నేను గొఱ్ఱాలకు మంచి కాపరిని… యోహాను 10:11
1.చిన్న గొట్టెపిల్ల ఒకటి – గంతులేసి ఆడెను
మందవీడి మెల్లగా – వేరు ప్రక్క గెంతెను
బర్మని పరుగిడెన్ – దారి తప్పిపోయెను
రాత్రి సమయమాయెను – చలికి వణకిపోయెను
దారి తప్పిన తప్పు తలచి – వెక్కి వెక్కి
ఏడ్చెను గడగడ వణికెను – కన్నీరు కార్చెను.
2. గొట్టెల కాపరి కొండ లోయలో – నడచి నడచి చూచెను (1)
గొట్టెనతడు వెదకి వెదకి – ముండ్ల పొదలో కనుగొనెన్ (1)
భుజము మీద మోసెను – ఆనందముగ వెళ్ళెను. (1)
3. నిన్ను నన్ను ప్రేమించు – మంచి కాపరి యేసుడే (1)
ఆయన స్వరము వింటివా? – అదియు నీకు తెలియునా? (1)
యేసు వైపు తిరుగవా? – ఆశతోడ వత్తువా? (1)
ఒకటి రెండు మూడు
ఆ యేసు వైపు చూడు
నాలుగు ఐదు ఆరు
బహు జోరుగా పాడు
అ.ప: నిరీక్షణ అనుక్షణం
యేసులోనే ఉంచు
దీక్షతో సాగుతూ పరీక్షలో నెగ్గు
1. ఏడు ఎనిమిది తొమ్మిది
ఆ యేసుతో ఉంటే నెమ్మది
యేసుని సన్నిధి
సంతోషానికి పెన్నిధి
ఆకాశాన తార ఒకటి వెలసింది
ఉదయించెను రక్షకుడని తెలిపింది (2)
ఇదే క్రిస్మస్ – హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్ ||ఆకాశాన||
యూద దేశపు బెత్లెహేములో
కన్య మరియ గర్బమున జన్మించె
తూర్పు దేశపు గొప్ప జ్ఞానులు
యూదుల రాజు ఎక్కడని వెతికారు
తూరుపు దిక్కున చుక్కను కనుగొని
ఆనందభరితులై యేసుని చేరిరి
కానుకలిచ్చిరి పూజించిరి ||ఇదే||
రాత్రివేళలో మంద కాసెడి
కాపరులకు ప్రభువు దూత ప్రకటించే
లోక ప్రజలకు మిగుల సంతసం
కలిగించెడి వర్తమానమందించే
క్రీస్తే శిశువుగా యేసుని పేరట
ముక్తిని గూర్చెడి రక్షకుడాయెగా
సంతోషగానముతో స్తుతియింతుము ||ఇదే||
Aakashaana Thaara Okati Velasindi
Udayinchenu Rakshakudani Thelipindi (2)
Ide Christmas – Happy Happy Christmas
Merry Merry Christmas – Happy Christmas ||Aakashaana||
Yooda Deshapu Bethlehemulo
Kanya Mariya Garbhamuna Janminche
Thoorpu Deshapu Goppa Gnaanulu
Yoodula Raaju Ekkadani Vethikaaru
Thoorupu Dikkuna Chukkanu Kanugoni
Aanandbharithulai Yesuni Cheriri
Kaanukalichchiri Poojinchiri ||Ide||
Raathri Velalo Manda Kaasedi
Kaaparulaku Prabhuvu Dootha Prakatinche
Loka Prajalaku Migula Santhasam
Kaliginchedi Varthamaanamandinche
Kreesthe Shishuvugaa Yesuni Perata
Mukthini Goorchedi Rakshakudaayegaa
Santhosha Gaanamutho Sthuthiyinthumu ||Ide||