యేసు చెప్పెను నేనే మార్గమును (సీయోను పిల్లల పాటలు) / Yesu Cheppenu Nene Maargamunu

యేసు – నేనే మార్గమును, సత్యమును, జీవమును;… యోహాను సువార్త 14:6

యేసు చెప్పెను నేనే మార్గమును,                                               (1)

యేసు చెప్పెను నేనే సత్యమును,                                                (1)

యేసు చెప్పెను నేనే జీవమును,                                   (1)

నా ద్వారానే తప్ప – యెవడును తండ్రి యొద్దకు     (2)

రాడు, రాడు తండ్రి యొద్దకు రాడు                              (2)

యోహాను సువార్త పదునాలుగు ఆరు                        (2)

యేసు చెప్పెను                                                                  (4)

బాలుడు కాదమ్మో / Baaludu Kaadammo

పాట రచయిత: డేనియల్ కళ్యాణపు
Lyricist: Daniel Kalyanapu

బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు
పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2)
పరమును విడచి పాకలో పుట్టిన
పాపుల రక్షకుడు మన యేసయ్యా (2)          ||బాలుడు||

కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందు
ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా
ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి
పరుగు పరుగున పాకను చేరామే (2)
మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము (2)
మా మంచి కాపరని సంతోషించామే
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4)         ||బాలుడు||

చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము
పరిశుద్ధుని చూసి పరవశించామే
రాజుల రాజని యూదుల రాజని
ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా (2)
బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము (2)
ఇమ్మానుయేలని పూజించామమ్మో
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4)          ||బాలుడు||

పాట రచయిత: డేనియల్ కళ్యాణపు
Lyricist: Daniel Kalyanapu

Baaludu Kaadammo Balavanthudu Yesu
Pasivaadu Kaadammo Paramaathmudu Kreesthu (2)
Paramunu Vidachi Pakalo Puttina
Paapula Rakshakudu Mana Yesayyaa (2)          ||Baaludu||

Kanya Mariya Garbhamandu Bethlehemu Puramunandu
Aa Pashushaalalona Puttinaadamma
Aa Vaartha Theliyagaane Gorrelanu Vidachi
Parugu Paruguna Paakanu Cheraame (2)
Manasaara Mrokkinaamu Madi Ninda Kolachinaamu (2)
Maa Manchi Kaaparani Santhoshinchaame
Sandadi Sandadi Sandadi Sandadi Sandadi Chesaame (4)          ||Baaludu||

Chukkanu Choosi Vachchinaamu Paakalo Memu Cherinaamu
Parishuddhuni Choosi Paravashinchaame
Raajula Raajani Yoodula Raajani
Ithade Maa Raajani Mrokkinaamammaa (2)
Bangaaramu Sambraani Bolam Kaanukagaa Ichchinaamu (2)
Immanuyelani Poojinchaamammo
Sandadi Sandadi Sandadi Sandadi Sandadi Chesaame (4)          ||Baaludu||

ప్రభు యేసు నీ చరణముల (సీయోను పిల్లలు పాటలు) / Prabhu Yesu Nee Charanamulu

…క్రీస్తు మనకోసము శాపమై… గలతీ 3:14

పల్లవి : ప్రభు యేసు నీ చరణముల – చేరినే వచ్చితిని

ఏ సమయమందైనను – చేరి స్తుతించెదను (2)

1.నావంటి ప్రధాన పాపిని – ప్రభువా ప్రేమించితివి (2)

     శపగ్రస్త సీలువలో నాకై – ప్రాణమర్పించితివి            ॥ప్రభు॥

2. నీదు పవిత్ర చేతితో – ప్రభు నను ముట్టితివి

    నీదు పవిత్ర రక్తముతో – ప్రభునను కడిగితివి              ॥ప్రభు॥

3. నీదు అపార ప్రేమను – నేనెట్లు వర్ణించెదా?

    నేనే మర్పింతు దానికైనిలలో – అర్పింతు నా జీవితం   ॥ప్రభు॥

Maseeh… jo hamare liye shraapith bana,… Gal. 3:13

పల్లవి : ప్రభు తుమ్హారే చరణోమే, మై అబ్ ఆతాహు

కోయిఖీ సమయ్ క్యోనహో, మై ఆసక్ తా హు (2)

1. ముజ్ అధమ్ పాపి దుష్ట్ సే – ప్రభుతునే ప్రేమకియా

    శ్రాపిత్ క్రూస్ పర్ మేరేలియే – ప్రభూ తూనే ప్రాణియా             ॥ప్రభు॥

2. తేరే పవిత్ర హాత్ సే – ప్రభు ముఝ చూఆ

    తేరే పవిత్ర లహు సే – తునే ముఝ దోయా                         ॥ప్రభు॥

3. తేరే ఆపార్ ప్రేమ్ కా – వర్జన్ మై కైసే కరూ?

    ఉస్కే బద్ లేమె – క్యా దేసక్తాహు? జీవన్ మై  సౌంప్ తాహూ ॥ప్రభు॥

నాకై యేసు కట్టెను – సుందరము బంగారిల్లు        (సీయోను పిల్లల పాటలు) / Nakai Yesu Kattenu Sundaramu Bangaarillu

…దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు,… ప్రక 21:4

1. నాకై యేసు కట్టెను – సుందరము బంగారిల్లు                                     (2)

    కన్నీరును కలతలు లేవు – యుగయుగములు పరమానందం       (2)

2. రాత్రింబగలందుండదు – సూర్యచంద్రులుండవు                             (2)

    ప్రభు యేసే ప్రకాశించున్ – ఆ వెలుగులో నే నడిచెదను                   (2)

3. జీవ వృక్షమందుండు – జీవ మకుటమందుండు                                 (2)

    ఆకలి లేదు దాహము లేదు – తిని త్రాగుట అందుండదు   (2)    

    Repeat first 2 lines

యేసు నా ప్రభువా – నీకై జీవించెదన్ (సీయోను పిల్లల పాటలు) / Yesu Naa Prabhuvaa Neekai Jeevinchedan

నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే…. ఫిలిప్పీ 1:21

పల్లవి: యేసు నా ప్రభువా – నీకై జీవించెదన్ (2)

1. అలసిన వేళలో, శోధనల్ కల్గిన(2)

    ఇతరులు రోసిన, సాతాను పోరిన(2)   ||యేసు||

2. ఆట్లాడు స్థలములో, బడి యందు వున్నను

    దుష్టుల మధ్యను, తల్లిదండ్రుల యెదుటను(2)     ||యేసు||

యేసు ఉన్న హృదయం

… నేను తప్ప వేరొక దేవుడు లేడు. యెషయా 45:21

పల్లవి: యేసు ఉన్న హృదయం – సంతోష పూర్ణం ఎల్లప్పుడానందం (2)

1. ఉన్నతమగు దేవుడు – ఒక్కడై యున్నాడు

    ఆయన గాక వేరే – దేవుడు లేడు(2)             ||యేసు||

2. స్తుతులొందు దేవుడు – భువిలోన జన్మించి

    పాపము తొలగించుటకు – దిగివచ్చెను         ||యేసు||

3. కాపాడు ప్రభువతడే – కరముల నెత్తి మనల

    భయమును దుఃఖమును బాపి – పరమున జేర్చున్||యేసు||

యేసు తిరిగిరాగా సంధింప సిద్ధమా (సీయోను పిల్లల పాటలు) /Yesu Thirigiraaga Sandhimpa Siddhama

మీరు సిద్ధపడని యెడల… మీరును సిగ్గుపరచబడుదురు… 2 కొరింథీ 9:4

1. యేసు తిరిగిరాగా సంధింప సిద్ధమా?           (1)

    నీవు నిక్కముగా తిరిగి జన్మించితివా?           (1)

    నీ వస్త్రమేసు రక్తములో శుద్ధియాయెనా?       (1)

    యేసు తిరిగిరాగా సంధింప సిద్ధమా?           (1)

2. ఇరువురు తిరుగలి విసురుచుండగా

    ఇరువురొకచోట నిద్రించుచుండగా

    ఒకరెత్తబడి ఒకరు విడువబడుదురు

    యేసు తిరిగిరాగా సంధింప సిద్ధమా?

3. అవును యేసు రాగా నే సంధించెదను

    నేను నిక్కముగా తిరిగి జన్మించితిని

    నా వస్త్ర మేసు రక్తములో కడుగుకొంటిని!

    అవును యేసురాగా సంధింప సిద్ధమే.

…be ready:… lest …we should be ashamed… 2 Cor. 9:3,4

1. Will you be ready-When Jesus comes?                                  (1)

    Are you truely born again? – Washed in Jesus Blood?           (1)

    Are your garments spotless?-Are they whiter than snow?     (1)

    Will you be ready-When Jesus comes?                                  (1)

2. Two shall be together – Grinding at the mill

    Two shall be together – Sleeping calm and still

    The one shall be taken – And the other left behind

    Will you be ready – When Jesus comes?

3.Yes, I\’ll be ready – When Jesus comes

    I am truely born again – Washed in Jesus\’ blood;

    My garments are spotless – They are whiter than snow

    Yes, I\’ll be ready – When Jesus comes.

ఎచ్చటి కేగెదను – యేసు నిన్ను విడిచి (సీయోను పిల్లల పాటలు) / Yecheti Kegedanu Yesu Ninnu Vidachi

.నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు; యోహాను 6:68

పల్లవి : ఎచ్చటి కేగెదను – యేసు నిన్ను విడిచి (1)

నీవే నిత్యజీవపు – మాటలు కలవాడవు (2)

1. జీవవాక్యము నీవై – జనకుని చూపితివి(2)

    లోకమునకు వెలుగై – నన్ను వెలిగించితివి(2)

2. దేవ గొఱ్ఱపిల్లవై – పాపముల్ మోసితివి

    నాకు నాయకుడవై – నన్ను పిలచితివి

3. నిత్య జీవము నీవై – నీ ఇంట చేర్చితివి

    బండవై నీవే నాకు – దాహము తీర్చితివి

యేసు నా చెయ్యి విడువడు (సీయోను పిల్లల పాటలు) / Yesu Na Cheyyi Viduvadu

నిన్ను ఏమాత్రమును విడువను,… హెబ్రీ 13:5

యేసు నా చెయ్యి విడువడు (2)

తుఫాను రేగినా గాలి లేచినా – యేసు నా చెయ్యి విడువడు (2)

…I will never leave thee,… Hebrews 13:5

He will never let go my hand

Though the storms may come

And the winds may blow

He will never let go my hand

యేసు నెరిగి యుండుటే ఆనందం, ఆనందం (సీయోను పిల్లల పాటలు) / Yesu Nerigi Undute Anandam, Anandam

…యెహోవాయందు ఆనందించుట… నెహెమ్యా 8:10

1. యేసు నెరిగి యుండుటే ఆనందం, ఆనందం             (1)

    యేసు నెరిగి యుండుటే ఆనందం                         (1)

పల్లవి: ఈ సంతోషం నాకిమ్ము – నాదు ప్రార్థన ఇదియే     (1)

నాకు క్రీస్తే సర్వము సమస్తము                        (1)

2. ప్రార్ధించుటయే నాకు ఆనందం, ఆనందం                 (1)

    ప్రార్ధించుటయే నాకు ఆనందం                             (1)      ॥ఈ॥

3. వాక్యము పఠించుటయే ఆనందం, ఆనందం

    వాక్యము పఠించుటయే ఆనందం                                   ॥ఈ॥

4. క్రీస్తు సిలువను మోయుటయే ఆనందం, ఆనందం

    క్రీస్తు సిలువను మోయుటయే ఆనందం                             ॥ఈ॥

5. దేవుని స్తుతించుటయే ఆనందం, ఆనందం

    దేవుని స్తుతించుటయే ఆనందం                                      ॥ఈ॥

6. యేసు నొద్దకు ఆత్మలను తెచ్చుటయే ఆనందం

    యేసు నొద్దకు తెచ్చుటయే ఆనందం                                 ॥ఈ॥

…Joy of the LORD… Neh. 8:10

1. Happy he who (1) (knows the Lord – 3)

    Happy he who (1) (knows the Lord – 2)              Il Grant II

Chorus: Grant me this O Lord I pray-That\’s my joy from day to day-1

     Christ my all along life\’s way – Christ my all -1

2. Happy he who (1) (learns to pray – 3)

    Happy he who (1) (learns to pray – 2)                 Il Grant II

3. Happy he who (1) (reads God\’s Word – 3)

    Happy he who (1) (reads God\’s Word – 2)          Il Grant II

4. Happy he who (1) (bears His cross – 3)

    Happy he who (1) (bears His cross – 2)              Il Grant II

5. Happy he who (1) (sings God\’s praise – 3)

    Happy he who (1) (sings God\’s praise – 2)         Il Grant II

6. Happy he who (1)  (wins some souls – 3)

    Happy he who (1) (wins some souls – 2)            Il Grant II