దేవుని గొప్ప మహిమను / Devuni Goppa Mahimanu

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

దేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా?
ద్వంద నీతికి నిష్కృతి లేదని నీకు తెలుసా ఓ క్రైస్తవా! (2)
ఎంత అధము అన్యుల కన్న, ఎంత ఘోరము ఆ యూద కన్న
వలదు పాపం ఇకపైనన్న, తిరిగి పొందు క్రీస్తులో  మన్నా  (2)

మరచినవా నీ అపజయములు
గుర్తు లేదా! ఆ శోధనలు
నీవు చూపిన ఆ వినయములు
ఏడ్చి చేసిన ఆ ప్రార్థనలు
తండ్రి నీవే దిక్కంటూ,  మోకరిల్లిన ఆ క్షణము
అందుకొంటివి విజయములు, విడిచి పెడితివి వాక్యములు (2)  ॥ఎంత॥

అందుకొంటివి బాప్తిస్మమును
పొందు కొంటివి ఆ రక్షణను
వదలబోకు ఆత్మీయతను
చేరనివ్వకు నిర్లక్ష్యమును
తీర్పు తీర్చే సమయంలో ఓర్పు దొరకదు గుర్తెరుగు
నిత్య జీవం లో నుండి, ఘోర నరకం చేరెదవా?  (2)  ॥ఎంత॥

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Devuni Goppa Mahimanu Choosi
Thirigi Paapam Chesedavaa?
Dvandava Neethiki Nishkruthi Ledani
Neeku Thelusaa O Kraisthavaa? (2)
Entha Adhamu Anyula Kanna
Entha Ghoramu Aa Yooda Kanna
Valadu Paapam Ikapainanna
Thirigi Pondu Kreesthulo Mannaa (2)

Marachinaavaa Nee Apajayamulu
Guruthu Ledaa Aa Shodhanalu
Neevu Choopina Aa Vinayamulu
Edchi Chesina Aa Praardhanalu
Thandri Neeve Dikkantu
Mokarillina Aa Kshanamu
Andukontivi Vijayamulu
Vidachi Pedithivi Vaakyamunu (2)    ||Entha||

Andukontivi Baapthismamunu
Pondukontivi Aa Rakshananu
Vadalaboku Aathmeeyathanu
Cheranivvaku Nirlakshyamunu
Theerpu Theerche Samayamlo
Orpu Dorakadu Gurtherugu
Nithya Jeevamlo Nundi
Ghora Narakam Cheredaa (2)    ||Entha||

దేవుడు నీకు తెలుసు / Devudu Neeku Thelusu

దేవుడు నీకు తెలుసు – నీవు దేవునికి తెలుసా
నీవు దేవుని నమ్మినా – నిన్ను దేవుడు నమ్మాలి (2)
అవసరాలకు దేవుని నమ్మక
ఆత్మకు తండ్రని నమ్మాలి (2)
నీ ఆత్మకు తండ్రని నమ్మాలి         ||దేవుడు||

నాలుగు గోడల మధ్య నీవు నలిగిపోక
నలు దిక్కులకు సువార్తను ప్రకటించు (2)
ప్రభువా ప్రభువని పిలువక – ప్రార్ధనతో విసిగించక
పాపిని రక్షించు పరలోకానికి నడిపించు
నా నిమిత్తము ఎవడు పోవునని అడుగుచున్నాడు దేవుడు
నా అవసరత తీర్చమని అడుగుచున్నాడు క్రైస్తవుడు          ||దేవుడు||

నామకార్ధ భక్తి దేవునికే అది విరక్తి
సువార్త భారం కలిగి నీవు బ్రతికితేనే ముక్తి (2)
ప్రజలందరికి ఇదే బైబిల్ సూక్తి (2)
దేవుని చేయి వెతకకుంటే అగ్నితోనే శాస్తి (2)
దేవునికిష్టమైనది తెలుసుకోవాలి ముందు
దేహానికిష్టమైనది అడగకూడదు ముందు         ||దేవుడు||

Devudu Neeku Thelusu – Neevu Devuniki Thelusaa
Neevu Devuni Namminaa – Ninnu Devudu Nammaali (2)
Avasaaralaku Devuni Nammaka
Aathmaku Thandrani Nammaali (2)
Nee Aathmaku Thandrani Nammaali            ||Devudu||

Naalugu Godala Madhya Neevu Naligipoka
Nalu Dikkulaku Suvaarthanu Prakatinchu (2)
Prabhuvaa Prabhuvani Piluvaka – Praardhanatho Visginchaka
Paapini Rakshinchu Paralokaaniki Nadipinchu
Naa Nimitthamu Evadu Povunani Aduguchunnaadu Devudu
Naa Avasaratha Theerchamani Aduguchunnaadu Kraisthavudu         ||Devudu||

Naamakaardha Bhakthi Devunike Adi Virakthi
Suvaartha Bhaaram Kaligi Neevu Brathikithene Mukthi (2)
Prajalandariki Ide Bible Sookthi (2)
Devuni Cheyi Vethakakunte Agnithone Shaasthi (2)
Devunikishtamainadi Thelusukovaali Mundu
Dehaanikishtamainadi Adagakoodadu Mundu          ||Devudu||