ఆకాశ మహాకాశంబులు ( సీయోను గీతాలు) / Aakaasha Mahaa-kaashambulu

పాట రచయిత: సీయోను గీతాలు

ఆకాశ మహా-కాశంబులు
పట్టని ఆశ్చర్యకరుడా (2)
కృప జూపి నిబంధనను
నెరవేర్చిన ఉపకారి (2)
కాపాడితివి నడిపితివి (2)
నీ యింటికి మమ్ములను (2)       ||ఆకాశ||

నీ దాసునికి నీ ప్రజలకు
నీ క్షమను కనుపరచు (2)
నీదు కల్వరి రక్తమున (2)
నీవే కడుగు కరుణామయా (2)       ||ఆకాశ||

నీతి న్యాయముల కర్త
ప్రీతి తోడ నీ ప్రజలకు (2)
నీతి న్యాయముల నిమ్ము (2)
స్తుతియింప నిరతంబు (2)       ||ఆకాశ||

రాజులనుగా యాజకులనుగా
మమ్ము చేసిన మహారాజ (2)
విజయమిమ్ము మా విజయుండా (2)
నిజమైన నీ ప్రజలకు (2)       ||ఆకాశ||

బలపరచు నీ భక్తులను
బలము తోడ ప్రవేశించి (2)
విలువైన నీ రక్షణను (2)
ధరింప చేయుము హల్లెలూయా (2)       ||ఆకాశ||

Lyricist: Songs of Zion

Aakaasha Mahaa-kaashambulu
Pattani Aascharyakarudaa (2)
Krupa Joopi Nibandhananu
Neraverchina Upakaari (2)
Kaapaadithivi Nadipithivi (2)
Nee Yintiki Mammulanu (2)       ||Aakaasha||

Nee Daasuniki Nee Prajalaku
Nee Kshamanu Kanuparachu (2)
Needu Kalvari Rakthamuna (2)
Neeve Kadugu Karunaamayaa (2)       ||Aakaasha||

Neethi Nyaayamula Kartha
Preethi Thoda Nee Prajalaku (2)
Neethi Nyaayamula Nimmu (2)
Sthuthiyimpa Nirathambu (2)       ||Aakaasha||

Raajulanu Yaajakulanugaa
Mammu Chesina MahaRaaja (2)
Vijayamimmu Maa Vijayundaa (2)
Nijamaina Nee Prajalaku (2)        ||Aakaasha||

Balaparachu Nee Bhakthulanu
Balamu Thoda Praveshinchi (2)
Viluvaina Nee Rakshananu (2)
Dharimpa Cheyumu Hallelooyaa (2)        ||Aakaasha||

అపరాధిని యేసయ్యా / Aparaadhini Yesayya

పాట రచయిత: సిరిపురపు కృపానందము

అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా (2)
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు (2)

సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని (2)
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా (2)

ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే (2)
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో (2)

ముళ్ళతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిడితి (2)
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి (2)

దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి (2)
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి (2)

ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని (2)
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా (2)

చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత (2)
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా (2)

శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా (2)
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా (2)

Lyricist: Siripurapu Krupaanandamu

Aparaadhini Yesayyaa
Krupa Joopi Brovumayyaa (2)
Nepamenchakaye Nee Krupalo
Naparaadhamulanu Kshaminchu (2)

Siluvaku Ninu Ne Gotti
Thuluvalatho Jerithini (2)
Kalushambulanu Mopithini
Doshnda Nenu Prabhuvaa (2)

Prakkalo Ballepu Potu
Grakkuna Podichithi Nene (2)
Mikkili Baadhinchithini
Makkuva Joopithivayyo (2)

Mullatho Kireetambu
Nalli Nee Shiramuna Nidithi (2)
Naa Valla Neramaaye
Challani Dayagala Thandri (2)

Daahambu Gonagaa Chedu
Chirakanu Draava Nidithi (2)
Naa Valla Neramaaye
Challani Dayagala Thandri (2)

Ghormabugaa Doorithini
Nerambulanu Jesithini (2)
Kroorundanai Gottithini
Ghorampu Paapini Devaa (2)

Chindithi Rakthamu Naakai
Pondina Debbala Chetha (2)
Apanindalu Mopithinayyo
Sandehamelanayyaa (2)

Shikshaku Paathrudanayyaa
Rakshana Dechchithivayyaa (2)
Akshaya Bhaagyamu Niyya
Mokshambu Joopithivayyaa (2)