నిన్ను కాపాడు దేవుడు / Ninnu Kaapaadu Devudu

పాట రచయిత: క్రాంతి చేపూరి

నిన్ను కాపాడు దేవుడు
కునుకడు నిదురపోడు – నిదురపోడు
వాగ్ధానమిచ్చి మాట తప్పడు
నమ్మదగినవాడు – నమ్మదగినవాడు
భయమేల నీకు – దిగులేల నీకు (2)
ఆదరించు యేసు దేవుడు ఉండగా          ||నిన్ను కాపాడు||

శత్రు బలము నిన్ను చుట్టుముట్టినా
శోధనలలో – నిన్ను నెట్టినా (2)
కోడి తన పిల్లలను కాచునంతగా
కాపాడు దేవుడు నీకు ఉండగా (2)
భయమేల నీకు – దిగులేల నీకు (2)
కాపాడు గొప్ప దేవుడు ఉండగా          ||నిన్ను కాపాడు||

రోగ భారమందు లేవకున్ననూ
వ్యాధులు నిన్ను కృంగదీసినా (2)
చనిపోయిన లాజరును తిరిగి లేపిన
స్వస్థపరచు దేవుడు నీకు ఉండగా (2)
భయమేల నీకు – దిగులేల నీకు (2)
స్వస్థపరచు సత్య దేవుడు ఉండగా          ||నిన్ను కాపాడు||

Lyricist: Kranthi Chepuri

Ninnu Kaapaadu Devudu
Kunukadu Nidurapodu – Nidurapodu
Vaagdhaanamichchi Maata Thappadu
Nammadaginavaadu – Nammadaginavaadu
Bhayamela Neeku – Digulela Neeku (2)
Aadarinchu Yesu Devudu Undagaa            ||Ninnu Kaapaadu||

Shathru Balamu Ninnu Chuttumuttinaa
Shodhanalalo – Ninnu Nettinaa (2)
Kodi Thana Pillalanu Kaachunanthagaa
Kaapaadu Devudu Neeku Undagaa (2)
Bhayamela Neeku – Digulela Neeku (2)
Kaapaadu Goppa Devudu Undagaa            ||Ninnu Kaapaadu||

Roga Bhaaramandu Levakunnanoo
Vyaadulu Ninnu Krungadeesinaa (2)
Chanipoyina Laazarunu Thirigi Lepina
Swasthaparachu Devudu Neeku Undagaa (2)
Bhayamela Neeku – Digulela Neeku (2)
Swasthaparachu Sathya Devudu Undagaa            ||Ninnu Kaapaadu||

అప్పగింపబడిన రాత్రి / Appagimpabadina Raathri

పాట రచయిత: పడిదెం అనంత రావు

అప్పగింపబడిన రాత్రి
చెప్ప సాగే శిష్యులతో (2)
చెప్పరాని దుఃఖముతో
తప్పదు నాకీ మరణమనెను (2)       ||అప్పగింప||

రొట్టె విరచి ప్రార్ధించి
నిట్టూర్పు విడచి ఇది నా దేహం (2)
పట్టుదలతో నేనొచ్చుఁ వరకు
ఇట్టులనే భుజించుడనెను (2)       ||అప్పగింప||

ద్రాక్షా రస గిన్నెను చాపి
వీక్షించుడిదియే నా రక్తం (2)
రక్షణార్థం దీని త్రాగి
మోక్ష రాజ్యం చేరుడనెను (2)       ||అప్పగింప||

రాతివేత దూరాన
చేతులెత్తి ప్రభు మోకరించి (2)
నా తండ్రి నీ చిత్తమైతే
ఈ పాత్రన్ తీసి వేయుమనెను (2)       ||అప్పగింప||

ఇదిగో వచ్చె తుది ఘడియ
హృదయ బాధ హెచ్చెను (2)
పదిలపరచు-నట్లు తండ్రిన్
మదిలో వదలక ప్రార్ధించుడనెను (2)       ||అప్పగింప||

Appagimpabadina Raathri
Cheppa Saage Shishyulatho (2)
Chepparaani Dukhamutho
Thappadu Naakee Maranamanenu (2)       ||Appagimpa||

Rotte Virachi Praardhinchi
Nittoorpu Vidachi Idi Naa Deham (2)
Pattudalatho Nenochchu Varaku
Ittulane Bhujinchudanenu (2)       ||Appagimpa||

Draakshaa Rasa Ginnenu Chaapi
Veekshinchudidiye Naa Raktham (2)
Rakshanaardham Deeni Thraagi
Moksha Raajyam Cherudanenu (2)       ||Appagimpa||

Raathi Vetha Dooraana
Chethuletthi Prabhu Mokarinchi (2)
Naa Thandri Nee Chitthamaithe
Ee Paathran Theesi Veyumanenu (2)       ||Appagimpa||

Idigo Vachche Thudi Ghadiyalu
Hrudaya Baadha Hechchenu (2)
Padilaparachu-natlu Thandrin
Madilo Vadalaka Praardhinchudanenu (2)       ||Appagimpa||