ఆనందముగా యెహోవా (సీయోను గీతాలు) / Aanandamugaa Yehovaa(Songs of Zion)

పాట రచయిత: సీయోను గీతాలు

ఆనందముగా యెహోవా నీ కృపలన్ని
అన్ని కాలంబులందు కీర్తించెదన్ (2)

చావు గోతినుండి లెవనెత్తి నాకు – జీవమిచ్చిన జీవ దాత
వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో
సవ్యంబుగా ఈ భువియందున           ||ఆనందముగా||

సింహపు పిల్లలు – ఆకలిగొనిన- యెహొవ సహాయుడందరికి
ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు
అహా! ఏమందు నీ విశ్వాస్యతన్         ||ఆనందముగా||

ఎన్నెన్నో శోధన బాధలు రేగి – నన్ను కృంగదీయ పోరాడినన్
ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన
కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్       ||ఆనందముగా||

పర్వతంబులు – పారిపోయినను- ఉర్విలోమార్పు కలిగిననూ
తరుణములు విరోధముగపై లేచినా –
స్మరియించెద నీ విశ్వాస్యతన్             ||ఆనందముగా||

Lyricist: Songs of Zion

Aanandamugaa Yehovaa Nee Krupaalanni
Anni Kaalambulandu Keerthinchedan (2)

Chaavu Gothinundi Levaneththi Naaku – Jeevamichchina Jeeva Daatha
Vivarinthu Ne Needu Vishwaasyatha Nenthayo
Savyambugaa Ee Bhuviyanduna           ||Aanandamugaa||

Simhapu Pillalu – Aakaligonina- Yehova Sahaayu Dandariki
Ihamandunaa Ae Melu Koduva Yundadu
Aaha! Emandu Nee Vishwaasyathan       ||Aanandamugaa||

Ennenno Shodhana Baadhalu Regi – Nannu Krungadeeya Poraadinan
Ghanamaina Nee Vishwaasyathan Naaku Choopina
Kanna Thandri Ninnu Koniyaadedan       ||Aanandamugaa||

Parvathambulu – Paaripoyinanu- Urvilo Maarpu Kaliginanoo
Tharunamulu Virodhamuga Pai Lechinaa-
Smariyincheda Nee Vishwasyathan         ||Aanandamugaa||

ఆనందము ప్రభు (సీయోను గీతాలు) / Aanandamu Prabhu Naakosagenu

పాట రచయిత: సీయోను గీతాలు

ఆనందము ప్రభు నాకొసగెను
నా జీవితమే మారెను (2)
నా యుల్లమందు యేసు వచ్చెన్
నా జీవిత రాజాయెను (2)         ||ఆనందము||

ప్రభుని రుచించి ఎరిగితిని
ఎంతో ఎంతో ప్రేమాముర్తి (2)
విశ్వమంతట నే గాంచలేదు
విలువైన ప్రభు ప్రేమను (2)      ||ఆనందము||

అలల వలె నా సంతోషము
పైకి ఉప్పొంగి ఎగయుచుండె (2)
నన్ను పిలిచి మేలులెన్నో చేసే
నూతన జీవమొసగెన్ (2)       ||ఆనందము||

శత్రువున్ ఎదిరించి పోరాడెదన్
విజయము పొంద బలమొందెదన్ (2)
ప్రభువుతో లోకమున్ జయించెదన్
ఆయనతో జీవించెదన్ (2)    ||ఆనందము||

Lyricist: Songs of Zion

Aanandamu Prabhu Naakosagenu
Naa Jeevithame Maarenu (2)
Naa Yullamandu Yesu Vachchen
Naa Jeevitha Raajaayenu (2) ||Aanandamu||

Prabhuni Ruchinchi Erigithini
Entho Entho Premaamurthy (2)
Vishwamanthata Ne Gaanchaledu
Viluvaina Prabhu Premanu (2) ||Aanandamu||

Alala Vale Naa Santhoshamu
Paiki Uppongi Egayuchunde (2)
Nannu Pilichi Melulenno Chese
Noothana Jeevamosagen (2) ||Aanandamu||

Shathruvun Edirinchi Poraadedan
Vijayamu Ponda Balamondedan (2)
Prabhuvutho Lokamun Jayinchedan
Aayanatho Jeevinchedan (2)  ||Aanandamu||

ఆనందం నీలోనే ( హోసన్నా మినిస్ట్రీస్) / Aanandam Neelone(Hosanna Ministries)

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్

ఆనందం నీలోనే – ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే – నా యేసయ్యా – స్తోత్రార్హుడు
అర్హతేలేని నన్ను – ప్రేమించినావు
జీవింతు ఇలలో – నీ కోసమే – సాక్ష్యార్థమై    ||ఆనందం||

పదే పదే నిన్నే చేరగా
ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2)
కలవరాల కోటలో – కన్నీటి బాటలో (2)
కాపాడే కవచంగా – నన్ను ఆవరించిన
దివ్యక్షేత్రమా – స్తోత్రగీతమా    ||ఆనందం||

నిరంతరం నీవే వెలుగని
నిత్యమైన స్వాస్థ్యం నీదని (2)
నీ సన్నిధి వీడక – సన్నుతించి పాడనా (2)
నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా
సత్యవాక్యమే – జీవవాక్యమే    ||ఆనందం||

సర్వసత్యమే నా మార్గమై
సంఘక్షేమమే నా ప్రాణమై (2)
లోక మహిమ చూడక – నీ జాడలు వీడక (2)
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో
ఈ దర్శనం – నా ఆశయం    ||ఆనందం||

Lyricist: Hosanna Ministries

Aanandam Neelone – Aadhaaram Neevegaa
Aashrayam Neelone – Naa Yesayyaa.. Sthothraarhudaa (2)
Arhathe Leni nannu – Preminchinaavu
Jeevinthu Ilalo – Nee Kosame.. Sakshyaardhamai       ||Aanandam||

Pade Pade ninne Cheragaa
Prathikshanam Neeve Dhyaasagaa (2)
Kalavaraala Kotalo – Kanneeti Baatalo (2)
Kaapaade Kavachamgaa – Nannu Aavarinchina
Divya Kshethramaa – Sthothra Geethamaa       ||Aanandam||

Nirantharam Neeve Velugani
Nithyamaina Swaasthyam Needani (2)
Nee Sannidhi Veedaka – Sannuthinchi Paadanaa (2)
Nee Korake Dhwajametthi Ninnu Prakatinchinaa
Sathya Vaakyame – Jeeva Vaakyame       ||Aanandam||

Sarva Sathyame Naa Maargamai
Sangha Kshemame Naa Praanamai (2)
Loka Mahima Choodaka – Nee Jaadalu Veedaka (2)
Neethone Nilavaali Nithya Seeyonulo
Ee Darshanam – Naa Aashayam       ||Aanandam||

ఆదియంతము లేనివాడా (సీయోను గీతాలు) / Aadiyanthamu Leni Vaadaa(Songs of Zion)

పాట రచయిత: సీయోను గీతాలు

ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా
నీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే

అబ్రాహామును పిలిచితివి – ఆ వంశమున బుట్టితివి
అనాధులకు దిక్కు నీవే – అనాధుడవై వచ్చితివి    ||ఆదియంతము||

ఇస్సాకును విడిపించి – యేసయ్యా బలియైనావా
యూదాచే నమ్మబడితివి – పాపులకై మరణించితివి    ||ఆదియంతము||

యోనావలె మూడు దినముల్ – భూగర్భమున నీవుండి
మానవులను రక్షింప – మహిమతోడ లేచితివి    ||ఆదియంతము||

పండ్రెండు గోత్రముల – జెంది – పండ్రెండు శిష్యుల జనకా
కన్యపుత్రుడవై సీయోను – కన్యను వరించితివి    ||ఆదియంతము||

దావీదు కుమారుడవు – దావీదుకు దేవుడవు
కాపాడుచు నున్నావు – పాపిని నన్ను ప్రేమించి    ||ఆదియంతము||

Lyricist: Songs of Zion

Aadiyanthamu Leni Vaadaa Sampoornudagu Maa Devaa
Neethi Gnaanamu Kalavaadaa Jyothiki Nilayamu Neeve

Abrahaamunu Pilichithivi – Aa Vamshamuna Buttithivi
Anaadhulaku Dikku Neeve – Anaadhudavai Vachchithivi      ||Aadiyanthamu||

Issaakunu Vidipinchi – Yesayyaa Baliyainaavaa
Yoodaache Nammabadithivi – Paapulakai Maraninchithivi      ||Aadiyanthamu||

Yonaa Vale Moodu Dinamul – Bhoo Garbhamuna Neevundi
Maanavulanu Rakshmipa – Mahima Thoda Lechithivi      ||Aadiyanthamu||

Pandrendu Gothramula – Jendi – Pandrendu Shishyula Janakaa
Kanya Puthrudavai Seeyonu – Kanyanu Varinchithivi      ||Aadiyanthamu||

Daaveedu Kumaarudavu – Daaveeduku Devudavu
Kaapaaduchununnaavu – Paapini Nannu Preminchi      ||Aadiyanthamu||

ఆగని పరుగులో ఎండిన / Aagani Parugulo Endina

పాట రచయిత: జాషువా షేక్

ఆగని పరుగులో ఎండిన ఎడారులు (2)
కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు
ఉన్నపాటునా నలిగె నా వైపున
కదలిరాలేవా ఆదరించగ రావా
కన్నీరే నా మజిలీ – దరి చేరే నీ జాలి
లాలించే నీ ప్రేమ – నా ప్రాణమై
కరుణించే నీ చూపు – మన్నించే నా మనవి
అందించే నీ చేయి – నా స్నేహమై     ||ఆగని||

లోకప్రేమే సదా – కలల కడలే కదా
తరంగమై కావుమా – తిరిగి తీరమునకు (2)
నీవే కదా ఆధారం – సదా నీకే దాసోహం
యేసయ్యా… అర్పించెదా – నా జీవితం     ||ఆగని||

ఎదుట నిలిచె నీవే – ప్రేమకు రూపం నీవే
కృపామయా కావుమా – జార విడువకు నన్ను (2)
నీవే కదా నా మూలం – సదా నీపై నా భారం
యేసయ్యా… ప్రేమించెదా – కలకాలము     ||ఆగని||

Lyricist: Joshua Shaik

Aagani Parugulo Endina Edaarulu (2)
Krungina Brathukulo Nindina Korathalu
Unnapaatunaa Nalige Naa Vaipuna
Kadali Raalevaa Aadarinchaga Raavaa
Kanneere Naa Majili – Dari Chere Nee Jaali
Laalinche Nee Prema – Naa Praanamai
Karuninche Nee Choopu – Manninche Naa Manavi
Andinche Nee Cheyi – Naa Snehamai       ||Aagani||

Loka Preme Sadaa – Kalala Kadale Kadaa
Tharangamai Kaavumaa – Thirigi Theeramunaku (2)
Neeve Kadaa Aadhaaram – Sadaa Neeke Daasoham
Yesayyaa… Arpinchedaa – Naa Jeevitham       ||Aagani||

Eduta Niliche Neeve – Premaku Roopam Neeve
Krupaamayaa Kaavumaa – Jaara Viduvaku Nannu (2)
Neeve Kadaa Naa Moolam – Sadaa Neepai Naa Bhaaram
Yesayyaa… Preminchedaa – Kalakaalamu       ||Aagani||

ఆకాశ వాసులారా యెహోవాను / Aakaasha VaasulaaraaYehovaanu

ఆకాశ వాసులారా
యెహోవాను స్తుతియించుడి (2)
ఉన్నత స్థలముల నివాసులారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2)         ||ఆకాశ||

ఆయన దూతలారా మరియు
ఆయన సైన్యములారా (2)
సూర్య చంద్ర తారలారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2)         ||ఆకాశ||

సమస్త భుజనులారా మరియు
జనముల అధిపతులారా (2)
వృద్దులు బాలురు, యవ్వనులారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2)         ||ఆకాశ||

క్రీస్తుకు సాక్షులారా మరియు
రక్షణ సైనికులారా (2)
యేసు క్రీస్తు పావన నామం
ఘనముగ స్తుతియించుడి – హల్లేలూయ (2)         ||ఆకాశ||

Aakaasha Vaasulaaraa
Yehovaanu Sthuthiyinchudi (2)
Unnatha Sthalamula Nivaasulaaraa
Yehovaanu Sthuthiyinchudi – Hallelooya (2)        ||Aakaasha||

Aayana Doothalaaraa Mariyu
Aayana Sainyamulaaraa (2)
Surya Chandra Thaaralaaraa
Yehovaanu Sthuthiyinchudi – Hallelooya (2)        ||Aakaasha||

Samastha Bhoojanulaaraa Mariyu
Janamula Adhipathulaaraa (2)
Vruddhulu Baaluru, Yavvanulaaraa
Yehovaanu Sthuthiyinchudi – Hallelooya (2)        ||Aakaasha||

Kreesthuku Saakshulaaraa Mariyu
Rakshana Sainikulaaraa (2)
Yesu Kreesthu Paavana Naamam
Ghanamuga Sthuthiyinchudi – Hallelooya (2)        ||Aakaasha||

ఆకాశ మహాకాశంబులు ( సీయోను గీతాలు) / Aakaasha Mahaa-kaashambulu

పాట రచయిత: సీయోను గీతాలు

ఆకాశ మహా-కాశంబులు
పట్టని ఆశ్చర్యకరుడా (2)
కృప జూపి నిబంధనను
నెరవేర్చిన ఉపకారి (2)
కాపాడితివి నడిపితివి (2)
నీ యింటికి మమ్ములను (2)       ||ఆకాశ||

నీ దాసునికి నీ ప్రజలకు
నీ క్షమను కనుపరచు (2)
నీదు కల్వరి రక్తమున (2)
నీవే కడుగు కరుణామయా (2)       ||ఆకాశ||

నీతి న్యాయముల కర్త
ప్రీతి తోడ నీ ప్రజలకు (2)
నీతి న్యాయముల నిమ్ము (2)
స్తుతియింప నిరతంబు (2)       ||ఆకాశ||

రాజులనుగా యాజకులనుగా
మమ్ము చేసిన మహారాజ (2)
విజయమిమ్ము మా విజయుండా (2)
నిజమైన నీ ప్రజలకు (2)       ||ఆకాశ||

బలపరచు నీ భక్తులను
బలము తోడ ప్రవేశించి (2)
విలువైన నీ రక్షణను (2)
ధరింప చేయుము హల్లెలూయా (2)       ||ఆకాశ||

Lyricist: Songs of Zion

Aakaasha Mahaa-kaashambulu
Pattani Aascharyakarudaa (2)
Krupa Joopi Nibandhananu
Neraverchina Upakaari (2)
Kaapaadithivi Nadipithivi (2)
Nee Yintiki Mammulanu (2)       ||Aakaasha||

Nee Daasuniki Nee Prajalaku
Nee Kshamanu Kanuparachu (2)
Needu Kalvari Rakthamuna (2)
Neeve Kadugu Karunaamayaa (2)       ||Aakaasha||

Neethi Nyaayamula Kartha
Preethi Thoda Nee Prajalaku (2)
Neethi Nyaayamula Nimmu (2)
Sthuthiyimpa Nirathambu (2)       ||Aakaasha||

Raajulanu Yaajakulanugaa
Mammu Chesina MahaRaaja (2)
Vijayamimmu Maa Vijayundaa (2)
Nijamaina Nee Prajalaku (2)        ||Aakaasha||

Balaparachu Nee Bhakthulanu
Balamu Thoda Praveshinchi (2)
Viluvaina Nee Rakshananu (2)
Dharimpa Cheyumu Hallelooyaa (2)        ||Aakaasha||

ఆకర్షించే ప్రియుడా… /Aakarshinche Priyudaa …

పాట రచయిత: థామస్

ఆకర్షించే ప్రియుడా…
అందమైన దైవమా…

ఆకర్షించే ప్రియుడా
అందమైన దైవమా
పరిపూర్ణమైనవాడా (4)

నీదు తలపై ఉన్న అభిషేకం
అధికంగా సువాసన వీచుచున్నది (2)
నీదు ప్రేమ చేతులు – ప్రేమించే చేతులు (2)
నీదు ప్రేమ చూపులే నాకు చాలు (2)      ||ఆకర్షించే||

నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది
నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి (2)
నీదు ప్రేమ పాదం – పరిశుద్ధ పాదం (2)
అదియే నేను వసియించే స్థలము (2)      ||ఆకర్షించే||

నిన్ను పాడి హృదయం ఆనందించును
నాట్యంతో పాటలు పాడెదను (2)
దేవాది దేవుడని – ప్రభువుల ప్రభువని (2)
అందరికి నిన్ను చాటి చెప్పెదను (2)      ||ఆకర్షించే||

Lyricist: Thomas

Aakarshinche Priyudaa…
Andhamaina Daivamaa…

Aakarshinche Priyudaa
Andhamaina Daivamaa
Paripoornamainavaadaa (4)

Needhu Thalapai Unna Abhishekam
Adhikamgaa Suvaasana Veechuchunnadhi (2)
Needhu Prema Chethulu – Preminche Chethulu (2)
Needhu Prema Choopule Naaku Chaalu (2)          ||Aakarshinche||

Nee Nota Nundi Thene Olukuchunnadhi
Needhu Maatalu Entho Madhuramgaa Unnavi (2)
Needhu Prema Paadham – Parishuddha Paadham (2)
Adhiye Nenu Vasiyinche Sthalamu (2)          ||Aakarshinche||

Ninnu Paadi Hrudayam Aanandinchunu
Naatyamtho Paatalu Paadedhanu (2)
Devaadhi Devudavani – Prabhuvula Prabhuvani (2)
Andhariki Ninnu Chaati Cheppedhanu (2)          ||Aakarshinche||

Audio / Video

ఆ భోజన పంక్తిలో సీమోను / Aa Bhojana Pankthilo Seemonu

ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో
అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను (2)
కన్నీళ్లతో పాదాలు కడిగింది
తన కురులతో పాదాలు తుడిచింది (2)
సువాసన సువాసన ఇల్లంత సువాసనా
ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2)

జుంటి తేనె ధారల కన్నా మధురమైనది వాక్యం
ఆ వాక్యమే నన్ను బ్రతికించెను (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన
ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2)        ||ఆ భోజన||

సింహాల నోళ్లను మూసినది ఈ వాక్యం
దానియేలుకు ఆపై విడుదలిచ్చె ఈ వాక్యం (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన
ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2)        ||ఆ భోజన||

Aa Bhojana Pankthilo Seemonu Intilo
Abhishekam Chesindi Attharutho Yesayyanu (2)
Kanneellatho Paadaalu Kadigindi
Thana Kurulatho Paadaalu Thudichindi (2)
Suvaasana Suvaasana Illantha Suvaasanaa
Aaraadhana Daiva Aaraadhana Aathmeeya Aalaapaana (2)

Junti Thene Dhaarala Kannaa Madhuramainadi Vaakyam
Aa Vaakyame Nannu Brathikinchenu (2)
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aaraadhana
Aaraadhana Daiva Aaraadhana Aathmeeya Aalaapaana (2)      ||Aa Bhojana||

Simhaala Nollanu Moosinadi Ee Vaakyam
Daaniyeluku Aapai Vidudalichche Ee Vaakyam (2)
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aaraadhana
Aaraadhana Daiva Aaraadhana Aathmeeya Aalaapaana (2)       ||Aa Bhojana||

అందరు నన్ను విడచినా / Andaru Nannu Vidachinaa

అందరు నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవే
నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)

లోకము నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా బంధువు నీవే
నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)

వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టినా (2)
నా కొండయు నీవే
నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా (2)

నేను నిన్ను నమ్ముకొంటిని
నీవు నన్ను విడువనంటివే (2)
నా తోడుయు నీవే
నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా (2)     ||అందరు నన్ను||

Andaru Nannu Vidachinaa
Neevu Nannu Viduvanantive (2)
Naa Thalliyu Neeve
Naa Thandriyu Neeve
Naa Thalli Thandri Neeve Yesayyaa (2)

Lokamu Nannu Vidachinaa
Neevu Nannu Viduvanantive (2)
Naa Bandhuvu Neeve
Naa Mithruda Neeve
Naa Bandhu Mithruda Neeve Yesayyaa (2)

Vyaadhulu Nannu Chuttinaa
Baadhalu Nannu Muttinaa (2)
Naa Kondayu Neeve
Naa Kotayu Neeve
Naa Konda Kota Neeve Yesayyaa (2)

Nenu Ninnu Nammukontini
Neevu Nannu Viduvanantive (2)
Naa Thoduyu Neeve
Naa Needayu Neeve
Naa Thodu Needa Neeve Yesayyaa (2)     ||Andaru Nannu||