నిను విడువను ఏనాడు / Ninu Viduvanu Yenaadu

నిను విడువను ఏనాడు

రానీయను ఏ కీడు

అ.ప:అని నాతో పలికినాడు

నా యేసు దేవుడు

1. కనుల నీరు జారనీయను

కలత నీ దరి చేరనీయను                               ॥అని॥

శత్రువుకు నిను లొంగనీయను

శ్రమలలో నిను కృంగనీయను       ॥అని॥

సమస్త దేవతల కంటే / Samastha Devathala Kante

సమస్త దేవతల కంటే

మన ప్రభువు గొప్పవాడు

ఆకాశ మండలము కంటే

మిక్కిలి ఉన్నతుడు

యెహోవా దయాళుడు

స్తుతులకు పాత్రుడు

ప్రధాన యాజకుడు చాలిన దేవుడు

ప్రకటించెదం ప్రభువార్తను / Prakatinchedam Prabhuvaarthanu

ప్రకటించెదం ప్రభువార్తను

మాకున్న సమయమంతా

పరుగెత్తెదం ప్రభు కోసము

మా జీవితకాలమంతా

ప్రకటించెదం పరుగెత్తెదం

ప్రభు కొరకై జీవించెదం

శక్తిగల యేసుక్రీస్తు నామంలో / Shakthigala Yesukreesthu Namamulo

శక్తిగల యేసుక్రీస్తు నామంలో

జయము పొందుతాను నేను అన్నిటిలో

అ.ప: యేసులో నిలిస్తే గొప్పజయం

యేసుతో నడిస్తే లేదు భయం                      ॥శక్తి॥

1. బలశాలి గొల్యాతును చిన్న రాయితో

పడగొట్టెను దావీదు దైవబలముతో

దేవునిపై ఉంచెదను విశ్వాసం

దేవుని కర్పించెదను నా జీవితం                  ॥యేసు॥

2. లెక్కలేని శత్రువులను కొద్దిమందితో

గెలిచినాడు యెహోషువ ప్రార్ధనాత్మతో

ప్రార్ధనతో గెలిచెదను సమస్తం

లోకంలో నిలిచెదను ప్రభుకోసం                 ॥యేసు॥

లోతునకు నీ పడవ నడిపించుము / lothunaku Nee Padava Nadipinchumu

లోతునకు నీ పడవ నడిపించుము

ఆ పైన నీటిలోకి వల వేయుము

రాత్రంతా కష్టించి అలసిపోతిమి

కడలంతా గాలించి విసిగిపోతిమి

అనుభవమెంతున్నా ఫలితమే శూన్యం

అయినా నీ మాట చొప్పున వలలు వేసెదం

వలనిండా చేపలే ఎంత ఆశ్చర్యం

యేసు మాటలో ఉంది ఎంత ప్రభావం

సోదరులారా మాకు సాయం చెయ్యండి.

మీరును యేసుప్రభువు మహిమ చూడండి

యోనా ఓ యోనా / Jonah Oh Jonah

1. యోనా ఓ యోనా

ఏమిటి నాయనా

నీనెవె ప్రజల పాపం

నా దృష్టిలో ఘోరం

చేతును త్వరలో లయం

ప్రకటించు ఈ విషయం

దేవుని సన్నిధి విడిచి పారిపోవతలచి

తర్షీషునకు పోవుటకు ఓడను ఎక్కాడు.

దేవుడు తుఫాను పుట్టించి

గొప్ప కీడు రప్పించి సంద్రములోకి

యోనాను పడద్రోయగ చేశాడు.

2. మీనా ఓ మీనా ఏమిటి నాయనా

నా భక్తుడు ఒకడు పడబోవుచున్నాడు.

మ్రింగుము అతని నేడు

చేయరాదు ఏ కీడు

మత్స్యము కడుపులో నుండి యోనా

ప్రార్ధనా చేశాడు మూడవ రోజున

బయట పడి నీనెవె చేరాడు దేవునికి

వ్యతిరేకముగా ఏమియు చేయలేము

ఆయన సన్నిధికి దూరమై

మనము బ్రతుకలేము

నీకు కలిగిన దానిలో / Neeku Kaligina Daanilo

నీకు కలిగిన దానిలో

యేసయ్య కొరకు

ఇచ్చుట నేర్చుకొనుము

నీవు ఇచ్చిన కానుక

చిన్నదియైనను

దీవించి వృద్ధి చేయును

1. చిన్నవాడు ఇచ్చిన ఐదురొట్టెలే

ఐదువేలమందికి పంచబడెను

పేదరాలు వేసిన రెండుకాసులే

ఎంతో గొప్పగ ఎంచబడెను

2. నీ అక్కరలన్ని తానెరిగి

ప్రేమతో యేసు తీర్చుచుండెను

పొందిన వాటిలో కృతజ్ఞతతో

ఆయన భాగమిచ్చి ఘనపర్చుము

బహుమానముగా నను యేసయ్య / Bahumaanamugaa Nanu Yesayya

బహుమానముగా నను యేసయ్య

ప్రేమతో అమ్మానాన్నలకిచ్చెను

మేమందరము సంతోషముగా

ఆయనకై జీవింప కృప నిచ్చెను.

1. అనుదినము నాకు ఆహారము

సమృద్ధిగా ఆయనే దయచేయును

చదువులలో నేను ముందుండగా

కావలసిన జ్ఞానం నాకీయును

2. ప్రతిదినము తన స్వరము వినుటకు

పరిశుద్ధ గ్రంథమును నాకిచ్చెను

లోకమునందు చిరుదివ్వెగా

ఆయనకై వెలుగుమని సెలవిచ్చెను

ఇవిగో ఇవిగో మా స్తుతులు / Ivigo Ivigo Maa Sthuthulu

ఇవిగో ఇవిగో మా స్తుతులు

యేసూ నీకే కృతజ్ఞతలు

నీవు మాకిచ్చిన సర్వముకై

నీకివియే మా స్తుతులు                    ॥ఇవి॥

1. పరిమళమిచ్చు పువ్వులకై

నీకివియే మా స్తుతులు

మా నోట నుంచిన నవ్వులకై

నీకివియే మా స్తుతులు

కిలకిల రావపు పక్షులకై

నీకివియే మా స్తుతులు

కలకాలముండు రక్షణకై

నీకివియే మా స్తుతులు                    ॥ఇవి॥

2. మా మంచి అమ్మనాన్నలకై

నీకివియే మా స్తుతులు

గాలి వెలుతురు వెన్నెలకై

నీకివియే మా స్తుతులు

ఆరోగ్యం తెలివి తేటలకై

నీకివియే మా స్తుతులు

పరిశుద్ధ గ్రంథపు మాటలకై

నీకివియే మా స్తుతులు                    ॥ఇవి॥

క్రీస్తును ధరియించిన వాడను / Kreesthunu Dharinchina Vaadanu

క్రీస్తును ధరియించిన వాడను

నేను క్రైస్తవుడను

ప్రేమస్వరూపి ప్రియబిడ్డను

ప్రేమను పంచెదను

పొరుగువాడు ఆకలితో నుండ

రుచిగల ఆహారమెట్లు తిందును

కొంతైనను ఆహారమునిచ్చి

అతని ఆకలిని తీర్చెదను

కేవలము మాటలతో గాక

క్రియలతో ప్రేమను చూపెదను

2. పొరుగువాడు వస్త్రము లేకయుండ

విలువైన వస్త్రమెట్లు ధరియింతును

కొంతైనను నా స్వార్ధము మాని

అతని చలి నుండి రక్షింతును

కేవలము మాటలతో గాక

క్రియలతో ప్రేమను చూపెదను