బంధించెదము (సీయోను పిల్లల పాటలు) / Bandhinchedamu

.. వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున… ఆ దయ్యముతో చెప్పెను,… అపొ. 16:18

1 .బంధించెదము – గద్దించెదము – పారద్రోలెదము (2)

    యేసుని నామమున (3) రక్త శక్తితో(2)

    సైతాను వాని సేనలను – పారద్రోలెదము(1)

2. తెగిపోవును సంకెళ్ళు-విడిపోవును బందాలు-రక్షింపబడు ఆత్మల్ (2)

    యేసుని నామమున (3) రక్త శక్తితో(2)

    సైతాను వాని సేనలకు – ఓటమి నిశ్చయము(1)

Aur ve memne ke lahoo ke kaaran,… us par jayvanth hue,… Rev. 12:11

1. బాంధ్ సక్ తే హై – డాంట్ సక్ తే హై – భగా సక్ తే హై(2)

    ఈశుకి నామ్ మే (3) రక్త్ కి శక్తి సే (2)

    సైతాన్ ఔర్ ఉస్ కీ సేనా కో – దూర్ భగాతే హై(1)

2. జంజీర్ టూటే హై-బంధన్ ఖులే హై-ఆత్మాయే బచ్చీ హై (2)

    ఈశుకి నామ్ మే (3) రక్త్ కి శక్తి సే (2)

    సైతాన్ ఔర్ ఉస్ కీ సేనాకీ – హార్ నిశ్చయ్ హై(1)

బాలురం బాలికలం బహుమానములం / Baaluram Baalikalam Bahumaanamulam

బాలురం బాలికలం బహుమానములం

పిల్లలం పౌరులం పరిచారకులం

అ.ప.: ప్రభు యేసుక్రీస్తును

ప్రేమించు వారము

ప్రతిదినం వాక్యము

ప్రకటించు వారము

1. పాపము తెలియని పసి వారలము

పరలోక భాగ్యము పొందువారము

పాటలు ఆటలు కలవారము

2. సండేస్కూలుకు వేగమే వెళ్ళువారము

సత్యవాక్యమును సాధనచేయు వారము

సద్భక్తి సద్భావన కలవారము

బాలలం భావిలో నేతలం / Balalam Bhavilo Nethalam

బాలలం భావిలో నేతలం

పిల్లలం ప్రేమవనం మల్లెలం

పుడమిపై బంగారు కొమ్మలం

ప్రగతిని సాధించే పౌరులం

మేమే యేసుక్రీస్తు పిల్లలం

క్రీస్తు ప్రేమ పంచే

పరిచారకులం బాలలం

1 విజ్ఞాన సంద్రములో చిరు నావికులం

విజయాల ఖడ్గంలో వింత తారలం

క్రీస్తులో మేము

పసిడి కాంతి రేఖలం

సంఘములో వికసించే మొగ్గలం బాలలం

2. రోజు రోజుకు పెరిగే చిన్నారులం

సండేస్కూల్లో మేమంతా ఒకే కుటుంబం

దైవభక్తి దైవశక్తి గలవారలం తే

ధైర్యంగా సాగిపోయే ధీరులం బాలలం

బాలలం విశ్వ జ్యోతులం / Balalam Vishwajyothulam

బాలలం విశ్వ జ్యోతులం

పిల్లలం క్రీస్తు బిడ్డలం

సంఘమునందలి పాత్రలం

క్రీస్తుకు మేమే ఇష్టులం

పాట-279

అడవిలోన కోయిల కూసెను

అది పాడుచు అటు ఇటు తిరిగెను

యేసుప్రభువును స్తుతియించెను

కూకుకు.. కూ కు కు…

1. చెట్టు మీద రెండు చిలకలుండెను

యేసుప్రభు ప్రేమను వర్ణించెను

చెడుతనము వలదని బోధించెను

పీపి పి పీ పి పి

2. ఇంటిపైన కోడి పుంజుండెను

అది నిద్ర నుండి మనలను లేపును

సోమరితనం వలదని బోధించెను

కొక్కొరకో కొక్కొరకో కొక్కొరకో

బాలవీరులం బాలవీరులం / Baalaveerulam Baalaveerulam

బాలవీరులం బాలవీరులం

ఈ ప్రపంచానికి యుద్ధ వీరులం

1. సండేస్కూలుకు మేము వెళ్తాము.

చక్కని పాటలు నేర్చుకుంటాము

ఎన్నో క్యాంపులకు హజరౌతాము

ఎన్నో పాఠములు నేర్చుకుంటాము

అయినను సాతానుడు

మమ్ములను మ్రింగాలని చూస్తున్నాడు.

సాతానును ఎదురించుటకు

వాక్యమనే ఖడ్గముతో

ముందుకెళ్ళదం

బలే బలే యేసయ్య / Bale Bale Yesayya

బలే బలే యేసయ్య

బంగారు యేసయ్య

జాలిగల యేసయ్య

చక్కని నా యేసయ్య

1. అద్భుతాలు ఆశ్చర్యాలు

ఎన్నెన్నో చేశావు

నీ మాటతో స్వస్థత

నిను తాకితే స్వస్థత

2. సిలువలో చనిపోయి

మూడవ రోజు లేచినావు

నిను నమ్మితే రక్షణ

నీ సన్నిధే దీవెన

బాలలందరు వేగమే రండి / Baalalandaru Vegame Randi

బాలలందరు వేగమే రండి

యేసయ్య సన్నిధి చేరగ రండి

బైబిల్లో వాక్యాలు నేర్వగ రండి

యేసుని స్తుతియింప ఆశతో రండి

ప్రార్ధన చేయగా పరుగున రండి

పాటలు నాట్యము చేయగ లెండి

విశ్వాస వీరులుగా మారగ రండి

వెలుగైన యేసు

నడువగ రండి

బుద్ధియు జ్ఞానమునుగల బిడ్డను నేను / Buddiyu Gnanamugala Biddanu Nenu

బుద్ధియు జ్ఞానమునుగల బిడ్డను నేను

బుద్ధిగ శుద్ధిగను ఇలలో బ్రతికెదను

1. తండ్రిని తల్లిని ఘనపరతున్‌

ఆనందపరచెదను

చెప్పిన మాటకు ఎదురు చెప్పక

లోబడి యుండెదను (2)

2. జ్ఞానపు మాటలు పలికెదను

జ్ఞానముగా నేనడిచెదను

జ్ఞానము నేనని యేసనెను

యేసే చాలును ఆ యేసే చాలును

బలమైనది స్థిరమైనది దేవుని హస్తం /Balamainadi Sthiramainadi Devuni Hastham

బలమైనది స్థిరమైనది దేవుని హస్తం

బాలలను దీవించిన దక్షిణ హస్తం

కొలత లేని కలత లేని ప్రభుని హస్తం

ముడత లేని మచ్చ లేని యేసుని హస్తం

మట్టిని మనిషిగా మలచిన హస్తం

దైవ రూపం పెట్టిన హస్తం

సూర్యచంద్ర సంద్రాలను ఆపిన హస్తం

సృష్టిక్రమం నిర్వహించే దేవునిహస్తం

బలము లేని చిట్టి చీమలు / Balamu Leni Chitti Cheemalu

బలము లేని చిట్టి చీమలు

లెఫ్ట్‌ రైట్‌ లెఫ్ట్‌

బుద్ధి గలిగి నడుచుకొనెను

వావ్‌ వావ్‌ వావ్‌

నాయకుడెవరు లేకున్నను

లెఫ్ట్‌ రైట్‌ లెఫ్ట్‌

జ్ఞానముతో జీవించెను

వావ్‌ వావ్‌ వావ్‌

క్యూ కట్టి పనికి నడుం కట్టి

ఆహరం నెత్తిని బెట్టి కూడ బెట్టెను

వేసవి కాలం కోత కాలం

కూర్చుకొనెనుజి

శీతాకాలం కష్టకాలం

హాయిగా బ్రతికెను

చకాం చకాం చకాం

చకాం చకాం చకాం

2. గుర్రు పెట్టి నిదుర పోయే

సోమరి మేలుకో

చీమల యొద్దకెళ్ళి బ్రతుకుట నేర్చుకో

క్యూ కట్టి పనికి నడుం కట్టి

ఆహరం నెత్తిని బెట్టి కూడ బెట్టెను (2)

వేసవి కాలం కోత కాలం

కూర్చుకొనెనుజి

శీతాకాలం కష్టకాలం

హాయిగా బ్రతికెను

చకాం చకాం చకాం

చకాం చకాం చకాం