కాల్బలమందు చేరక యున్నను / Kalbalamandu Cheraka Yunnanu

క్రీస్తుయేసుయొక్క మంచి సైనికుడు… 2 తిమోతి 2:3

కాల్బలమందు చేరక యున్నను,                   (1)

సవారి చేయక కాల్చక పోయిన,                  (1)

విమాన దళమున ఎగురకయున్నను          (1)

యేసుని వీరుడను (1) నేనేసుని వీరుడను(2)

…a good soldier of Jesus Christ. 2 Tim. 2:3

I may never march in the infantry,    (1)

Ride in the cavalry, shoot in artillery               (1)

I may never fly over my enemy                            (1)

But I am in the Lord\’s army                    (1)

I am in the Lord\’s army, Yes, Sir         (1)

I am in the Lord\’s army                                             (1)

(Repeat above 4 lines)

స్తుతింతున్ ప్రభునే జై యంచు (సీయోను పిల్లల పాటలు) / Sthuthinthun Prabhune Jai Yanchu

మన యతిక్రమక్రియలనుబట్టి… (క్రీస్తు) గాయపరచబడెను. యెషయా 53:5

పల్లవి : స్తుతింతున్ ప్రభునే జై యంచు                        (2)

1.మరువజాల ఆ దృశ్యము ప్రభు యేసువా                   (1)

    కల్వరిలో నీవే సిల్వన్ – వ్రేలాడితివా దర్గా కి              (1)

    కాళ్లు చేతులు శరీరమంతా – గాయపర్చబడితివా        (2)

    గ్రహించితి నివియన్నియు – నా పాపము వలనే         (2) ॥స్తుతి॥

2. మరువజాల నేనో దేవా – నీదు ప్రేమను          (1)

    ఓర్చె శిక్ష నీ పుత్రుడే – అతి ఘనంబుగా           (1)

   నాదు పాప క్రయమునంత – కల్వరి పై చెల్లించెను       (2)

   నే గాంచితి నిన్నే సిల్వన్ – పొందితి రక్షణ                 (2) ॥స్తుతి॥

Paranthu wah hamare hee apraadhon ke kaaran ghaayal kiyaa gayaa,… Isaiah 53:5

Cho : Stuti ho Prabhu ki jai kar (2)

1. Bhulunga nahin us drisya ko – Prabhu Yishu ke             (1)

    Tangaya gaya tha Prabhu – Krus par kalvary ke            (1)

    Sari deh aur hath paun bhi – Chot he chot se purna the (2)

    Mujhe yad ai iska karan, aparad hi tha mere (2) IIStutill

2. Bhulunga nahin us wachan ko – Prabhu Yeshu ke

    Kaha tha krus par Yishu ne – Prem se adra ho ke

    Pap ka rin aur pap ka dand – Maine uthaya tere liye

    Kamaya uddhar maine yahan – Hai yah tere liye IIStutill

నాకు జీవమై ఉన్న / Naaku Jeevamai Unna

పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesley

నాకు జీవమై ఉన్న నా జీవమా
నాకు ప్రాణమై ఉన్న నా ప్రాణమా
నాకు బలమై ఉన్న నా బలమా
నాకు సర్వమై ఉన్న నా సర్వమా
నీ నామమే పాడెదన్ నా జీవిత కాలమంతా
నీ ధ్యానమే చేసెద నా ఊపిరి ఉన్నంత వరకు          ||నాకు జీవమై||

పూజ్యుడవు… ఉన్నత దేవుడవు
యోగ్యుడవు… పరిశుద్ధ రాజువు (2)
నా ఆరాధన నా ఆలాపన
నా స్తుతి కీర్తన నీవే
నా ఆలోచన నా ఆకర్షణ
నా స్తోత్రార్పణ నీకే           ||నాకు జీవమై||

నాయకుడా… నా మంచి స్నేహితుడా
రక్షకుడా… నా ప్రాణ నాథుడా (2)
నా ఆనందము నా ఆలంబన
నా అతిశయము నీవే
నా ఆదరణ నా ఆశ్రయము
నా పోషకుడవు నీవే          ||నాకు జీవమై||

పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesley

విధేయులం విధేయులం యేసు పిల్లలం / Vidheyulam Vidheyulam Yesu Pillalam

విధేయులం విధేయులం యేసు పిల్లలం

అజేయులం అజేయులం

విజయముతో ముందుకెళ్ళెదం

ఆజ్ఞను మీరము పాపము చేయము

ఆదాములా పాపము కప్పుకొనము

అమ్మకు నాన్నకు లోబడుతాము

ప్రార్ధన వాక్యము నేర్చుకుంటాము

నీ కృప ఆకాశముకంటె ఎత్తైనది / Nee Krupa Aakashamukante Ethainadi

నీ కృప ఆకాశముకంటె ఎత్తైనది

మహా సముద్రముకంటె లోతైనది

ఎల్లకాలము మాపై నిలచునది

హల్లెలూయ హల్లెలూయ

హల్లెలూయ హల్లెలూయ

సుందరమైన దేహాలెన్నో / Sundaramaina Dehaalenno

సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా?
అంబరమంటిన రాజులెందరో అలిసిపోలేదా?
కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా?
ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా?
ఏదీ శాశ్వతం కాదేది శాశ్వతం
తరచి చూడుము పరికించి చూడము (2)       ||సుందరమైన||

నెత్తుటి చారలను లిఖించిన రాజులెందరో
ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు
అధికార దాహంతో మదమెక్కిన వీరులు
సమాధి లోతుల్లోనే మూగబోయారు (2)
తపోబలము పొందిన ఋషులందరూ
మతాధికారులు మఠాధిపతులు
ఈ కాలగర్భంలోనే కలసిపోయారు
మరణ పిడికళ్లలో బందీలయ్యారు (2)
యేసులేని జీవితం వాడబారిన చరితం (2)
క్రీస్తు ఉన్న జీవితం భువిలో చరితార్ధం (2)       ||సుందరమైన||

ప్రాణం పోసిన దైవాన్ని కాదంటే
ఆ జీవితానికి పరమార్ధం ఉంటుందా?
పాప సంకెళ్ళలో బందీలైనవారికి
ఆ దివ్య మోక్షం చేరుకొనే భాగ్యం ఉంటుందా? (2)
శరీరాన్ని విడిచిన మనుష్యాత్మకు
మరో జీవితం లేదనుట భావ్యమా?
రక్తము కార్చిన యేసుని విస్మరించి
ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా? (2)
యేసులేని జీవితం అంధకార భందురం (2)
క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం (2)       ||సుందరమైన||

Sundaramaina Dehaalenno Shithilam Kaaledhaa?
Ambaramantina Raajulendharo Alisipoledhaa?
Kalamulu Pattina Kavulu Endaro Kanumarugavaledhaa?
Dharanilona Dhanikulellaru Dhahanam Kaaledhaa?
Edhi Shaashwatham Kaadhedhi Shaashwatham
Tharachi Choodumu Parikinchi Choodumu (2)      ||Sundaramaina||

Netthuthi Chaaralanu Likhinchina Raajulendharo
Aa Netthurulone Praanaalu Vidichipoyaaru
Adhikaara Dhaahamtho Madhamekkina Veerulu
Samaadhi Lothullone Moogaboyaaru (2)
Thapo Balamu Pondhina Rushulandharu
Mathaadhikaarulu Mataadhipathulu
Ee Kaala Garbhamlone Kalasipoyaaru
Marana Pidikallalo Bandheelayyaaru (2)
Yesu Leni Jeevitham Vaadabaarina Charitham (2)
Kreesthu Unna Jeevitham Bhuvilo Charithaardham (2)      ||Sundaramaina||

Praanam Posina Daivaanni Kaadhante
Aa Jeevithaaniki Paramaardham Untundhaa?
Paapa Sankellalo Bandheelaina Vaariki
Aa Divya Moksham Cherukone Bhaagyam Untundhaa? (2)
Shareeraanni Vidichina Manushyaathmaku
Maro Jeevitham Ledhanuta Bhaavyamaa?
Rakthamu Kaarchina Yesuni Vismarinchi
Ee Srushtini Poojinchuta Manishiki Nyaayamaa? (2)
Yesu Leni Jeevitham Andhakaara Bhandhuram (2)
Kreesthu Unna Jeevitham Thejomaya Mandhiram (2)      ||Sundaramaina||

ఆరాధించెదం ఆర్భాటించెదం/ Aaraadhinchedam Aarbhaatinchedam

పాట రచయిత: ఫిలిప్ గరికి

ఆరాధించెదం ఆర్భాటించెదం – యేసుని సన్నిధిలో
ఆనందించెదం మరల ఆనందించెదం – దేవుని సన్నిధిలో
సాయంకాల నైవేద్యము వలె చేతులెత్తి స్తుతియించెదం
జిహ్వా ఫలము ప్రభుకర్పించి స్తుతి గీతము పాడెదము
యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా
యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా

యెరికో కోట గోడలన్ని కూలిపోయే – కాలిపోయే
ఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా – ఆర్భాటించగా
స్తుతులపై ఆసీనుడా యేసయ్యా
మా ప్రార్ధనలు ఆలకించువాడా
స్తుతియాగము చేయు వాడే
నిన్ను మహిమ పరచు వాడు       ||యేసయ్యా||

యూదా దేశము మీదికి శత్రు సైన్యము – దండెత్తగా
యెహోషాపాతు తన ప్రజలతో స్తుతియించగా – స్తోత్రము చేయగా
దేవుడే యుద్ధము జరిపెను
అద్భుత జయమును పొందిరి
బెరాకా లోయలో కూడిరి
కృతజ్ఞతా స్తుతులు చెల్లించిరి       ||యేసయ్యా||

Lyricist: Philip Gariki

Aaraadhinchedam Aarbhaatinchedam – Yesuni Sannidhilo
Aanandinchedam Maralaa Aanandinchedam – Devuni Sannidhilo
Saayankaala Naivedyamu Vale Chethuletthi Sthuthiyinchedam
Jihwaa Phalamu Prabhukarpinchi Sthuthi Geethamu Paadedamu
Yesayyaa Yesayyaa Parishuddhudavu Neevenayyaa
Yesayyaa Yesayyaa Sthuthulaku Arhuda Neevenayyaa

Eriko Kota Godalanni Koolipoye – Kaalipoye
Ishraayelu Prajalanthaa Koodi Aaraadhinchagaa – Aarbhaatinchagaa
Sthuthulapai Aaseenuda Yesayyaa
Maa Praardhanalu Aalakinchuvaadaa
Sthuthiyaagamu Cheyu Vaade
Ninnu Mahima Parachu Vaadu       ||Yesayyaa||

Yoodaa Deshamu Meediki Shathru Sainyamu – Dhandetthagaa
Yehoshaapaathu Thana Prajalatho Sthuthiyinchagaa – Sthothramu Cheyagaa
Devude Yuddhamu Jaripenu
Adbhutha Jayamunu Pondiri
Berakaa Loyalo Koodiri
Kruthagnathaa Sthutulu Chellinchiri       ||Yesayyaa||

కన్నుల నిండుగ / Kannula Ninduga

కన్నుల నిండుగ – క్రిస్మస్ పండుగ
గుండెల నిండుగ – ఆనందముండుగ (2)
పరమ పురినుండే – పరిశుద్ధ దేవుడు
పుడమిలో పుట్టెగా – పాపుల బ్రోవగ
మహిమలోనుండే – మహిమాత్ముండు
మనుజుడాయెగా – మరణము నొందగా
రండి చేరి కొలిచెదం – రారండి కలసి పాడుదాం
రండి యేసుననుసరించుదాం – పదండి ప్రభుని చూపించుదాం (2)

సర్వసృష్టిని మాటతో చేసిన – సార్వభౌముడా నీకు సముడెవ్వరయ్యా
లోకపాపమంతయూ మోయవచ్చిన – దైవమానవా నీకు స్థలమే లేదయ్యా (2)
చీకటినుండి వెలుగునకు – మరణమునుండి జీవముకు (2)
నడిపింప వచ్చిన నజరేయుని – దాటింప వచ్చిన దయామయుని
ప్రేమించి వచ్చిన ప్రేమామయుని – క్షమియించ వచ్చిన క్షమాపూర్ణుని      ||రండి||

విశ్వమంతయూ వ్యాపించియున్న – సర్వవ్యాపి నీవులేని చోటే లేదయ్యా
అంతరంగమంతయూ ఎరిగియున్న – సర్వజ్ఞాని నీకు సాటే లేరయ్యా (2)
దాస్యము నుండి స్వాతంత్ర్యమును – శాపము నుండి విడుదలను (2)
ప్రకటింప వచ్చిన పుణ్యాత్ముని – రక్షింప వచ్చిన రక్షకుని
శాంతిచేయ వచ్చిన శాంతమూర్తిని – విడిపింప వచ్చిన విమోచకుని      ||రండి||

ఊహకందని త్రియేకమైయున్న – అద్వితీయుడా నీవే ఆత్మరూపివయ్యా
నిన్న నేడు రేపు ఏకరీతిగున్న – నిత్యనివాసి నీకు అంతమే లేదయ్యా (2)
సంకెళ్ళనుండి సంబరానికి – ఉగ్రతనుండి ఉదాత్తతకు (2)
తప్పింప వచ్చిన త్యాగమూర్తిని – కనికరింప వచ్చిన కరుణశీలుని
కృపజూపవచ్చిన కృపాకరుని – దాపుచేరనిచ్చిన దాక్షిణ్యపూర్ణుని      ||రండి||

Kannula Ninduga – Christmas Panduga
Gundela Ninduga – Aanandamunduga (2)
Parama Purinunde – Parishuddha Devudu
Pudamilo Puttegaa – Paapula Brovaga
Mahimalo Nunde – Mahimaathmundu
Manujudaayegaa – Maranamu Nondagaa
Randi Cheri Kolichedam – Raarandi Kalai Paadudaam
Randi Yesunanusarinchudaam – Padandi Prabhuni Choopinchudaam (2)

Sarva Srushtini Maatatho Chesina – Saarvabhoumudaa Neeku Samudevvarayyaa
Loka Paapamanthayu Moya Vachchina – Daiva Maanavaa Neeku Sthalame Ledayyaa (2)
Cheekati Nundi Velugunaku Maranamu Nundi Jeevamuku (2)
Nadipimpa Vachchina Najareyuni – Daatimpa Vachchina Dayaamayuni
Preminchi Vacchina Premaamayuni – Kshamiyincha Vachchina Kshamaapoornuni          ||Randi||

Vishwamanthayu Vyaapinchuyunna – Sarva Vyaapi Neevu Leni Chote Ledayyaa
Antharangamanthayu Erigiyunna – Sarva Gnaani Neeku Saate Lerayyaa (2)
Daasyamu Nundi Swaathanthryamunu – Shaapamu Nundi Vidudalanu (2)
Prakatimpa Vachchina Punyaathmuni – Rakshimpa Vachchina Rakshakuni
Shaanthi Cheya Vachchina Shaanthamoorthini – Vidipimpa Vachchina Vimochakuni          ||Randi||

Oohakandani Thriyekamaiyunna – Advitheeyudaa Neeve Aathmaroopivayyaa
Ninna Nedu Repu Ekareethigunna – Nithya Nivaasi Neeku Anthame Ledayyaa (2)
Sankella Nundi Sambaraaniki – Ugratha Nundi Udaatthathaku (2)
Thappimpa Vachchina Thyaagamoorthini – Kanikarimpa Vachchina Karunasheeluni
Krupa Joopa Vachchina Krupaakaruni – Daapu Cheranichchina Daakshinya Poornuni          ||Randi||