నీ జీవితం క్షణ భంగురం / Nee Jeevitham Kshana Bhanguram

నీ జీవితం క్షణ భంగురం
నీ యవ్వనం తృణాప్రాయం
ఎప్పుడు రాలునో ఎవరు ఎరుగరు
ఎప్పుడు పోవునో నీకు తెలియదు
ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా
పరిహాసమేల ఓ సోదరా
ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా
పరిహాసమేల ఓ సోదరీ
పరిహాసమేల ఓ సోదరా… పరిహాసమేల ఓ సోదరీ…

ఈ రెండు మార్గములు నీ ఎదుటనున్నవి
విశాల మార్గమొకటి – ఇరుకు మార్గమొకటి (2)
ఏది నీ మార్గమో – ఈ క్షణమే తేల్చుకో (2)
ఈ క్షణమే తేల్చుకో       ||నీ జీవితం||

నీకున్నవన్నియు క్షణిక సుఖములే
ప్రభు యేసుని చేరు – పరలోకమే నీదవును (2)
ఈ దినమే సుదినము – ప్రభుని హృదిని చేర్చుకో (2)
ప్రభుని హృదిని చేర్చుకో      ||నీ జీవితం||

Nee Jeevitham Kshana Bhanguram
Nee Yavvanam Thrunaapraayam
Eppudu Raaluno Evaru Erugaru
Eppudu Povuno Neeku Theliyadu
Prabhu Yesu Priyamaara Ninnu Piluchuchundagaa
Parihaasamela O Sodaraa
Prabhu Yesu Priyamaara Ninnu Piluchuchundagaa
Parihaasamela O Sodaree
Parihaasamela O Sodaraa
Parihaasamela O Sodaree

Ee Rendu Maargamulu Nee Yedutanunnavi
Vishaala Maargamokati – Iruku Maargamokati (2)
Edi Nee Maargamo – Ee Kshaname Thelchuko (2)
Ee Kshaname Thelchuko       ||Nee Jeevitham||

Neekunnavanniyu Kshanika Sukhamule
Prabhu Yesuni Cheru – Paralokame Needavunu (2)
Ee Diname Sudinamu – Prabhuni Hrudini Cherchuko (2)
Prabhuni Hrudini Cherchuko      ||Nee Jeevitham||

నన్నెంతగానో ప్రేమించిన / Nannenthagaano Preminchina

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా
నా దీన బ్రతుకునే దీవించిన దేవా (2)
నిన్నే ఆరాధింతును – నీలో ఆనందింతును (2)
నా యవ్వనమంతా… నా జీవితమంతా (2)     ||నన్నెంతగానో||

ధరలోని మన్నుతో సమమైన నన్ను
ఎన్నుకొని ఉన్నత స్థితికి చేర్చినావు (2)
అన్నీ నీవే నాకై సమకూర్చినావు
ఉన్నాను నీ తోడు భయపడకన్నావు (2)
వాక్యపు మన్నాతో పోషించిన నన్నే
ఎన్నడూ విడువని ఎడబాయని నిన్నే    ||నిన్నే||

దినమెల్ల నా కొరకే కనిపెట్టినావు
ఎల్లవేళలా నా తోడుగ నిలిచావు (2)
మెల్లని నీ స్వరముతో మాట్లాడినావు
చల్లని కరములతో నా కన్నీరు తుడిచావు (2)
పాపపు ముళ్ళును తొలగించుటకై నాలో
మరణపు విల్లును విరచిన దేవా నీలో      ||నీలో||

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Nannenthagaano Preminchina Prabhuvaa
Naa Deena Brathukune Deevinchina Devaa (2)
Ninne Aaraadhinthunu – Neelo Aanandinthunu (2)
Naa Yavvanamanthaa… Naa Jeevithamanthaa (2)      ||Nannenthagaano||

Dharaloni Mannutho Samamaina Nannu
Ennukoni Unnatha Sthithiki Cherchinaavu (2)
Anni Neeve Naakai Samakoorchinaavu
Unnaanu Nee Thodu Bhayapadakannaavu (2)
Vaakyapu Mannaatho Poshinchina Nanne
Ennadoo Viduvani Edabaayani Ninne         ||Ninne||

Dinamella Naa Korake Kanipettinaavu
Ellavelalaa Naa Thoduga Nilichaavu (2)
Mellani Nee Swaramutho Maatlaadinaavu
Challani Karamulatho Naa Kanneeru Thudichaavu (2)
Paapapu Mullunu Tholaginchutakai Naalo
Maranapu Villunu Virachina Devaa Neelo     ||Neelo||