నింగిలో దేవుడు / Ningilo Devudu

నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు
ఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు (2)
చెంత చేరి సంతసించుమా (2)
స్వంతమైన క్రీస్తు సంఘమా        ||నింగిలో||

పాపాల పంకిలమై శోకాలకంకితమై
మరణించి మన కోసం కరుణించి ఆ దైవం (2)
దీన జన రక్షకుడై దేవ దేవుని సుతుడై (2)
జన్మించె నీ కోసం ధన్యము చేయగా (2)      ||నింగిలో||

సాతాను శోధనలే శాపాల వేదనలై
విలపించే దీనులకై అలరించు దీవెనలై (2)
శరణమై ఉదయించే తరుణమౌ ఈ వేళ (2)
గుండె గుడి పానుపులో చేర్చుకొన రావేల (2)      ||నింగిలో||

Ningilo Devudu Ninu Chooda Vachchaadu
Aa Neethi Sooryudu Shree Yesu Naadhudu (2)
Chentha Cheri Santhasinchumaa (2)
Swanthamaina Kreesthu Sanghamaa        ||Ningilo||

Paapaala Pankilamai Shokaalakankithamai
Maraninchi Mana Kosam Karuninchi Aa Daivam (2)
Deena Jana Rakshakudai Deva Devuni Suthudai (2)
Janminche Nee Kosam Dhanyamu Cheyagaa (2)      ||Ningilo||

Saathaanu Shodhanale Shaapaala Vedanalai
Vilapinche Deenulakai Alarinchu Deevenalai (2)
Sharanamai Udayinche Tharunamau Ee Vela (2)
Gunde Gudi Paanupulo Cherchukona Raavela (2)      ||Ningilo||

తార వెలిసింది / Thaara Velisindi

తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2)
రాజులకు రాజు పుట్టాడని
యూదుల రాజు ఉదయించాడని (2)         ||తార||

మందను విడచి మమ్మును మరచి
మేమంతా కలిసి వెళ్ళాములే
ఆ ఊరిలో ఆ పాకలో
స్తుతి గానాలు పాడాములే (2)
సంతోషమే ఇక సంబరమే
లోక రక్షణ ఆనందమే
స్తోత్రార్పణే మా రారాజుకే
ఇది క్రిస్మస్ ఆర్భాటమే         ||తార||

బంగారమును సాంబ్రాణియు
బోళంబును తెచ్చాములే
ఆ యింటిలో మా కంటితో
నిను కనులారా గాంచాములే (2)
మా ఇమ్మానుయేలువు నీవేనని
నిను మనసారా కొలిచాములే
మా యూదుల రాజువు నీవేనని
నిను ఘనపరచి పొగిడాములే        ||తార||

Thaara Velisindi Aa Ningilo Dharani Murisindi
Dootha Vachchindi Suvaarthanu Maaku Thelipindi (2)
Raajulaku Raaju Puttaadani
Yoodula Raaju Udayinchaadani (2)         ||Thaara||

Mandanu Vidachi Mammunu Marachi
Memanthaa Kalisi Vellaamule
Aa Oorilo Aa Paakalo
Sthuthi Gaanaalu Paadaamule (2)
Santhoshame Ika Sambarame
Loka Rakshana Aanandame
Sthothraarpane Maa Raaraajuke
Idi Christmas Aarbhaatame           ||Thaara||

Bangaaramunu Saambraaniyu
Bolambunu Thechchaamule
Aa Yintilo Maa Kantitho
Ninu Kanulaaraa Gaanchaamule (2)
Maa Immaanuyeluvu Neevenani
Ninu Manasaaraa Kolichaamule
Maa Yoodula Raajuvu Neevenani
Ninu Ghanaparachi Pogidaamule         ||Thaara||

అంబరాన్ని దాటే సంబరాలు నేడు / Ambaraanni Daate Sambaraalu Nedu

పాట రచయిత: సాయారాం గట్టు

అంబరాన్ని దాటే సంబరాలు నేడు
నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు (2)
రండయ్యో రండి రండి దావీదు పురముకు (2)
రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు (2)    ||అంబరాన్ని||

దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము
ఏకైక తనయుని పంపెను ఈ దినము (2)
పశువుల పాకలో ఒదిగేను శిశువుగా (2)
అవతరించే నేడు లోక రక్షకునిగా (2)         ||రండయ్యో||

దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ
శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ (2)
లోకాల కారకుడు లోకమున పుట్టెను (2)
మనిషి మరణము ఆయువు తీరెను (2)         ||రండయ్యో||

Lyricist: Sayaram Gattu

Ambaraanni Daate Sambaraalu Nedu
Ningilo Chukka Butti Vachchindi Manaku Thodu (2)
Randayyo Randi Randi Daaveedu Puramuku (2)
Raaraaju Putti Ila Pilichenu Koluvuku (2)          ||Ambaraanni||

Devudu Enthagaano Preminchi Lokamu
Ekaika Thanayuni Pampenu Ee Dinamu (2)
Pashuvula Paakalo Odigenu Shishuvugaa (2)
Avatharinche Nedu Loka Rakshakunigaa (2)       ||Randayyo||

Devaadi Devudu Manishigaa Maarina Vela
Shaapaalu Paapaalu Raddaayina Shubhavela (2)
Lokaala Kaarakudu Lokamunu Puttenu (2)
Manishi Maranamu Aayuvu Theerenu (2)       ||Randayyo||