చిన్ని పిల్లలం చిన్నారి పిల్లలం / Chinni Pillalam Chinnari Pillalam

చిన్ని పిల్లలం చిన్నారి పిల్లలం

ప్రభుయేసు పిల్లలం క్రీస్తు పిల్లలం

బాధ వచ్చినా భయపడము మేం

కష్టమొచ్చిన కలత చెందము

ఇదే త్రోవ నడువరా / Ide Throva Naduvara

ఇదే త్రోవ నడువరా

లేదు వేరే దారిరా

మార్గములన్ని మోసమురా

మార్గము యేసే కదలిరా (2)

అటు ఇటు పోవద్దురా

ఎటూ లేదుగ శాంతిరా

రంగురంగుల లోకమురా

హంగులతో నిన్ను రమ్మనురా      ॥ఇదే॥

భక్తులు నడచి వెళ్ళారు.

ముక్తికి బైబులే బాటరా

యుక్తి సాతానును విడచిరా

భక్తితో యేసును చేరగరా                              ॥ఇదే॥

నాకళ్లు చెవులు ముక్కు నోరు యేసు కోసమే / Na Kallu Chevulu Mukku Nooru Yesu Kosame

నాకళ్లు చెవులు ముక్కు నోరు యేసు కోసమే

నా చేతులు కాళ్లు దేహమంతా

యేసుకోసమే

పరిశుద్ధత నాకీయుమా

పాటలుపాడి నాట్యమాడెద

పి..పి…పి… పి…పి…పి…పి…పి

డుం.. డుం..డుం..డు..

డుం.. డుం.. డుం..డుం

ల.. ల.. ల.. ల.. ల.. ల.. ల.. ల

పక్షికిగలవు రెండు రెక్కలు /

పక్షికిగలవు రెండు రెక్కలు

వాటితో చక్కగ ఎగురుచుండును

నాకును గలవు రెండు రెక్కలు

దేవుడే వాటిని నాకు ఇచ్చెను

ఒకటి ప్రార్ధన రెండు వాక్యము

పైపైకెగిరెదను కొండకు ఎగిసెదను

యేసయ్య వుంటే భయము లేదులే / Yesayya Unte Bhayamu Ledule

యేసయ్య వుంటే భయము లేదులే

యేసయ్య వుంటే దిగులు లేదులే

నా చిన్ని హృదయమంటే

యేసయ్యకిష్టం

నా చిన్ని మనసు అంటే

యేసయ్యకిష్టం

సంద్రాలు ఎన్నో అడ్డు వచ్చినా

సుడి గాలులు నన్ను ముంచచూచిన

లోయలలో నేను ఒంటరైనను

సుడిగాలులు ఎదురై పడగొట్టచూచిన

సమయం అమూల్యం చెయ్యబోకుమా వ్యర్ధం / Samayam Amulyam Cheyabokumaa Vyardham

సమయం అమూల్యం

చెయ్యబోకుమా వ్యర్ధం నీ

సినిమా కధలు మాటలు

అల్లరి ఆటపాటలు

వ్యర్ధపరచు నీ సమయం

నీకు కలిగిస్తుంది నష్టం

నీటి బుడగ నీ జీవితం

తెలియదు నీ మరణ దినం

అర్పించుకో నీ హృదయం

నీకు కలుగును నిత్యజీవం

తెల్లారింది వేళ / Thellaarindi Vela

అన్నయ్య… తెల్లారింది లేరా..
తెల్లారింది వేళ – త్వరగా నిద్దుర లేరా
మనమంతా ఆయన సృష్టే రా
పక్షుల కోలాహ వేళ – ప్రభువును స్తుతించావేరా
వాటి కంటె శ్రేష్ఠుల మనమేరా (2)

అడవి రాజు సింహమైననూ – ఆకలంటు పిల్లలన్ననూ
యేసు రాజు పిల్లలం మనం – పస్తులుంచునా (2)
వాడిపోవు అడవి పూలకు – రంగులేసి అందమిచ్చెను
రక్తమిచ్చి కొన్న మనలను – మరచిపోవునా (2)
మరచిపోవునా               ||తెల్లారింది||

చిన్నదైన పిచ్చుకైననూ – చింత ఉందా మచ్ఛుకైననూ
విత్తలేదు కోయలేదని – కృంగిపోవునా (2)
వాటికన్ని కూర్చువాడు – నీ తండ్రి యేసేనని
నీకు ఏమి తక్కువ కాదని – నీకు తెలియునా (2)
నీకు తెలియునా               ||తెల్లారింది||

Annayya… Thellaarindi Leraa..
Thellaarindi Vela – Thvaragaa Niddura Leraa
Manamanthaa Aayana Srushte Raa
Pakshula Kolaaha Vela – Prabhuvunu Sthuthinchaveraa
Vaati Kante Shreshtula Manameraa (2)

Adavi Raaju Simhamainanu – Aakalantu Pillalannanu
Yesu Raaju Pillalam Manam – Pasthulunchunaa (2)
Vaadipovu Adavi Poolaku – Rangulesi Andamichchenu
Rakthamichchi Konna Manalanu – Marachipovunaa (2)
Marachipovunaa                  ||Thellaarindi||

Chinnadaina Pichchukainanu – Chintha Undaa Machchukainanu
Vitthaledu Koyaledani – Krungipovunaa (2)
Vaatikanni Koorchuvaadu – Nee Thadri Yesenani
Neeku Emi Thakkuva Kaadani – Neeku Theliyunaa (2)
Neeku Theliyunaa               ||Thellaarindi||

యేసూ నీ సృష్టి ఎంత అద్భుతం / Yesu Nee Shrusti Entha Adbutham

యేసూ నీ సృష్టి ఎంత అద్భుతం

ప్రభూ నీ ప్రేమ ఎంతో మధురం

కొండ లోయలు ఎడారులు

సెలయేరు నదులు సంద్రములు

పక్షులు వృక్షాలు ఫలపుష్పాలు

జలచర జంతుజాల గని ఖనిజాలు

నీ చేతులతో నన్ను నిర్మించావు

నీ చేతులు చాచి పిలచుచున్నావు

నాకై నీ సమస్తము ఇచ్చావు

నీకై నేనేమి ఇవ్వగలను

వీరులం వీరులం యుద్ధ వీరులం / Veerulam Veerulam Yuddha Veerulam

వీరులం వీరులం యుద్ధ వీరులం

శూరులం శూరులం యుద్ధ శూరులం

సాతాను మూకను చెదరగొట్టెదం

వైరుమూక ఎత్తులను చిత్తుచేసెదం

వెనుక చూడము ముందు చూతుము

హోసన్న పాటలతో సాగిపోడుము హోయ్‌

యేసయ్య చేతిలో వడిసెల నేను

గొల్యాతును పడగొట్టె రాయిని నేను

వరను దూసిన కత్తిని నేను

వైరు తలను తెగవేసిన వీరుని నేను హోయ్‌

మా యేసు మాకెంతో మంచివాడు / Maa Yesu Maakentho Manchivaadu

మా యేసు మాకెంతో మంచివాడు

మా ప్రభువు మాకెంతో మంచివాడు

చిన్నచిన్న పిల్లలంటే ఇష్టమంట

ప్రేమతో వారిని దీవించునంట

ఆ యేసు చెంతకే మేమేగెదం