నా తనువు నా మనసు / Naa Thanuvu Naa Manasu

పాట రచయిత: స్వప్న ఎడ్వర్డ్స్
Lyricist: Swapna Edwards

నా తనువు నా మనసు
నా నైపుణ్యం నీ కొరకే
నా తలంపులు నా మాటలు
నా క్రియలు నీ కొరకే
నా ప్రయాసే కాదు
నీ కరుణతో నిలిచింది ఈ జీవితం
నీ నామం కీర్తించాలని
నీ బలం చూపించాలని
అందుకేగా నన్నిలలో నియమించితివి

నీ స్వరూపముగా
నీ శ్వాసతో నను సృజియించితివి
నీ మహిమగా నేనుండుటకు
నీతోనే జీవించుటకు (2)
అందుకేగా నన్నిలలో సృజియించితివి
అందుకేగా నన్నిలలో నియమించితివి         ||నా తనువు||

గర్భ వాసమున లేనప్పుడే
నన్ను ప్రతిష్టించితివి
నీ వెలుగునే ప్రకాశించుటకు
నీ ప్రేమనే పంచుటకు (2)
అందుకేగా నన్నిలలో ప్రతిష్టించితివి
అందుకేగా నన్నిలలో నియమించితివి           ||నా తనువు||

పాట రచయిత: స్వప్న ఎడ్వర్డ్స్
Lyricist: Swapna Edwards

Naa Thanuvu Naa Manasu
Naa Naipunyam Nee Korake
Naa Thalampulu Naa Maatalu
Naa Kriyalu Nee Korake
Naa Prayaase Kaadu
Nee Karunatho Nilichindi Ee Jeevitham
Nee Naamam Keerthinchaalani
Nee Balam Choopinchaalni
Andukegaa Nannilalo Niyaminchithivi

Nee Swaroopamugaa
Nee Shwaasatho Nanu Srujiyinchithivi
Nee Mahimagaa Nenundutaku
Neethone Jeevinchutaku (2)
Andukegaa Nannilalo Srujiyinchithivi
Andukegaa Nannilalo Niyaminchithivi           ||Naa Thanuvu||

Garbha Vaasamuna Lenappude
Nanu Prathishtinchithivi
Nee Velugune Prakaashinchutaku
Nee Premane Panchutaku (2)
Andukegaa Nannilalo Prathishtinchithivi
Andukegaa Nannilalo Niyaminchithivi          ||Naa Thanuvu||

తనువు నా దిదిగో / Thanuvu Naa Didigo

తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి బ్రతిష్టించుమీ
దినములు క్షణములు – దీసికొని యవి నీదు
వినతిన్ ప్రవహింప జే – యను శక్తి నీయుమీ      ||తనువు||

ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై – పని చేయ జేతు లివిగో
యనయంబు నీ విషయ – మై సొగసుగా జురుకు
దనముతో పరుగెత్త – వినయ పాదము లివిగో      ||తనువు||

స్వర మిదిగో కొనుమీ – వరరాజ నిను గూర్చి – నిరతమ్ము పాడనిమ్ము
మరియు పెదవు లివిగో – మహనీయమైన నీ
పరిశుద్ధ వార్తతో – పరి పూర్ణముగా నింపు      ||తనువు||

వెండి పసిడి యివిగో – వీస మైనను నాకై – యుండవలె నని కోరను
నిండైన నీ యిష్ట – నియమంబు చొప్పున
మెండుగా వాడ పరి – మితియవు జ్ఞానం బిదిగో      ||తనువు||

నా యిష్ట మిదిగో యిది – నీ యిషముగ జేయ – నా యిష్ట మిక గాదది
నా యిఛ్చ యున్నట్టి – నా హృదయ మిదిగో నీ
కే యియ్యది రాజ – కీయ సింహాసనామౌ      ||తనువు||

ఉన్న నా ప్రేమ నీ – సన్నిధానమున నే – నెన్నడు ధార వోయన్
నన్ను నీ వానిగ – నాథా గైకొను మెపుడు
చెన్నుగ నీ వశమై – స్థిర ముగ నుండెద      ||తనువు||

Thanuvu Naa Didigo Gai – Konumee Yo Prabhuvaa Nee – Paniki Brathishtinchumee
Dinamulu Kshanamulu – deesikoni Yavi Needu
Vinathin Pravahimpa Je – Yanu Shakthi Neeyumee        ||Thanuvu||

Ghanamaina Nee Prema – Kaaranambuna Neekai – Pani Cheya Jethu Livigo
Yanayambu Nee Vishaya – Mai Sogasugaa Juruku
Danamutho Parugettha – Vinaya Paadamu Livigo           ||Thanuvu||

Swara Midigo Konumee – Vararaaja Ninu Goorchi – Nirathammu Paadanimmu
Mariyu Pedavu Livigo – Mahaneeyamaina Nee
Parishuddha Vaarthatho – Pari Poornamuga Nimpu           ||Thanuvu||

Vendi Pasidi Yivigo – veesa Mainanu Naakai – Yundavale Nani Koranu
Nindaina Nee Yishta – Niyamambu Choppuna
Menduga Vaada Pari – Mithiyau Gnaanam Bidigo           ||Thanuvu||

Naa Yishta Midigo Yidi – nee Yishamuga Jeya – Naa Yishta Mika Gaadadi
Naa Yichcha Yunnatti – Naa Hrudaya Midigo Nee
Ke Yiyyadi Raaja – Keeya Simaasanamou           ||Thanuvu||

Unna Naa Prema Nee – Sannidhaanamuna Ne – Nennadu Dhaara Voyan
Nannu Nee Vaaniga – Naathaa Gaikonu Mapudu
Chennuga Nee Vashamai – Sthira Muga Nundeda           ||Thanuvu||

కట్టెలపై నీ శరీరం / Kattelapai Nee Shareeram

కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ
మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి
ఎన్ని చేసినా తనువు నమ్మినా
కట్టె మిగిల్చింది కన్నీటి గాధ – (2)        ||కట్టెలపై||

దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను
తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2)
కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా
నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2)         ||ఎన్ని చేసినా||

ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు
అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2)
కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ
ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును (2)         ||ఎన్ని చేసినా||

Kattelapai Nee Shareeram Kanipinchadu Gantaku Mallee
Mattilona Pettina Ninne Gurthinchadu Nee Thalli
Enni Chesinaa Thanuvu Namminaa
Katte Migilchindi Kanneeti Gaadha – (2)         ||Kattelapai||

Devaadi Devude Thana Polika Neekichchenu
Thana Aasha Neelo Choosi Parithapinchipovaalani (2)
Kanna Thandrine Narachi Kaatikellipothaavaa
Nithya Jeevam Vidachi Narakamelli Pothaavaa (2)         ||Enni Chesinaa||

Aathma Neelo Untene Andaru Ninu Premisthaaru
Adi Kaastha Vellipothe Evariki Nee Avasaramundadu (2)
Kannavaare Unnanu Kattukunna Vaarunnanu
Evvarikee Kanipinchaka Nee Aathma Vellipovunu (2)         ||Enni Chesinaa||