ఆదిలో మన దేవుడు – భూమి ఆకాశంబుల సృజియించెను (సీయోను పిల్లల పాటలు) / Aadi Lo Mana Devudu-Bhoomi Akashambula Srujinchenu

… సమస్త సమూహమును… దేవుడు… యేడవదినములోగా సంపూర్తిచేసి,… ఆది 2:1,2

పల్లవి : ఆదిలో మన దేవుడు – భూమి ఆకాశంబుల సృజియించెను (2)

1. శూన్యము నుండి సృష్టిని చేసే – చీకటిని వెలుగుగ మార్చెను (2)

    సూర్య చంద్ర నక్షత్రములను తన నోటి మాటతో సృజియించెను(1) ॥ఆ॥

2. అడవి పువ్వులను ఆకాశపక్షులను

    జల చరముల సృజియించెను తన వాక్కుతో(2)

    తన స్వరూపము నందు నరులను సృజియించె

    ఆరు రోజులలో సంపూర్ణము చేసెను(2) ॥ఆ॥

3. ఏడవ దినమును పరిశుద్ధ పరచి – ఆ దినమును ఆశీర్వదించే     ఆత్మతో సత్యముతో ఆరాధించి – ఆనందించుమనే మనదేవుడు ॥ఆ॥

ప్రేమించు దేవుడు / Preminchu Devudu

ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు
పాలించు దేవుడు – యేసు దేవుడు
పాటలు పాడి ఆనందించెదం
ఆహా ఎంతో ఆనందమే (2)       ||ప్రేమించు||

తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు
ప్రతి అవసరమును తీర్చు దేవుడు (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు
తోడు నీడగా నన్ను కాపాడును (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు
సర్వ కాలమందు జయమిచ్చును (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు
అంతము వరకు చేయి విడువడు (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

Preminchu Devudu Rakshinchu Devudu
Paalinchu Devudu – Yesu Devudu
Paatalu Paadi Aanandinchedam
Aaha Entho Aanandame (2)      ||Preminchu||

Thallidandrula Kannaa Thaatha Aina Devudu
Prathi Avasarmunu Theerchu Devudu (2)
Hallelooyaa Aanandame
Santhoshame Samaadhaaname (2)        ||Preminchu||

Nannu Swasthaparachi Shakthinichchu Devudu
Thodu Needaga Nannu Kaapaadunu (2)
Hallelooyaa Aanandame
Santhoshame Samaadhaaname (2)        ||Preminchu||

Ninna Nedu Ekareethiga Unnaadu
Sarva Kaalamandu Jayamichchunu (2)
Hallelooyaa Aanandame
Santhoshame Samaadhaaname (2)        ||Preminchu||

Ellavelalaa Nannu Nadipinche Devudu
Anthamu Varaku Cheyi Viduvadu (2)
Hallelooyaa Aanandame
Santhoshame Samaadhaaname (2)        ||Preminchu||

ప్రభు యేసుని వదనములో / Prabhu Yesuni Vadanamulo

ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2)
పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2)
పరలోకముకై – చిర జీవముకై (2)
ప్రార్ధించెను నా హృదయం             ||ప్రభు యేసుని||

దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2)
దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2)
ధన పీడనతో – మృగ వాంఛలతో (2)
దిగాజారితి చావునకు              ||ప్రభు యేసుని||

యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2)
ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని (2)
ఇల వేడితిని – విలపించుచును (2)
ఈడేరెను నా వినతి             ||ప్రభు యేసుని||

పరదైసున ఈ దినమే – నా ఆనందములోను (2)
పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే (2)
పరలోకమే నా – తుది ఊపిరిగా (2)
పయనించితి ప్రభు కడకు          ||ప్రభు యేసుని||

Prabhu Yesuni Vadanamulo – Naa Devudu Kanipinche (2)
Paapaathmula Brochutakai – Krupalolikina Kaluvarilo (2)
Paralokamukai – Chira Jeevamukai (2)
Praardhinchenu Naa Hrudayam        ||Prabhu Yesuni||

Dishalanniyu Thirigithini – Naa Paapapu Daahamutho (2)
Doushtyamulo Masaluchunu – Dourjanyamu Cheyuchunu (2)
Dhana Peedanatho – Mruga Vaanchalatho (2)
Digajaarithi Chaavunaku                ||Prabhu Yesuni||

Yesu Nee Raajyamulo – Bhuvi Kethenchedi Roju (2)
Ee Paapini Kshamiyinchi – Gnaapakamutho Brovumani (2)
Ila Vedithini – Vilapinchuchunu (2)
Eederenu Naa Vinathi                    ||Prabhu Yesuni||

Paradaisuna Ee Diname – Naa Aanandamulonu (2)
Paalgonduvu Neevanuchu – Vaagdhaanamu Cheyagane (2)
Paralokame Naa – Thudi Oopirigaa (2)
Payaninchithi Prabhu Kadaku        ||Prabhu Yesuni||

నేడే ప్రియరాగం / Nede Priyaraagam

నేడే ప్రియరాగం పలికే నవ గీతం
ప్రేమే మన కోసం వెలసే
లోకాన శాంతి మురిసింది
మన మనసుల్లో రాగాల కాంతి విరిసింది        ||నేడే||

దివినేలు దేవుడు ఉదయించగానే
ఇలలోన ప్రకృతి పులకించెగా
పరలోక దూతలు స్తుతియించగానే
జగమంతా ఉప్పొంగి నర్తించెగా           ||నేడే||

మనిషైన సుతుడు జనియించగానే
విశ్వాన గోళాలు విభవించెగా
చిన్నారి యేసుని చిరునవ్వుతోనే
నవ కాంతి లోకాన ప్రభవించెగా        ||నేడే||

హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
హ్యాప్పీ క్రిస్మస్ టు యు…
లోకాన శాంతి మురిసింది
మన మనస్సులో రాగాల కాంతి విరిసింది

Nede Priyaraagam Palike Nava Geetham
Preme Mana Kosam Velase
Lokaana Shaanthi Murisindi
Mana Manasullo Raagaala Kaanthi Virisindi       ||Nede||

Divinelu Devudu Udayinchagaane
Ilalona Prakruthi Pulakinchegaa
Paraloka Doothalu Sthuthiyinchagaane
Jagamanthaa Uppongi Narthinchegaa       ||Nede||

Manishaina Suthudu Janiyinchagaane
Vishwaana Golaalu Vibhavinchegaa
Chinnaari Yesuni Chirunavvuthone
Nava Kaanthi Lokaana Prabhavinchegaa        ||Nede||

Happy Christmas Merry Christmas
Happy Christmas to you…
Lokaana Shaanthi Murisindi
Mana Manasullo Raagaala Kaanthi Virisindi

నింగిలో దేవుడు / Ningilo Devudu

నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు
ఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు (2)
చెంత చేరి సంతసించుమా (2)
స్వంతమైన క్రీస్తు సంఘమా        ||నింగిలో||

పాపాల పంకిలమై శోకాలకంకితమై
మరణించి మన కోసం కరుణించి ఆ దైవం (2)
దీన జన రక్షకుడై దేవ దేవుని సుతుడై (2)
జన్మించె నీ కోసం ధన్యము చేయగా (2)      ||నింగిలో||

సాతాను శోధనలే శాపాల వేదనలై
విలపించే దీనులకై అలరించు దీవెనలై (2)
శరణమై ఉదయించే తరుణమౌ ఈ వేళ (2)
గుండె గుడి పానుపులో చేర్చుకొన రావేల (2)      ||నింగిలో||

Ningilo Devudu Ninu Chooda Vachchaadu
Aa Neethi Sooryudu Shree Yesu Naadhudu (2)
Chentha Cheri Santhasinchumaa (2)
Swanthamaina Kreesthu Sanghamaa        ||Ningilo||

Paapaala Pankilamai Shokaalakankithamai
Maraninchi Mana Kosam Karuninchi Aa Daivam (2)
Deena Jana Rakshakudai Deva Devuni Suthudai (2)
Janminche Nee Kosam Dhanyamu Cheyagaa (2)      ||Ningilo||

Saathaanu Shodhanale Shaapaala Vedanalai
Vilapinche Deenulakai Alarinchu Deevenalai (2)
Sharanamai Udayinche Tharunamau Ee Vela (2)
Gunde Gudi Paanupulo Cherchukona Raavela (2)      ||Ningilo||

నిన్ను కాపాడు దేవుడు / Ninnu Kaapaadu Devudu

పాట రచయిత: క్రాంతి చేపూరి

నిన్ను కాపాడు దేవుడు
కునుకడు నిదురపోడు – నిదురపోడు
వాగ్ధానమిచ్చి మాట తప్పడు
నమ్మదగినవాడు – నమ్మదగినవాడు
భయమేల నీకు – దిగులేల నీకు (2)
ఆదరించు యేసు దేవుడు ఉండగా          ||నిన్ను కాపాడు||

శత్రు బలము నిన్ను చుట్టుముట్టినా
శోధనలలో – నిన్ను నెట్టినా (2)
కోడి తన పిల్లలను కాచునంతగా
కాపాడు దేవుడు నీకు ఉండగా (2)
భయమేల నీకు – దిగులేల నీకు (2)
కాపాడు గొప్ప దేవుడు ఉండగా          ||నిన్ను కాపాడు||

రోగ భారమందు లేవకున్ననూ
వ్యాధులు నిన్ను కృంగదీసినా (2)
చనిపోయిన లాజరును తిరిగి లేపిన
స్వస్థపరచు దేవుడు నీకు ఉండగా (2)
భయమేల నీకు – దిగులేల నీకు (2)
స్వస్థపరచు సత్య దేవుడు ఉండగా          ||నిన్ను కాపాడు||

Lyricist: Kranthi Chepuri

Ninnu Kaapaadu Devudu
Kunukadu Nidurapodu – Nidurapodu
Vaagdhaanamichchi Maata Thappadu
Nammadaginavaadu – Nammadaginavaadu
Bhayamela Neeku – Digulela Neeku (2)
Aadarinchu Yesu Devudu Undagaa            ||Ninnu Kaapaadu||

Shathru Balamu Ninnu Chuttumuttinaa
Shodhanalalo – Ninnu Nettinaa (2)
Kodi Thana Pillalanu Kaachunanthagaa
Kaapaadu Devudu Neeku Undagaa (2)
Bhayamela Neeku – Digulela Neeku (2)
Kaapaadu Goppa Devudu Undagaa            ||Ninnu Kaapaadu||

Roga Bhaaramandu Levakunnanoo
Vyaadulu Ninnu Krungadeesinaa (2)
Chanipoyina Laazarunu Thirigi Lepina
Swasthaparachu Devudu Neeku Undagaa (2)
Bhayamela Neeku – Digulela Neeku (2)
Swasthaparachu Sathya Devudu Undagaa            ||Ninnu Kaapaadu||

న్యాయాధిపతి అయిన దేవుడు / Nyaayaadhipathi Aina Devudu

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

న్యాయాధిపతి అయిన దేవుడు
నిను తీర్పు తీర్చేటి వేళలో
ఏ గుంపులో నీవుందువో
యోచించుకో ఓ మానవా (2)      ||న్యాయాధిపతి||

ఆకలితో అలమటించగా
దాహముతో తపియించగా (2)
రోగముతో కృశియించగా (2)
నను చేర్చుకొనలేదు నీవెందుకు
అని యేసు నిన్నడిగిన ఏమందువు (2)      ||న్యాయాధిపతి||

గ్రహియించుకో నీదు గమ్యము
విడనాడు పాప గతమును (2)
లేదింక నీకు తరుణము (2)
ప్రభునాశ్రయించుటే బహు క్షేమము
ప్రభుని చేర్చుకో సరిదిద్దుకో (2)      ||న్యాయాధిపతి||

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Nyaayaadhipathi Aina Devudu
Ninu Theerpu Theercheti Velalo
Ye Gumpulo Neevunduvo
Yochinchuko O Maanavaa (2)        ||Nyaayaadhipathi||

Aakalitho Alamatinchagaa
Daahamutho Thapiyinchagaa (2)
Rogamutho Krushiyinchagaa (2)
Nanu Cherchukonaledu Neevenduku
Ani Yesu Ninnadigina Emanduvu (2)        ||Nyaayaadhipathi||

Grahiyinchuko Needu Gamyamu
Vidanaadu Paapa Gathamunu (2)
Ledinka Neeku Tharunamu (2)
Prabhunaashrayinchute Bahu Kshemamu
Prabhuni Cherchuko Sarididdhuko (2)        ||Nyaayaadhipathi||

ఇది దేవుడు మనకిచ్చిన దినము / Idi Devudu Manaku Icchina Dinamu

ఇది దేవుడు మనకిచ్చిన దినము

ఉత్సాహముతో స్తుతి పాడెదము

ఆ దేవుని చేతి పని మనము

తన సేవలో సాగుట ఘనము

1. దేవుడు ఇచ్చెను ప్రతి క్షణము

ఎంతో విలువని గమనించుము

దేవుడు మెచ్చెను ప్రతిదినము

ఆయన మహిమ కొరకు వాడుము

నడిపిస్తాడు నా దేవుడు / Nadipisthaadu Naa Devudu

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు (2)
అడుగులు తడబడినా – అలసట పైబడినా (2)
చేయి పట్టి వెన్నుతట్టి – చక్కని ఆలొచన చెప్పి (2)         ||నడిపిస్తాడు||

అంధకారమే దారి మూసినా – నిందలే నను కృంగదీసినా (2)
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు (2)        ||నడిపిస్తాడు||

కష్టాల కొలిమి కాల్చివేసినా – శోకాలు గుండెను చీల్చివేసినా (2)
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు (2)        ||నడిపిస్తాడు||

నాకున్న కలిమి కరిగిపోయిన – నాకున్న బలిమి తరిగిపోయిన (2)
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు (2)        ||నడిపిస్తాడు||

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Nadipisthaadu Naa Devudu – Shramalonainaa Nanu Viduvadu (2)
Adugulu Thadabadinaa – Alasata Paibadinaa (2)
Cheyi Patti Vennu Thatti – Chakkani Aalochana Cheppi (2)        ||Nadipisthaadu||

Andhakaarame Daari Moosinaa – Nindale Nanu Krungadeesinaa (2)
Thana Chittham Neraverchuthaadu
Gamyam Varaku Nanu Cherchuthaadu (2)        ||Nadipisthaadu||

Kashtaala Kolimi Kaalchivesinaa – Shokaalu Gundenu Cheelchivesinaa (2)
Thana Chittham Neraverchuthaadu
Gamyam Varaku Nanu Cherchuthaadu (2)        ||Nadipisthaadu||

Naakunna Kalimi Karigipoyina – Naakunna Balimi Tharigipoyina (2)
Thana Chittham Neraverchuthaadu
Gamyam Varaku Nanu Cherchuthaadu (2)        ||Nadipisthaadu||

దేవునియందు నిరీక్షణ నుంచి / Devuniyandu Nireekshana Nunchi

దేవునియందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా (2)

ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు (2)
ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు (2)      ||దేవుని||

చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు (2)
సత్యమగు – జీవమగు – మార్గమేసే (2)      ||దేవుని||

నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే (2)
ఆధారము – ఆదరణ – ఆయనలో (2)      ||దేవుని||

తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను (2)
తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు (2)      ||దేవుని||

నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2)
శత్రువులు – మిత్రులుగా – మారుదురు (2)      ||దేవుని||

పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2)
కనికర – సంపన్నుడు – నా దేవుడు (2)      ||దేవుని||

స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద (2)
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ (2)      ||దేవుని||

Devuniyandu Nireekshana Nunchi
Aayananu Sthuthinchu Naa Praanamaa (2)

Ae Apaayamu Raakunda Ninnu – Deewaaraathrulu Kaapaaduvaadu (2)
Prathi Kshanam – Nee Pakshamundu – Rakshakudu (2)         ||Devuni||

Cheekatini Velugugaa Chesi – Aayana Nee Mundu Povuvaadu (2)
Sathyamagu – Jeevamagu – maargamese (2)         ||Devuni||

Neeku Sahaayamu Cheyuvaadu – Sadaa Aadukonuvaadu Aayane (2)
Aadhaaramu – Aadarana – Aayanalo (2)         ||Devuni||

Thalli Thana Biddanu Marachinanu – Maruvadu Nee Devudu Ninnu (2)
Thalli Kannaa – Thandri Kannaa – Utthamudu (2)         ||Devuni||

Neeku Virodhamugaa Roopinchina – Ae Vidha Aayudhamunu Vardhilladu (2)
Shathruvulu – Mithrulugaa – Maaruduru (2)         ||Devuni||

Parvathamulu Tholagipoyinanu – Thana Krupa Ninnu Ennadu Veedadu (2)
Kanikara – Sampannudu – Naa Devudu (2)         ||Devuni||

Sthuthi Mahimalu Neeke Prabhu – Nithyamu Ninne Koniyaadeda (2)
Hallelooya – Hallelooya – Hallelooya (2)         ||Devuni||