నేడే ప్రియరాగం / Nede Priyaraagam

నేడే ప్రియరాగం పలికే నవ గీతం
ప్రేమే మన కోసం వెలసే
లోకాన శాంతి మురిసింది
మన మనసుల్లో రాగాల కాంతి విరిసింది        ||నేడే||

దివినేలు దేవుడు ఉదయించగానే
ఇలలోన ప్రకృతి పులకించెగా
పరలోక దూతలు స్తుతియించగానే
జగమంతా ఉప్పొంగి నర్తించెగా           ||నేడే||

మనిషైన సుతుడు జనియించగానే
విశ్వాన గోళాలు విభవించెగా
చిన్నారి యేసుని చిరునవ్వుతోనే
నవ కాంతి లోకాన ప్రభవించెగా        ||నేడే||

హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
హ్యాప్పీ క్రిస్మస్ టు యు…
లోకాన శాంతి మురిసింది
మన మనస్సులో రాగాల కాంతి విరిసింది

Nede Priyaraagam Palike Nava Geetham
Preme Mana Kosam Velase
Lokaana Shaanthi Murisindi
Mana Manasullo Raagaala Kaanthi Virisindi       ||Nede||

Divinelu Devudu Udayinchagaane
Ilalona Prakruthi Pulakinchegaa
Paraloka Doothalu Sthuthiyinchagaane
Jagamanthaa Uppongi Narthinchegaa       ||Nede||

Manishaina Suthudu Janiyinchagaane
Vishwaana Golaalu Vibhavinchegaa
Chinnaari Yesuni Chirunavvuthone
Nava Kaanthi Lokaana Prabhavinchegaa        ||Nede||

Happy Christmas Merry Christmas
Happy Christmas to you…
Lokaana Shaanthi Murisindi
Mana Manasullo Raagaala Kaanthi Virisindi

నా హృదయములో నీ మాటలే / Naa Hrudayamulo Nee Maatale

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

నా హృదయములో నీ మాటలే
నా కనులకు కాంతి రేఖలు (2)
కారు చీకటిలో కలువరి కిరణమై
కఠిన హృదయమును కరిగించిన
నీ కార్యములను వివరింప తరమా
నీ ఘన కార్యములు వర్ణింప తరమా (2)        ||నా హృదయములో||

మనస్సులో నెమ్మదిని కలిగించుటకు
మంచు వలె కృపను కురిపించితివి (2)
విచారములు కొట్టి వేసి
విజయానందముతో నింపినావు
నీరు పారేటి తోటగా చేసి
సత్తువ గల భూమిగా మార్చినావు         ||నీ కార్యములను||

విరజిమ్మే ఉదయ కాంతిలో
నిరీక్షణ ధైర్యమును కలిగించి (2)
అగ్ని శోధనలు జయించుటకు
మహిమాత్మతో నింపినావు
ఆర్పజాలని జ్వాలగా చేసి
దీప స్తంభముగా నను నిలిపినావు         ||నీ కార్యములను||

పవిత్రురాలైన కన్యకగా
పరిశుద్ధ జీవితము చేయుటకు (2)
పావన రక్తముతో కడిగి
పరమానందముతో నింపినావు
సిద్ధపడుచున్న వధువుగా చేసి
సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు         ||నీ కార్యములను||

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Naa Hrudayamulo Nee Maatale
Naa Kanulaku Kaanthi Rekhalu (2)
Kaaru Cheekatilo Kaluvari Kiranamai
Katina Hrudayamunu Kariginchina
Nee Kaaryamulanu Vivarimpa Tharamaa
Nee Ghana Kaaryamulu Varnimpa Tharamaa (2)           ||Naa Hrudayamulo||

Manassulo Nemmadini Kaliginchutaku
Manchu Vale Krupanu Kurpinchithivi (2)
Vichaaramulu Kotti Vesi
Vijayaanandamutho Nimpinaavu
Neeru Paareti Thotagaa Chesi
Satthuva Gala Bhoomigaa Maarchinaavu             ||Nee Kaaryamulanu||

Virajimme Udaya Kaanthilo
Nireekshana Dhairyamunu Kaliginchi (2)
Agni Shodhanalu Jayinchutaku
Mahimaathmatho Nimpinaavu
Aarpajaalani Jwaalagaa Chesi
Deepa Sthambhamugaa Nanu Nilipinaavu             ||Nee Kaaryamulanu||

Pavithruraalaina Kanyakagaa
Parishuddha Jeevithamu Cheyutaku (2)
Paavana Rakthamutho Kadigi
Paramaanandamutho Nimpinaavu
Siddhapaduchunna Vadhuvugaa Chesi
Sugunaala Sannidhilo Nanu Nilipinaavu             ||Nee Kaaryamulanu||

నలుగకుండ గోధుమలు / Nalugakunda Godhumalu

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

నలుగకుండ గోధుమలు కడుపు నింప గలుగునా
కరగకుండ కొవ్వొత్తి కాంతి నివ్వగలుగునా (2)
ఆత్మీయ యాత్రలో నలుగుటయే విలువయా
ఇరుకైన బాటలో కరుగుటయే వెలుగయా (2)       ||నలుగకుండ||

పగలని బండనుండి జలములు హోరులు
విరుగని పొలము మనకు పంటలివ్వగలుగునా (2)
పరలోక యాత్రలో పగులుటయే ఫలమయా (2)
విశ్వాసి బాటలో విరుగుటయే పరమయా (2)       ||నలుగకుండ||

రక్తము చిందకుండ పాపములు పోవునా
కన్నీరు కార్చకుండ కలుషములు కరుగునా (2)
అంతిమ యాత్రలో క్రీస్తేసే గమ్యమయా (2)
ఏకాంత బాటలో ప్రభు యేసే శరణమయా
బహు దూర బాటలో ప్రభు యేసే శరణమయా         ||నలుగకుండ||

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

Nalugakunda Godhumalu Kadupu Nimpa Galugunaa
Karagakunda Kovvotthi Kaanthi Nivvagalugunaa (2)
Aathmeeya Yaathralo Nalugutaye Viluvayaa
Irukaina Baatalo Karugutaye Velugayaa (2)         ||Nalugakunda||

Pagalani Bandanundi Jalamulu Horulu
Virugani Polamu Manaku Pantalivvagalugunaa (2)
Paraloka Yaathralo Pagulutaye Phalamayaa (2)
Vishwaasi Baatalo Virugutaye Paramayaa (2)         ||Nalugakunda||

Rakthamu Chindakunda Paapamulu Povunaa
Kanneeru Kaarchakunda Kalushamulu Karugunaa (2)
Anthima Yaathralo Kreesthese Gamyamayaa (2)
Aekaantha Baaatalo Prabhu Yese Sharanamayaa
Bahu Doora Baatalo Prabhu Yese Sharanamayaa       ||Nalugakunda||

అరుణ కాంతి కిరణమై / Aruna Kaanthi Kiranamai

పాట రచయిత: షాలేం ఇశ్రాయేలు

అరుణ కాంతి కిరణమై
కరుణ చూప ధరణిపై
నరుని రూపు దాల్చెను
పరమ దేవ తనయుడు
అదే అదే క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్
ఇదే ఇదే క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్     ||అరుణ||

యజ్ఞ యాగాదులు – బలి కర్మకాండలు (2)
దోషంబులు కడుగలేవు
దోషుల రక్షింప లేవు (2)
పరిశుద్ధుని రక్తమునందే
పాపులకిల ముక్తి కలుగును
అందుకే.. అందుకే         ||అరుణ||

పుణ్య కార్యములు – మరి తీర్థయాత్రలు (2)
దోషంబులు కడుగలేవు
దోషుల రక్షింప లేవు (2)
పరిశుద్ధుని రక్తమునందే
పాపులకిల ముక్తి కలుగును
అందుకే.. అందుకే      ||అరుణ||

Lyricist: Shalem Israyel

Aruna Kaanthi Kiranamai
Karuna Choopa Dharanipai
Naruni Roopu Daalchenu
Parama Deva Thanayudu
Ade Ade Christmas – Happy Christmas
Ide Ide Christmas – Merry Christmas         ||Aruna||

Yagna Yaagaadulu
Bali Karma Kaandalu (2)
Doshambulu Kadugalevu
Doshula Rakshimpa Levu (2)
Parishuddhuni Rakthamunande
Paapulakila Mukthi Kalugunu
Anduke.. Anduke          ||Aruna||

Punya Kaaryamulu
Mari Theertha Yaathralu (2)
Doshambulu Kadugalevu
Doshula Rakshimpa Levu (2)
Parishuddhuni Rakthamunande
Paapulakila Mukthi Kalugunu
Anduke.. Anduke          ||Aruna||