పాత క్రొత్త నిబంధనలందున (సీయోను పిల్లల పాటలు) / Patha krotha nibandanalanduna

… వచనముల భావము వారికి తెలిపెను. లూకా 24:27

1. పాత క్రొత్త నిబంధనలందున – అరవైయారు పుస్తకముల్

    పేర్లు తెలియవలెననిన – దైవ కృపచే విభజించి పాడ వలయున్

2. పాత నిబంధన యందలి గ్రంథముల్-ముప్పది తొమ్మిదియు

    మరి క్రొత్త నిబంధన – యందున ఇరవై-ఏడు పుస్తకములును

3. ఆదికాండము, నిర్గమకాండము, లేవీయుల కాండము,

    సంఖ్యా, ద్వితీయోపదేశ కాండముల్, యెహోషువ,

    న్యాయాధి పతులు, రూతు

4. మొదటి సమూయేలు, రెండు సమూయేలు

    మొదటి రెండు రాజులును

    మరి ఒకటి రెండు దినవృత్తాంతములును, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు,

5. యోబు, కీర్తనలు, సొలొమోను సామెతల్, ప్రసంగి, పరమ గీతము

    యెషయా, యిర్మీయా, విలాపములు, యెహెజ్కేలు,

    దానియేల్, హోషేయా, యోవేలు,

6. ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, మరి హబక్కూకు,

    జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ, చెప్పితి ముప్పై తొమ్మిది

7. మత్తయి, మార్కు, లూకా, యోహాన్, అపొస్తలుల కార్యములు,

    రోమా, ఒకటి, రెండు కొరింథీయులు, గలతీయ, ఎఫెసీయులు

8.  ఫిలిప్పీయు, కొలొస్సయు, ఒక థెస్సలోనికైయ,

    రెండు థెస్సలోని కైయులు

    ఒకటి, రెండు తిమోతి పత్రికలును – తీతు, ఫిలేమోన్ పత్రిక,

9. హెబ్రీయులును, యాకోబు, పేతురు – ఒకటి, రెండు పత్రికలన్

    యోహాను వ్రాసిన పత్రికలు మూడును – యూదా, ప్రకటనయు

10. అరవై ఆరును దేవుని చేత – నీయబడిన వేదము

     దాని మోకాళ్ళ మీద ప్రార్థన తోడ – అనుదినము చదువుడి

పరలోక రాజ్యం చేరాలంటే(సీయోను పిల్లల పాటలు)/ Paraloka Raajyam Cheralante

Our Vision:

Empowered by the holy spirit, the vision of our new Jerusalem ministries is to passionately spread the love and good news of Jesus Christ to our own communities, our country and to the ends of the earth as ambassadors for Jesus Christ.

మా దృష్టి :

తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా అధికారం పొంది, నూతన యేరూషలేము పరిచర్యలు ద్వారా అనేకులను మన స్వంత సమాజాలకు, మన దేశానికి మరియు ప్రభువైన యేసుక్రీస్తునకు రాయబారులుగా భూదింగతముల వరకు యేసుక్రీస్తు ప్రేమను మరియు ఆయన శుభవార్తను ఉద్రేకపూర్వకంగా విస్తరించడం.

Our Mission:

We gather to glorify and praise God gloriously, to hear and respond obediently to what He has commanded.
We are apostles teaching one another in Jesus Christ. Come together in prayer, love, faith, obedience and compassion. 
We are committed to serving as ambassadors to tell others about Jesus Christ. 
we pursue God’s righteousness, justice, and peace in every place and time
Our ministry has no FCRA and no foreign funds. This is totally 100% Indian and indigenous ministry

మా మిషన్ :

మేము దేవునిని మహికరముగా ఘనపరచి, స్తుతించడానికి, ఆయన ఆజ్జాపించినవన్ని వినుటకును మరియు విధేయత కలిగి ప్రతిస్పందించడానికి సమావేశమవుతాము. 
మేము యేసుక్రీస్తు నందు ఒకరినొకరు అపోస్తులుల బోధ. ప్రార్థన, ప్రేమ, విశ్వాసం, విధేయత మరియు కరుణతో కలిసిమెలసియుందుము.
యేసుక్రీస్తును గురించి ఇతరులకు చెప్పడానికి రాయబారులుగా పనిచేయడానికి మేము కట్టుబడి ఉంటాము. 
మేము ప్రతి స్థలమునందు, సమయములలో దేవుని నీతి, న్యాయం, శాంతిని అనుసరిస్తాము 
ప్రార్థన టవర్లు, మ్యాగజైన్ల ద్వారా ఈ మిషన్ నెరవేరుతుంది.
నూతన యేరూషలేము పరిచర్యలు FCRA లేదు మరియు విదేశీ నిధులు లేవు. ఇది పూర్తిగా 100% భారతీయ మరియు స్వదేశీ పరిచర్యలు

ప్రభు యేసు నీ చరణముల (సీయోను పిల్లలు పాటలు) / Prabhu Yesu Nee Charanamulu

…క్రీస్తు మనకోసము శాపమై… గలతీ 3:14

పల్లవి : ప్రభు యేసు నీ చరణముల – చేరినే వచ్చితిని

ఏ సమయమందైనను – చేరి స్తుతించెదను (2)

1.నావంటి ప్రధాన పాపిని – ప్రభువా ప్రేమించితివి (2)

     శపగ్రస్త సీలువలో నాకై – ప్రాణమర్పించితివి            ॥ప్రభు॥

2. నీదు పవిత్ర చేతితో – ప్రభు నను ముట్టితివి

    నీదు పవిత్ర రక్తముతో – ప్రభునను కడిగితివి              ॥ప్రభు॥

3. నీదు అపార ప్రేమను – నేనెట్లు వర్ణించెదా?

    నేనే మర్పింతు దానికైనిలలో – అర్పింతు నా జీవితం   ॥ప్రభు॥

Maseeh… jo hamare liye shraapith bana,… Gal. 3:13

పల్లవి : ప్రభు తుమ్హారే చరణోమే, మై అబ్ ఆతాహు

కోయిఖీ సమయ్ క్యోనహో, మై ఆసక్ తా హు (2)

1. ముజ్ అధమ్ పాపి దుష్ట్ సే – ప్రభుతునే ప్రేమకియా

    శ్రాపిత్ క్రూస్ పర్ మేరేలియే – ప్రభూ తూనే ప్రాణియా             ॥ప్రభు॥

2. తేరే పవిత్ర హాత్ సే – ప్రభు ముఝ చూఆ

    తేరే పవిత్ర లహు సే – తునే ముఝ దోయా                         ॥ప్రభు॥

3. తేరే ఆపార్ ప్రేమ్ కా – వర్జన్ మై కైసే కరూ?

    ఉస్కే బద్ లేమె – క్యా దేసక్తాహు? జీవన్ మై  సౌంప్ తాహూ ॥ప్రభు॥

ప్రార్థన చేయుడి భారంబుతో (సీయోను పిల్లల పాటలు) / Praadhana Cheyudi Bharambutho

…అడుగు ప్రతివాడును పొందును,… మత్తయి 7:8

పల్లవి : ప్రార్థన చేయుడి భారంబుతో – యేసుని వేడుడి అతి ప్రేమతో (2)

1. అడుగుడి నిండు మనస్సుతో (4) అది మీకియ్యబడును   (2) ॥ప్రా॥

2. చిన్నపిల్లల చిన్ని ప్రార్థన (4) యేసుకు అతి ప్రియము      (2) ॥ప్రా॥

పిల్లలము మేమందరము (సీయోను పిల్లల పాటలు) / Pillalamu Memandaramu

అక్కడ అతని నాశీర్వదించెను. ఆది 32:29

పల్లవి : పిల్లలము మేమందరము – నిను స్తుతియింప వచ్చితిమి (1)

          ప్రభువా నీవే నీతిరాజా – ఘనత మహిమ చెల్లింతుము (1)

          పిల్లలము మేమందరము (1)

1. మా పాపములను క్షమియించి – మా కొసగు ఆశీర్వాదం

    సుందర మనోహర స్వర్గములో – మమ్ముల ప్రవేశింపజేయు        ॥పిల్ల॥

    (రెండు సార్లు పాడవలెను)

2. వాక్యము ప్రార్థన సేవలో – మా హృదయమును మార్చుము

    మాదు కాళ్లు చేతులు – వాడుకొనుము నీ మహిమకై                         ॥పిల్ల॥

పండ్రెండు గంటలకు, పండ్రెండు శిష్యులతో (సీయోను పిల్లల పాటలు) / Panenndu Gantalaku Pandrendu Shishyulatho

నేనిచ్చు నీళ్లు… నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గ… యోహా 4:14

పల్లవి : పండ్రెండు గంటలకు, పండ్రెండు శిష్యులతో, (1)

ప్రభువైన క్రీస్తు యేసు – ప్రయాణం చేసెను (1)

సమరయకు వచ్చెను (2)

1. సమరయ స్త్రీ వచ్చెను-సంభాషణ చేసెను – సత్యమును గ్రహించెను

    జీవజలం త్రాగెను-జన్మించెను క్రొత్తగా జనులకు వివరించెను                       ॥ప॥

    (రెండు సార్లు పాడవలెను)

2. పాప బాబు రండి-పాప క్షమ అందరికి-పరిపూర్ణ విమోచన

    ప్రభుయేసు నామంలో-ప్రతియొక్కరికి ఉచితం-నమ్మి నేడే పొందుడి        ॥ప॥

ప్రభుయేసే నిజ ద్రాక్షావల్లి (సీయోను పిల్లల పాటలు)/ Prabhu Yese Nija Drakshavalli

నేను నిజమైన ద్రాక్షావల్లిని…. యోహాను 15:1

1. ప్రభుయేసే నిజ ద్రాక్షావల్లి – ఆయనలో నేనొక తీగెను    (2)

    ఆయనకు వేరుగా నేను – ఏమియు చేయలేను           (2)

    పనికిరాని వన్నిటిని – తీసివేయనిచ్చెదను                (2)

    అధికముగా ఫలించెదను – తండ్రికి మహిమ కలుగుటకె (2)     ॥ప్రభు॥

2. ఆత్మలో ఆనందించుచు – ఫలియించెదనే నీ ఫలమున్

    ప్రేమ సంతోషము సమాధానం – దీర్ఘశాంత దయాళుత్వము

    మంచితనము విశ్వాసము – సాత్వికము ఆశానిగ్రహమున్                 ॥ప్రభు॥

3. ప్రభువునకు తగినట్లుగా – నడిచెదను ప్రతి విషయములో

    మారు మనస్సుకు తగినట్లుగా – అత్యధికముగా ఫలియించెదను     ప్రభువు కృపలో ఎదిగెదను – ప్రభు రాకను నిరీక్షించుచు                   ॥ప్రభు॥

పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్(సీయోను పిల్లల పాటలు) / Patimpa Shresta Grandham Bible  

….ఈ ప్రవచనవాక్యములు చదువువాడును,… గైకొనువారును… ధన్యులు. ప్రకటన 1:3

పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్                      (2)

అనుదినము పఠించిన – ప్రేమ తోడ నడుపును (1)

ఓ! పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్                  (1)

Blessed is he that readeth,… Rev 1:3

The best book to read is the Bible        (2)

If you read it every day                          (1)

It will help you all the way                     (1)

Oh! The best book to read is the Bible (2)

దునియామె సబ్సై ప్యారీ పుస్తక్ బైబిల్     (2)

పడే జౌ ఇస్ కో రోజ్ -పర్-రోజ్            (1)

మార్గ్ మె ఖతరా కోయి న హో             (1)

ఓ! దునియామె సబ్ సె ప్యారీ పుస్తక్ బైబిల్ (1)

వాసిక్క సిరంద పు సగం వేదం (2)

అన్ద్రడుమ్ నివాసితాల్ (1)

కున్ద్రమల్ నడత్తుమే(1) ఆమ్ వాసిక్క సిరంద పుస్తగం వేదం (2

ఆ ఉత్తమ పుస్తక బైబిల్ (2)

దీన దీన ఓదువె            (1)

ఆత్మ శుద్ధి హొంధువె     (1)

ఆ ఉత్తమ పుస్తక బైబిల్ (1)

ప్రభువుకు తగినట్లు – పృథివిలో ప్రియుడా (సీయోను పిల్లల పాటలు)/ Prabhuvunaku Thaginattlu Pruthvilo Priyudaa

(ప్రభువునకు) ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను… కొలొస్స 1:12

పల్లవి : ప్రభువుకు తగినట్లు – పృథివిలో ప్రియుడా (2)

          పదిలముగా జీవించవా!

1. ఆదామవ్వల వలె నీవు సహ – కేవలము దిగంబరివై యుండ (2)

    ఆ దేవ గొర్రెపిల్ల చావొంది సిలువలో

    పావన వస్త్రముల నిచ్చెన్ (2)                                 ॥ప్ర॥

2. శ్రేష్ఠబలినిచ్చి హేబెలు – సృష్టికర్త యొక్క సాక్ష్యము పొందె

    అట్టి సాక్ష్యము పొందను అవనిలో ప్రియుడా

    హతసాక్షిగా నీ వుండెదవా?                                           ॥ప్ర॥

3. ప్రభు యడుగుజాడలను పరికించి-ప్రభుకనుకూలంబుగ నడచినచో

    హనోకువలె ఆ రెండవ మరణము

    నొందక ప్రభుతో నుండెదవు                                            ॥ప్ర॥

4. పరిశుద్ధమైన ప్రవర్తనతో – ప్రభు సర్వాంగ కవచమున్ కల్గి

    నీతిని ప్రకటించిన నోవహున్ బోలి

    ఖ్యాతి సువార్తను చాటు మిలన్                                        ॥ప్ర॥

5. మృతులను సహలేపు మహాత్ముడని – తన సుతునర్పించే నబ్రహాము ॥

     మృతికి లోనగు నీ శరీరంబును అతనికే బలిగా నర్పించు       ॥ప్ర॥

6. తన తండ్రి ఖడ్గముకు ఇస్సాకు – మౌనమున్ జూపి మరణము గోరె

    కడు శ్రమకాలములో ఖండించే ఖడ్గము-ముంగిట నీవట్లుండెదవా ॥ప్ర॥

7. యెహోవ భయము నొంది యోసేపు ఎంత వైభవమనుభవించెనో గాంచు

    నీ జీవితంబులో దైవభయము నొంది-అక్షయ కిరీటము బొందు ॥ప్ర॥

పాట పాడనా ప్రభువు పాట పాడనా / Paata Paadana Prabhu Paata Paadana

పాట పాడనా ప్రభువు పాట పాడనా

ఏలాగు పాడను ఏమని పాడను

1. ఎందరికో మేలు చేసిన చేతులలో

అందరి యొద్దకు నడచిన పాదములలో

మెత్తనైన పాదములలో మేకులు

మృదువైన చేతులలో చీలలు

ముఖము పై ఉమ్మి వేయబడినదా

శిరముపై ముండ్ల మకుటమున్నదా

ప్రేమ పంచిన యేసు హృదయము

పగులగా కారెను రక్తము

నా కొరకై పొందెనే శ్రమలన్నియు

నన్ను ప్రేమతో క్షమించి రక్షించెను