శ్రమలలో భ్రమలలో / Shramallalo Bhramalalo

శ్రమలలో భ్రమలలో

శోధనలో వేదనలో

బాధలలో హింసలలో

మన విశ్వాసమే మనకు విజయము

దుష్టుడు సాతానుడు బాధించినా

కష్టము నష్టము కలిగినను

శరీరమంతా కృశించినను

పరిశోధనలెన్నో కలిగినను

మరవకు విడవకు యేసు ప్రభువుని

శక్తి గల దేవుడు మన యేసయ్య / Shakthi Gala Devudu Mana Yesayya

శక్తి గల దేవుడు మన యేసయ్య

అద్భుతాలు చేసే దేవుడు

మన యేసయ్య విన్నావా కన్నావా

నీవెపుడైనా చూశావా

1 ఎఱ్ఱ సంద్రాన్ని పాయలుగా చేశాడు.

ఆరిన నేలను తన ప్రజలను నడిపాడు.

2 నాల్గు రోజులైన సమాధిని తెరిచాడు

చచ్చిన లాజరును తిరిగి లేవమన్నాడు

3 ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి ఆహారంగా ఇచ్చాడు

శక్తిగల యేసుక్రీస్తు నామంలో / Shakthigala Yesukreesthu Namamulo

శక్తిగల యేసుక్రీస్తు నామంలో

జయము పొందుతాను నేను అన్నిటిలో

అ.ప: యేసులో నిలిస్తే గొప్పజయం

యేసుతో నడిస్తే లేదు భయం                      ॥శక్తి॥

1. బలశాలి గొల్యాతును చిన్న రాయితో

పడగొట్టెను దావీదు దైవబలముతో

దేవునిపై ఉంచెదను విశ్వాసం

దేవుని కర్పించెదను నా జీవితం                  ॥యేసు॥

2. లెక్కలేని శత్రువులను కొద్దిమందితో

గెలిచినాడు యెహోషువ ప్రార్ధనాత్మతో

ప్రార్ధనతో గెలిచెదను సమస్తం

లోకంలో నిలిచెదను ప్రభుకోసం                 ॥యేసు॥