… సమస్త సమూహమును… దేవుడు… యేడవదినములోగా సంపూర్తిచేసి,… ఆది 2:1,2
పల్లవి : ఆదిలో మన దేవుడు – భూమి ఆకాశంబుల సృజియించెను (2)
1. శూన్యము నుండి సృష్టిని చేసే – చీకటిని వెలుగుగ మార్చెను (2)
సూర్య చంద్ర నక్షత్రములను తన నోటి మాటతో సృజియించెను(1) ॥ఆ॥
2. అడవి పువ్వులను ఆకాశపక్షులను
జల చరముల సృజియించెను తన వాక్కుతో(2)
తన స్వరూపము నందు నరులను సృజియించె
ఆరు రోజులలో సంపూర్ణము చేసెను(2) ॥ఆ॥
3. ఏడవ దినమును పరిశుద్ధ పరచి – ఆ దినమును ఆశీర్వదించే ఆత్మతో సత్యముతో ఆరాధించి – ఆనందించుమనే మనదేవుడు ॥ఆ॥