పోరాటం ఆత్మీయ పోరాటం / Poraatam Aathmeeya Poraatam

పోరాటం ఆత్మీయ పోరాటం (2)
చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదు
సాగిపోవుచున్నాను
సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2)

నా యేసుతో కలిసి పోరాడుచున్నాను
అపజయమే ఎరుగని జయశీలుడాయన (2)
నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

నా యేసు వెళ్ళిన మార్గము లేనని
అవమానములైనా ఆవేదనలైనా (2)
నా యేసు కృపనుండి దూరపరచలేవని (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

ఆదియు అంతము లేనివాడు నా యేసు
ఆసీనుడయ్యాడు సింహాసనమందు (2)
ఆ సింహాసనం నా గమ్యస్థానం (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

Poraatam Aathmeeya Poraatam (2)
Chivari Shwaasa Varaku – Ee Poraatam Aagadu
Saagipovuchunnaanu
Siluvanu Mosukoni Naa Gamya Sthaanaaniki (2)

Naa Yesutho Kalisi Poraaduchunnaanu
Apajayame Erugani Jayasheeludaayana (2)
Naa Yesu Korake Samarpinchukunnaanu (2)
Aagiponu Nenu Saagipovuchunnaanu            ||Poraatam||

Naa Yesu Vellina Maargamu Lenani
Avamaanamulainaa Aavedanalainaa (2)
Naa Yesu Krupanundi Dooraparachalevani (2)
Aagiponu Nenu Saagipovuchunnaanu         ||Poraatam||

Aadiyu Anthamu Lenivaadu Naa Yesu
Aaseenudayyaadu Simhaasanamandu (2)
Aa Simhaasanam Naa Gamyasthaanam (2)
Aagiponu Nenu Saagipovuchunnaanu       ||Poraatam||

పొందితిని నేను /Pondithini Nenu

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

పొందితిని నేను ప్రభువా నీ నుండి
ప్రతి శ్రేష్ట ఈవులన్ ఈ భువియందు (2)

జీవిత యాత్రలో సాగి వచ్చితిని (2)
ఇంత వరకు నాకు తోడై యుండి (2)
ఎబినేజరువై యున్న ఓ యేసు ప్రభువా (2)
నా రక్షణ కర్తవు నీవైతివి (2)                        ||పొందితిని||

గాలి తుఫానులలోనుండి వచ్చితిని (2)
అంధకార శక్తుల ప్రభావమునుండి (2)
నీ రెక్కల చాటున నను దాచితివయ్యా (2)
నీవే ఆశ్రయ దుర్గంబైతివి (2)                       ||పొందితిని||

కష్ట దుఖంబులు నాకు కలుగగా (2)
నను చేరదీసి ఓదార్చితివే (2)
భయ భీతి నిరాశల యందున ప్రభువా (2)
బహుగా ధైర్యంబు నాకొసగితివి (2)                ||పొందితిని||

నా దేహమందున ముళ్ళు నుంచితివి (2)
సాతానుని దూతగా నలుగ గొట్టన్ (2)
వ్యాధి బాధలు బలహీనతలందు (2)
నీ కృపను నాకు దయచేసితివి (2)                ||పొందితిని||

నీ ప్రేమ చేత ధన్యుడనైతిని (2)
కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను (2)
కష్ట పరీక్షలయందు నా ప్రభువా (2)
జయజీవితము నాకు నేర్పించితివి (2)          ||పొందితిని||

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Pondithini Nenu Prabhuvaa Nee Nundi
Prathi Sreshta Eevulan Ee Bhuviyandu (2)

Jeevitha Yaathralo Saagi Vachchitini (2)
Intha Varaku Naaku Thodai Yundi (2)
Ebinejaruvai Yunna O Yesu Prabhuvaa (2)
Naa Rakshana Karthavu Neevaithivi (2)      ||Pondithini||

Gaali Thuphaanulalonundi Vachchithini (2)
Andhakaara Shakthula Prabhaavamunundi (2)
Nee Rekkala Chaatuna Nanu Daachithivayyaa (2)
Neeve Aashraya Durgambaithivi (2)      ||Pondithini||

Kashta Dukhambulu Naaku Kalugagaa (2)
Nanu Cheradeesi Odaarchithive (2)
Bhaya Bheethi Niraashala Yanduna Prabhuvaa (2)
Bahugaa Dhairyambu Naakosagithivi (2)          ||Pondithini||

Naa Dehamanduna Mullu Nunchithivi (2)
Saathaanuni Doothaga Naluga Gottan (2)
Vyaadhi Baadhalu Balaheenathalandu (2)
Nee Krupanu Naaku Dayachesithivi (2)            ||Pondithini||

Nee Prema Chetha Dhanyudanaithini (2)
Kruthagnathaa Sthuthulu Chellinchedanu (2)
Kashta Pareekshalayandu Naa Prabhuvaa (2)
Jayajeevithamu Naaku Nerpinchithivi (2)    ||Pondithini||

పొర్లి పొర్లి పారుతుంది / Porli Porli Paaruthundi

పొర్లి పొర్లి పారుతుంది కరుణానది
కల్వరిలో యేసు స్వామి రుధిరమది (4)

నిండియున్న పాపమంత కడిగివేయును
కడిగివేయును.. కడిగివేయును (2)
రండి మునుగుడిందు
పాపశుద్ధి చేయును (2)
చేయును శుద్ధి – చేయును శుద్ధి (4)     ||పొర్లి||

రక్తము చిందించకుండా పాపము పోదు
పాపము పోదు.. పాపము పోదు (2)
ఆ ముక్తిదాత రక్తమందే
జీవము గలదు (2)
గలదు జీవము – గలదు జీవము (4)     ||పొర్లి||

విశ్వ పాపములను మోసే యాగ పశువదే
యాగ పశువదే.. యాగ పశువదే (2)
కోసి చీల్చి నదియై పారే
యేసు రక్తము (2)
రక్తము యేసు – రక్తము యేసు (4)     ||పొర్లి||

చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము
పిల్ల రుధిరము.. పిల్ల రుధిరము (2)
రమ్ము రమ్ము ఉచితము
ఈ ముక్తి మోక్షము (2)
మోక్షము ఉచితము – మోక్షము ఉచితము (4)     ||పొర్లి||

Porli Porli Paaruthundi Karunaa Nadi
Kalvarilo Yesu Swaami Rudhiramadi (4)

Nindiyunna Paapamantha Kadigiveyunu
Kadigiveyunu.. Kadigiveyunu (2)
Randi Munugudindu
Paapa Shuddhi Cheyunu (2)
Cheyunu Shuddhi – Cheyunu Shuddhi (4)     ||Porli||

Rakthamu Chindinchakunda Paapamu Podu
Paapamu Podu.. Paapamu Podu (2)
Aa Mukthidaatha Rakthamande
Jeevamu Galadu (2)
Galadu Jeevamu – Galadu Jeevamu (4)     ||Porli||

Vishwa Paapamulanu Mose Yaaga Pashuvade
Yaaga Pashuvade.. Yaaga Pashuvade (2)
Kosi Cheelchi Nadiyai Paare
Yesu Rakthamu (2)
Rakthamu Yesu – Rakthamu Yesu (4)     ||Porli||

Chimme Chimme Daiva Gorrepilla Rudhiramu
Pilla Rudhiramu.. Gorrepilla Rudhiramu (2)
Rammu Rammu Uchithamu
Ee Mukthi Mokshamu (2)
Mokshamu Uchithamu – Mokshamu Uchithamu (4)     ||Porli||

పైలం కొడుకా / Pailam Kodukaa

పైలం కొడుకా పాపం చేయకురా
యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా
పైలం కొడుకా పైలం కొడుకా
పైలం కొడుకా పైలం కొడుకా
పైలం కొడుకా పాపం చేయకురా
యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా
నీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా

ఉడుకు రక్తము ఉరుకలు పెడ్తది
పాపం చెయ్యమని ఒత్తిడి చేస్తది
పాపమన్నది పాములాంటిది
పగ పడ్తది ప్రాణం తీస్తది           ||పైలం||

మనిషి జీవితం విలువయ్యింది
మరువకు కొడుకా మరణమున్నదని
బ్రతికింది ఇది బ్రతుకు కాదురా
సచ్చినంక అసలాట ఉంటది          ||పైలం||

కత్తి కన్న పదునెక్కువ కొడుకా
మనిషి కోపము మంచిది కాదు
కాలు జారితే తీసుకోవచ్చురా
నోరు జారితే తీసుకోలేము          ||పైలం||

క్రైస్తవ జీవితం విలువయ్యింది
నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా
నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా
నిందలన్ని మొయ్యాలిరా కొడుకా          ||పైలం||

విచ్చలవిడిగా తిరుగుతున్నావు
ఎవరు చూడరని ఎగురుతున్నావు
చూసే దేవుడేసయ్య ఉన్నడు
తోలు తీస్తడు జాగ్రత్త కొడుకా          ||పైలం||

గుట్కలు తినకురా గుటుక్కున చస్తావు
పొగాకు తినకురా పోతవు నరకం
సినిమా చూడకు చింతలు తప్పవు
ఫోజులు కొట్టకు పోతవు నరకం          ||పైలం||

కుమ్మరి పురుగు గుణం చూడరా
బురదల ఉంటది బురదే అంటదు
తామెర పువ్వు బురుదల ఉంటది
వరదొస్తే తల వంచుకుంటది          ||పైలం||

ఎన్నో ఆశలు పెట్టుకున్నరా
సేవ చేస్తే నిను చూడాలని
నా కలలను కల్ల చెయ్యకు కొడుకా
కాళ్ళు మొక్కుతా మయ్యగానిరా          ||పైలం||

పొందుకున్నవు రక్షణ నీవు
పోగొట్టుకోకు పోతవు నరకం
నరకమంటే ఆషామాషీ కాదురో
అగ్ని ఆరదు పురుగు చావదు          ||పైలం||

ప్రపంచమంతటా పాపమున్నది
మందులేని మాయ రోగమున్నది
నీ పచ్చని జీవితం పాడు చేసుకోకు ఓ కొడకా
నీవు మంచిగా బ్రతికేసయ్యను మహిమపరచు నా కొడకా

నీవు సి ఎం అయితే సంతోషముండదు పి ఎం అయితే సంతోషముండదు
యాక్టర్ అయితే సంతోషముండదు డాక్టర్ అయితే సంతోషముండదు
నీవు సేవ చేస్తే నేను చూడాలి కొడుకా
నువ్వు శ్రమలు అనుభవించాలిరా నా కొడుకా          ||పైలం||

Pailam Kodukaa Paapam Cheyyakuraa
Yesayyanu Nammukoni Manchiga Bathukuraa
Pailam Kodukaa Pailam Kodukaa
Pailam Kodukaa Pailam Kodukaa
Pailam Kodukaa Paapam Cheyyakuraa
Yesayyanu Nammukoni Manchiga Bathukuraa
Nee Manasu Maarchukoni Manchiga Brathukuraa

Uduku Rakthamu Urukalu Pedthadi
Paapam Cheyyamani Votthidi Chesthadi
Paapamannadi Paamulaantidi
Paga padthadi Praanam Theesthadi        ||Pailam||

Manishi Jeevitham Viluvayyindi
Maruvaku Kodukaa Maranamunnadani
Brathikindi Idi Brathuku Kaaduraa
Sachchinanka Asalaata Untadi        ||Pailam||

Katthi Kanna Padunekkuva Kodukaa
Manishi Kopamu Manchidi Kaadu
Kaalu Jaarithe Theesukovachchuraa
Noru Jaarithe Theesukolemu        ||Pailam||

Kraisthava Jeevitham Viluvayyindi
Nippulaaga Brathakaaliraa Kodukaa
Nippulaaga Brathakaaliraa Kodukaa
Nindalanni Moyaaliraa Kodukaa        ||Pailam||

Vichchalavidigaa Thiruguthunnavu
Evaru Choodarani Eguruthunnavu
Choose Devudesayya Unnadu
Tholu Theesthadu Jaagrattha Kodukaa        ||Pailam||

Gutkalu Thinakuraa Guttukuna Chasthavu
Pogaaku Thinakuraa Pothavu Narakam
Cinimaa Choodaku Chinthalu Thappavu
Phosulku Kottaku Pothavu Narakam        ||Pailam||

Kummari Purugu Gunam Choodaraa
Buradala Untadi Burade Antadu
Thaamera Puvvu Burudala Untadi
Varadosthe Thala Vanchukuntadi        ||Pailam||

Enno Aashalu Pettukunnaraa
Seva Chesthe Ninu Choodaalani
Naa Kalalnu Kalla Cheyyaku Kodukaa
Kaallu Mokkuthaa Mayyagaaniraa        ||Pailam||

Pondukunnavu Rakshana Neevu
Pogottukoku Pothavu Narakam
Narakamante Aashaamaashee Kaaduro
Agni Aaradu Purugu Chaavadu        ||Pailam||

Prapanchamanthata Paapamunnadi
Manduleni Maaya Rogamunnadi
Nee Pachchani Jeevitham Paadu Chesukoku O Kodakaa
Neevu Manchiga Brathikesayyanu Mahimaparachu Naa Kodakaa

Neevu CM Aithe Santhoshamundadu PM Aithe Santhoshamundadu
Actor Aithe Sathoshamundadu Doctor Aithe Santhoshamundadu
Neevu Seva Chesthe Nenu Choodaali Kodukaa
Nuvvu Shramalu Anubhavinchaalira Naa Kodukaa        ||Pailam||

పైనున్న ఆకాశమందునా / Painunna Aakaashamandunaa

పైనున్న ఆకాశమందునా
క్రిందున్న భూలోకమందునా (2)
లేదు రక్షణ ఏ నామమున
లేదు పాప విమోచన – (2)       ||పైనున్న||

అన్ని నామములకు పైని కలదు
ఉన్నతంబగు యేసుని నామము (2)
యేసు నామములో శక్తి కలదు (2)
దోషులకు శాశ్వత ముక్తి కలదు (2)       ||పైనున్న||

అలసి సొలసిన వారికి విశ్రం
జీవము లేని వారికి జీవము (2)
నాశనమునకు జోగేడి వారికి (2)
యేసు నామమే రక్షణ మార్గము (2)       ||పైనున్న||

యేసు నామము స్మరియించగానే
మనసు మారి నూతనమగును (2)
బేధమేమియు లేదెవ్వరికిని (2)
నాథుని స్మరియించి తరింప (2)       ||పైనున్న||

Painunna Aakaashamandunaa
Krindunna Bhoolokamandunaa (2)
Ledu Rakshana Ae Naamamuna
Ledu Paapa Vimochana – (2)        ||Painunna||

Anni Naamamulaku Paini Kaladu
Unnathambagu Yesuni Naamamu (2)
Yesu Naamamulo Shakthi Kaladu (2)
Doshulaku Shaashwatha Mukthi Kaladu (2)        ||Painunna||

Alasi Solasina Vaariki Vishram
Jeevamu Leni Vaariki Jeevam (2)
Naashanamunaku Jogedi Vaariki (2)
Yesu Naamame Rakshana Maargamu (2)        ||Painunna||

Yesu Naamamu Smariyinchagaane
Manasu Maari Noothanamagunu (2)
Bedhamemiyu Ledevvarikini (2)
Naathuni Smariyinchi Tharimpa (2)        ||Painunna||

ప్రేమింతును నిన్నే / Preminthunu Ninne

ప్రేమింతును నిన్నే – జీవింతును నీకై
ధ్యానింతును నిన్నే – ప్రకటింతును నీకై
యేసూ… నీవే…
అతి సుందరుడా – అతి శ్రేష్టుడా
నీవే… అతి కాంక్షనీయుడా
నా ప్రాణ ప్రియుడా – నా యేసయ్యా       ||ప్రేమింతును||

నీతోనే నేనెల్లప్పుడు జీవింతును యేసయ్యా
ప్రతి దినము నీ రాకడకై నేనెదురు చూచెదనయ్యా (2)
నీ రెక్కల నీడలో నన్ను కాపాడావు
నా జీవిత కాలమంతా నిన్నే కీర్తింతునయ్యా (2)        ||యేసూ||

నీ ముఖము అతి మనోహరం సూర్య కాంతి మించినది
నీ స్వరము అతి మధురం తేనె కంటె తీయనిది (2)
షాలేము రాజా సమాధాన కర్తా
రక్షణ పాత్ర చేత బూని ఆరాధింతునయ్యా (2)        ||యేసూ||

Preminthunu Ninne – Jeevinthunu Neekai
Dhyaanithunu Ninne – Prakatinthunu Neekai
Yesu… Neeve…
Athi Sundarudaa – Athi Shreshtudaa
Neeve… Athi Kaankshaneeyudaa
Naa Praana Priyudaa – Naa Yesayyaa        ||Preminthunu||

Neethone Nenellappudu Jeevinthunu Yesayyaa
Prathi Dinamu Nee Raakadakai Neneduru Choochedanayyaa (2)
Nee Rekkala Needalo Nannu Kaapaadaavu
Naa Jeevitha Kaalamanthaa Ninne Keerthinthunayyaa (2)       ||Yesu||

Nee Mukhamu Athi Manohram Soorya Kaanthi Minchinadi
Nee Swaramu Athi Madhuram Thene Kante Theeyanidi (2)
Shaalemu Raajaa Samaadhaana Karthaa
Rakshana Paathra Chetha Booni Aaraadhinthunayyaa (2)       ||Yesu||

ప్రేమించెదన్ / Preminchedan

ప్రేమించెదన్ అధికముగా
ఆరాధింతున్ ఆసక్తితో (2)

నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధనా
ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)

ఎబినేజరే ఎబినేజరే
ఇంత వరకు ఆదుకొన్నావే (2)
ఇంత వరకు ఆదుకొన్నావే   || నిన్ను పూర్ణ ||

ఎల్రోహి ఎల్రోహి
నన్ను చూచావే వందనమయ్యా (2)
నన్ను చూచావే వందనమయ్యా    || నిన్ను పూర్ణ ||

యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరిచావే వందనమయ్యా (2)
స్వస్థపరిచావే వందనమయ్యా       || నిన్ను పూర్ణ ||

Preminchedan Adhikamugaa
Aaradhinthun Aasakthitho (2)

Ninnu Poorna Manasutho Aaraadhinthun
Poorna Balamutho Preminchedan
Aaraadhana Aaraadhanaa
Aa.. Aa..Aaraadhana Aaraadhanaa (2)

Ebinejare Ebinejare
Intha Varaku Aadukonnaave (2)
Intha Varaku Aadukonnaave      || Ninnu Poorna ||

Elrohi Elrohi
Nannu Choochaave Vandanamayyaa (2)
Nannu Choochaave Vandanamayyaa    || Ninnu Poorna ||

Yehovaa Raaphaa Yehovaa Raaphaa
Swasthaparichaave Vandanamayyaa (2)
Swasthaparichaave Vandanamayyaa      || Ninnu Poorna ||

ప్రేమించెద యేసు రాజా / Premincheda Yesu Raajaa

ప్రేమించెద యేసు రాజా
నిన్నే ప్రేమించెద (2)
ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆ
ప్రేమించెద ప్రేమించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

ఆరాధించెద యేసు రాజా
నిన్నే ఆరాధించెద (2)
ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెదా ఆ ఆ ఆ
ఆరాధించెద ఆరాధించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

ప్రార్ధించెద యేసు రాజా
నిన్నే ప్రార్ధించెద (2)
ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రార్ధించెదా ఆ ఆ ఆ
ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

సేవించెద యేసు రాజా
నిన్నే సేవించెద (2)
సేవించెద సేవించెద సేవించెదా ఆ ఆ ఆ
సేవించెద సేవించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

జీవించెద యేసు రాజా
నీకై జీవించెద (2)
జీవించెద జీవించెద జీవించెదా ఆ ఆ ఆ
జీవించెద జీవించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

Premincheda Yesu Raajaa
Ninne Premincheda (2)
Premincheda Premincheda Preminchedaa Aa.. Aa.. Aa..
Premincheda Premincheda Praanamunnantha Varaku
Ne Mattilo Chere Varaku
Naa Praanamunnantha Varaku
Ne Mahimalo Chere Varaku

Aaraadhincheda Yesu Raajaa
Ninne Aaraadhincheda (2)
Aaraadhincheda Aaraadhincheda Aaraadhinchedaa Aa.. Aa.. Aa..
Aaraadhincheda Aaraadhincheda Praanamunnantha Varaku
Ne Mattilo Chere Varaku
Naa Praanamunnantha Varaku
Ne Mahimalo Chere Varaku

Praardhincheda Yesu Raajaa
Ninne Praardhincheda (2)
Praardhincheda Praardhincheda Praardhinchedaa Aa.. Aa.. Aa..
Praardhincheda Praardhincheda Praanamunnantha Varaku
Ne Mattilo Chere Varaku
Naa Praanamunnantha Varaku
Ne Mahimalo Chere Varaku

Sevincheda Yesu Raajaa
Ninne Sevincheda (2)
Sevincheda Sevincheda Sevinchedaa Aa.. Aa.. Aa..
Sevincheda Sevincheda Praanamunnantha Varaku
Ne Mattilo Chere Varaku
Naa Praanamunnantha Varaku
Ne Mahimalo Chere Varaku

Jeevincheda Yesu Raajaa
Neekai Jeevincheda (2)
Jeevincheda Jeevincheda Jeevinchedaa Aa.. Aa.. Aa..
Jeevincheda Jeevincheda Praanamunnantha Varaku
Ne Mattilo Chere Varaku
Naa Praanamunnantha Varaku
Ne Mahimalo Chere Varaku

ప్రేమించు దేవుడు / Preminchu Devudu

ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు
పాలించు దేవుడు – యేసు దేవుడు
పాటలు పాడి ఆనందించెదం
ఆహా ఎంతో ఆనందమే (2)       ||ప్రేమించు||

తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు
ప్రతి అవసరమును తీర్చు దేవుడు (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు
తోడు నీడగా నన్ను కాపాడును (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు
సర్వ కాలమందు జయమిచ్చును (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు
అంతము వరకు చేయి విడువడు (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

Preminchu Devudu Rakshinchu Devudu
Paalinchu Devudu – Yesu Devudu
Paatalu Paadi Aanandinchedam
Aaha Entho Aanandame (2)      ||Preminchu||

Thallidandrula Kannaa Thaatha Aina Devudu
Prathi Avasarmunu Theerchu Devudu (2)
Hallelooyaa Aanandame
Santhoshame Samaadhaaname (2)        ||Preminchu||

Nannu Swasthaparachi Shakthinichchu Devudu
Thodu Needaga Nannu Kaapaadunu (2)
Hallelooyaa Aanandame
Santhoshame Samaadhaaname (2)        ||Preminchu||

Ninna Nedu Ekareethiga Unnaadu
Sarva Kaalamandu Jayamichchunu (2)
Hallelooyaa Aanandame
Santhoshame Samaadhaaname (2)        ||Preminchu||

Ellavelalaa Nannu Nadipinche Devudu
Anthamu Varaku Cheyi Viduvadu (2)
Hallelooyaa Aanandame
Santhoshame Samaadhaaname (2)        ||Preminchu||

ప్రేమిస్తా నిన్నే / Premisthaa Ninne

ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా
పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా (2)
చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా
యేసయ్యా నీ సన్నిధి చాలయా (2)        ||ప్రేమిస్తా||

నను ప్రేమించి భువికొచ్చినది నీ ప్రేమ
సిలువలో మరణించి బలియైన ఆ ప్రేమ (2)
ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
నా జీవమర్పింతు నీ సేవకు (2)          ||చాలయ్యా||

కన్నీటిని తుడిచి ఓదార్చును నీ ప్రేమ
కరములు చాపి కౌగిట చేర్చును ఆ ప్రేమ (2)
ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
నా జీవమర్పింతు నీ సేవకు (2)          ||చాలయ్యా||

నా స్థితి మార్చి నను రక్షించెను నీ ప్రేమ
నను దీవించి హెచ్చించినది నీ ప్రేమ (2)
ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
నా జీవమర్పింతు నీ సేవకు (2)          ||చాలయ్యా||

Premisthaa Ninne Naa Yesayyaa
Paravashisthu Untaa Nee Sannidhilo Nenayyaa (2)
Chaalayyaa Nee Prema Chaalayyaa
Yesayyaa Nee Sannidhi Chaalayaa (2)         ||Premisthaa||

Nanu Preminchi Bhuvikochchinadi Nee Prema
Siluvalo Maraninchi Baliyaina Aa Prema (2)
Emivvagalanu Nee Prema Koraku
Naa Jeevamarpinthu Nee Sevaku (2)           ||Chaalayyaa||

Kanneetini Thudichi Odaarchunu Nee Prema
Karamulu Chaapi Kougita Cherchunu Aa Prema (2)
Emivvagalanu Nee Prema Koraku
Naa Jeevamarpinthu Nee Sevaku (2)           ||Chaalayyaa||

Naa Sthithi Maarchi Nanu Rakshinchenu Nee Prema
Nanu Deevinchi Hechchinchinadi Nee Prema (2)
Emivvagalanu Nee Prema Koraku
Naa Jeevamarpinthu Nee Sevaku (2)           ||Chaalayyaa||