నా దేవుని గుడారములో / Naa Devuni Gudaaramulo

పాట రచయిత: జయరాజ్
Lyricist: Jayaraj

నా దేవుని గుడారములో – నా యేసుని నివాసములో (2)
ఎంతో సంతోషం – ఎంతో ఆనందం (2)
నా యేసుని నివాసములో (2)         ||నా దేవుని||

సీయోను మార్గములందు – సహాయకుడవు నీవే కదా
రాత్రి జాముల యందు- నా తోడు నీడవు నీవే కదా (2)
నా కొండ నీవేగా – నా కోట నీవేగా (2)
నా యేసు రక్షకా నీవే కదా (2)         ||నా దేవుని||

నా యేసు సన్నిధి యందు – నేను పరవశమొందెదను
నా యేసు స్వరమును వినుచు – నేను కాలము మరచెదను (2)
నా గానమాయెనే – నా ధ్యానమాయెనే (2)
నాదు స్వరము నా ప్రభువే (2)         ||నా దేవుని||

ఆనంద తైలము నందు – నన్ను అభిషేకించెనుగా
నాదు వస్త్రము నందు – అగరు వాసన నింపెనుగా (2)
నా ప్రాణ నాథుడా – నా ప్రేమ పాత్రుడా (2)
నా యేసు నాథుడా నీవే కదా (2)         ||నా దేవుని||

పాట రచయిత: జయరాజ్
Lyricist: Jayaraj

Naa Devuni Gudaaramulo – Naa Yesuni Nivaasamulo (2)
Entho Santhosham – Entho Aanandam (2)
Naa Yesuni Nivaasamulo (2)       ||Naa Devuni||

Seeyonu Maargamulandu – Sahaayakudavu Neeve Kadaa
Raathri Jaamula Yandu – Naa Thodu Needavu Neeve Kadaa (2)
Naa Konda Neevegaa – Naa Kota Neevegaa (2)
Naa Yesu Rakshakaa Neeve Kadaa (2)       ||Naa Devuni||

Naa Yesu Sannidhi Yandu – Nenu Paravashamondedanu
Naa Yesu Swaramunu Vinuchu – Nenu Kaalamu Marachedanu (2)
Naa Gaanamaayene – Naa Dhyaanamaayene (2)
Naadu Swaramu Naa Prabhuve (2)       ||Naa Devuni||

Aananda Thailamu Nandu – Nannu Abhishekinchenugaa
Naadu Vasthramu Nandu – Agaru Vaasana Nimpenugaa (2)
Naa Praana Naathudaa – Naa Prema Paathrudaa (2)
Naa Yesu Naathudaa Neeve Kadaa (2)       ||Naa Devuni||

దేవా నా మొర ఆలకించుమా / Devaa Naa Mora Aalakinchumaa

నా ప్రాణం తల్లడిల్లగా
భూదిగంతముల నుండి మొర పెట్టుచున్నాను

దేవా నా మొర ఆలకించుమా
నా ప్రార్థనకు చెవియొగ్గుమా (2)
నా ప్రాణం తల్లడిల్లగా
భూదిగంతముల నుండి మొర పెట్టుచున్నాను (2)
నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి
ఎక్కించుము నను నడిపించుము (2)       ||దేవా||

నీవు నాకు ఆశ్రయముగ నుంటివి
శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి (2)
యుగయుగములు నేను నీ గుడారములో నుందును
నీ రెక్కల చాటున దాగి యుందును (2)
నీ రెక్కల చాటున దాగి యుందును       ||దేవా||

నా రక్షణ మహిమకు ఆధారము నీవే
నా ఆశ్రయ దుర్గం నా నిరీక్షణ మార్గము నీవే (2)
నీ ప్రేమ బాటలో నడిపించుమయ్యా
నీ పోలికగా నన్ను మలచుమయ్యా (2)
నీ పోలికగా నన్ను మలచుమయ్యా      ||దేవా||

Naa Praanam Thalladillagaa
Boodiganthamula Nundi Mora Pettuchunnaanu

Devaa Naa Mora Aalakinchumaa
Naa Praarthanaku Cheviyoggumaa (2)
Naa Praanam Thalladillagaa
Boodiganthamula Nundi Mora Pettuchunnaanu (2)
Nenu Ekkalenantha Etthaina Konda Paiki
Ekkinchumu Nanu Nadipinchumu (2)      ||Devaa||

Neevu Naaku Aashrayamuga Nuntivi
Shathruvula Yeduta Balamaina Kotagaa Nuntivi (2)
Yugayugamulu Nenu Nee Gudaaramulo Nundunu
Nee Rekkala Chaatuna Daagi Yundunu (2)
Nee Rekkala Chaatuna Daagi Yundunu       ||Devaa||

Naa Rakshana Mahimaku Aadhaaramu Neeve
Naa Aashraya Durgam Naa Nireekshana Maargamu Neeve (2)
Nee Prema Baatalo Nadipinchumayyaa
Nee Polikagaa Nannu Malachumayya (2)
Nee Polikagaa Nannu Malachumayya       ||Devaa||

దిక్కులెన్ని తిరిగినా / Dikkulenni Thiriginaa

దిక్కులెన్ని తిరిగినా – ఏ దిక్కు వెదకినా (2)
మనకు దిక్కు ఈ బాల యేసుడే
ఈ ధరణిలో – జోల పాట పాడ రారండయ్యో
ఓ జనులారా – మీ హృదయంలో నివసింప జేయండయ్యో (2)

కన్య గర్భమందు నేడు – కరుణగల రక్షకుండు (2)
స్థలము లేక తిరిగి వేసారెను
నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను (2)
కల్లబొల్లి కథలు కావు – ఆ గొల్ల బొయల దర్శనంబు (2)
నేడు నోవాహు ఓడ జోరేబు కొండ
గుర్తుగా ఉన్నాయి చూడండి         ||దిక్కులెన్ని||

దిక్కులేని వారినెల్ల – పాపమందు బ్రతికేటోళ్ల (2)
తన మార్గమందు నడుప బుట్టెను
ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును (2)
జన్మించాడు నేడు – ఈ విశ్వ మొత్తమునేలు రాజు (2)
నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి
హృదయాలు అర్పించినారయ్యో             ||దిక్కులెన్ని||

Dikkulenni Thiriginaa – Ae Dikku Vedakinaa (2)
Manaku Dikku Ee Baala Yesude
Ee Dharanilo – Jola Paata Paada Raarandayyo
O Janulaaraa – Mee Hrudayamlo Nivasimpa Jeyandayyo (2)

Kanya Garbhamandu Nedu – Karunagala Rakshakundu (2)
Sthalamu Leka Thirigi Vesaarenu
Naa Korakai Sthalamu Siddha Paracha Nedu Puttenu (2)
Kallabolli Kathalu Kaavu – Aa Golla Boyala Darshanambu (2)
Nedu Novaahu Oda Jorebu Konda
Gurthuga Unnaayi Choodandi            ||Dikkulenni||

Dikkuleni Vaarinella – Paapamandu Brathiketolla (2)
Thana Maargamandu Nadupa Buttenu
Ee Baaludu Chedda Vaarinella Cheradeeyunu (2)
Janminchinaadu Nedu – Ee Vishwa Motthamunelu Raaju (2)
Nedu Thoorpu Dikku Janulandaru Vachchi
Hrudayaalu Arpinchinaarayyo          ||Dikkulenni||

కొండ కోన లోయలోతుల్లో / Konda Kona Loya Lothullo

కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ
వినబడుతుంది నా యేసుని స్వరమే
తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం
ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం || కొండ కోన ||

నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు
హృదయమందు చేర్చుకో నేస్తమా (2)
ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య
నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2)
నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2)     ||కొండ కోన ||

ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసు
నిన్ను రక్షించాలని (2)
కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్య
తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య (2)
నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2)     ||కొండ కోన ||

Konda Kona Loya Lothullo.. O O
Vinabaduthundi Naa Yesuni Swarame
Thelusuko Nesthamaa Yese Nija Daivam
Prabhu Yese Mana Rakshana Praakaaram ||Konda Kona||

Nee Hrudayamane Dwaaramuna Niluchunnaadu Naa Yesu
Hrudayamandu Cherchuko Nesthamaa (2)
Ae Sthithikainaa Chaalina Devudu Naa Yesenayya
Nee Sthithini Erigina Devudu Naa Yesenayya (2)
Neevu Ee Dinamane Yesuni Swaramu Vinumannaa (2)     ||Konda Kona||

Aakaashaaniki Bhoomiki Madhya Siluvalo Velaadenu Naa Yesu
Ninnu Rakshinchaalani (2)
Kaluvari Siluvalo Thana Rakthamunu Kaarchenu Yesayya
Thana Raajyamulo Ninu Cherchutaku Pilichenu Yesayya (2)
Neevu Ee Dinamande Yesuni Swaramu Vinumannna (2)    ||Konda Kona||

కదలకుందువు / Kadalakunduvu

కదలకుందువు సీయోను కొండవలె
బెదరకుందువు బలమైన సింహం వలె (2)
యేసయ్య నీ చెంత ఉండగా
ఏ చింత నీకింక లేదుగా (2)

కష్టములెన్నో కలుగుచున్ననూ
నిట్టూర్పులెన్నో వచ్చియున్ననూ
దుష్ట జనములుపై దుమికి తరిమిన
భ్రష్ట మనుష్యులు నీ మీదికి వచ్చినా          ||కదలకుందువు||

నీటి వరదలు నిలువెత్తున వచ్చినా
నిండు సముద్రము నీళ్లు ఉప్పొంగి పొరలినా
ఆకాశము నుండి పై అగ్ని కురసినన్
ఏనాడు ఏ కష్టం నష్టం నీకుండదు             ||కదలకుందువు||

నీరు కట్టిన తోటవలెను
నిత్యం ఉబుకుచుండు నీటి ఊటవలెను
నీటి కాల్వల యోరను నాటబడినదై
వర్ధిల్లు వృక్షం వలె నిక్షేపముగా నీవుందువ్            ||కదలకుందువు||

Kadalakunduvu Seeyonu Kondavale
Bedarakunduvu Balamaina Simham Vale (2)
Yesayya Nee Chentha Undagaa
Ae Chintha Neekinka Ledugaa (2)

Kashtamulenno Kaluguchunnanu
Nittoorpulenno Vachchiyunnanu
Dushta Janamulupai Dumiki Tharimina
Brashta Manushyulu Nee Meediki Vachchinaa           ||Kadalakunduvu||

Neeti Varadalu Niluvetthuna Vachchinaa
Nindu Samudramu Neellu Uppongi Poralinaa
Aakaashamu Nundi Pai Agni Kurasinan
Aenaadu Ae Kashtam Nashtam Neekundadu           ||Kadalakunduvu||

Neeru Kattina Thotavalenu
Nithyam Ubukuchundu Neeti Ootavalenu
Neeti Kaalvala Yoranu Naatabadinadai
Vardhillu Vruksham Vale Nikshepamugaa Neevunduv           ||Kadalakunduvu||