ఎంతటి వాడను నేను/Enthati Vaadanu Nenu

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్

ఎంతటి వాడను నేను యేసయ్యా
కొంతైనా యోగ్యుడను కానయ్యా (2)
ఇంతగ నను హెచ్చించుటకు
ఈ స్థితిలో నన్నుంచుటకు (2)            ||ఎంతటి||

ఐశ్వర్యము గొప్పతనమును
కలిగించు దేవుడవీవే
హెచ్చించువాడవును
బలమిచ్చువాడవు నీవే (2)
అల్పుడను మంటి పురుగును
నన్ను ప్రేమించినావు
ప్రాణమును నీ సర్వమును
నా కొరకై అర్పించినావు            ||ఎంతటి||

నిను వెంబడించువారిని
నిజముగ సేవించువారిని
నీవుండే స్థలములలో
నిలిచే నీ సేవకుని (2)
ఎంతో ఘనపరచెదవు
ఆశీర్వదించెదవు
శత్రువుల కంటె ఎత్తుగా
అతని తలను పైకెత్తెదవు ||ఎంతటి||

వినయముగల మనుష్యులను
వర్దిల్లజేసెదవు
గర్విష్టుల గర్వమునణచి
గద్దె నుండి దించెదవు (2)
మాదు ఆశ్రయ దుర్గమా
మేమంతా నీ వారమే
మా శైలము మా కేడెమా
మాకున్నదంతా నీ దానమే          ||ఎంతటి||

Lyricist: A R Stevenson

Enthati Vaadanu Nenu Yesayyaa
Konthainaa Yogyudanu Kaanayyaa (2)
Inthaga Nanu Hechchinchutaku
Ee Sthithilo Nannunchutaku (2)           ||Enthati||

Aishwaryamu Goppathanamunu
Kaliginchu Devudaveeve
Hechchinchuvaadavunu
Balamichchuvaadavu Neeve (2)
Alpudanu Manti Purugunu
Nannu Preminchinaavu
Praanamunu Nee Sarvamunu
Naa Korakai Arpinchinaavu            ||Enthati||

Ninu Vembadinchuvaarini
Nijamuga Sevinchuvaarini
Neevunde Sthalamulalo
Niliche Nee Sevakuni (2)
Entho Ghanaparachedavu
Aasheervadinchedavu
Shathruvula Kante Eththugaa
Athani Thalanu Paikeththedavu           ||Enthati||

Vinayamugala Manushyulanu
Vardhillajesedavu
Garvishtula Garvamunanachi
Gadde Nundi Dinchedavu (2)
Maadu Aashraya Durgamaa
Memanthaa Nee Vaarame
Maa Shailamu Maa Kedemaa
Maakunnadantha Nee Daaname           ||Enthati||

అంబరానికి అంటేలా (ఏ ఆర్ స్టీవెన్సన్) / Ambaraaniki Antelaa (Yesayya Puttaadani)  A R Stevenson

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్

అంబరానికి అంటేలా
సంబరాలతో చాటాలా (2)
యేసయ్య పుట్టాడని
రక్షింప వచ్చాడని (2)

ప్రవచనాలు నెరవేరాయి
శ్రమ దినాలు ఇక పోయాయి (2)
విడుదల ప్రకటించే
శిక్షను తప్పించే (2)           ||యేసయ్య||

దివిజానాలు సమకూరాయి
ఘనస్వరాలు వినిపించాయి (2)
పరముకు నడిపించే
మార్గము చూపించే (2)           ||యేసయ్య||

సుమ వనాలు పులకించాయి
పరిమళాలు వెదజల్లాయి (2)
ఇలలో నశియించే
జనులను ప్రేమించే (2)           ||యేసయ్య||

Lyricist: A R Stevenson

Ambaraaniki Antelaa
Sambaraalatho Chaataalaa (2)
Yesayya Puttaadani
Rakshimpa Vachchaadani (2)

Pravachanaalu Neraveraayi
Shrama Dinaalu Ika Poyaayi (2)
Vidudala Prakatinche
Shikshanu Thappinche (2)          ||Yesayya||

Divijanaalu Samakooraayi
Ghanaswaraalu Vinipinchaayi (2)
Paramuku Nadipinche
Maargamu Choopinche (2)          ||Yesayya||

Suma Vanaalu Pulakinchaayi
Parimalaalu Vedajallaayi (2)
Ilalo Nashiyinche
Janulanu Preminche (2)          ||Yesayya||