నీ స్నేహము / Nee Snehamu

నీ స్నేహము ఎంతో సత్యము
ఆద్యంతము నా హృదిలో పదిలము (2)
నా సఖుడా ప్రియ యేసయ్య
నా హితుడా స్నేహితుడా (2)
నీవెంత గొప్ప వాడివయ్యా
నను ఆదరించినావయ్యా (2)

సింహాల బోనులో నా ప్రాణానికి
ప్రాణమైన నా విభుడవు
చెరసాలలోన సంకెళ్ళు విరచి
విడుదల నిచ్చిన రక్షక (2)
కన్న తల్లి కూడా నన్నెరుగక మునుపే
నన్నెరిగిన నా తండ్రివి        ||నా సఖుడా||

గొల్యాతయినా ఏ యుద్ధమైనా
విజయము నిచ్చిన వీరుడవు
పదివేలమంది నా వైపు కూలినా
నాతో నిలచిన ధీరుడవు (2)
నా దోశములను నీదు రక్తముతో
తుడిచివేసిన పరిశుద్ధుడవు        ||నా సఖుడా||

ఏ ఎన్నిక లేని నను ప్రేమించిన కృపామయుడవు
అందరు విడిచిన నన్నెన్నడు విడువని కరుణామయుడవు (2)
నిస్సారమైన నా జీవితములో
సారము పోసిన సజీవుడవు (2)        ||నా సఖుడా||

Nee Snehamu Entho Sathyamu
Aadyanthamu Naa Hrudilo Padilamu (2)
Naa Sakhudaa Priya Yesayya
Naa Hithudaa Snehithudaa (2)
Neeventha Goopavaadivayyaa
Nanu Aadarinchinaavayyaa (2)

Simhaala Bonulo Naa Praanaaniki
Praanamaina Naa Vibhudavu
Cherasaalalona Sankellu Virachi
Vidudala Nicchina Rakshaka (2)
Kanna Thalli Kooda Nannerugaka Munupe
Nannerigina Naa Thandrivi         ||Naa Sakhudaa||

Golyaathayinaa Ae Yuddhamaina
Vijayamu Nicchina Veerudavu
Padivelamandi Naa Vaipu Koolinaa
Naatho Nilachina Dheerudavu (2)
Naa Doshamulanu Needu Rakthamutho
Thudichivesina Parishuddhudavu         ||Naa Sakhudaa||

Ae Ennikaleni Nanu Preminchina Krupaamayudavu
Andaru Vidichina Nannennadu Viduvani Karunaamayudavu (2)
Nissaramaina Naa Jeevithamulo
Saaramu Posina Sajeevudavu (2)         ||Naa Sakhudaa||

నీ ప్రేమే నాకు చాలయ్యా / Nee Preme Naaku Chaalayyaa

నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా
నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా (2)
నీ దీవెనా నాకు చాలయ్యా (2)
ఓ కరుణామయా (4)          ||నీ ప్రేమే||

నన్ను ప్రేమించి నన్నాదరించి
నీ సన్నిధిలో నను నిలిపితివి (2)         ||నీ దీవెనా||

ఈ లోక మనుషులు నన్ను ద్వేషించినా
నీవు నన్ను మరువని దేవుడవు (2)           ||నీ దీవెనా||

కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా
నీ రాకడకు గుర్తులుగా ఉన్నవి (2)
నీ సువార్తను నే చాటెదను (2)
ఓ కరుణామయా (4)          ||నీ ప్రేమే||

Nee Preme Naaku Chaalayyaa O Yesayyaa
Nee Krupaye Naaku Thodayyaa O Messaiah (2)
Nee Deevenaa Naaku Chaalayyaa (2)
O Karunaamayaa (4)       ||Nee Preme||

Nannu Preminchi Nannaadarinchi
Nee Sannidhilo Nanu Nilapithivi (2)         ||Nee Deevenaa||

Ee Loka Manushulu Nannu Dweshinchinaa
Neevu Nannu Maruvani Devudavu (2)         ||Nee Deevenaa||

Karuvulu Bhookampaalu Yuddhaalu Vachchinaa
Nee Raakadaku Gurthulugaa Unnavi (2)
Nee Suvaarthanu Ne Chaatedanu (2)
O Karunaamayaa (4)        ||Nee Preme||

నీ ప్రేమ ఎంతో మధురం / Nee Prema Entho Madhuram

నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా
నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (2)            ||నీ ప్రేమ||

రాతి గుండెలే మారును
నీ మాట సెలవిస్తే (2)
రమణీయము నీ మాటలే
వెదజల్లును సుమగంధమే (2)           ||యేసయ్యా||

వ్యాధి బాధలే పోవును
నీ మాట సెలవిస్తే (2)
బలమైనది నీ మాటయే
తొలగించును కారు చీకటులే (2)           ||యేసయ్యా||

నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా
నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (2)            ||నీ ప్రేమ||

రాతి గుండెలే మారును
నీ మాట సెలవిస్తే (2)
రమణీయము నీ మాటలే
వెదజల్లును సుమగంధమే (2)           ||యేసయ్యా||

వ్యాధి బాధలే పోవును
నీ మాట సెలవిస్తే (2)
బలమైనది నీ మాటయే
తొలగించును కారు చీకటులే (2)           ||యేసయ్యా||

నీ ప్రేమా ఎంతో / Nee Premaa Entho

నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం (2) యేసు
యేసయ్యా నీ ప్రేమ మధురం
యేసయ్యా మధురాతి మధురం (2)     ||నీ ప్రేమా||

మరచిపోనిది నీ ప్రేమా
నన్ను మార్చుకున్నది నీ ప్రేమా
కన్ను రెప్ప లాంటిది నీ ప్రేమా
జీవ కాలముండును నీ ప్రేమా (2)      ||నీ ప్రేమా||

సిలువకెక్కెను నీ ప్రేమా
నాకు విలువ నిచ్చెను నీ ప్రేమా
నాకై మరణించెను నీ ప్రేమా
నాకై తిరిగి లేచెను నీ ప్రేమా (2)     ||నీ ప్రేమా||

తల్లికుండునా నీ ప్రేమా
సొంత చెల్లికుండునా నీ ప్రేమా
అన్నకుండునా నీ ప్రేమా
కన్న తండ్రికుండునా నీ ప్రేమా (2)       ||నీ ప్రేమా||

త్యాగమున్నది నీ ప్రేమలో
దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో
బలమున్నది నీ ప్రేమలో
గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో (2)         ||నీ ప్రేమా||

Nee Premaa Entho Entho Madhuram (2) Yesu
Yesayyaa Nee Prema Madhuram
Yesayyaa Madhuraathi Madhuram (2)   ||Nee Premaa||

Marachiponidi Nee Premaa
Nannu Maarchukunnadi Nee Premaa
Kannu Reppa Laantidi Nee Premaa
Jeeva Kaalamundunu Nee Premaa (2)      ||Nee Premaa||

Siluvakekkenu Nee Premaa
Naaku Viluva Nichchenu Nee Premaa
Naakai Maraninchenu Nee Premaa
Naakai Thirigi Lechenu Nee Premaa (2)        ||Nee Premaa||

Thallikundunaa Nee Premaa
Sontha Chellikundunaa Nee Premaa
Annakundunaa Nee Premaa
Kanna Thandrikundunaa Nee Premaa (2)     ||Nee Premaa||

Thyaagamunnadi Nee Premalo
Deergha Shaanthamunnadi Nee Premalo
Balamunnadi Nee Premalo
Goppa Bhaagyamunnadi Nee Premalo (2)    ||Nee Premaa||

నీ పాద సన్నిధికి / Nee Paadha Sannidhiki

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

నీ పాద సన్నిధికి
కృపామయా యేసయ్యా
నీ ప్రేమ కనుగొనుచు
దేవా నే వచ్చితిని (2)       ||నీ పాద||

విశ్రాంతి నిచ్చెడు దేవా
శ్రమలెల్ల తీర్చుమయ్యా (2)
సిలువయే నా ఆశ్రయము
హాయిగా నచ్చటుండెదను (2)       ||నీ పాద||

ప్రార్ధించుమంటివి ప్రభువా
సంకట సమయములో (2)
దయ చూపి నను కరుణించి
ప్రేమతో ఆదరించుమయ్యా (2)       ||నీ పాద||

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Nee Paadha Sannidhiki
Krupaamayaa Yesayyaa
Nee Prema Kanugonuchu
Devaa Ne Vachchithini (2)       ||Nee Paadha||

Vishraanthi Nichchedu Devaa
Shramalella Theerchumayyaa (2)
Siluvaye Naa Aashrayamu
Haayigaa Nachchatundedanu(2)       ||Nee Paadha||

Praardhinchumantivi Prabhuvaa
Sankata Samayamulo (2)
Daya Choopi Nanu Karuninchi
Prematho Aadarinchumayyaa (2)       ||Nee Paadha||

నీ నామం నా గానం / Nee Naamam Naa Gaanam

నీ నామం నా గానం
నీ స్మరణే నా సర్వం (2)
నా కాపరి నీవే యేసయ్యా
నా ఊపిరి నీవే మెస్సయ్యా (2)        ||నీ నామం||

నీ వాక్యపు వెలుగులో నడిచెదనయ్యా
నీ రక్షణ గూర్చి నేను పాడెదనయ్యా (2)
సంగీత స్వరములతో స్తుతియి౦తును (2)
స్తుతుల౦దుకో నా యేసురాజా (2)        ||నీ నామం||

ఈ ఊపిరి నీవిచ్చిన కృపాదానమే
నన్నిలలో కాపాడే కాపరి నీవే (2)
నీ ఆత్మతో నన్ను శృతి చేయుమయా (2)
బ్రతుకంత నీ సేవ చేసెదనయ్యా (2)        ||నీ నామం||

Nee Naamam Naa Gaanam
Nee Smarane Naa Sarvam (2)
Naa Kaapari Neeve Yesayyaa
Naa Oopiri Neeve Messayyaa (2) ||Nee Naamam||

Nee Vaakyapu Velugulo Nadichedanayyaa
Nee Rakshana Goorchi Nenu Paadedanayyaa (2)
Sangeetha Swaramulatho Sthuthiyinthunu (2)
Sthuthulanduko Naa Yesu Raajaa (2)         ||Nee Naamam||

Ee Oopiri Neevichchina Krupaadaaname
Nannilalo Kaapaade Kaapari Neeve (2)
Nee Aathmatho Nannu Shruthi Cheyumayaa (2)
Brathukantha Nee Seva Chesedanayyaa (2)         ||Nee Naamam||

నీ చేతిలో రొట్టెను నేనయ్య / Nee Chethilo Rottenu Nenayya

నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా (2)
విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా (2)       ||నీ చేతిలో||

తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును
ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి (2)           ||నీ చేతిలో||

అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు
ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి (2)           ||నీ చేతిలో||

హింసకుడు దూషకుడు హానికరుడైన
సౌలును విరిచితివి పౌలుగా మార్చితివి (2)              ||నీ చేతిలో||

Nee Chethilo Rottenu Nenayya
Viruvu Yesayyaa (2)
Viruvu Yesayyaa
Aasheervadinchu Yesayyaa (2)                ||Nee Chethilo||

Thandri Intinundi Pilichithivi Abraamunu
Aasheervadinchithivi
Abrahaamuga Maarchithivi (2)            ||Nee Chethilo||

Ala Yaakobunu Neevu Pilichithivi Aanaadu
Aasheervadinchithivi
Ishraayeluga Maarchithivi (2)              ||Nee Chethilo||

Himsakudu Dooshakudu Haanikarudaina
Soulunu Virichithivi
Pouluga Maarchithivi (2)                      ||Nee Chethilo||

నీ చల్లని నీడలో / Nee Challani Needalo

నీ చల్లని నీడలో
నీ చక్కని సేవలో (2)
నా బ్రతుకు సాగనిమ్మయ్యా
యేసయ్యా – నా బ్రతుకు సాగనిమ్మయ్యా (2)         ||నీ చల్లని||

కష్టాలు ఎన్ని వచ్చినా
వేదనలు ఎదురైనా (2)
నీ కృప నాకు చాలు నీ కాపుదల మేలు
నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా (2)         ||నీ చల్లని||

ఏర్పరచబడిన వంశములో
రాజులైన యాజకులుగా చేసితివి (2)
పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా
నీ కొరకే జీవించుట నాకు భాగ్యము (2)         ||నీ చల్లని||

Nee Challani Needalo
Nee Chakkani Sevalo (2)
Naa Brathuku Saaganimmayyaa
Yesayyaa – Naa Brathuku Saaganimmayyaa (2)         ||Nee Challani||

Kashtaalu Enni Vachchinaa
Vedhanalu Edurainaa (2)
Nee Krupa Naaku Chaalu Nee Kaapudala Melu
Nee Parishuddhathmatho Nannaadarinchavaa (2)         ||Nee Challani||

Erparachabadina Vamshamulo
Raajulaina Yaajakulugaa Chesithivi (2)
Parishuddha Janamugaa Sotthaina Prajalugaa
Nee Korake Jeevinchuta Naaku Bhaagyamu (2)         ||Nee Challani||

నీ కృప లేని క్షణము / Nee Krupa Leni Kshanamu

పాట రచయిత: పాకలపాటి జాన్ వెస్లీ
Lyricist: Pakalapati John Wesley

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా

నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా (2)
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2)     ||నీ కృప||

మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప (2)     ||యేసయ్యా||

ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు (2)
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప (2)     ||యేసయ్యా||

పాట రచయిత: పాకలపాటి జాన్ వెస్లీ
Lyricist: Pakalapati John Wesley

Nee Krupa Leni Kshanamu – Nee Daya Leni Kshanamu
Nenoohinchalenu Yesayyaa (2)
Yesayyaa Nee Krupa Naaku Chaalayyaa
Nee Krupa Lenide Nenundalenayyaa (2)       ||Nee Krupa||

Mahimanu Vidichi Mahiloki Digi Vachchi
Maargamugaa Maari Manishiga Maarchaavu
Mahine Neevu Maadhuryamugaa Maarchi
Maadiri Choopi Maro Roopamichchaavu (2)
Mahimalo Nenu Mahimanu Ponda
Mahimagaa Maarchindi Nee Krupa (2)        ||Yesayyaa||

Aagnala Maargamuna Aashrayamunu Ichchi
Aapathkaalamuna Aadukonnaavu
Aathmeeyulatho Aanandimpa Chesi
Aananda Thailamutho Abhishekinchaavu (2)
Aasha Theera Aaraadhana Chese
Adrushtamichchindi Nee Krupa (2)        ||Yesayyaa||

నీ కంటిపాపనూ / Nee Kantipaapanu 

నీ కంటిపాపనూ – నా కంటనీరు చూడలేవు
నీ చల్లని చూపులో – నేనుందును నీ కృపలో (2)
యేసయ్యా.. యేసయ్య.. ఏ అడ్డూ వద్దయ్యా
నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా (2)

కన్నవారు నీ దారి నీదన్నారు
నమ్మినవారే నవ్విపోయారు
విరిగి నలిగి నీవైపు చూశాను
తల్లివై తండ్రివై నన్నాదుకున్నావు      ||యేసయ్యా||

ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు
ఎంతగానో ప్రేమించి లాలించావు
నా ఊపిరీ నా ప్రాణమూ
నీ దయలోనే నా జీవితం      ||యేసయ్యా||

నీ మాటలో నా బాటను
నీ ప్రేమలో నా పాటను
సాగిపోనీ నా యాత్రనూ
నీ దరి నేను చేరువరకు      ||యేసయ్యా||

Nee Kantipaapanu – Naa Kanta Neeru Choodalevu
Nee Challani Choopulo – Nenundunu Nee Krupalo (2)
Yesayyaa Yesayya Ae Addu Vaddhayyaa
Nee Premaku Naalo Sarihaddhulu Levayyaa (2)

Kanna Vaaru Nee Daari Needannaaru
Nammina Vaare Navvi Poyaaru (2)
Virigi Naligi Nee Vaipu Choosanu
Thallivai Thandrivai Nannaadukunnavu (2)      ||Yesayya||

Endharendharilo Nannennukunnavu
Enthagaano Preminchi Laalinchavu (2)
Naa Oopiri Naa Pranamu
Nee Dayalone Naa Jeevitham (2)      ||Yesayya||

Nee Maatalo Naa Baatanu
Nee Premalo Naa Paatanu (2)
Saagiponi Naa Yaathranu
Nee Dari Nenu Cheruvaraku (2)      ||Yesayya||