శ్రీ యేసుండు జన్మించె/Sri Yesundu Janminche

శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2)
నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2)           ||శ్రీ యేసుండు||

ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2)
ఇమ్మానుయేలనెడి నామమందున (2)        ||శ్రీ యేసుండు||

సత్రమందున పశువులశాల యందున (2)
దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2)  ||శ్రీ యేసుండు||

పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2)
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2)             ||శ్రీ యేసుండు||

గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2)
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2)               ||శ్రీ యేసుండు||

మన కొరకొక్క శిశువు పుట్టెను (2)
ధరను మన దోషములబోగొట్టెను (2)            ||శ్రీ యేసుండు||

పరలోకపు సైన్యంబు గూడెను (2)
మింట వర రక్షకుని గూర్చి పాడెను (2)         ||శ్రీ యేసుండు||

అక్షయుండగు యేసు పుట్టెను (2)
మనకు రక్షణంబు సిద్ధపరచెను (2)              ||శ్రీ యేసుండు||

Sri Yesundu Janminche Reyilo (2)
Nedu Paayaka Bethlehemu Oorilo (2)            ||Sri Yesundu||

Aa Kanniya Mariyamma Garbhamanduna (2)
Immaanuyelanedi Naamamandunaa (2)          ||Sri Yesundu||

Sathramanduna Pashuvulashaala Yanduna (2)
Devaputhrundu Manujundaayenandunaa (2)    ||Sri Yesundu||

Mana Koraku Oka Shishuvu Puttenu (2)
Dharanu Mana Doshamulabogettenu (2)         ||Sri Yesundu||

Gollalellaru Migula Bheethillagaa (2)
Thelpe Goppa Vaartha Dootha Challaga (2)   ||Sri Yesundu||

Akshayundagu Yesu Puttenu (2)
Manaku Rakshanambu Sidhdhaparachenu (2)  ||Sri Yesundu||

స్తుతులపై ఆసీనుడా/Sthuthulapai Aaseenudaa

పాట రచయిత: బన్నీ సుదర్శన్

స్తుతులపై ఆసీనుడా
అత్యున్నత నా దేవుడా (2)
నీ ప్రేమలో నీ ప్రేమలో
నను నేను మరిచాను నీ ప్రేమలో
నీ నీడలో నీ జాడలో
మైమరచిపోయాను నేను ||స్తుతులపై||

నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులు
నీవు పొందిన గాయాలకు బదులు (2)
బంగారం వజ్రాలు – మకుటాలు కిరీటాలు
వెండినడుగలేదు నీవు
విరిగి నలిగి – కరిగి వెలిగే
హృదయాన్నే కోరావు నీవు (2)
ఓ మాట సెలవియ్యి దేవా
నీ పాద ధూళిని కానా ప్రభువా
నీ పాదం స్పర్శించగానే
నా సంతోషానికి హద్దుండునా ||స్తుతులపై||

నీవు లేచిన పునరుథ్తానా దినము మొదలు
మా బ్రతుకులో విజయము మొదలు (2)
తిరిగి లేచావు నీవు
నీకోసం ఏదైనా దేవా
నే వెచ్చింప సంసిద్ధమయ్యా
ఆఖరికి నా ప్రాణమైనా
చిందులు వేస్తూ అర్పిస్తా ||స్తుతులపై||

Sthuthulapai Aaseenudaa
Athyunnatha Naa Devudaa (2)
Nee Premalo Nee Premalo
Nanu Nenu Marichaanu Nee Premalo
Nee Needalo Nee Jaadalo
Maimarchipoyaanu Nenu      ||Sthuthulapai||

Neevu Chesina Aascharya Kaaryaalaku Badulu
Neevu Pondina Gaayaalaku Badulu (2)
Bangaaram Vajraalu Makutaalu Kireetaalu – Vendinadugaledu Neevu
Virigi Naligi Karigi Velige – Hrudayaanne Koraavu Neevu (2)
O Maata Selaviyyi Devaa
Nee Paada Dhoolini Kaanaa Prabhuvaa
Nee Paadam Sparshinchagaane
Naa Santhoshaaniki Haddhundunaa         ||Sthuthulapai||

Neevu Lechina Punaruththaana Dinamu Modalu
Maa Brathukulo Vijayamu Modalu (2)
Maranam Aneti Mullunu Virachi – Thirigi Lechaavu Neevu
Cheekati Nindina Maadu Brathukulo – Velugulu Nimpaavu Neevu (2)
Neekosam Edainaa Devaa
Ne Vechchimpa Samsiddhamayyaa
Aakhariki Naa Praanamainaa
Chindulu Vesthu Arpisthaa         ||Sthuthulapai||

ఆహా ఆనందమే / Aahaa Aanandame

పాట రచయిత: మేరీ విజయ్ నన్నేటి

ఆహా ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో (2)
ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో (2)       ||ఆహా||

యెషయా ప్రవచనము నేడు రుజువాయే
జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2)      ||ఆనందమే||

మీకా ప్రవచనము నేడు రుజువాయే
ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2)      ||ఆనందమే||

తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే
దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2)          ||ఆనందమే||

Lyricist: Mary Vijay Nanneti

Aahaa Aanandame Mahaa Santhoshame
Yesu Putte Ilalo (2)
Aanandame Mahaa Santhoshame
Yesu Putte Ilalo (2)        ||Aahaa||

Yeshayaa Pravachanamu Nedu Rujuvaaye
Janminche Kumaarundu Kanya Garbhamanduna (2) ||Aanandame||

Meekaa Pravachanamu Nedu Rujuvaaye
Ishraayel Neledivaadu Janminche Bethlehemuna (2) ||Aanandame||

Thandri Vaagdhaanam Nedu Neravere
Devuni Bahumaanam Shree Yesuni Janmamu (2) ||Aanandame||

ఆనందమానందమే / Aanandamaanandame

ఆనందమానందమే
ఈ భువిలో యేసయ్య నీ జననము (2)
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికి మహిమ ప్రభావము
భూమి మీద తనకిష్టులకు
సమాధానము కలుగును గాక
హల్లెలూయా           ||ఆనంద||

తన ప్రజలను వారి పాపమునుండి రక్షించుట
కొరకై యేసు భువికి దిగి వచ్చెను
తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించుటకు
దేవుని జ్ఞానమై వచ్చెను          ||సర్వోన్నత||

మరణ ఛాయలు చీకటిలోను కూర్చున్నవారికి
యేసు అరుణోదయమిచ్చెను
పాప శాపము నుండి ప్రజలకు విడుదలనిచ్చుటకు
క్రీస్తు నర రూపము దాల్చెను       ||సర్వోన్నత||

Aanandamaanandame
Ee Bhuvilo Yesayya Nee Jananamu (2)
Sarvonnathamaina Sthalamulalona
Devuniki Mahima Prabhaavamu
Bhoomi Meeda Thanakishtulaku
Samaadhaanamu Kalugunu Gaaka
Hallelujah             ||Aananda||

Thana Prajalanu Vaari Paapamunundi Rakshinchuta
Korakai Yesu Bhuviki Digi Vachchenu
Thana Prajalaku Rakshana Gnaanamu Anugrahinchutaku
Devuni Gnaanamai Vachchenu           ||Sarvonnatha||

Marana Chaayalu Cheekati Lonu Koorchunnavaaraiki
Yesu Arunodayamichchenu
Paapa Shaapamu Nundi Prajalaku Vidudalanichchutaku
Kreesthu Nara Roopamu Daalchenu       ||Sarvonnatha||

ఆకాశంబున్ దూతలు / Aakaashambun Doothalu

ఆకాశంబున్ దూతలు
ఉత్సాహించి పాడిరి
పుట్టె రక్షకుండని
సంతసించి ఆడిరి

సర్వోన్నతమైన స్థలములలో
ప్రభుకే మహిమలు కలుగును గాక
భూమి పై సమాధానం (2)

బెత్లెహేము నందున
క్రీస్తు రాజున్ చుడుడి
దేవుని కుమారుని
మోకరించి మ్రొక్కుడి    ||సర్వోన్నతమైన||

Aakaashambun Doothalu
Uthsaahinchi Paadiri
Putte Rakshakundani
Santhasinchi Aadiri

Sarvonnathamaina Sthalamulalo
Prabhuke Mahimalu Kalugunu Gaaka
Bhoomipai Samaadhaanam (2)

Bethlehemu Nanduna
Kreesthu Raajun Choodudi
Devuni Kumaaruni
Mokarinchi Mrokkudi         ||Sarvonnathamaina||

ఆకాశం అమృత జల్లులు / Aakaasham Amrutha Jallulu

|

ఆకాశం అమృత జల్లులు కురిపించింది
ఈ లోకం ఆనందమయమై మురిసింది (2)

అంతు లేని ఈ అనంత జగతిలో
శాంతి కొరవడి మసలుచుండగా (2)
రక్షణకై నిరీక్షణతో (2)
వీక్షించే ఈ అవనిలో (2)
శాంతి సమతల కధిపతి నేడు జన్మించినాడనీ           ||ఆకాశం||

పొంతన లేని వింత జగతిలో
పాపాంధకారం ప్రబలి యుండగా (2)
సమ్మతిని మమతలను (2)
పెంచుటకై ఈ పృథివిపై (2)
ఆది దేవుడే ఆదరంబున ఉదయించినాడనీ             ||ఆకాశం|

Aakaasham Amrutha Jallulu Kurpinchindi
Ee Lokam Aanandamayamai Murisindi (2)

Anthu Leni Ee Anantha Jagathilo
Shaanthi Koravadi Masaluchundagaa (2)
Rakshanakai Nireekshanatho (2)
Veekshinche Ee Avanilo (2)
Shaanthi Samathala Kadhipathi Nedu Janminchinaadanee            ||Aakaasham||

Ponthana Leni Vintha Jagathilo
Paapaandhakaaram Prabali Yundagaa (2)
Sammathini Mamathalanu (2)
Penchutakai Ee Pruthivipai (2)
Aadi Devude Aadarambuna Udayinchinaadanee          ||Aakaasham||

అవనిలో ఉద్భవించె / Avanilo Udbhavinche

పాట రచయిత: కే ఆర్ జాన్

అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని చూడరే
పుడమియే పరవశించె పసిబాలుని చూడగనే… పసిబాలుని చూడగనే

ఆకాశమే పట్టనోడు – ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై – వెలసినాడు రక్షకుడు (2)
ఆనందమే మహా ఆనందమే – అందరికి ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే – యేసు జననం అద్భుతమే (2)

అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు
ఆది అంతమైన పరలోక నాథుడు(2)
ఆదియందు వాక్యంబుగా – సృష్టి కార్యము జరిగించినాడు
అనాది నుండి జ్ఞానంబుగా – సృష్టి క్రమము నడిపించినాడు (2)
అన్నిటిని కలిగించిన మహరాజు
కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు (2)     ||ఆనందమే||

ప్రేమను పంచే ప్రేమామయుడు
రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు (2)

పాపమే లేని సుగుణాల సుందరుడు
శాపము బాపను జన్మించెను చూడు (2)
నిత్యముండు నీతి సూర్యుడు – సత్యసాక్షిగా ఇలకొచ్చినాడు
ప్రేమను పంచే పావనాత్ముడు – పశుల పాకలో పవళించినాడు (2)
సర్వాధికారియైన మహరాజు
దీనులకు దీవెనగా దిగి వచ్చినాడు (2) ||ఆనందమే||    ||ఆకాశమే||

Lyricist: KR John

Avanilo Udbhavinche Aadi Sambhoothuni Choodare
Pudamiye Paravshinche Pasibaaluni Choodagane.. Pasibaaluni Choodagane

Aakaashame Pattanodu – Dharanilo Puttinaadu
Daaveedu Puramunandu Deenudai – Velasinaadu Rakshakudu (2)
Aanandame Mahaa Aanandame – Andariki Ilalo Santhoshame
Aascharyame Idi Adbhuthame – Yesu Jananam Adbhuthame (2)

Adrushya Devuni Mahima Swaroopudu
Aadi Anthamaina Paraloka Naathudu (2)
Aadiynadu Vaakyambugaa – Srushti Kaaryamu Jariginchinaadu
Anaadi Nundi Gnaanambugaa – Srushti Kramamu Nadipinchinaadu (2)
Annitini Kaliginchina Maharaaju
Kanneetini Thudachutaku Digi Vachchinaadu (2) |||Aanandame||

Premanu Panche Premaamayudu
Rakshana Ichche Rakshinche Devudu (2)

Paapame Leni Sugunaala Sundarudu
Shaapamu Baapanu Janminchenu Choodu (2)
Nithyamundu Neethi Sooryudu – Sathya Saakshigaa Ilakochchinaadu
Premanu Panche Paavanaathmudu – Pashula Paakalo Pavalinchinaadu (2)
Sarvaadhikaariyaina Maharaaju
Deebulaku Deevenagaa Digi Vachchinaadu (2) ||Aanandame||   ||Aakaashame||

ఆకాశాన తార ఒకటి వెలసింది / Aakashaana Thaara Okati

ఆకాశాన తార ఒకటి వెలసింది
ఉదయించెను రక్షకుడని తెలిపింది (2)
ఇదే క్రిస్మస్ – హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్         ||ఆకాశాన||

యూద దేశపు బెత్లెహేములో
కన్య మరియ గర్బమున జన్మించె
తూర్పు దేశపు గొప్ప జ్ఞానులు
యూదుల రాజు ఎక్కడని వెతికారు
తూరుపు దిక్కున చుక్కను కనుగొని
ఆనందభరితులై యేసుని చేరిరి
కానుకలిచ్చిరి పూజించిరి        ||ఇదే||

రాత్రివేళలో మంద కాసెడి
కాపరులకు ప్రభువు దూత ప్రకటించే
లోక ప్రజలకు మిగుల సంతసం
కలిగించెడి వర్తమానమందించే
క్రీస్తే శిశువుగా యేసుని పేరట
ముక్తిని గూర్చెడి రక్షకుడాయెగా
సంతోషగానముతో స్తుతియింతుము          ||ఇదే||

Aakashaana Thaara Okati Velasindi
Udayinchenu Rakshakudani Thelipindi (2)
Ide Christmas – Happy Happy Christmas
Merry Merry Christmas – Happy Christmas        ||Aakashaana||

Yooda Deshapu Bethlehemulo
Kanya Mariya Garbhamuna Janminche
Thoorpu Deshapu Goppa Gnaanulu
Yoodula Raaju Ekkadani Vethikaaru
Thoorupu Dikkuna Chukkanu Kanugoni
Aanandbharithulai Yesuni Cheriri
Kaanukalichchiri Poojinchiri         ||Ide||

Raathri Velalo Manda Kaasedi
Kaaparulaku Prabhuvu Dootha Prakatinche
Loka Prajalaku Migula Santhasam
Kaliginchedi Varthamaanamandinche
Kreesthe Shishuvugaa Yesuni Perata
Mukthini Goorchedi Rakshakudaayegaa
Santhosha Gaanamutho Sthuthiyinthumu         ||Ide||

ఆ రాజే నా రాజు నా రాజే రారాజు / Aa Raaje Naa Raaju Naa Raaje Raaraaju

పాట రచయిత: బన్ని సుదర్శన్

ఆ రాజే నా రాజు – నా రాజే రారాజు
నా రాజు రాజులకు రాజు (2)
యేసు పుట్టెను ఈ లోకంలో
ఆనందమే గొప్ప ఆనందమే (2)
ఆనందమే గొప్ప ఆనందమే
సంతోషమే సర్వలోకమే (2)         ||ఆ రాజే||

యెష్షయి మొద్దున – దావీదు చిగురుగా
లోక రక్షకుడు జన్మించెను
లోక పాపాలను కడిగి వేయగా
భువిలో బాలుడిగా అరుదించెను (2)
పరిశుద్ధాత్మ మూలముగా జన్మించెను
మన పాపాలకు విరుగుడు మందును (తెచ్చెను) (తెచ్చి అందించెను) (2)        ||ఆనందమే||

వీనుల విందుగా – దీనుల అండగా
కరుణా కారకుడు కడలివచ్చెను
పాపుల శాపాలను తానే మోయగా
పరమ పాలకుడు పుడమి చేరెను (2)
కుల మత బేధాలను హరియించ వచ్చెను
పరలోకానికి చేర్చే (మార్గమాయెను) (మార్గమై తనే నిలిచెను) (2)        ||ఆనందమే||

Lyricist: Bunny Sudarshan

Aa Raaje Naa Raaju – Naa Raaje Raaraaju
Naa Raaju Raajulaku Raaju (2)
Yesu Puttenu Ee Lokamlo
Aanandame Goppa Aanandame (2)
Aanandame Goppa Aanandame
Santhoshame Sarva Lokame (2)         ||Aa Raaje||

Yeshshayi Modduna – Daaveedu Chigurugaa
Loka Rakshakudu Janminchenu
Loka Paapaalanu Kadigi Veyagaa
Bhuvilo Baaludigaa Arudinchenu (2)
Parishuddhaathma Moolamugaa Janminchenu
Mana Paapaalaku Virugudu Mandunu (Thechcenu) (Thechchi Andinchenu) (2)          ||Aanandame||

Veenula Vindugaa – Deenula Andagaa
Karunaa Kaarakudu Kadali Vachchenu
Paapula Shaapaalnu Thaane Moyagaa
Parama Paalakudu Pudami Cherenu (2)
Kula Matha Bedhaalanu Hariyincha Vachchenu
Paralokaaniki Cherche (Maargamaayenu) (Maargamai Thane Nilichenu) (2)          ||Aanandame||

ఆ నింగిలో వెలిగింది ఒక తార / Aa Ningilo Veligindi Oka Thaara

పాట రచయిత: బన్ని సుదర్శన్

ఆ నింగిలో వెలిగింది ఒక తార
మా గుండెలో ఆనందాల సితార
నిజ ప్రేమను చూసాము కళ్ళారా
ఈ లోకంలో నీ జన్మము ద్వారా
ఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాల
హృదయంలోని యేసు పుట్టిన వేళ
ఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాల
మా హృదయాల్లోన యేసు పుట్టిన వేళ
యేషు మేరా ప్రాణ్ హాయ్ తూ
యేషు మేరా ధ్యాన్ హాయ్ తూ
యేషు మేరా గాన్ హాయ్ తూ
యేషు మేరా ప్రాణ్ హాయ్ తూ

లోకంలో యాడ చూసిన శోకాలేనట
పరిశుద్ధ రాక కోసం ఎదురు చూపులట
అంతట ఒక తార వెలసెను తూర్పు దిక్కుట
అది చూసిన జ్ఞానులు వెళ్లిరి దాని వెంబట
విశ్వాన్ని సృష్టించిన దేవుడంట
పశువుల పాకలోన పుట్టాడంట
పాటలు పాడి ఆరాధించి
నిజ దేవుడు యేసుని అందరు చూడగ రారండోయ్            ||యేషు||

చీకటిలో చిక్కుకున్న బీదవారట
చలి గాలిలో సాగుతున్న గొల్లవారట
అంతట ఒక దూత నిలిచెను వారి ముంగిట
వెలుగులతో నింపే గొప్ప వార్త చెప్పెనట
దావీదు పట్టణమందు దేవుడంట
మనకొరకై భువిలో తానే పుట్టాడంట
వేగమే వెళ్లి నాథుని చూసి
పరిశుద్ధుని పాదము చెంత మోకరిల్లండోయ్            ||యేషు||

Lyricist: Bunny Sudarshan

Aa Ningilo Veligindi Oka Thaara
Maa Gundelo Aanandaala Sithaara
Nija Premanu Choosaamu Kallaara
Ee Lokamlo Nee Janmamu Dwaaraa
Aananda Hela Eeyaala Sandadi Cheyaala
Hrudayamlona Yesu Puttina Vela
Aananda Hela Eeyaala Sandadi Cheyaala
Maa Hrudayaallona Yesu Puttina Vela
Yeshu Meraa Praan Hai Thu
Yeshu Meraa Dhyaan Hai Thu
Yeshu Meraa Gaan Hai Thu
Yeshu Meraa Praan Hai Thu

Lokamlo Yaada Choosina Shokaalenata
Parishuddha Raaka Kosam Eduru Choopulata
Anthata Oka Thaara Velasenu Thoorpu Dikkuta
Adi Choosina Gnaanulu Velliri Daani Vembata
Vishwaanni Srushtinchina Devudanta
Pashuvula Paakalona Puttaadanta
Paatalu Paadi Aaraadhinchi
Nija Devudu Yesuni Andaru Choodaga Raarandoi             ||Yeshu||

Cheekatilo Chikkukunna Beedavaarata
Chali Gaalilo Saaguthunna Gollavaarata
Anthata Oka Dootha Nilichenu Vaari Mungata
Velugulatho Nimpe Goppa Vaartha Cheppenata
Daaveedu Pattanamandu Devudanta
Manakorakai Bhuvilo Thaane Puttaadanta
Vegame Velli Naathuni Choosi
Parishuddhuni Paadamu Chentha Mokarillandoi             ||Yeshu||