శక్తి చేత కాదు/Shakthi Chetha Kaadu

పాట రచయిత: ఆకుమర్తి డానియెల్

శక్తి చేత కాదు
బలము చేత కాదు
దేవుని ఆత్మచే
సమస్తము సాధ్యము (2)        ||శక్తి||

నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని
చేసెను దేవుడు శూన్యము నుండి (2)
తన రూపులో తన పోలికలో (2)
నిర్మించెను దేవుడు నరుని మంటి నుండి (2)        ||శక్తి||

కౄరమైన సింహాల బోనైననూ
విశ్వాసముతో సాగెను దానియేలు (2)
అగ్ని గుండములో మరణ శాసనములో (2)
ఇమ్మానుయేలు యేసయ్య తోడుగా (2)        ||శక్తి||

ఘోరమైన పాపాల బానిసైననూ
భారమైన బ్రతుకును గడుపుచున్ననూ (2)
ప్రియమార నిన్నే పిలువంగ యేసు (2)
దరి చేర రావా ఆ ప్రేమ నాథుని (2)        ||శక్తి||

Lyricist: Akumarthi Daniel

Shakthi Chetha Kaadu
Balamu Chetha Kaadu
Devuni Aathmache
Samasthamu Saadhyamu (2)     ||Shakthi||

Noti Maata Dwaaraa Ee Sarva Srushtini
Chesenu Devudu Shoonyamu Nundi (2)
Thana Roopulo Thana Polikalo (2)
Nirminchenu Devudu Naruni Manti Nundi (2)     ||Shakthi||

Krooramaina Simhaala Bonainanu
Vishwaasamutho Saagenu Daaniyelu (2)
Agni Gundamulo Marana Shaasanamulo (2)
Immaanuyelu Yesayya Thodugaa (2)     ||Shakthi||

Ghoramaina Paapaala Baanisainanu
Bhaaramaina Brathukunu Gadupuchunnanu (2)
Priyamaara Ninne Piluvanga Yesu (2)
Dari Chera Raavaa Aa Prema Naathuni (2)     ||Shakthi||

దేవుడే నాకాశ్రయంబు / Devude Naakaashrayambu

పాట రచయిత: పంతగాని పరదేశి
Lyricist: Panthagani Paradeshi

దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము
మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ          ||దేవుడే||

పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను
సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్       ||అభయ||

దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును
ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు      ||అభయ||

రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన
పూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును       ||అభయ||

విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయన
చెల్ల చెదర జేసి రిపుల – నెల్లద్రుంచు నాయనే           ||అభయ||

పిశాచి పూర్ణ బలము నాతో – బెనుగులాడ జడియును
నశించి శత్రు గణము దేవు – నాజ్ఞ వలన మడియును      ||అభయ||

కోటయు నాశ్రయమునై యా – కోబు దేవు డుండగా
ఏటి కింక వెరవ వలయు – నెప్డు నాకు బండుగ         ||అభయ||

పాట రచయిత: పంతగాని పరదేశి
Lyricist: Panthagani Paradeshi

Devude Naakaashrayambu – Divyamaina Durgamu
Mahaa Vinodu Daapadala – Sahaayudai Nan Brochunu
Abhaya Mabhaya Mabhaya Meppu
Daananda Maananda Maananda Mouga        ||Devude||

Parvathamulu Kadilina Nee – Yurvi Maaru Padinanu
Sarvamun Ghoshinchuchu Nee – Sandra Mupponginan        ||Abhaya||

Devudepdu Thodugaaga – Deshamu Vardhillunu
Aa Thaavu Nandu Prajalu Migula – Dhanyulai Vasinthuru        ||Abhaya||

Raajyamul Kampinchina Bhoo – Raashtramul Ghoshinchina
Poojyundou Yehovaa Vairi – Booni Samharinchunu      ||Abhaya||

Villu Virachu Naana Thega – Ballemu Naraku Naayana
Chella Chedara Jesi Ripula – Nelladrunchu Naayane     ||Abhaya||

Pishaachi Poorna Balamu Naatho – Benugulaada Jadiyunu
Nashinchi Shathru Ganamu Devu – Naazna Valana Madiyunu     ||Abhaya||

Kotayu Naashrayamunai Yaa – Kobu Devu Dundaga
Aeti Kinka Verava Valayu – Nepdu Naaku Banduga      ||Abhaya||

దేవుడు మనకు ఎల్లప్పుడు / Devudu Manaku Ellappudu

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

దేవుడు మనకు ఎల్లప్పుడు (2)
తోడుగ నున్నాడు (3)

ఏదేనులో ఆదాముతో నుండెన్ (2)
హానోకు తోడనేగెను (2)
దీర్ఘ దర్శకులతో నుండెన్ (2)
ధన్యులు దేవుని గలవారు – తోడుగనున్నాడు

దైవాజ్ఞను శిరసావహించి (2)
దివ్యముగ నా బ్రాహాము (2)
కన్న కొమరుని ఖండించుటకు (2)
ఖడ్గము నెత్తిన యపుడు – తోడుగనున్నాడు

యోసేపు ద్వేషించ బడినపుడు (2)
గోతిలో త్రోయబడినపుడు (2)
శోధనలో చెరసాలయందు (2)
సింహాసనమెక్కిన యపుడు – తోడుగనున్నాడు

ఎర్ర సముద్రపు తీరమునందు (2)
ఫరో తరిమిన దినమందు (2)
యోర్దాను దాటిన దినమందు (2)
యెరికో కూలిన దినమందు – తోడుగనున్నాడు

దావీదు సింహము నెదిరించి (2)
ధైర్యాన చీల్చినయపుడు (2)
గొల్యాతును హతమార్చినయపుడు (2)
సౌలుచే తరుమబడినపుడు – తోడుగనున్నాడు

సింహపు బోనులో దానియేలు (2)
షద్రకు మేషా కబేద్నెగో (2)
అగ్ని గుండములో వేయబడెన్ (2)
నల్గురిగా కనబడినపుడు – తోడుగనున్నాడు

పౌలు బంధించబడినపుడు (2)
పేతురు చెరలో నున్నపుడు (2)
అపోస్తలులు విశ్వాసులు (2)
హింసించ బడినయపుడు – తోడుగనున్నాడు     ||దేవుడు||

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Devudu Manaku Ellappudu (2)
Thoduga Nunnaadu (3)

Aedenulo Aadaamutho Nunden (2)
Haanoku Thodanegenu (2)
Deergha Darshakulatho Nunden (2)
Dhanyulu Devuni Galavaaru – Thoduganunnaadu

Daivaaznanu Shirasaavahinchi (2)
Divyamuga Naa Braahaamu (2)
Kanna Komaruni Khandinchutaku (2)
Khadgamu Neththina Yapudu – Thoduganunnaadu

Yosepu Dweshincha Badinapudu (2)
Gothilo Throyabadinapudu (2)
Shodhanalo Cherasaalayandu (2)
Simhaasanamekkina Yapudu – Thoduganunnaadu

Erra Samudrapu Theeramunandu (2)
Pharo Tharimina Dinamandu (2)
Yordaanu Daatina Dinamandu (2)
Yeriko Koolina Dinamandu – Thoduganunnaadu

Daaveedu Simhamu Nedirinchi (2)
Dhairyaana Cheelchinayapudu (2)
Golyaathunu Hathamaarchinayapudu (2)
Souluche Tharumabadinapudu – Thoduganunnaadu

Simhapu Bonulo Daaniyelu (2)
Shadraku Meshaa Kabednego (2)
Agni Gundamulo Veyabaden (2)
Nalgurigaa Kanabadinapudu – Thoduganunnaadu

Poulu Bandhinchabadinapudu (2)
Pethuru Cheralo Nunnapudu (2)
Aposthalulu Vishwaasulu (2)
Himsincha Badinayapudu – Thoduganunnaadu       ||Devudu||

దేవుడు నీకు తెలుసు / Devudu Neeku Thelusu

దేవుడు నీకు తెలుసు – నీవు దేవునికి తెలుసా
నీవు దేవుని నమ్మినా – నిన్ను దేవుడు నమ్మాలి (2)
అవసరాలకు దేవుని నమ్మక
ఆత్మకు తండ్రని నమ్మాలి (2)
నీ ఆత్మకు తండ్రని నమ్మాలి         ||దేవుడు||

నాలుగు గోడల మధ్య నీవు నలిగిపోక
నలు దిక్కులకు సువార్తను ప్రకటించు (2)
ప్రభువా ప్రభువని పిలువక – ప్రార్ధనతో విసిగించక
పాపిని రక్షించు పరలోకానికి నడిపించు
నా నిమిత్తము ఎవడు పోవునని అడుగుచున్నాడు దేవుడు
నా అవసరత తీర్చమని అడుగుచున్నాడు క్రైస్తవుడు          ||దేవుడు||

నామకార్ధ భక్తి దేవునికే అది విరక్తి
సువార్త భారం కలిగి నీవు బ్రతికితేనే ముక్తి (2)
ప్రజలందరికి ఇదే బైబిల్ సూక్తి (2)
దేవుని చేయి వెతకకుంటే అగ్నితోనే శాస్తి (2)
దేవునికిష్టమైనది తెలుసుకోవాలి ముందు
దేహానికిష్టమైనది అడగకూడదు ముందు         ||దేవుడు||

Devudu Neeku Thelusu – Neevu Devuniki Thelusaa
Neevu Devuni Namminaa – Ninnu Devudu Nammaali (2)
Avasaaralaku Devuni Nammaka
Aathmaku Thandrani Nammaali (2)
Nee Aathmaku Thandrani Nammaali            ||Devudu||

Naalugu Godala Madhya Neevu Naligipoka
Nalu Dikkulaku Suvaarthanu Prakatinchu (2)
Prabhuvaa Prabhuvani Piluvaka – Praardhanatho Visginchaka
Paapini Rakshinchu Paralokaaniki Nadipinchu
Naa Nimitthamu Evadu Povunani Aduguchunnaadu Devudu
Naa Avasaratha Theerchamani Aduguchunnaadu Kraisthavudu         ||Devudu||

Naamakaardha Bhakthi Devunike Adi Virakthi
Suvaartha Bhaaram Kaligi Neevu Brathikithene Mukthi (2)
Prajalandariki Ide Bible Sookthi (2)
Devuni Cheyi Vethakakunte Agnithone Shaasthi (2)
Devunikishtamainadi Thelusukovaali Mundu
Dehaanikishtamainadi Adagakoodadu Mundu          ||Devudu||

దేవుడు దేహమును / Devudu Dehamunu

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

దేవుడు దేహమును పొందిన దినము
మనిషిగా మారి ఇల చేరిన క్షణము (2)
తార వెలిగెను – దూత పాడెను
పరలోకనికి మార్గము వెలిసెను (2)
స్తుతుల గానములు పాడి పరవశించెదము
యేసు నామమునే చాటి మహిమ పరిచెదము (2)

దూత పలికెను భయము వలదని
తెలిపే వార్తను యేసే క్రీస్తని (2)
చీకటి తొలగెను రారాజుకు భయపడి
లోకము వెలిగెను మరణము చెరవిడి (2)
క్రీస్తు పుట్టెనని తెలిపి సంతోషించెదము
నిత్య జీవమునే చాటి ఘనత పొందెదము (2)       ||దేవుడు||

సృష్టి కారుడు అల్పుడాయెను
అది శాపము తీయ వచ్చెను (2)
పాపము ఎరుగని మనిషిగా బ్రతికెను
మానవ జాతికి మార్గమై నిలిచెను (2)
నమ్మి ఒప్పినను చాలు తొలగు పాపములు
పరము చేరుటకు మనకు కలుగు దీవెనలు (2)       ||దేవుడు||

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Devudu Dehamunu Pondina Dinamu
Manishigaa Maari Ila Cherina Kshanamu (2)
Thaara Veligenu – Dootha Paadenu
Paralokaaniki Maargamu Velisenu (2)
Sthuthulu Gaanamulu Paadi Paravashinchedamu
Yesu Naamamune Chaati Mahima Parichedamu (2)       ||Devudu||

Dootha Palikenu Bhayamu Valadani
Thelipe Vaarthanu Yese Kreesthani (2)
Cheekati Tholagenu Raaraajuku Bhayapadi
Lokamu Veligenu Maranamu Cheravidi (2)
Kreesthu Puttenani Thelipi Santhoshinchedamu
Nithya Jeevamune Chaati Ghanatha Pondedamu (2)       ||Devudu||

Srushtikaarudu Alpudaayenu
Aadi Shaapamu Theeya Vachchenu (2)
Paapamu Erugani Manishigaa Brathikenu
Maanava Jaathiki Maargamai Nilichenu (2)
Nammi Oppinanu Chaalu Tholagu Paapamulu
Paramu Cherutaku Manaku Kalugu Deevenalu (2)       ||Devudu||

దేవాది దేవుడు / Devaadhi Devudu

దేవాది దేవుడు మహోపకారుడు
మహాత్యము గల మహారాజు (2)
ప్రభువుల ప్రభువు – రాజుల రాజు
ఆయన కృప నిరంతరముండును      ||దేవాది||

సునాద వత్సరము ఉత్సాహ సునాదము
నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము (2)
ఉత్తమ దేవుని దానములు (2)       ||దేవాది||

యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవు
జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే (2)
నీదు క్రియలు ఘనమైనవి (2)       ||దేవాది||

అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసు క్రీస్తు
మహిమా మహాత్యములు సర్వాధిపత్యమును (2)
సదా నీకే కలుగును గాక (2)       ||దేవాది||

Devaadhi Devudu Mahopakaarudu
Mahaathyamu Gala Maharaaju (2)
Prabhuvula Prabhuvu – Raajula Raaju
Aayana Krupa Nirantharamundunu        ||Devaadhi||

Sunaadha Vathsaramu Uthsaaha Sunaadhamu
Noothana Sahsraabdhi Noothana Shathaabdhamu (2)
Utthama Devuni Dhaanamulu (2)       ||Devaadhi||

Yugamulaku Devudavu Unnavaadavanuvaadavu
Jagamanthaa Eluchunna Jeevaadhipathi Neeve (2)
Needhu Kriyalu Ghanamainavi (2)       ||Devaadhi||

Adhvitheeya Devudavu Prabhuvaina Yesu Kreesthu
Mahimaa Mahathyamulu Sarvaadhipathyamunu (2)
Sadhaa Neeke Kalugunu Gaaka (2)       ||Devaadhi||

తరాలు మారినా యుగాలు మారినా / Tharaalu Maarinaa Yugaalu Maarinaa

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

తరాలు మారినా యుగాలు మారినా
మారని దేవుడు మారని దేవుడు
మన యేసుడు      ||తరాలు||

మారుచున్న లోకములో
దారి తెలియని లోకములో (2)
మారని దేవుడు మన యేసుడు (2)       ||తరాలు||

సూర్యచంద్రులు గతించినా
భూమ్యాకాశముల్ నశించినా (2)
మారని దేవుడు మన యేసుడు (2)       ||తరాలు||

నీతి న్యాయ కరుణతో
నిశ్చలమైన ప్రేమతో (2)
మారని దేవుడు మన యేసుడు (2)       ||తరాలు||

నిన్న నేడు నిరంతరం
ఒకటైయున్న రూపము (2)
మారని దేవుడు మన యేసుడు (2)       ||తరాలు||

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Tharaalu Maarinaa Yugaalu Maarinaa
Maarani Devudu Maarani Devudu
Mana Yesudu         ||Tharaalu||

Maaruchunna Lokamulo
Daari Theliyani Lokamulo (2)
Maarani Devudu Mana Yesudu (2)        ||Tharaalu||

Soorya Chandrulu Gathinchinaa
Bhoomyaakaashamul Nashinchinaa (2)
Maarani Devudu Mana Yesudu (2)        ||Tharaalu||

Neethi Nyaaya Karunatho
Nischalamaina Prematho (2)
Maarani Devudu Mana Yesudu (2)        ||Tharaalu||

Ninna Nedu Nirantharam
Okataiyunna Roopamu (2)
Maarani Devudu Mana Yesudu (2)        ||Tharaalu||

తరతరాలలో యుగయుగాలలో / Tharatharaalalo Yugayugaalalo

పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Lyricist: Andhra Kraisthava Keerthanalu

తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో
దేవుడు దేవుడు యేసే దేవుడు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

భూమిని పుట్టించకమునుపు
లోకము పునాది లేనపుడు    ||దేవుడు||

సృష్టికి శిల్పకారుడు
జగతికి ఆదిసంభూతుడు       ||దేవుడు||

తండ్రి కుమార ఆత్మయు
ఒకడైయున్న రూపము        ||దేవుడు||

పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Lyricist: Andhra Kraisthava Keerthanalu

Tharatharaalalo Yugayugaalalo Jagajagaalalo
Devudu Devudu Yese Devudu
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa

Bhoomini Puttinchakamunupu
Lokamu Punaadi Lenapudu    ||Devudu||

Srushtiki Shilpakaarudu
Jagathiki Aadisambhoothudu     ||Devudu||

Thandri Kumaara Aathmayu
Okadaiyunna Roopamu      ||Devudu||

జాలిగల దైవమా యేసయ్యా / Jaaligala Daivamaa Yesayyaa

జాలిగల దైవమా యేసయ్యా
మనసారా స్తుతింతున్‌ స్తోత్రింతును
నీవు దేవుడు సర్వశక్తుడు (2)
నీ జాలికి హద్దులే లేవు
నీ ప్రేమకు కొలతలే లేవు (2)
అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్‌ (2)          ||జాలిగల||

నిజముగ మా యొక్క పాపములన్‌ మోసికొని
దుఃఖములను భరించితివే (2)
అయ్యా – దుఃఖములను భరించితివే          ||నీవు||

మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంత
నీపైన పడెనే ప్రభూ (2)
అయ్యా – నీపైన పడెనే ప్రభూ          ||నీవు||

మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే
గాయములచే స్వస్థమైతిమి (2)
నీదు – గాయములచే స్వస్థమైతిమి          ||నీవు||

Jaaligala Daivamaa Yesayyaa
Manasaaraa Sthuthinthun Sthothrinthunu (2)
Neevu Devudu Sarvashakthudu (2)
Nee Jaaliki Haddule Levu
Nee Premaku Kolathale Levu (2)
Avi Prathidinamu Krotthagaa Nundun (2)           ||Jaaligala||

Nijamuga Maa Yokka Paapamulan Mosikoni
Dukhamulanu Bharinchithive (2)
Ayyaa – Dukhamulanu Bharinchithive            ||Neevu||

Maa Koraku Samaadhaanamichchutakai Dandanantha
Neepaina Padene Prabhu (2)
Ayyaa – Neepaina Padene Prabhu            ||Neevu||

Maadu Athikramamulache Gaayapadi Naligithive
Gaayamulache Swasthamaithimi (2)
Needu – Gaayamulache Swasthamaithimi            ||Neevu||

చిన్నారి బాలగా / Chinnaari Baalagaa

చిన్నారి బాలగా చిరుదివ్య జ్యోతిగా
కనరాని దేవుడు కనిపించెనా
తన ప్రేమ నా పైన కురిపించెనా… కురిపించెనా
జో.. లాలిజో.. జో… లాలిజో…

పరలోక భోగాలు వర దూత గానాలు
తనకున్న భాగ్యాలు విడనాడెనా (2)
పాపాలు భరియించెనా – శాపాలు భరియించెనా
ఆనందమే ఆశ్చర్యమే సంతోషమే సమాధానమే        ||జో లాలిజో||

దావీదు తనయుండై మహిమా స్వరూపుండై
మానుజావతారుండై పవళించెనా (2)
గాఢాంధకారంబున ఒక తార ఉదయించెనా
ప్రభు బాలుడై ప్రభు యేసుడు మరియమ్మ ఒడిలోన నిదురించెనా        ||జో లాలిజో||

శాంతి స్వరూపుండు కరుణా సముద్రుండు
కడు శక్తిమంతుడు కమనీయుడు (2)
ఆశ్చర్యకరుడాయనే ఆలోచన కర్తాయనే
అభిషిక్తుడు ఆరాధ్యుడు ప్రేమామయుడు ప్రియుడేసుడు        ||జో లాలిజో||

Chinnaari Baalagaa Chirudivya Jyothigaa
Kanaraani Devudu Kanipinchenaa
Thana Prema Naa Paina Kuripinchenaa… Kuripinchenaa
Jo.. Laalijo.. Jo… Laalijo…

Paraloka Bhogaalu Vara Dootha Gaanaalu
Thanakunna Bhaagyaalu Vidanaadenaa (2)
Paapaalu Bhariyinchenaa – Shaapaalu Bhariyinchenaa
Aanandame Aascharyame Santhoshame Samaadhaaname           ||Jo Laalijo||

Daaveedu Thanayundai Mahimaa Swaroopundai
Manujaavathaarundai Pavalinchenaa (2)
Gaadaandhakaarambuna Oka Thaara Udayinchenaa
Prabhu Baaludai Prabhu Yesudu Mariyamma Odilona Nidurinchenaa           ||Jo Laalijo||

Shaanthi Swaroopundu Karunaa Samudrundu
Kadu Shakthimanthudu Kamaneeyudu (2)
Aascharyakarudaayane Aalochana Karthaayane
Abhishikthudu Aaraadhyudu Premaamayudu Priyudesudu           ||Jo Laalijo||