అందమైన దేశము పరలోకము (సీయోను పిల్లల పాటలు) . Andamaina Deshamu Paralokamu

పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది… మత్తయి 13:11

పల్లవి : అందమైన దేశము పరలోకము

ఆనందముగా ఉంటుంది చిరకాలము(2)

1. పాపముండదు – అచట శాపముండదు

    దుఃఖముండదు – అచట చీకటుండదు(2)

    ఆహా మా యేసు రాజుగా – చిరకాల మేలుతాడు (2) ॥అంద॥

2. దూతలుంటారు – జీవ గ్రంథముంటుంది

    భక్తులుంటారు – జీవ వృక్షముంటుంది

    ఆహా మాయేసు రాజుగా – చిరకాల మేలుతాడు       ॥అంద॥

అడుగుడి మీకివ్వబడును (సీయోను పిల్లల పాటలు) / Adugudi Meekivvabadunu 

అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును,… మత్తయి 7:7

అడుగుడి మీకివ్వబడును                 (1)

వెదకుడి మీకు దొరుకును               (1)

తట్టుడి మీకు తీయబడును             (2)

ప్రభుయేసుని సత్యమైన మాట      (2)

నిశ్చయము – నిశ్చయము               (2)

అన్నలను చూడవెళ్లె చిన్న దావీదు  (సీయోను పిల్లల పాటలు) Annalanu Choodavelle Chinna Daaveedu

…యుద్ధము యెహోవాదే;… 1 సమూ 17:47

1. అన్నలను చూడవెళ్లె చిన్న దావీదు         (1)

   దుష్ట గొల్యాతు స్వరము విని లేచెను       (1)

   చంపెదను గొల్యాతునని చెప్పెను (1) యుద్ధమాడ సాగివెళ్లెను (2)

2. ఎట్లు గొల్యాతును దావీదు చంపెను?                   (3)

    ఎవ్విధముగా యుద్ధమాడెను?                                 (2)

3. కర్రతో-కాదు, కత్తితో కాదు, బాణముతోనా? – కాదు, కాదు (1)

    ఈటెతో-కాదు ఏలాగు యుద్ధమాడెను?               (1)

    వడిసెల రాయిని యెహోవా పేరట                          (1)

    చుట్టు త్రిప్పి విసిరెను సర్, సర్, సర్                          (1)

    దుష్టుని నుదుట ఆ రాయి జొచ్చెను – ఈలాగు చంపె దుష్టుని (1)

4. దుష్ట సైతానుడు మనల భయపెట్టిన                      (1)

    యుద్ధ శూరు డేసుడుండ భయమెందుకు            (1)

    జయమునిచ్చు యేసున్ నమ్మి యుద్ధమాడుము (1)

    చిన్న దావీదున్ తలచుకొని                                       (2)

అమ్మకు లోబడు చిన్న పిల్లలము / Ammaku Lobadu Chinna Pillalamu

అమ్మకు లోబడు చిన్న పిల్లలము

నాన్నకు లోబడు ముద్దు బిడ్డలము

వేద వాక్యం పఠించు

చిన్న పిల్లలము

యేసునే ప్రేమించు

ముద్దు బిడ్డలము

అనగానగా సమూయేలు / Anaganagaa Samuyelu

అనగానగా సమూయేలు

ఒక చిన్నబాలుడు

ఎల్కానా హన్నాల ముద్దుల బాలుడు

ఏలీతో దేవునికి పరిచర్య చేసాడు.

ఇశ్రాయేలీయుల ప్రవక్తగా

నియమింపబడ్డాడు

1.సమూయేలు మోకరించి ప్రార్ధన చేసాడు

దేవుడే సమూయేలును పేరుతో పిలిచాడు.

దేవునికి మనుష్యులకు విధేయుడైన

సమూయేలు చిన్న వయసులో

దేశమంతా పేరు పొందాడు.

2. సమూయేలు ఇతరుల కొరకు

ప్రార్ధన చేశాడు

దావీదును రాజుగా అభిషేకించాడు.

ప్రవక్తగా న్యాయాధిపతిగా

నియమితుడైన సమూయేలు

దేవునిచే ప్రజలచే ప్రేమింపబడ్డాడు

అన్నా ఓరన్నా పెద్దన్నా / Anna Oranna Peddanna

అన్నా ఓరన్నా పెద్దన్నా

అన్నా ఓరన్నా చిన్నన్నా

చిన్న చిన్న ప్రాణులు

వాటి తెలివి తేటలు

వాటినైన చూచి బుద్ధి తెచ్చుకోరా

వాటి నడత చూచి

బ్రతుకు మార్చుకోరా

1. చీమలను చూడరా చిన్నన్నా

వాటి చురుకు చూడరా పెద్దన్నా

రాజు లేడురా నేత లేడురా

వాటి నడత చూచి బుద్ధి తెచ్చుకోరా

వాటి బ్రతుకు చూచి

మనసు మార్చుకోరా          ॥అన్నా॥

2. గోడ మీద బల్లి చూడు చిన్నన్నా

గొప్ప ఇంట ఉంటుంది చూడరన్నా

చిన్న మిడతలు వాటి ఐకమత్యము

వాటినైన చూచి బుద్ధి తెచ్చుకోరా

వాటి నడత చూచి బుద్ధి తెచ్చుకోరా

వాటి బ్రతుకు చూచి

బ్రతుకు మార్చుకోరా                          ॥అన్నా॥

అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే / Ammo Ammo Ascharyakarude

అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే

అమ్మో అమ్మో అద్భుతకరుడే

నోటిమాటతో చేసేస్తున్నాడే

కనుసైగతో ఆపేస్తున్నాడే

1. నాల్గు రోజులైంది

లాజరు మరణించి

తిరిగి లేపాడు యేసయ్య వచ్చి

పుట్టు గుడ్డివాని వైపు ప్రేమగా చూచి

చూపునిచ్చాడు మట్టి ముద్దను రాసి

అమ్మో ఆశ్చర్యం అమ్మో అద్భుతం

2. గాలి వాన చేత

శిష్యులు భయపడుతుంటే

వాటిని గద్దించి నెమ్మది నిచ్చాడే

సేన దయ్యములచేత

బ్రతుకు పాడౌతుంటే

వాటిని తరిమేసి

క్రొత్త జీవితమిచ్చాడే

అమ్మో ఆశ్చర్యం అమ్మో అద్భుతం

అబెద్నగో షడ్రకు మేషకు / Abednego Shadraku Meshaku

అబెద్నగో షడ్రకు మేషకు

వచ్చి పడెనె పెద్ద చిక్కు

రాజు ప్రతిమకు మ్రొక్కమంటూ

సాతాను ప్లే చేసే ట్రిక్కు

1. ఏడంతల వేడిమి పెంచినా

అగ్నిలో మమ్మును కాల్చినా

నీ ప్రతిమంటే మాకు లేదు లెక్క

మ్రొక్కమంటూ చెప్పినారు ఎంచక్కా

అబెద్నగో షడ్రకు మేషకు

సాతానుకు పెట్టినారు చెక్కు

అది గదిగో ఒక యుద్ధం అరెరె / Adi Gadigo Oka Yudham Arere

అది గదిగో

ఒక యుద్ధం అరెరె

ఆగెనె ఆ సైన్యం

ఆపాదించెను ఆ జైంటు

ఆయెను సౌలు సైన్యం పైంటు

అడుగడుగో ఒక చిన్నోడు

అరెదైవిక రోషం ఉన్నోడు

చేతిలో వడిసెలు పట్టాడు.

ఆ జైంట్‌ పకపక నవ్వాడు

విసిరితే వడిసెల రాయి

కొట్టింది దేవుడెనోయి (2)

గొల్యాతాయెను జీరో

దావీదే ఇక హీరో (2)

అదిగదిగో ఒక యుద్ధం అరెరె

అగెనే ఆ సైన్యం

అరిచే నెమలికి తెలుసా / Ariche Nemaliki Thelusaa

1. అరిచే నెమలికి తెలుసా

ఎగిరే లేడికి తెలుసా

ఆ అందం యేసు ఇచ్చిందేనని

2. కూసే పక్షికి తెలుసా

రాసే కవితకు తెలుసా

ఆ మధురిమ యేసు ఇచ్చిందేనని

3. పూసే పువ్వుకు తెలుసా

తడిసిన మట్టికి తెలుసా

ఆ పరిమళం యేసు ఇచ్చిందేనని

4. అందం కంటే గొప్పది

మకరందం కంటే గొప్పది

సువాసన కంటే గొప్పది

యేసు ఇచ్చే రక్షణ

స్వీకరిస్తావా ఆస్వాదిస్తావా