దాస్య జనులనెల్ల మోషే విడిపించెను (సీయోను పిల్లల పాటలు)/ Daasya Janulella Moshe Vidipinchenu

ఎఱ్ఱసముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. కీర్తన 136:13

1. దాస్య జనులనెల్ల మోషే విడిపించెను   (1)

    ప్రభువు దారి నీడ నిచ్చి రోజు కాచెను  (1)

    పరమ మన్నా వస్త్రమిచ్చి ఆదరించెను   (1)

    మోషే సాగరం చేరెను                    (2)

2. ఎట్లు మోషే సాగరమును దాటివెళ్లెను  (3)

    ఎవ్విధముగ దాటెను                      (2)

3. ఈతతో-కాదు, పడవలో-కాదు, ఎగిరెనా? కాదు కాదు            (1)

    నడచెనా-కాదు, పరుగునా-కాదు, ఏలాగు దాటెను?               (1)

    దేవుడే రేపెను గుఫ్, గుఫ్, గుఫ్ – పెనుగాలిచే అఫ్, అఫ్, అఫ్     (1)

    సాగరంబు నందు దారిచేసెను – ఈలాగు మోషే దాటెను         (1)

4. పిశాచి వశము నుండి యేసు విడిపించెను                         (1)

    కీడులెన్నో రేగి నన్ను ఆవరించినన్                                  (1)

    మోషే కేర్పరచినట్టి దేవుడే నాకున్                                   (1)

    దారి చూపి నన్ను నడుపును                                          (2)

దేవుని గృహంబులో సాత్వికుడెవరో తెలుసా?(సీయోను పిల్లల పాటలు)/ Devuni Gruhamlo Saathwikudevaro Thelusaa

మోషే… క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,… హెబ్రీ 11:24,26

దేవుని గృహంబులో సాత్వికుడెవరో తెలుసా?

దేవునికై ధన, ఘనతలను విడనాడినదెవరో తెలుసా?(2)

క్రీస్తుకై అవమానమున్ – క్రీస్తులో బహుమానముల్ (2)

కోరినదాసుడు మోషే – కృపనొందిన దీనుడు మోషే (2)

Repeat first 2 lines

దీనస్థితి నుండి లేపబడి (సీయోను పిల్లల పాటలు) /Deenasthithi Nundi Lepabadi

…ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను… కీర్తన 136:23

దీనస్థితి నుండి లేపబడి-యేసుని ప్రేమను కనుగొంటిని      (2)

కరతాళముతో పాడెదను అచ్చట ఇచ్చట చెప్పెదను          (2)

యేసే రాజనుచు                                                  (2)

Usne hamare durdasha mein hamari sudhi lee,… Psalm 136:23

నీచే స్థాన్ సే ఉఠాయా ముజే – ఈశూకే ప్రేమ్ కో జానామై (2)

థాలి బజాకర్ గావూంగా మై – యహా వహా బతావూంగా మై           (2)

(ఈశూ రాజాహై)                                                    (2)

దేవుడు తన పుత్రుని పంపె జగమునకు (సీయోను పిల్లల పాటలు) / Devudu Thana Puthruni Pampe Jagamunaku

… దేవుడు తన… కుమారుని లోకములోనికి పంపెను;…1 యోహాను 4:9

1. దేవుడు తన పుత్రుని పంపె జగమునకు

    సిలువలో మరణించెను రక్షింప మనలను

పల్లవి : ఏమిత్తున్ ! ఏమిత్తున్ ! యేసుకు నేమిత్తున్? (1)

ప్రభుని గొప్ప ప్రేమకై నేనేమివ్వగలన్ (2)

2. నావంటి గొర్రెపిల్ల పైన ప్రేమ జూపునా?

    మరేమి యిచ్చినను – తానంగీకరించునా?

3. వాక్యంబును పఠించి దాని ననుసరించెద

    ప్రార్థించుచు నెల్లప్పుడేసుతోనే నడిచెద

దేవుని ప్రేమయే అద్భుతం (సీయోను పిల్లల పాటలు) / Deevuni Premaye Adbutham

 దేవ… ప్రేమ… వెడల్పు పొడుగు లోతు ఎత్తు… గ్రహించు… ఎఫెసీ 3:18

దేవుని ప్రేమయే అద్భుతం (3) దేవుని ప్రేమ (1)

యెంతో ఎత్తు నీవెక్కలేనిది – ఎంతో లోతు నీవు తాకలేనిది (1)

ఎంతో వెడల్పు నీకందరానిది – దేవుని ప్రేమ (1)

… Comprehend… what is the breadth, and length, and depth,

and height;… know the love of Christ,… Eph. 3:18,19

God\’s love to me is wonderful   (3)

God\’s love to me                       (1)

So high you can\’t get over it      (1)

So deep you can\’t get under it  (1)

So wide you can\’t get around it (1)

God\’s love to me                       (1)

దావీదు వడిసెల ప్రభుకొరకే (సీయోను పిల్లల పాటలు)/ Daaveedu Vadisela Prabhu Korike

నావన్నియు నీవి, నీవియు నావి;… యోహాను 17:10

1. దావీదు వడిసెల ప్రభుకొరకే                                  (1)

    దోర్కా సూదియును ప్రభు కొరకే                           (1)

    మరి – రాహాబు త్రాడును తన కొరకే – ప్రభువాడెను     (1)

2. సంసోను చేతిలో – నొక ఎముక

    అహరోను చేతిలో – నొక కఱ్ఱ

    అవి అన్నియు ఆయన పని కొరకే – ప్రభువాడెను

3. దేవుని ప్రేమయు నీకొరకే – అనుదినము నిన్ను ఆదరించ

    నీకున్నవి అన్నియు ఆయనకే నీవిచ్చెదవా?

దైవాజ్ఞకు నీవు లోబడిన తన వాగ్దానము నెరవేర్చును (సీయోను పిల్లల పాటలు) /Daivaagnyaku Neevu Lobadina Thana Vaagdaanamu Nereverchanu

నీ కట్టడలను నేను గైకొందును… కీర్తన 119:8

పల్లవి : దైవాజ్ఞకు నీవు లోబడిన తన వాగ్దానము నెరవేర్చును (2)

1. అపవాదికి చోటియ్యక – దొంగతనములు చేయక(2)

    నీ పాపముల నొప్పుకొనిన – కడుగును క్రీస్తు రక్తముతో (2) ॥దైవా॥

2. వాక్యము ప్రార్థన – యందు నీవు గడిపిన

    ప్రభువు నీదు ప్రార్థన విని – నీకు విజయ మొసగును           ॥దైవా॥

3. నీవు యెహోవాను – నమ్మి మేలు చేయుము

    నీవును నీదు యింటివారును – యెహోవాను సేవించుడి         ॥దైవా॥

4. నీ ఆశ్రయము కోటయు – నీవు నమ్ము దేవుడు

    నీ హృదయము నుండి – జీవధారల – ప్రవహింపజేయును      ॥దైవా॥

5. పాపమును కప్పిన – ఆకానువలె నుండక

    రాహాబువలె నాధారపడుము – క్రీస్తుయేసు రక్తము పై       ॥దైవా॥

6. ధైర్యముగా నిలువుము – ఏలీయా వలె నీవును

    ప్రభు క్రీస్తును వెంబడించుము – ఓర్పుతో రూతును పోలియు ॥దైవా॥

7. నిన్ను ఏర్పరచెను – ఏలీషా వంటి సేవకై

    ఎదురుచూడుము పవిత్రముగా – రారాజు యొక్క రాకకై       ॥దైవా॥

దేవుండు ఈ పాపమయ – లోకమును ఎంతో ప్రేమించెను (సీయోను పిల్లల పాటలు) /Deevundu Ee Papamayaa-Lokamunu Entho Preminchenu

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను 3:16

పల్లవి : దేవుండు ఈ పాపమయ – లోకమును ఎంతో ప్రేమించెను (1)

ఒక్కడైన తన ప్రియకుమారుని మన కొరకు అనుగ్రహించెన్ (1)

ఆయనపై విశ్వసించిన – నిశ్చయముగ నశింపవు (1)

నిత్య జీవము పొందెదవు – ప్రభువుతోనే సదా నుందువు (1)

1. పాపపు శిక్ష అగ్నిగుండమే – అయినను దేవుని వరము (2)

    ప్రభువైన యేసునందు – పరలోకరాజ్యము పొందు (2)           ॥దే॥

2. మానవులలో ఏ నామమున – రక్షణ కలుగదు నీకు

    నీ ఆత్మ రక్షణ కొరకై – ఎవ్వరు ప్రాణ మియ్యలేదే!                  ॥దే॥

3. పాపపు శుద్ది మరి పాపక్షమ – ప్రభు యేసునందే దొరుకున్

    సిలువలో రక్తము కార్చి – రక్షణ సిద్ధము చేసెన్                      ॥దే॥

4. నీ పాపముల నొప్పుకొన్నచో – నమ్మకమైన దేవుండే

    నీ పాపముల క్షమియించి – కడుగును కలుషములన్ని            ॥దే॥

5. ఈ మంచివార్తను వినిపించుము – ఈ లోకమంతయు నేడే

    రక్షణకర్త క్రీస్తేసే – అంగీకరించుడి నేడే                               ॥దే॥

దేవుని పిల్లలం / Devuni Pillalam

దేవుని పిల్లలం

మనమేసుని వారసులం (2)

ఎన్నడు మమ్ము విడువడు

ఏనాడు మమ్ము ఎడబాయడు (2)

1. భూమ్యాకాశములు సృజించిన దేవుడు

ఆకాశ పక్షులను పోషించు నా దేవుడు

నన్ను చేరదీయును

నన్ను కూడ పోషించును          ॥దేవు॥

2. విశ్వాసమే నా బలము

అపజయం నాకు లేదు

యేసు నాతో ఉన్నారు.

ఇక భయమే నాకు లేదు

క్రీస్తు నాలో ఉన్నారు

ఇక దిగులే నాకు లేదు             ॥దేవు॥

దేవుడే దావీదు దుర్గము / Devude Daaveedu Durgamu

దేవుడే దావీదు దుర్గము

ధైర్యమే దావీదు బలము

ఆపద ఏదైనా శత్రువు ఎవరైనా

దేవుని శక్తితో గెలిచెను

ఓ.. ఓ… ఓ… ఓ… ఓహోహో (4)

1. సింహమొచ్చెను తోక ముడిచెను

ఎలుగుబంటి పరుగు తీసెను

గొల్యాతు వచ్చెను విర్రవీగెను

దావీదు చేతిలో చచ్చెన                    ॥ఓ॥

2. దేవుని ఆజ్ఞకు లోబడెను

దేవునికిష్టునిగా బ్రతికెను

దేవుడు మెచ్చెను ఆశీర్వదించెను

దావీదు రాజుగా చేసెను                  ॥ఓ॥