నూతన సంవత్సరములో / Noothana Samvathsaramulo

నూతన సంవత్సరములో
యేసు.. నూతన పరచుము నన్ను
నూతన జీవమిచ్చి
నూతన కృపనిమ్మయా (2)
ఆనందమే సంతోషమే
యేసయ్యలో నాకు సంబరమే (2)     ||నూతన||

పాపమంత మన్నించయ్యా
పరిశుద్ధ మనసు నాకు ఇమ్మయ్యా (2)
ప్రభు నీతో నడుచుటకు
నీ సన్నిధిలో ఉండుటకు (2)     ||నూతన||

వాక్యముతో కడుగుమయా
పరిశుద్ధ ఆత్మను నాకిమ్మయ్యా (2)
ప్రభు నీతో నడుచుటకు
నీ సన్నిధిలో ఉండుటకు (2)     ||నూతన||

సత్యముతో నింపుమయా
నీ సాక్షిగ నేనుండుటకు (2)
ప్రభు నీతో నడుచుటకు
నీ సన్నిధిలో ఉండుటకు (2)     ||నూతన||

Noothana Samvathsaramulo
Yesu.. Noothana Parachumu Nannu
Noothana Jeevamichchi
Noothana Krupanimmayaa (2)
Aanandame Santhoshame
Yesayyalo Naaku Sambarame (2)         ||Noothana||

Paapamantha Manninchayyaa
Parishuddha Manasu Naaku Immayyaa (2)
Prabhu Neetho Naduchutaku
Nee Sannidhilo Undutaku (2)         ||Noothana||

Vaakyamutho Kadugumayaa
Parishuddha Aathmanu Naakimmayya (2)
Prabhu Neetho Naduchutaku
Nee Sannidhilo Undutaku (2)         ||Noothana||

Sathyamutho Nimpumayaa
Nee Sakshiga Nenundutaku (2)
Prabhu Neetho Naduchutaku
Nee Sannidhilo Undutaku (2)         ||Noothana||

నీతో నా జీవితం / Neetho Naa Jeevitham

నీతో నా జీవితం సంతోషమే
నీతో నా అనుబంధం మాధుర్యమే (2)
నా యేసయ్యా కృప చూపుచున్నావు – వాత్సల్యపూర్ణుడవై
నా యేసయ్యా నడిపించుచున్నావు – స్ఫూర్తిప్రదాతవై
ఆరాధ్యుడా యేసయ్యా…
నీతో నా అనుబంధం మాధుర్యమే

భీకర ధ్వనిగలా మార్గమునందు
నను స్నేహించిన నా ప్రియుడవు నీవు (2)
కలనైన మరువను నీవు నడిపిన మార్గం
క్షణమైన విడువను నీతో సహవాసం (2)       ||ఆరాధ్యుడా||

సంతోషమందైనా శ్రమలయందైనను
నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే (2)
నిత్యమైన మహిమలో నను నిలుపుటకు
శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2)       ||ఆరాధ్యుడా||

ఆకాశమందుండి ఆశీర్వదించితివి
అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని (2)
నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు
నూతన కృపలతో నను నింపుచున్నావు (2)        ||నీతో నా||

Neetho Naa Jeevitham Santhoshame
Neetho Naa Anubandham Maadhuryame (2)
Naa Yesayyaa Krupa Choopuchunnaavu – Vaathsalyapoornudavai
Naa Yesayyaa Nadipinchuchunnaavu – Spoorthipradhaathavai
Aaraadhyudaa Yesayyaa…
Neetho Naa Anubandham Maadhuryame

Bheekara Dhwanigala Maargamunandu
Nanu Snehinchina Naa Priyudavu Neevu (2)
Kalanaina Maruvanu Neevu Nadipina Maargam
Kshanamaina Viduvanu Neetho Sahavaasam (2)        ||Aaraadhyudaa||

Santhoshamandainaa Shramalayandainanu
Naa Sthuthi Keerthanaku Aadhaaramu Neeve (2)
Nithyamaina Mahimalo Nanu Niluputaku
Shuddha Suvarnamugaa Nanu Maarchuchunnaavu (2)        ||Aaraadhyudaa||

Aakaashamandundi Aasheervadinchithivi
Abhaagyudanaina Nenu Kanikarimpabadithini (2)
Neelo Niluchutaku Bahugaa Phalinchutaku
Noothana Krupalatho Nanu Nimpuchunnaavu (2)       ||Neetho Naa||

నా దేహమును / Naa Dehamunu

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము
నే సమర్పింతును నీకు నా దేహము సజీవయాగముగా ప్రభు
యేసు నాలో నీవు ఉంటే – నీ సంపదలు నా సొంతమే
యేసు నీలో నేను ఉంటే – నా బ్రతుకంతా సంతోషమే     ||నా దేహమును||

నాలో నీ సన్నిధి ఉందని
గ్రహియించు జ్ఞానమును కలిగుంచుము
నా దేహమును భయముతో భక్తితో
నీ కొరకు పరిశుద్ధముగా దాచెద
ఈ లోకములో జనముల ఎదుట మాదిరిగా జీవింతును
నా దేహముతో నీ నామమును ఘనపరతును నిత్యము     ||నా దేహమును||

నీ జీవ ప్రవాహము ప్రవహించనీ
నాలోని అణువణువు చిగురించును
ఫలియించు ద్రాక్షావల్లి వలె నేను
విస్తారముగా దేవా ఫలియింతును
నా దీవెనగా నీవు ఉంటే నాకేమైనా కొదువుండునా
ఈ లోకముకు నన్ను నీవు దీవెనగా మార్చు ప్రభు     ||నా దేహమును||

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Naa Dehamunu Nee Aalayamugaa N irminchi Nivasinchumu
Ne Samarpinthunu Neeku Naa Dehamu Sajeevayaagamugaa Prabhu
Yesu Naalo Neevu Unte – Nee Sampadalu Naa Sonthame
Yesu Neelo Nenu Unte – Naa Brathukanthaa Santhoshame
                                                                              ||Naa Dehamunu||

Naalo Nee Sannidhi Undani
Grahiyinchu Gnaanamunu Kaliginchumu
Naa Dehamunu Bhayamutho Bhakthitho
Nee Koraku Parishuddhamugaa Daacheda
Ee Lokamulo Janamula Eduta Maadirigaa Jeevinthunu
Naa Dehamutho Nee Naamamunu Ghanaparathunu Nithyamu
||Naa Dehamunu||

Nee Jeeva Pravaahamu Pravahinchani
Naaloni Anuvanuvu Chigurinchunu
Phaliyinchu Draakshaavalli Vale
Nenu Visthaaramugaa Devaa Phaliyinthunu
Naa Deevenagaa Neevu Unte Naakemainaa Koduvundunaa
Ee Lokamuku Nannu Neevu Deevenagaa Maarchu Prabhu
||Naa Dehamunu||

తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ / Thandri Intlo Ellappudu

పాట రచయిత: ఎస్ జె బెర్క్మన్స్
Lyricist: S J Berchmans

తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే
ఆటలు పాటలు ఇక్కడేగా
ఆడుదాం కొనియాడుదాం
పాడుదాం నాట్యమాడుదాం (2)
హల్లెలూయా ఆనందమే
హద్దులేని సంతోషమే (2)          ||తండ్రి||

వేచియుండి కనుగొంటిరి
కన్నీరంతా తుడిచితిరి (2)         ||ఆడుదాం||

పరిశుద్ధ ముద్దు పెట్టి
పాపాలన్ని తొలగించెను (2)         ||ఆడుదాం||

పాపానికి మరణించి
క్రొత్త రూపం పొందితిని (2)         ||ఆడుదాం||

ఆత్మ అనే వస్త్రమిచ్చె
అధికార బలమును ఇచ్చె (2)         ||ఆడుదాం||

పాట రచయిత: ఎస్ జె బెర్క్మన్స్
Lyricist: S J Berchmans

Thandri Intlo Ellappudu Santhoshame
Aatalu Paatalu Ikkadegaa
Aadudaam Koniyaadudaam
Paadudaam Naatyamaadudaam (2)
Hallelooyaa Aanandame
Hadduleni Santhoshame (2)          ||Thandri||

Vechiyundi Kanugontiri
Kanneeranthaa Thudachithiri (2)            ||Aadudaam||

Parishuddha Muddu Petti
Paapaalanni Tholaginchenu (2)            ||Aadudaam||

Paapaaniki Maraninchi
Krottha Roopam Pondithini (2)            ||Aadudaam||

Aathma Ane Vasthramichche
Adhikaara Balamunu Icche (2)            ||Aadudaam||

ఆహా ఆనందమే / Aahaa Aanandame

పాట రచయిత: మేరీ విజయ్ నన్నేటి

ఆహా ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో (2)
ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో (2)       ||ఆహా||

యెషయా ప్రవచనము నేడు రుజువాయే
జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2)      ||ఆనందమే||

మీకా ప్రవచనము నేడు రుజువాయే
ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2)      ||ఆనందమే||

తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే
దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2)          ||ఆనందమే||

Lyricist: Mary Vijay Nanneti

Aahaa Aanandame Mahaa Santhoshame
Yesu Putte Ilalo (2)
Aanandame Mahaa Santhoshame
Yesu Putte Ilalo (2)        ||Aahaa||

Yeshayaa Pravachanamu Nedu Rujuvaaye
Janminche Kumaarundu Kanya Garbhamanduna (2) ||Aanandame||

Meekaa Pravachanamu Nedu Rujuvaaye
Ishraayel Neledivaadu Janminche Bethlehemuna (2) ||Aanandame||

Thandri Vaagdhaanam Nedu Neravere
Devuni Bahumaanam Shree Yesuni Janmamu (2) ||Aanandame||

క్రిస్మస్ ఆనందం / Christmas Aanandam

క్రిస్మస్ ఆనందం సంతోషమే
నా యేసుని జన్మదినమే
యూదుల రాజుగ జన్మించెనే
పశులతొట్టెలో పరుండబెట్టెనే (2)
క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)       ||క్రిస్మస్ ఆనందం||

సంతోషం సంబరం – రాజులకు రాజు పుట్టెను
ఆనందం మనకు అనుదినం – ఇక ఇమ్మానుయేలు వచ్చెను (2)
క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)       ||క్రిస్మస్ ఆనందం||

గొల్లలు జ్ఞానులు – దర్శించి పూజించిరి
విలువైన కానుకలను – అర్పించి ప్రణమిల్లిరి (2)
క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)       ||క్రిస్మస్ ఆనందం||

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త – బలవంతుడైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమధాన కర్త – ఇమ్మనుయేలు యేసుడు (2)
క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)       ||క్రిస్మస్ ఆనందం||

Christmas Aanandam Santhoshame
Naa Yesuni Janmadiname
Yoodula Raajuga Janminchene
Pashula Thottelo Parundabettene (2)
Christmas – Happy Christmas
Christmas – Merry Christmas (2)      ||Christmas||

Santhosham Sambaram – Raajulaku Raaju Puttenu
Aanandam Manaku Anudinam – Ika Immaanuyelu Vachchenu (2)
Christmas – Happy Christmas
Christmas – Merry Christmas (2)      ||Christmas||

Gollalu Gnaanulu – Darshinchi Poojinchiri
Viluvaina Kaanukalanu – Arpinchi Pranamilliri (2)
Christmas – Happy Christmas
Christmas – Merry Christmas (2)      ||Christmas||

Aascharyakarudu Aalochanakartha – Balavanthudaina Devudu
Nithyudagu Thandri Samaadhaana Kartha – Immaanuyelu Yesudu (2)
Christmas – Happy Christmas
Christmas – Merry Christmas (2)      ||Christmas||

ఆ రాజే నా రాజు నా రాజే రారాజు / Aa Raaje Naa Raaju Naa Raaje Raaraaju

పాట రచయిత: బన్ని సుదర్శన్

ఆ రాజే నా రాజు – నా రాజే రారాజు
నా రాజు రాజులకు రాజు (2)
యేసు పుట్టెను ఈ లోకంలో
ఆనందమే గొప్ప ఆనందమే (2)
ఆనందమే గొప్ప ఆనందమే
సంతోషమే సర్వలోకమే (2)         ||ఆ రాజే||

యెష్షయి మొద్దున – దావీదు చిగురుగా
లోక రక్షకుడు జన్మించెను
లోక పాపాలను కడిగి వేయగా
భువిలో బాలుడిగా అరుదించెను (2)
పరిశుద్ధాత్మ మూలముగా జన్మించెను
మన పాపాలకు విరుగుడు మందును (తెచ్చెను) (తెచ్చి అందించెను) (2)        ||ఆనందమే||

వీనుల విందుగా – దీనుల అండగా
కరుణా కారకుడు కడలివచ్చెను
పాపుల శాపాలను తానే మోయగా
పరమ పాలకుడు పుడమి చేరెను (2)
కుల మత బేధాలను హరియించ వచ్చెను
పరలోకానికి చేర్చే (మార్గమాయెను) (మార్గమై తనే నిలిచెను) (2)        ||ఆనందమే||

Lyricist: Bunny Sudarshan

Aa Raaje Naa Raaju – Naa Raaje Raaraaju
Naa Raaju Raajulaku Raaju (2)
Yesu Puttenu Ee Lokamlo
Aanandame Goppa Aanandame (2)
Aanandame Goppa Aanandame
Santhoshame Sarva Lokame (2)         ||Aa Raaje||

Yeshshayi Modduna – Daaveedu Chigurugaa
Loka Rakshakudu Janminchenu
Loka Paapaalanu Kadigi Veyagaa
Bhuvilo Baaludigaa Arudinchenu (2)
Parishuddhaathma Moolamugaa Janminchenu
Mana Paapaalaku Virugudu Mandunu (Thechcenu) (Thechchi Andinchenu) (2)          ||Aanandame||

Veenula Vindugaa – Deenula Andagaa
Karunaa Kaarakudu Kadali Vachchenu
Paapula Shaapaalnu Thaane Moyagaa
Parama Paalakudu Pudami Cherenu (2)
Kula Matha Bedhaalanu Hariyincha Vachchenu
Paralokaaniki Cherche (Maargamaayenu) (Maargamai Thane Nilichenu) (2)          ||Aanandame||