ప్రేమ యేసయ్య ప్రేమా / Prema Yesayya Premaa

ప్రేమ యేసయ్య ప్రేమా (4)
మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2)          ||ప్రేమ||

తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ
తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2)
నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమా
తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2)          ||ప్రేమ||

నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ
నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2)
నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా
తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా (2)          ||ప్రేమ||

నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ
నేను ఎరుగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ (2)
తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా
ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా (2)          ||ప్రేమ||

Prema Yesayya Premaa (4)
Maaranidi Maruvanidi Veedanidi Edabaayanidi (2)        ||Prema|| 

Thalli Marachina Gaani Nanu Maruvananna Prema
Thandri Vidachina Gaani Nanu Viduvananna Prema (2)
Ne Aedusthunte Etthukunna Premaa
Thana Kougitlo Nanu Hatthukunna Premaa (2)        ||Prema|| 

Nenu Marachina Gaani Nanu Maruvananna Prema
Nenu Vidachina Gaani Nanu Viduvananna Prema (2)
Ne Padipothunte Pattukunna Premaa
Thana Krupalo Nanu Daachukunna Premaa (2)        ||Prema|| 

Nenu Puttakamunde Nanu Ennukunna Prema
Nenu Erugakamunde Aerparachukunna Prema (2)
Thana Arachethullo Chekkukunna Premaa
Eda Lothullo Nannu Daachukunna Premaa (2)        ||Prema||

ఆశ్రయుడా నా అభిశక్తుడా / Aashrayudaa Naa Abhishikthudaa

ఆశ్రయుడా నా అభిశక్తుడా
నీ అభిష్టము చేత నను నడుపుచుండిన
అద్భుత నా నాయకా
యేసయ్య అద్భుత నా నాయకా

స్తోత్రములు నీకే స్తోత్రములు (2)
తేజోమయుడయిన ఆరాధ్యుడా (2)

నీ ఆలోచనలు అతి గంభీరములు
అవి ఎన్నటికీ క్షేమకరములే
మనోహరములే కృపాయుతమే (2)
శాంతి జలములే సీయోను త్రోవలు (2)

నీతి మార్గములో నన్ను నడుపుచుండగా
సూర్యుని వలె నే తేజరిల్లెదను
నీ రాజ్య మర్మములు ఎరిగిన వాడనై (2)
జీవించెదను నీ సముఖములో (2)

సువార్తకు నన్ను సాక్షిగా నిలిపితివి
ఆత్మల రక్షణ నా గురి చేసితివి
పరిశుద్ధతలో నే నడిచెదను (2)
భళా మంచి దాసుడనై నీ సేవలో (2)

Aashrayudaa Naa Abhishikthudaa
Nee Abheeshtamu Chetha Nanu Nadupuchundina
Adbhutha Naa Naayakaa
Yesayyaa Adbhutha Naa Naayakaa

Sthothramulu Neeke Sthothramulu (2)
Thejomayudaina Aaraadhyudaa (2)

Nee Aalochanalu Athi Ganbheeramulu
Avi Ennatikee Kshemakaramule
Manoharamule Krupaayuthame (2)
Shaanthi Jalamule Seeyonu Throvalu (2)

Neethi Maargamulo Nannu Nadupuchundagaa
Sooryuni Vale Ne Thejarilledanu
Nee Raajya Marmamulu Erigina Vaadanai (2)
Jeevinchedanu Nee Samukhamulo (2)

Suvaarthaku Nannu Saakshigaa Nilipithivi
Aathmala Rakshana Naa Guri Chesithivi
Parishuddhathalo Ne Nadichedanu (2)
Bhalaa Manchi Daasudanai Nee Sevalo (2)

సేవకులారా / Sevakulaaraa

సేవకులారా సువార్తికులారా
యేసయ్య కోరుకున్న శ్రామికులారా
సేవకులారా సువార్తికులారా
మీ మాదిరికై వందనము
ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా
మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి యుండుటే మా భాగ్యము
నీ కొరకై జీవించెదము        ||సేవకులారా||

మన కంటే ముందుగా వెళ్లిపోయిన వారి కంటే
మనము గొప్పవారము కాదు
మనము మంచివారము కాదు
మనము ఎంత మాత్రము శ్రేష్టులము కాదు

దైవాజ్ఞను నెరవేర్చుటకు – మా కోసం బలి అయ్యారు
ప్రభు రాజ్యం ప్రకటించుటకు – ప్రాణాలని ఇల విరిచారు
మా ఆత్మలు రక్షించుటకు – హత సాక్షులు మీరయ్యారు
నీతి కిరీటము పొందుటకు – అర్హులుగా మీరున్నారు        ||ఉన్నత||

ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి
మీ శరీరము దేవుని ఆలయమిది
మీరు విలువ పెట్టి కొనబడిన వారు

సంఘమును కాపాడుటలో – కాపరులుగ మీరున్నారు
సువార్తకై పోరాడుటలో – సిద్ధపడిన సైన్యం మీరు
మీ ప్రేమను ఎరుగని వారు – అన్యాయముగ మిము చంపారు
మీ త్యాగం మేము – ఎన్నటికీ మరచిపోము        ||సేవకులారా||

హి గేవ్ హిస్ ఓన్లీ బిగాట్టెన్ సన్,
దట్ హుసోఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్
షుడ్ నాట్ పెరిష్, బట్ హావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్

సువార్తను అందించుటకు – ఎన్నో హింసలు పొందారు
ఆకలితో మోకాళ్లూని – సంఘమును పోషించారు
మాకు మాదిరి చూపించుటకు – క్రీస్తుని పోలి జీవించారు
మీ జత పని వారమే మేము – మీ జాడలో ఇక నిలిచెదము        ||ఉన్నత||

Sevakulaaraa Suvaarthikulaaraa
Yesayya Korukunna Shraamikulaaraa
Sevakulaaraa Suvaarthikulaaraa
Mee Maadirikai Vandanamu
Unnatha Panikai Mammunu Pilachina Devaa
Maa Korakai Nee Praanam Arpinchithivi
Neelo Nilachi Yundute Maa Bhaagyamu
Nee Korakai Jeevinchedamu       ||Sevakulaaraa||

Mana Kante Mundugaa Vellipoyina Vaari Kante
Manamu Goppavaaramu Kaadu
Manamu Manchivaaramu Kaadu
Manamu Entha Maathramu Sreshtulamu Kaadu

Daivaagnanu Neraverchutaku – Maa Kosam Bali Ayyaaru
Prabhu Raajyam Prakatinchutaku – Praanaalani Ila Virichaaru
Maa Aathmalu Rakshinchutaku – Hatha Saakshulu Meerayyaaru
Neethi Kireetamu Pondutaku – Arhulugaa Meerunnaaru       ||Unnatha||

Ghataanni Ghanangaa Kaapaadukovaali
Mee Shareeramu Devuni Aalayamidi
Meeru Viluva Petti Konabadina Vaaru

Sanghamunu Kaapaadutalo – Kaaparuluga Meerunnaru
Suvaarthakai Poraadutalo – Siddhapadina Sainyam Meeru
Mee Premanu Erugani Vaaru – Anyaayamuga Mimu Champaaru
Mee Thyaagam Memu – Ennatiki Marachipomu          ||Sevakulaaraa||

He gave His only begotten Son,
that whosoever believeth in Him
should not perish, but have everlasting life.

Suvaarthanu Andinchutaku – Enno Himsalu Pondaaru
Aakalitho Mokaallooni – Sanghamunu Poshinchaaru
Maaku Maadiri Choopinchutaku – Kreesthuni Poli Jeevinchaaru
Mee Jatha Pani Vaarame Memu – Mee Jaadalo Ika Nilichedamu         ||Unnatha||

స్తోత్రము స్తుతి స్తోత్రము / Sthothramu Sthuthi Sthothramu

స్తోత్రము స్తుతి స్తోత్రము
వేలాది వందనాలు
కలుగును గాక నీకే మహిమ
ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము
యేసయ్య యేసయ్య యేసయ్య (4)

శూన్యము నుండి సమస్తము కలుగజేసెను
నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను
యేసే నా సర్వము
యేసే నా సమస్తము            ||యేసయ్య||

పరము నుండి భూమికి దిగివచ్చిన యేసు
సిలువ మరణమునొంది మార్గము తెరిచెను
యేసే నా రక్షణ
యేసే నా నిరీక్షణ                ||యేసయ్య||

Sthothramu Sthuthi Sthothramu
Velaadi Vandanaalu
Kalugunu Gaaka Neeke Mahima
Ellappudu Sthuthi Sthothramu
Yesayya, Yesayya Yesayya (4)

Shoonyamu Nundi Samasthamu Kalugajesenu
Niraakaaramaina Naa Jeevithamunaku Roopamu Nichchenu
Yese Naa Sarvamu
Yese Naa Samasthamu          ||Yesayya||

Paramu Nundi Bhoomiki Digivachchina Yesu
Siluva Maranamunondi Maargamu Therichenu
Yese Naa Rakshana
Yese Naa Nireekshana           ||Yesayya||

ఆరాధించెదము యేసయ్య (జాన్ చక్రవర్తి)

పాట రచయిత: జాన్ చక్రవర్తి

ఆరాధించెదము యేసయ్య నామమును
పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము (2)
ఆరాధన ఆరాధన ఆరాధనా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా (2)     ||ఆరాధించెదము||

ఆది యందు ఉన్న దేవుడు
అద్భుతాలు చేయు దేవుడు (2)
అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు (2)
అద్వితీయ సత్య దేవుడు
యేసయ్య అద్వితీయ సత్య దేవుడు (2)       ||ఆరాధన||

మోక్షము నిచ్చు దేవుడు
మహిమను చూపు దేవుడు (2)
మోషే దేవుడు మాట్లాడే దేవుడు (2)
మహిమ గల దేవుడు నిత్య దేవుడు
యేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు (2)       ||ఆరాధన||

దాహము తీర్చు దేవుడు
ధన ధాన్యములిచ్చు దేవుడు (2)
దావీదుకు దేవుడు దానియేలు దేవుడు (2)
ధరణిలోన గొప్ప దేవుడు
యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు (2)       ||ఆరాధన||

Lyricist: John Chakravarthi

Aaraadhinchedamu Yesayya Naamamunu
Parishuddha Sanghamugaa Anni Velalaa Memu (2)
Aaraadhana Aaraadhana Aaraadhanaa
Hallelujah Hallelujah Hallelujah (2)    ||Aaraadhinchedamu||

Aadi Yandu Unna Devudu
Adbhuthaalu Cheyu Devudu (2)
Abrahaamu Devudu Aathmayaina Devudu (2)
Advitheeya Sathya Devudu
Yesayya Advitheeya Sathya Devudu (2)      ||Aaraadhana||

Mokshamu Nicchu Devudu
Mahimanu Choopu Devudu (2)
Moshe Devudu Maatlaade Devudu (2)
Mahima Gala Devudu Nithya Devudu
Yesayya Mahima Gala Devudu Nithya Devudu (2)      ||Aaraadhana||

Daahamu Theerchu Devudu
Dhana Dhaanyamulichchu Devudu (2)
Daaveeduku Devudu Daaniyelu Devudu (2)
Dharanilona Goppa Devudu
Yesayya Dharanilona Goppa Devudu (2)      ||Aaraadhana||

ఆరాధన ఆరాధన యేసయ్య / Aaraadhana Aaraadhana

ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన              (4)
యేసయ్య ఆరాధన…

ఆరాధన ఆరాధన మెస్సయ్య ఆరాధన             (4)
మెస్సయ్య ఆరాధన…

ఆరాధన ఆరాధన పరిశుద్ధుని ఆరాధన            (4)
పరిశుద్ధుని ఆరాధన…

ఆరాధన ఆరాధన పరలోక ఆరాధన                   (4)
పరలోక ఆరాధన…


ఘనతా మహిమా నీకేయని
హల్లెలూయా గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో                                 ||ఆరాధన||

Aaraadhana Aaraadhana Yesayya Aaraadhana (4)
Yesayya Aaraadhana…

Aaraadhana Aaraadhana Messayya Aaraadhana (4)
Messayya Aaraadhana…

Aaraadhana Aaraadhana Parishuddhuni Aaraadhana (4)
Parishuddhuni Aaraadhana…

Aaraadhana Aaraadhana Paraloka Aaraadhana (4)
Paraloka Aaraadhana…

అందమైన క్షణము ఆనందమయము / Andamaina Kshanamu Aanandamayamu

అందమైన క్షణము ఆనందమయము
యేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరము
యేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరము (2)
బంగారు సొగసు కన్నా బహు అందగాడు (2)
బోళము సాంబ్రాణి కన్నా బహు సుగంధుడు

సంబరమే సంబరము శ్రీ యేసు జననము
సర్వ జగతికి మహా సంతోషము
సర్వ సృష్టికి ముందే దేవుడేర్పరిచిన
శాశ్వత జీవం ఈ ప్రభు యేసే
శాశ్వత జీవం ఈ ప్రభు యేసే

బలమైన యోధుడు దేవాది దేవుడు
దీన నరుడై మనకై పుట్టాడు
మన గాయములకు కట్టు కట్టి
మన బ్రతుకులను వెలుగుతో నింపిన
దైవతనయుని కొలువ రావా
సందేహించకు ఓ సోదరా
రక్షణ మార్గము కోరి రావా
సంశయమెందుకు ఓ సోదరా… ఓ సోదరీ…      ||సంబరమే||

పాప విమోచన నిత్య జీవం
సిలువలోనే మనకు సాధ్యం
సిలువ భారం తాను మోసి
మన దోషములను తుడిచేసాడు
సిలువ చెంతకు చేర రావా
జాగు ఎందుకు ఓ సోదరా
యేసు నామము నమ్మ రావా
జాగు ఎందుకు ఓ సోదరా… ఓ సోదరీ…      ||సంబరమే||

Andamaina Kshanamu Aanandamayamu
Yesayya Puttina Vela Sambarame Sambaramu
Yesayya Puttina Vela Sambarame Sambaramu (2)
Bangaaru Sogasu Kannaa Bahu Andagaadu (2)
Bolamu Saambraani Kannaa Bahu Sugandhudu

Sambarame Sambaramu – Shree Yesu Jananamu
Sarva Jagathiki Mahaa Santhoshamu
Sarva Srushtiki Munde Devuderparachina
Shaashwatha Jeevam Ee Prabhu Yese
Shaashwatha Jeevam Ee Prabhu Yese

Balamaina Yodhudu Devaadhi Devudu
Deena Narudai Manakai Puttaadu
Mana Gaayamulaku Kattu Katti
Mana Brathukulanu Velugutho Nimpina
Daiva Thanayuni Koluva Raavaa
Sandehinchaku O Sodaraa
Rakshana Maargamu Kori Raavaa
Samshayamenduku O Sodaraa.. O Sodaree..         ||Sambarame||

Paapa Vimochana Nithya Jeevam
Siluvalone Manaku Saadhyam
Siluva Bhaaram Thaanu Mosi
Mana Doshamulanu Thudichesaadu
Siluva Chenthaku Chera Raavaa
Jaagu Enduku O Sodaraa
Yesu Naamamu Namma Raavaa
Jaagu Enduku O Sodaraa.. O Sodaree..         ||Sambarame||