పడవలో యేసుస్వామి పయనమాయెను
కడలిలో ఆ చిన్నదోనె సాగుచుండెను
1. ఆదమరచి యేసుస్వామి
నిదురపోయెను అంతలోనే
కారుమబ్బు కమ్మివేసెను
హోరునగాలి – జోరున వాన
పెళ పెళమని ఉరుములు
పైకి లేచె అలలు శిష్యులందరికి
గుండెలదిరిపోయెను
యేసుపైన విశ్వాసం సడలిపోయెను
2. యేసు స్వామి లేచి శిష్యులను చూచి
అల్పవిశ్వాసులార భయమేలని అడిగి
గాలి సముద్రమును గద్దించెను
ప్రకృతి ఆ మాట విని నిమ్మళించెను
శిష్యులందరికి ఆశ్చర్యమాయెను
యేసుపైన విశ్వాసం సడలిపోయెను
ఇది దేవుడు మనకిచ్చిన దినము
ఉత్సాహముతో స్తుతి పాడెదము
ఆ దేవుని చేతి పని మనము
తన సేవలో సాగుట ఘనము
1. దేవుడు ఇచ్చెను ప్రతి క్షణము
ఎంతో విలువని గమనించుము
దేవుడు మెచ్చెను ప్రతిదినము
ఆయన మహిమ కొరకు వాడుము
చిన్నవాడను నేను యేసుకిష్టుడను
నన్ను బలపరచు దేవునిలో
సమస్తము చేతును
1. బొబ్బరించు సింహము
నా ఎదురుగా నిల్చినా
వట్టి చేతులతో దవడలు పట్టి
రెండుగా చీల్తును
2. అరుమూరల గొల్యాతు
నా ఎదురుగా నిల్చినా
వడిసెల రాయితో ఒక్క దెబ్బతో
నేలను కూల్తును
3. నా విరోధి సాతాను
నా ఎదురుగా నిల్చినా
ప్రార్ధన బలముతో దైవశక్తితో విజయుడై నిత్తును
కట్టబడ్డ గాడిద పిల్లను నేను
పట్టబడ్డాను అపవాదితోను
1. యేసయ్య నా నిజ యజమానుడు
సాతాను మోసంతో నను లొంగదీసాడు.
అయినను యేసయ్య కరుణించాడు.
నన్ను విడిపించ తన శిష్యులనంపాడు
2. నా పైకి ఎక్కి నన్ను ధన్యుని చేశాడు
యెరుషలేం వీధుల వెంట యాత్ర చేశాడు.
నా బ్రతుకు మార్చి నాకు ఘనత తెచ్చాడు.
ఆయన సేవజేయ అర్హత నిచ్చాడు.
నాదు హృదయము యేసు సదనము
నాదు దేహము ఆ స్వామి నిలయము
1.నాలో యేసుడు నివాసముండును.
నాతో యేసుడు భుజించుచుండును
2. చెడ్డపనులనెప్పుడు నేను చేయను
యేసుస్వామినెన్నడు బాధ పెట్టను
ప్రార్ధించ నేర్పుమయా యేసయ్యా
ప్రార్ధించ నేర్పుమయా
నా విన్నపములు – నీ సన్నిధి చేర
1. వ్యర్ధమైనది కోరకుండ
నా పెదవులు కాయుమయ్యా
నీ చిత్తమెరిగి నేనడుగ
నీ ఆత్మతో నింపుమయ్యా ॥ప్రార్ధి॥
2. సుంకరివలెను నిను వేడ
తగ్గింపు దయ చేయుమయ్యా
ఒంటరి వలె పోరాడ
పరలోక శక్తినీయుమయ్యా ॥ప్రారి॥
3. వేకువనే లేచి నిను కొలువ
స్తుతిని మా నోటనుంచుమయ్యా
మరువక నీ మేలులను తలువ
కృతజ్ఞత కలిగించుమయ్యా ॥ప్రార్ధి॥
చిన్న చిన్న పిల్లలూ రారండి
చిన్నారి యేసుని చేరండి
బేత్లహేములో రక్షకునిగా
మన కొరకు పుట్టినాడు చూడండి
1. దూతలు పాటలు పాడుచున్నారు
గొల్లలు సంబరాన ఆడుచున్నారు.
బోసి నవ్వులు చిందించుచు
తొట్టిలో పరుండెను చూడండి
2. జ్ఞానులు చుక్కవెంట వచ్చియున్నారు
విలువైన కానుకలు తెచ్చియున్నారు
జనులందరిని రక్షించుటకు
దివి నుండి దిగినాడు చూడండి
దేవుని మార్గములో
ముందుకు సాగుదమా
యేసే ఆ మార్గమని
జనులకు చాటుదమా
1. రక్తం కార్చి ప్రాణం పోసి
సిద్ధము చేసినది
శిక్ష బాపి రక్షణిచ్చే
నీతి మార్గమది
2. ఇరుకైన మార్గమది పరముకు
చేర్చునది పరీక్షల మార్గమది
నిరీక్షణిచ్చునది
సిలువలో నా కొరకు
యేసు మరణమొందెను
కలుషమంత కడిగి
నన్ను శుద్ధి చేసెను
అ.ప: ఆహా… హల్లెలూయా
ఓహో… హల్లెలూయా
ఊ… ఊ… హల్లెలూయా
1. పనికిమాలిన నన్ను చేరదీసెను
విలువనిచ్చు పాత్రగా
మార్చివేసెను
2. నరకపాత్రుడను
నాపై కరుణజూపెను
పరమ రాజ్య పౌరునిగా
నన్నుజేసెను
పొరుగువానిని ప్రేమించమన్నది
ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది
1. యెరుషలేము నుండి ఒకడు
వెళ్ళుచుండగా దొంగలతని
దోచుకొని కొట్టి విడిచిరి
యాజకుడు లేవీయుడు
అచటికి వచ్చి అతని చూచి
ప్రక్కగా వెళ్ళిపోయిరి
2. అంతలోనే సమరయుడొకడతని
చూచెను జాలిపడి అతని చేరి
గాయము కట్టెను వాహన మెక్కించి
అతని ఇల్లు చేర్చెను
అతని బాగుపరచ
తాను ఖర్చు చేసెను
జాలిపడిన వాడె అతని
పొరుగువాడనెన్ మనలనట్లు
చేయమని యేసయ్య చెప్పెన్