పేద నరుని రూపము / Pedha Naruni Roopamu

పేద నరుని రూపము ధరించి
యేసు రాజు నీ చెంత నిలచె
అంగీకరించు-మాయనను (2)       ||పేద నరుని||

కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడెన్
ముళ్ల మకుటము శిరస్సున పెట్టబడెన్ (2)
నింద వేదన శ్రమలను సహించెనేసు
చిందే తనదు రక్తము నీ పాపముకై
దీనుడై నిన్ను పిలచుచుండె (2)       ||పేద నరుని||

తల వాల్చుటకు ఇల స్థలమే లేదు
దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు (2)
తన్ను ఆదరించు వారెవరు లేరు
ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే
పాట్లుపడే నిన్ను విడిపింపను (2)       ||పేద నరుని||

ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్
పాప డాగులన్ రక్తముతో కడిగెన్ (2)
నీ వ్యాధిని వేదన తొలగించ
నీ శాపము నుండి విడిపింప
సిలువలో విజయము పొందే (2)       ||పేద నరుని||

మాయ లోకమును నీవు నమ్మకుము
మనుష్యుల మనస్సు మారిపోవునిల (2)
నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు
నిశ్చయముగా ప్రభువులో ఆనందింప
నేడే రమ్ము విశ్వాసముతో (2)       ||పేద నరుని||

తామసించెదవేల ఓ ప్రియుడా
ప్రియ యేసుని యొద్దకు లేచి రమ్ము (2)
ఈ లోకము నీకివ్వని శాంతిని
ఈ దినమే ప్రభువు నీకొసగ
ప్రేమతో నిన్ను పిలచుచుండె (2)       ||పేద నరుని||

Pedha Naruni Roopamu Dharinchi
Yesu Raaju Nee Chentha Nilache
Angeekarinchu-maayananu (2)       ||Pedha Naruni||

Kaalla Chethulandu Seelal Kottabaden
Mulla Makutamu Shirassuna Pettabaden (2)
Ninda Vedana Shramalanu Sahinchenesu
Chinde Thanadu Rakthamu Nee Paapamukai
Deenudai Ninnu Pilachuchunde (2)       ||Pedha Naruni||

Thala Vaalchutaku Ila Sthalame Ledu
Dappi Theerchukona Neeru Dorakaledu (2)
Thannu Aadarinchu Vaarevaru Leru
Priya Rakshakudu Siluvalo Vrelaade
Paatlupade Ninnu Vidipimpanu (2)       ||Pedha Naruni||

Prabhu Saathaanu Thalanu Chithuka Drokken
Paapa Daagulan Rakthamutho Kadigen (2)
Nee Vyaadhini Vedhana Tholagincha
Nee Shaapamu Nundi Vidipimpa
Siluvalo Vijayamu Pondhe (2)       ||Pedha Naruni||

Maaya Lokamunu Neevu Nammakumu
Manushyula Manassu Maaripovunila (2)
Nithya Devuni Premanu Nammi Neevu
Nischayamugaa Prabhuvulo Aanandimpa
Nede Rammu Vishwaasamutho (2)       ||Pedha Naruni||

Thaamasinchedhavela O Priyudaa
Priya Yesuni Yoddaku Lechi Rammu (2)
Ee Lokamu Neekivvani Shaanthini
Ee Diname Prabhuvu Neekosaga
Prematho Ninnu Pilachuchunde (2)       ||Pedha Naruni||

పరిశుద్ధుడు పరిశుద్ధుడు / Parishuddhudu Parishuddhudu

పరిశుద్ధుడు పరిశుద్ధుడు – రాజుల రాజు యేసు
బలవంతుడు బలమిచ్చును – ప్రభువుల ప్రభువు క్రీస్తు (2)

గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిననూ
అగాధ జల ప్రవాహములో నేను సాగవలసిననూ (2)
ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా
ఎన్నటికీ వెనుతిరుగను నాయందు నీవుండగా       ||పరిశుద్ధుడు||

నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడుదును
కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును (2)
ఎన్నటికీ వెనుతిరుగను అండ నీవుండగా
ఎన్నటికీ ఓడిపోను – జయశాలి నీవుండగా         ||పరిశుద్ధుడు||

Parishuddhudu Parishuddhudu – Raajula Raaju Yesu
Balavanthudu Balamichchunu – Prabhuvula Prabhuvu Kreesthu (2)

Gaadaandhakaarapu Loyalalo Nenu Sancharinchinanu
Agaadha Jala Pravaahamulo Nenu Saagavalasinanu (2)
Ennatiki Bhayapadanu Neevu Thodundagaa
Ennatiki Venuthiruganu Naayandu Neevundagaa         ||Parishuddhudu||

Nashinchu Aathmala Rakshanakai Ne Prayaasapadudunu
Kashtamulennochchinaa Krungipokundunu (2)
Ennatiki Venuthiruganu Anda Neevundagaa
Ennatiki Odiponu – Jayashaali Neevundagaa            ||Parishuddhudu||

నా యేసు రాజు / Naa Yesu Raaju

నా యేసు రాజు
నాకై పుట్టిన రోజు (2)
క్రిస్మస్ పండుగా
హృదయం నిండుగా (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)       ||నా యేసు||

పరలోకమునే విడిచెను
పాపిని నను కరుణించెను
పశు పాకలో పుట్టెను
పశువుల తొట్టిలో వింతగా (2)     ||హ్యాపీ||

నమ్మిన వారికి నెమ్మది
ఇమ్ముగనిచ్చి బ్రోవఁగా
ప్రతి వారిని పిలిచెను
రక్షణ భాగ్యమునివ్వగా (2)     ||హ్యాపీ||

సంబరకరమైన క్రిస్మస్
ఆనందకరమైన క్రిస్మస్
ఆహ్లాదకరమైన క్రిస్మస్
సంతోషకరమైన క్రిస్మస్ (2)      ||నా యేసు||

Naa Yesu Raaju
Naakai Puttina Roju (2)
Christmas Pandugaa
Hrudayam Nindugaa (2)
Happy Happy Christmas
Merry Merry Christmas (2)        ||Naa Yesu||

Paralokamune Vidichenu
Paapini Nanu Karuninchenu
Pashu Paakalo Puttenu
Pashuvula Thottilo Vinthagaa (2)     ||Happy||

Nammina Vaariki Nemmadhi
Immuganichchi Brovagaa
Prathi Vaarini Pilichenu
Rakshana Bhaagyamunivvagaa (2)     ||Happy||

Sambharakaramaina Christmas
Aanandhakaramaina Christmas
Aahlaadhakaramaina Christmas
Santhoshakaramaina Christmas (2)     ||Naa Yesu||

దేవాది దేవుడు / Devaadhi Devudu

దేవాది దేవుడు మహోపకారుడు
మహాత్యము గల మహారాజు (2)
ప్రభువుల ప్రభువు – రాజుల రాజు
ఆయన కృప నిరంతరముండును      ||దేవాది||

సునాద వత్సరము ఉత్సాహ సునాదము
నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము (2)
ఉత్తమ దేవుని దానములు (2)       ||దేవాది||

యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవు
జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే (2)
నీదు క్రియలు ఘనమైనవి (2)       ||దేవాది||

అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసు క్రీస్తు
మహిమా మహాత్యములు సర్వాధిపత్యమును (2)
సదా నీకే కలుగును గాక (2)       ||దేవాది||

Devaadhi Devudu Mahopakaarudu
Mahaathyamu Gala Maharaaju (2)
Prabhuvula Prabhuvu – Raajula Raaju
Aayana Krupa Nirantharamundunu        ||Devaadhi||

Sunaadha Vathsaramu Uthsaaha Sunaadhamu
Noothana Sahsraabdhi Noothana Shathaabdhamu (2)
Utthama Devuni Dhaanamulu (2)       ||Devaadhi||

Yugamulaku Devudavu Unnavaadavanuvaadavu
Jagamanthaa Eluchunna Jeevaadhipathi Neeve (2)
Needhu Kriyalu Ghanamainavi (2)       ||Devaadhi||

Adhvitheeya Devudavu Prabhuvaina Yesu Kreesthu
Mahimaa Mahathyamulu Sarvaadhipathyamunu (2)
Sadhaa Neeke Kalugunu Gaaka (2)       ||Devaadhi||

స్తుతి నీకే యేసు రాజా / Sthuthi Neeke Yesu Raajaa

స్తుతి నీకే యేసు రాజా
మహిమ నీకే యేసు రాజా
స్తోత్రం నీకే యేసు రాజా
ఘనత నీకే యేసు రాజా
హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా (2)
(యేసు) రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు
త్వరలోనే రానున్నాడు
నిత్యజీవమును మన అందరికిచ్చి
పరలోకం తీసుకెళ్తాడు (2)
హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా (2)        ||స్తుతి||

మధ్యాకాశములో ప్రభువును కలిసెదము
పరిశుద్ధుల విందులో పాలునొందెదము (2)
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు (2)
తేజోవాసులతో స్తుతియింతుము       ||హోసన్నా||

సంతోష గానాలతో ఉత్సాహించి పాడెదము
క్రొత్త కీర్తనతో రారాజును ఘనపరచెదము (2)
శ్రమలైనా శోధనలెదురైనా (2)
ఆర్భాటముతో సన్నుతింతుము       ||హోసన్నా||         ||స్తుతి||

Sthuthi Neeke Yesu Raajaa
Mahima Neeke Yesu Raajaa
Sthothram Neeke Yesu Raajaa
Ghanatha Neeke Yesu Raajaa
Hosannaa Hosannaa Hallelooyaa Hosannaa (2)
(Yesu) Raajulaku Raaju Prabhuvulaku Prabhuvu
Thvaralone Raanunnaadu
Nithyajeevamunu Mana Andarikichchi
Paralokam Theesukelthaadu (2)
Hosannaa Hosannaa Hallelooyaa Hosannaa (2)        ||Sthuthi||

Madhyaakaashamulo Prabhuvunu Kalisedamu
Parishuddhula Vindulo Paalunondedamu (2)
Parishuddhudu Parishuddhudu Anuchu (2)
Thejovaasulatho Sthuthiyinthumu         ||Hosannaa||

Santhosha Gaanaalatho Uthsahinchi Paadedamu
Krottha Keerthanatho Raaraajunu Ghanaparachedamu (2)
Shramalainaa Shodhanaledurainaa (2)
Aarbhaatamutho Sannuthinthumu       ||Hosannaa||       ||Sthuthi||

తార వెలిసింది / Thaara Velisindi

తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2)
రాజులకు రాజు పుట్టాడని
యూదుల రాజు ఉదయించాడని (2)         ||తార||

మందను విడచి మమ్మును మరచి
మేమంతా కలిసి వెళ్ళాములే
ఆ ఊరిలో ఆ పాకలో
స్తుతి గానాలు పాడాములే (2)
సంతోషమే ఇక సంబరమే
లోక రక్షణ ఆనందమే
స్తోత్రార్పణే మా రారాజుకే
ఇది క్రిస్మస్ ఆర్భాటమే         ||తార||

బంగారమును సాంబ్రాణియు
బోళంబును తెచ్చాములే
ఆ యింటిలో మా కంటితో
నిను కనులారా గాంచాములే (2)
మా ఇమ్మానుయేలువు నీవేనని
నిను మనసారా కొలిచాములే
మా యూదుల రాజువు నీవేనని
నిను ఘనపరచి పొగిడాములే        ||తార||

Thaara Velisindi Aa Ningilo Dharani Murisindi
Dootha Vachchindi Suvaarthanu Maaku Thelipindi (2)
Raajulaku Raaju Puttaadani
Yoodula Raaju Udayinchaadani (2)         ||Thaara||

Mandanu Vidachi Mammunu Marachi
Memanthaa Kalisi Vellaamule
Aa Oorilo Aa Paakalo
Sthuthi Gaanaalu Paadaamule (2)
Santhoshame Ika Sambarame
Loka Rakshana Aanandame
Sthothraarpane Maa Raaraajuke
Idi Christmas Aarbhaatame           ||Thaara||

Bangaaramunu Saambraaniyu
Bolambunu Thechchaamule
Aa Yintilo Maa Kantitho
Ninu Kanulaaraa Gaanchaamule (2)
Maa Immaanuyeluvu Neevenani
Ninu Manasaaraa Kolichaamule
Maa Yoodula Raajuvu Neevenani
Ninu Ghanaparachi Pogidaamule         ||Thaara||

జన్మించినాడురా రాజు / Janminchinaaduraa Raaju

జన్మించినాడురా రాజు జన్మించినాడురా (2)
బెత్లహేములోన పశుల పాకలోన (2)
జన్మించినాడురా…
ఆనందం ఆనందం జగమంతా ఆనందం
సంతోషం సంతోషం ఇంటింటా సంతోషం (2)

ధనవంతుడై యుండియు
భువికి దీనుడై వచ్చాడురా
ఎంతో ప్రేమించాడురా
లోకమును రక్షింప వచ్చాడురా
పాపమంత బాపి జీవమే ఇచ్చే – (2)
యేసే వచ్చాడురా…        ||ఆనందం||

దుఃఖమే ఇక లేదురా
మనకు విడుదలే వచ్చిందిరా
మెస్సయ్య వచ్చాడని
ఈ వార్త లోకమంతా చాటాలిరా
లోక రక్షకుడు ఇమ్మానుయేలు – (2)
యేసే వచ్చాడురా..         ||ఆనందం||

Janminchinaaduraa Raaju Janminchinaaduraa (2)
Bethlahemulona Pashula Paakalona (2)
Janminchinaaduraa…
Aanandam Aanandam Jagamanthaa Aanandam
Santhosham Santhosham Intintaa Santhosham (2)

Dhanavanthudai Yundiyu
Bhuviki Deenudai Vachchaaduraa
Entho Preminchaaduraa
Lokamunu Rakshimpa Vachchaaduraa
Paapamantha Baapi Jeevame Ichche – (2)
Yese Vachchaaduraa…       ||Aanandam||

Dukhame Ika Leduraa
Manaku Vidudale Vachchindiraa
Messayya Vachchaadani
Ee Vaartha Lokamantha Chaataaliraa
Loka Rakshakudu Immanuyelu – (2)
Yese Vachcchaaduraa..        ||Aanandam||

జగతికి వెలుగును తెచ్చెనులే / Jagathiki Velugunu Thechchenule

జగతికి వెలుగును తెచ్చెనులే – క్రిస్మస్ క్రిస్మస్
వసంత రాగం పాడెనులే – క్రిస్మస్ క్రిస్మస్
రాజుల రాజు పుట్టిన రోజు – క్రిస్మస్ క్రిస్మస్
మనమంతా పాడే రోజు – క్రిస్మస్ క్రిస్మస్ (2)

ఈ రాత్రిలో కడు దీనుడై
యేసు పుట్టెను బెత్లెహేములో (2)
తన స్థానం పరమార్ధం విడిచాడు నీకై
నీ కోసం నా కోసం పవళించే పాకలో (2)        ||జగతికి||

ఇమ్మానుయేలుగా అరుదించెను
దైవ మానవుడు యేసు దేవుడు (2)
నీ తోడు నా తోడు ఉంటాడు ఎప్పుడు
ఏ లోటు ఏ కీడు రానీయదు ఎన్నడు (2)         ||జగతికి||

Jagathiki Velugunu Thechchenule – Christmas Christmas
Vasantha Raagam Paadenule – Christmas Christmas
Raajula Raaju Puttina Roju – Christmas Christmas
Manamanthaa Paade Roju – Christmas Christmas (2)

Ee Raathrilo Kadu Deenudai
Yesu Puttenu Bethlehemulo (2)
Thana Sthaanam Paramaardham Vidichaadu Neekai
Nee Kosam Naa Kosam Pavalinche Paakalo (2)        ||Jagathiki||

Immaanuyelugaa Arudinchenu
Daiva Maanavudu Yesu Devudu (2)
Nee Thodu Naa Thodu Untaadu Eppudu
Ae Lotu Ae Keedu Raaneeyadu Ennadu (2)         ||Jagathiki||

క్రీస్తులో జీవించు నాకు / Kreesthulo Jeevinchu Naaku

క్రీస్తులో జీవించు నాకు – ఎల్లప్పుడు జయముండును
జయముంది జయముంది – జయముంది నాకు (2)

ఎటువంటి శ్రమలొచ్చినా – నేను దిగులు పడను ఇలలో (2)
ఎవరేమి చెప్పిననూ – నేను సోలిపోనెప్పుడూ (2)     ||జయముంది||

నా రాజు ముందున్నాడు – గొప్ప జయముతో వెళ్లుచున్నాడు (2)
మట్టలను చేత పట్టి – నేను హోసన్నా పాడెదను (2)     ||జయముంది||

సాతాను అధికారమున్ – నా రాజు తీసివేసెను (2)
సిలువలో దిగగొట్టి – యేసు కాళ్లతో త్రొక్కి వేసెను (2)     ||జయముంది||

Kreesthulo Jeevinchu Naaku – Ellappudu Jayamundunu
Jayamundi Jayamundi – Jayamundi Naaku (2)

Etuvanti Shramalochchinaa – Nenu Digulu Padanu Ilalo (2)
Evaremi Cheppinanu – Nenu Soliponeppudu (2)      ||Jayamundi||

Naa Raaju Mundunnaadu – Goppa Jayamutho Velluchunnaadu (2)
Mattalanu Chetha Patti – Nenu Hosanna Paadedanu (2)      ||Jayamundi||

Saathaanu Adhikaaramun – Naa Raaju Theesivesenu (2)
Siluvalo Digagotti – Yesu Kaallatho Throkki Vesenu (2)      ||Jayamundi||

ఆ రాజే నా రాజు నా రాజే రారాజు / Aa Raaje Naa Raaju Naa Raaje Raaraaju

పాట రచయిత: బన్ని సుదర్శన్

ఆ రాజే నా రాజు – నా రాజే రారాజు
నా రాజు రాజులకు రాజు (2)
యేసు పుట్టెను ఈ లోకంలో
ఆనందమే గొప్ప ఆనందమే (2)
ఆనందమే గొప్ప ఆనందమే
సంతోషమే సర్వలోకమే (2)         ||ఆ రాజే||

యెష్షయి మొద్దున – దావీదు చిగురుగా
లోక రక్షకుడు జన్మించెను
లోక పాపాలను కడిగి వేయగా
భువిలో బాలుడిగా అరుదించెను (2)
పరిశుద్ధాత్మ మూలముగా జన్మించెను
మన పాపాలకు విరుగుడు మందును (తెచ్చెను) (తెచ్చి అందించెను) (2)        ||ఆనందమే||

వీనుల విందుగా – దీనుల అండగా
కరుణా కారకుడు కడలివచ్చెను
పాపుల శాపాలను తానే మోయగా
పరమ పాలకుడు పుడమి చేరెను (2)
కుల మత బేధాలను హరియించ వచ్చెను
పరలోకానికి చేర్చే (మార్గమాయెను) (మార్గమై తనే నిలిచెను) (2)        ||ఆనందమే||

Lyricist: Bunny Sudarshan

Aa Raaje Naa Raaju – Naa Raaje Raaraaju
Naa Raaju Raajulaku Raaju (2)
Yesu Puttenu Ee Lokamlo
Aanandame Goppa Aanandame (2)
Aanandame Goppa Aanandame
Santhoshame Sarva Lokame (2)         ||Aa Raaje||

Yeshshayi Modduna – Daaveedu Chigurugaa
Loka Rakshakudu Janminchenu
Loka Paapaalanu Kadigi Veyagaa
Bhuvilo Baaludigaa Arudinchenu (2)
Parishuddhaathma Moolamugaa Janminchenu
Mana Paapaalaku Virugudu Mandunu (Thechcenu) (Thechchi Andinchenu) (2)          ||Aanandame||

Veenula Vindugaa – Deenula Andagaa
Karunaa Kaarakudu Kadali Vachchenu
Paapula Shaapaalnu Thaane Moyagaa
Parama Paalakudu Pudami Cherenu (2)
Kula Matha Bedhaalanu Hariyincha Vachchenu
Paralokaaniki Cherche (Maargamaayenu) (Maargamai Thane Nilichenu) (2)          ||Aanandame||