పోరాటం ఆత్మీయ పోరాటం / Poraatam Aathmeeya Poraatam

పోరాటం ఆత్మీయ పోరాటం (2)
చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదు
సాగిపోవుచున్నాను
సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2)

నా యేసుతో కలిసి పోరాడుచున్నాను
అపజయమే ఎరుగని జయశీలుడాయన (2)
నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

నా యేసు వెళ్ళిన మార్గము లేనని
అవమానములైనా ఆవేదనలైనా (2)
నా యేసు కృపనుండి దూరపరచలేవని (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

ఆదియు అంతము లేనివాడు నా యేసు
ఆసీనుడయ్యాడు సింహాసనమందు (2)
ఆ సింహాసనం నా గమ్యస్థానం (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

Poraatam Aathmeeya Poraatam (2)
Chivari Shwaasa Varaku – Ee Poraatam Aagadu
Saagipovuchunnaanu
Siluvanu Mosukoni Naa Gamya Sthaanaaniki (2)

Naa Yesutho Kalisi Poraaduchunnaanu
Apajayame Erugani Jayasheeludaayana (2)
Naa Yesu Korake Samarpinchukunnaanu (2)
Aagiponu Nenu Saagipovuchunnaanu            ||Poraatam||

Naa Yesu Vellina Maargamu Lenani
Avamaanamulainaa Aavedanalainaa (2)
Naa Yesu Krupanundi Dooraparachalevani (2)
Aagiponu Nenu Saagipovuchunnaanu         ||Poraatam||

Aadiyu Anthamu Lenivaadu Naa Yesu
Aaseenudayyaadu Simhaasanamandu (2)
Aa Simhaasanam Naa Gamyasthaanam (2)
Aagiponu Nenu Saagipovuchunnaanu       ||Poraatam||

నే సాగెద యేసునితో / Ne Saageda Yesunitho

నే సాగెద యేసునితో
నా జీవిత కాలమంతా (2)

యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2)
పరమును చేరగ నే వెళ్లెద (2)
హనోకు వలె సాగెదా            ||నే సాగెద||

వెనుక శత్రువులు వెంటాడిననూ (2)
ముందు సముద్రము ఎదురొచ్చినా (2)
మోషె వలె సాగెదా             ||నే సాగెద||

లోకపు శ్రమలు నన్నెదిరించినా (2)
కఠినులు రాళ్ళతో హింసించినా (2)
స్తెఫను వలె సాగెదా            ||నే సాగెద||

బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2)
క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2)
పౌలు వలె సాగెదా             ||నే సాగెద||

తల్లి మరచిన తండ్రి విడచిన (2)
బంధువులే నన్ను వెలివేసినా (2)
బలవంతుని వలె సాగెదా    ||నే సాగెద||

Ne Saageda Yesunitho
Naa Jeevitha Kaalamanthaa (2)

Yesutho Gadipeda Yesutho Nadicheda (2)
Paramunu Cheraga Ne Velleda (2)
Hanoku Vale Saagedaa    ||Ne Saageda||

Venuka Shathruvulu Ventaadinanoo (2)
Mundu Samudramu Edurochchinaa (2)
Moshe Vale Saagedaa     ||Ne Saageda||

Lokapu Shramalu Nannedirinchinaa (2)
Katinulu Raallatho Himsinchinaa (2)
Stephanu Vale Saagedaa     ||Ne Saageda||

Brathukuta Kreesthe Chaavainaa Mele (2)
Kreesthukai Hatha Saakshigaa Maarina (2)
Poulu Vale Saagedaa     ||Ne Saageda||

Thalli Marachina Thandri Vidachina (2)
Bandhuvule Nannu Velivesinaa (2)
Balavanthuni Vale Saagedaa     ||Ne Saageda||

యేసుతో నడచి వెళ్ళెదం / Yesutho Nadachi Velledam

యేసుతో నడచి వెళ్ళెదం

అన్ని తావులలో

యేసుతో కూడ నుండెదం

అన్ని వేళలలో

1. రూపాంతర కొండనెక్కెదం

యేసుప్రభుని మహిమ చూచెదం

తండ్రి స్వరము చెవినబెట్టిదం

ఆనందం అనుభవించెదం

2. కల్వరిగిరి పైకి వెళ్ళేదం

యేసుని అనుసరించి సాగెదం

సిలువ శ్రమలో పాలుపొందెదం

భయపడక నిలిచియుండెదం

సొంతమైపోవాలి నా యేసుతో / Sonthamaipovaali Naa Yesutho

సొంతమైపోవాలి నా యేసుతో
మిళితమై పోవాలి నా ప్రియునితో (2)
సొంతమై మిళితమై యేసుతో ఏకమై (2)
ఎగిరి వెళ్లి పోవాలి నా రాజుతో
లీనమై పోవాలి ఆ ప్రేమలో (2)

నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి
నా వరుడు కలువరిలో బలియాయెను (2)
బలి అయిన వానికే నా జీవితం
అర్పించుకొనుటే నా ధర్మము (2)
ధర్మము.. ధర్మము.. యేసుతో జీవితం (2)         ||సొంతమై||

పరదేశిగా నేను వచ్చానిలా
తన ప్రేమ కీర్తిని చాటాలని (2)
ప్రియుని కోసమే బ్రతికెదను
కాపాడుకొందును సౌశీల్యము
ప్రభువు కోసమే బ్రతికెదను
కాపాడుకొందును నా సాక్ష్యము
యేసుతో జీవితం పరమున శాశ్వతం (2)         ||సొంతమై||

Sonthamaipovaali Naa Yesutho
Milithamai Povaali Naa Priyunitho (2)
Sonthamai Milithamai Yesutho Ekamai (2)
Egiri Velli Povaali Naa Raajutho
Leenamai Povaali Aa Premalo (2)

Naa Priyudu Naa Koraku Chethulu Chaachi
Naa Varudu Kaluvarilo Bali Yaayenu (2)
Bali Aina Vaanike Naa Jeevitham
Arpinchukonute Naa Dharmamu (2)
Dharmamu.. Dharmamu.. Yesutho Jeevitham (2)         ||Sonthamai||

Paradeshigaa Nenu Vachchaanila
Thana Prema Keerthini Chaataalani (2)
Priyuni Kosame Brathikedanu
Kaapadukondunu Sousheelyamu
Prabhuvu Kosame Brathikedanu
Kaapadukondunu Naa Saakshyamu
Yesutho Jeevitham Paramuna Shaashwatham (2)         ||Sonthamai||

కంట నీరేల / Kanta Neerela

కంట నీరేల? కలతలు ఏల?
యేసుతో నీవు సాగు వేళ
శోధన వేళ రోదన ఏల?
నీ విశ్వసము గెలిచే వేళ (2)
నమ్మిన ఆ దేవుడు – ఎన్నడు మరచిపోడు
నీయొక్క అవసరాలు – ఏనాడో తానెరిగాడు        ||కంట||

వలదు చింతన దేనికైనా
విన్నవించుము నీ నివేదన (2)
పొందితినను నీదు నమ్మకము
దరికి చేర్చును తగిన విజయము (2)
తిరుగన్నదే లేనివి – ఆ తండ్రి దీవెనలు
పొరపాటు ఎరుగనివి – తానిచ్చు ఆ మేలులు (2)        ||కంట||

రేపు గూర్చిన భయము వలదు
ప్రతి దినము తగు బాధ కలదు (2)
నీదు భారము మోయు ఆ దేవుడు
నీకు ముందుగా నడుచు ఎల్లప్పుడు (2)
నీలోని ఆ భయము – లోకానికి ప్రతిరూపం
స్థిరమైన నీ విశ్వాసం – దేవునికి సంతోషం (2)          ||కంట||

Kanta Neerela? Kalathalu Aela?
Yesutho Neevu Saagu Vela
Shodhana Vela Rodana Aela?
Ne Vishwaasamu Geliche Vela (2)
Nammina Aa Devudu – Ennadu Marachipodu
Neeyokka Avasaraalu – Aenaado Thaanerigaadu          ||Kanta||

Valadu Chinthana Denikainaa
Vinnavinchumu Nee Nivedana (2)
Pondithinanu Needu Nammakamu
Dariki Cherchunu Thagina Vijayamu (2)
Thirugannade Lenivi – Aa Thandri Deevenalu
Porapaatu Eruganivi – Thaanichchu Aa Melulu (2)          ||Kanta||

Repu Goorchina Bhayamu Valadu
Prathi Dinamu Thagu Baadha Kaladu (2)
Needu Bhaaramu Moyu Aa Devudu
Neeku Mundugaa Naduchu Ellappudu (2)
Neeloni Aa Bhayamu – Lokaaniki Prathiroopam
Sthiramaina Nee Vishwaasam – Devuniki Santhosham (2)          ||Kanta||