నీ పనులు భారము
మోపుము ప్రభువుపై (2)
అపుడు నీ కార్యములను
సఫలము చేయును ప్రభువు (2)
నీ పనులు భారము
మోపుము ప్రభువుపై (2)
అపుడు నీ కార్యములను
సఫలము చేయును ప్రభువు (2)
పెద్ద పెద్ద బోధలు నేను చేయను
విసిగించే మాటలు ప్రకటించను
యేసయ్య ప్రేమను క్రియలలోనే
జనులకు చూపింతును
1. అర్ధముకాని భాష మాట్లాడను
వ్యర్ధముగా వాక్యముచ్చరించను
యేసయ్య ప్రేమను క్రియలలోనే
జనులకు చూపింతును
2. మొక్కుబడి ప్రార్ధన నేను చేయను
చిక్కుతెచ్చు మాటలకు తావీయను
యేసయ్య ప్రేమను క్రియలలోనే
జనులకు చూపింతును
యేసయ్య నాతో వుంటే
రోజూ ఒక పండగ
కీడేది దరికి రాదు
ఆయనుంటే అండగ
1. కరువు కాటకాలు
నన్నేమి చేయ లేవుగా
లేమి అపజయాలు
నన్ను కృంగదీయ లేవుగా ॥యేస॥
2. ఇరుకు ఇబ్బందులు
నన్నేడిపించ లేవుగా
శ్రమలు వ్యాధి బాధలు
నిరాశపరచ లేవుగా ॥యేస॥
చిన్నలం యేసు మహిమకు వన్నెలం
మల్లెలం యేసు పరిమళ జల్లులం
1. ధీరులం యేసు సైన్యపు వీరులం
తారలం యేసు రాకకు బూరలం
2. గువ్వలం సిలువ రాగపు మువ్వలం
దివ్వెలం యేసు రాజ్యపు నవ్వులం
చిన్నవాడనైనను
ఎన్నదగిన వాడను
నా యేసు చేతిలో
చెక్కబడియున్నాను
1.ప్రేమమూర్తి రూపులో
చెక్కబడిన బొమ్మను
క్షేమమిచ్చు యేసులో
కట్టబడిన కొమ్మను
2. రక్షకుని తోటలో
నాటబడిన మొక్కను
ద్రాక్షవల్లి యేసులో నిలిచియున్న తీగను
చిన్ని బాలలం యేసయ్య బిడ్డలం
క్రీస్తు కొరకు జీవించు
మంచి పిల్లలం
1. దావీదువలె పోరాడెదం
దానియేలువలె ప్రార్ధించెదం
క్రీస్తుపిల్లలం – పోరాడెదం
ప్రార్ధించెదం – క్రీస్తుపిల్లలం
2. దేవుని దయను కోరెదం
దైవగ్రంథమును చదివెదం
మాదిరి పిల్లలం – కోరెదం
చదివెదం మాదిరి పిల్లలం
లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ (2)
చేతులు పట్టి సాగిపోదమా
దేవుని స్తుతించెదమా
నాట్యమాడి సాగిపోదమా
మార్గము సిద్ధపరతుమా
హలో తమ్ముడా ఎగిరి ఆడుదాం
హలో చెల్లెలా చప్పట్లు కొట్టుదాం
సండేస్కూలుకి వెళ్లమన్నది
యేసయ్య మనసు (3)
బజారు చుట్టూ తిరగమన్నది
సాతాను మనసు – నన్ను
2. అమ్మకు సాయం చేయమన్నది
యేసయ్య మనసు (3)
బయటకు పోయి ఆడమన్నది
సాతాను మనసు – నన్ను
3. యేసు మాటలు చెప్పమన్నది.
యేసయ్య మనసు (3)
సినిమా పాటలు పాడమన్నది
సాతాను మనసు నన్ను
అక్కా మన యేసుడెంతో చక్కానివాడే
ఎక్కువ ప్రేమ చూపు ఏ పాపికైనా
నా చక్కని యేసయ్య
నా ముద్దుల యేసయ్య
నా బంగారు యేసయ్య
చెల్లి యేసయ్యా నీకు ఏమీ చేశాడే
నన్ను రక్షించినాడే నా యేసు స్వామి
నా చక్కని యేసయ్య
నా ముద్దులు యేసయ్య
నా బంగారు యేసయ్య ॥అక్కా!॥
వద్దు బాలలు మనకొద్దు
సొదొమ ఆశలు అసలొద్దు
యేసురాజు ఆజ్ఞలు
మదిని కోరు ముద్దుగా ॥వద్దు॥
బూతుమాటలొద్దురా
కోతిపనులు మానరా
చెడుచూపులు వద్దురా
చెడుమాటలు మానరా
సినిమాలు సిగరెట్లు
చెడు ఆశలు వద్దురా ॥వద్దు॥