ఇవ్వాలి ఇవ్వాలి యేసుకు ఇవ్వాలి
మనకున్నవన్ని ఆయనవే
ఆయనకే తిరిగివ్వాలి
అ.ప.: చిన్ని పాప ఓ చిన్నారి పాప
చిన్ని బాబు ఓ చిన్నారి బాబు
1. ఐదు వేలమందికి
పంచాడు ఆనాడేసయ్య
ఐదు రొట్టెలు రెండు చేపలు
అధికంగా దీవించాడు.
అవి ఇచ్చిందెవరు
నీలాంటి తమ్ముడు
2. ఏడుసార్లు మునిగెను
ఎంతగానో మురిసెను
రోగమంత నయమై
నయమాను రక్షణ పొందెను
నడిపించిందెవరు
నీలాంటి చెల్లెలు
ఇసుక మీద ఇల్లు కట్టకు
అది కూలిపోతుంది (2)
వాన కురిసి వరద వస్తే
గాలి తోడై విసిరి కొడితే (2)
మాట వినని వాని ఇల్లు
కూలిపోయెను
లోబడని వాని
ఇల్లు కూలిపోయెను
వాని సొగసైన ఇల్లు కూలిపోయెను
1. బండ మీద ఇల్లు కట్టుకో
అది స్థిరముగా ఉంటుంది(2)
వాన కురిసి వరద వస్తే
గాలి తోడై విసిరి కొడితే (2)
మాట వినిని వాని ఇల్లు ధీటుగుండెను
లోబడిని వాని ఇల్లు మేటిగుండెను
వాని సొగసైన ఇల్లు నిలిచియుండెను
2. జోరు వాన హోరు గాలి వరదపోటు
ఆ ఇంట ముంగిట తెల్ల బోయెగ
బండ మీద ఇల్లు కట్టి
సాటి లేదని చాటి చెప్పి (2)
బండైన యేసు మీద నీ బ్రతుకు
ఇంటిని కట్టుకోవయ్యా
బండైన యేసు మీద నీ బ్రతుకు
ఇంటిని కట్టుకోవమ్మా
చావు వద్ద తీర్పు వద్ద
కూలి పోని కాలి పోని (2)
నిత్యం జీవం పొంద రావయ్యా
సజీవుడైన యేసు దేవుని స్వీకరించయ్యా
నిత్యం జీవం పొంద రావమ్మా సజీవుడైన యేసు దేవుని స్వీకరించమ్మా
ఇద్దరు ముగ్గురు కూడినచోట
ఉంటానన్నాడు దేవుడు
విశ్వాసముతో అడిగినవన్నీ
ఇస్తానన్నాడు యేసుడు
1. ఆయన రాజ్యమును
నీతిని వెదకిన
ఇష్టమైనవన్నీ అనుగ్రహిస్తాడు.
2. ఆవగింజయంత నమ్మకం ఉంచిన
మహా కొండలైన పెరికి వేస్తాడు.
ఇవిగో ఇవిగో మా స్తుతులు
యేసూ నీకే కృతజ్ఞతలు
నీవు మాకిచ్చిన సర్వముకై
నీకివియే మా స్తుతులు ॥ఇవి॥
1. పరిమళమిచ్చు పువ్వులకై
నీకివియే మా స్తుతులు
మా నోట నుంచిన నవ్వులకై
నీకివియే మా స్తుతులు
కిలకిల రావపు పక్షులకై
నీకివియే మా స్తుతులు
కలకాలముండు రక్షణకై
నీకివియే మా స్తుతులు ॥ఇవి॥
2. మా మంచి అమ్మనాన్నలకై
నీకివియే మా స్తుతులు
గాలి వెలుతురు వెన్నెలకై
నీకివియే మా స్తుతులు
ఆరోగ్యం తెలివి తేటలకై
నీకివియే మా స్తుతులు
పరిశుద్ధ గ్రంథపు మాటలకై
నీకివియే మా స్తుతులు ॥ఇవి॥
ఇది దేవుడు మనకిచ్చిన దినము
ఉత్సాహముతో స్తుతి పాడెదము
ఆ దేవుని చేతి పని మనము
తన సేవలో సాగుట ఘనము
1. దేవుడు ఇచ్చెను ప్రతి క్షణము
ఎంతో విలువని గమనించుము
దేవుడు మెచ్చెను ప్రతిదినము
ఆయన మహిమ కొరకు వాడుము
ఇదే దినం ఇదే దినం
ప్రభు చేసినది ప్రభు చేసినది.
ఉత్సాహం ఉత్సాహంచి
స్తుతి పాడెదము స్తుతి పాడెదము
ఇదే దినం ప్రభు చేసినది
ఉత్సాహంచి స్తుతి పాడెదము
ఇదే దిన ఇదే దినం
ప్రభు చేసినది.
ఇదే త్రోవ నడువరా
లేదు వేరే దారిరా
మార్గములన్ని మోసమురా
మార్గము యేసే కదలిరా (2)
అటు ఇటు పోవద్దురా
ఎటూ లేదుగ శాంతిరా
రంగురంగుల లోకమురా
హంగులతో నిన్ను రమ్మనురా ॥ఇదే॥
భక్తులు నడచి వెళ్ళారు.
ముక్తికి బైబులే బాటరా
యుక్తి సాతానును విడచిరా
భక్తితో యేసును చేరగరా ॥ఇదే॥
ఇది ధర్మము యేసు మర్మము
ఇదియే నా తీర్మానము
అమ్మకు నాన్నకు లోబడుతా
దీర్ఘాయువును పొందుతా
అమ్మ కొట్టినా నాన్న తిట్టినా
అంగీకరిస్తాను
సొగసైన మాలిక హారముగా
సన్మానిస్తాను
ఇది ధర్మము యేసు మర్మము
ఇదియే నా తీర్మానము
అమ్మకు నాన్నకు లోబడుతా
దీర్ఘాయువును పొందుతా
అమ్మ కొట్టినా నాన్న తిట్టినా
అంగీకరిస్తాను
సొగసైన మాలిక హారముగా
సన్మానిస్తాను