraisthava Sanghamaa (2)
Pushpinchaleka Phaliyimpaleka (2)
Modai Migilaava Neevu (2)      ||Andaala||

Prabhu Premalo Baagu Chesi
Sreshtamau Draakshaaga Naataadugaa (2)
Kaachaavu Neevu Kaaru Draakshaalu (2)
Yochinchu Idi Nyaayamenaa (2)     ||Andaala||

Prabhu Yesulo Neevu Nilachi
Parishudhdhaathmatho Neevu Payaninchumaa (2)
Perigaavu Neevu Phaliyimpaleka (2)
Yochinchu Idi Nyaayamenaa (2)     ||Andaala||

Aakaligoni Neevaipu Chooda
Aasha Niraashaaye Prabhu Yesuku (2)
Ikanaina Neevu Nijamaina Phalamul (2)
Prabhu Korakai Phaliyimpalevaa (2)    ||Andaala||

అందరు మెచ్చిన అందాల తార / Andaru Mechchina Andaala Thaara

|

పాట రచయిత: గుడేటి పురుషోత్తం బాబు

అందరు మెచ్చిన అందాల తార
అవనికి తెచ్చెను వెలుగుల మేడ (2)
క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)       ||అందరు||

సృష్టికర్తయే మరియ తనయుడై
పశుల పాకలో పరుండినాడు (2)
నీతి జీవితం నీవు కోరగా
నీకై రక్షణ తెచ్చినాడు (2)
నీకై రక్షణ తెచ్చినాడు          ||క్రిస్మస్||

ఇంటిని విడిచి తిరిగిన నాకై
ఎదురు చూపులే చూచినాడు (2)
తప్పును తెలిసి తిరిగి రాగా
క్షమియించి కృప చూపినాడు (2)
ఎన్నో వరములు ఇచ్చినాడు         ||క్రిస్మస్||

పాత దినములు క్రొత్తవి చేసి
నీలో జీవము నింపుతాడు (2)
కటిక చీకటే వేకువ కాగా
అంబరమందు సంబరమాయే (2)
హృదయమునందు హాయి నేడు         ||క్రిస్మస్|

Lyricist: Gudeti Purushotham Babu

Andaru Mechchina Andaala Thaara
Avaniki Thechchenu Velugula Meda (2)
Christmas.. Happy Christmas
Happy Happy Christmas
Christmas.. Merry Christmas
Merry Merry Christmas (2)        ||Andaru||

Srushtikarthaye Mariya Thanayudai
Pashula Paakalo Parundinaadu (2)
Neethi Jeevitham Neevu Koragaa
Neekai Rakshana Thechchinaadu (2)
Neekai Rakshana Thechchinaadu          ||Christmas||

Intini Vidichi Thirigina Naakai
Eduru Choopule Choochinaadu (2)
Thappunu Thelisi Thirigi Raagaa
Kshamiyinchi Krupa Choopinaadu (2)
Enno Varamulu Ichchinaadu           ||Christmas||

Paatha Dinamulu Krotthavi Chesi
Neelo Jeevamu Nimputhaadu (2)
Katika Cheekate Vekuva Kaagaa
Ambaramandu Sambaramaaye (2)
Hrudayamunandu Haayi Nedu         ||Christmas||