సీయోను నీ దేవుని / Seeyonu Nee Devuni

సీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుము (2)
శ్రీ యేసు రాజుని ప్రియ సంఘమా స్తొత్రించి పూజింపుము (2)
యేసే మన విమోచన – హల్లెలూయా హల్లేలూయా
యేసే మన సమాదానం – హల్లెలూయా హల్లేలూయా
యేసే మన రక్షణ – హల్లెలూయా హల్లేలూయా
యేసే మన రారాజు – హల్లెలూయా ఆమేన్ (2)

మా ఊటలన్నియు నీ యందు వున్నవని (2)
పాటలు పాడుము నాట్యము చేయుము (2)        ||యేసే||

ఇమ్మనుయేలుగ ఇనాల్లు తోడుగ (2)
జిహ్వా ఫలమర్పించి సన్నుతించెదం (2)        ||యేసే||

అల్ఫా ఒమేగ ఆద్యంతమాయనే (2)
ఆమేన్ అనువానిని ఆరాధించెదం (2)        ||యేసే||

Seeyonu Nee Devuni Keerthinchi Koniyaadumu (2)
Sree Yesu Raajuni Priya Sanghamaa Sthothrinchi Poojimpumu (2)
Yese Mana Vimochana – Hallelooyaa Hallelooyaa
Yese Mana Samaadhaanam – Hallelooyaa Hallelooyaa
Yese Mana Rakshana – Hallelooyaa Hallelooyaa
Yese Mana Raaraaju – Hallelooyaa Aamen (2)

Maa Ootalanniyu Nee Yandu Unnavani (2)
Paatalu Paadumu Naatyamu Cheyumu (2)          ||Yese||

Immaanuyeluga Innaallu Thoduga (2)
Jihvaaphalamarpinchi Sannuthinchedam (2)          ||Yese||

Alphaa Omega Aadyanthamaayane (2)
Aamen Anuvaanini Aaraadhinchedam (2)          ||Yese||

అమూల్య రక్తం ప్రశస్త రక్తం / Amoolya Raktham Prashastha Raktham

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు

అమూల్య రక్తం – ప్రశస్త రక్తం
విలువైన రక్తం – శక్తి గల రక్తం (2)
యేసు రక్తమే జయము
క్రీస్తు రక్తమే విజయము (2)
పాప క్షమాపణ యేసు రక్తములోనే
శాప విమోచన క్రీస్తు రక్తములోనే ||అమూల్య||

తండ్రి చిత్తము నెరవేర్చ
గెత్సేమనేలో ప్రార్ధింప (2)
చెమట రక్తము గొప్ప బిందువులై కారెనే
ఆత్మ శక్తిని ప్రసాదించును – అమూల్య రక్తమే (2) ||యేసు||

శాపానికి ప్రతిఫలము ముళ్ళు
ముండ్ల కిరీటముతో చెల్లు (2)
ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలు
ప్రతి వ్యాధిని స్వస్థపరచును – అమూల్య రక్తమే (2) ||యేసు||

నీ చేతుల పనిని ఆశీర్వదింప
ప్రభు చేతులలో మేకులు గొట్ట (2)
కాళ్లలో మేకులు సువార్తకు సుందరమే
బల్లెపు పోటు బాగు చేయును – గుండెలను (2) ||యేసు||

Lyricist: Diyya Prasada Rao

Amoolya Raktham – Prashastha Raktham
Viluvaina Raktham – Shakthi Gala Raktham (2)
Yesu Rakthame Jayamu
Kreesthu Rakthame Vijayamu (2)
Paapa Kshamaapana Yesu Rakthamulone
Shaapa Vimochana Kreesthu Rakthamulone          ||Amoolya||

Thandri Chitthamu Neravercha
Gethsemanelo Praardhimpa (2)
Chemata Rakthamu Goppa Binduvulai Kaarene
Aathma Shakthini Prasaadinchunu – Amoolya Rakthame (2)       ||Yesu||

Shaapaaniki Prathiphalamu Mullu
Mundla Kireetamutho Chellu (2)
Prabhuvu Nondene Manakai Koradaa Debbalu
Prathi Vyaadhini Swasthaparachunu – Amoolya Rakthame (2)       ||Yesu||

Nee Chethula Panini Aasheervadimpa
Prabhu Chethulalo Mekulu Gotta (2)
Kaallalo Mekulu Suvaarthaku Sundarame
Ballepu Potu Baagu Cheyunu – Gundelanu (2)       ||Yesu||