దేవుని స్తుతియించి ఆరాధింతుము / Devuni Sthuthiyinchi Aaraadhinthumu

పాట రచయిత: మధు
Lyricist: Madhu

దేవుని స్తుతియించి ఆరాధింతుము
మన దేవుని ఆరాధించి ఆనందింతుము (2)
రండీ ఓ జనులారా
సర్వలోక నివాసులారా (2)
సంతోషగీతము పాడెదము (2)
ఆహా.. ఆరాధనా.. – హల్లెలూయా ఆరాధనా… (2)         ||దేవుని||

వేటకాని ఉరిలో నుండి ఆయనే నిన్ను విడిపించును
భారమైన నీ బాధలను ఆయనే ఇక తొలగించును (2)
ఏ తెగులు నీ ఇల్లు దరిచేరదు (2)
ఆయనే రక్షించును          ||రండీ ఓ||

బండ చీల్చి నీళ్ళను ఇచ్చి ఇశ్రాయేలీయులను కాచెను
నింగి నుంచి మన్నాను పంపి వారి ప్రాణము రక్షించెను (2)
శత్రువుల చెర నుంచి విడిపించెను (2)
తోడుండి నడిపించెను         ||రండీ ఓ||

మన విరోధి చేతిలోనుండి ఆయనే మనను తప్పించును
కష్టకాల ఆపదలన్ని ఆయనే ఇక కడతేర్చును (2)
వేదనలు శోధనలు ఎదిరించగా (2)
శక్తిని మనకిచ్చునూ        ||రండీ ఓ||

కన్నవారు ఆప్తులకంటే ఓర్పుగా మనను ప్రేమించును
భూమికంటే విస్తారముగా ప్రేమతో మనను దీవించును (2)
ఆ ప్రభువు రక్షకుడు తోడుండగా (2)
దిగులే మనకెందుకు     ||రండీ ఓ||

పాట రచయిత: మధు
Lyricist: Madhu

Devuni Sthuthiyinchi Aaraadhinthumu
Mana Devuni Aaraadhinchi Aanandinthumu (2)
Randee O janulaara
Sarvaloka Nivaasulaara (2)
Santhosha Geethamu Paadedamu (2)
Aahaa.. Aaraadhanaa – Hallelooyaa Aaraadhanaa (2)       ||Devuni||

Vetakaani Urilo Nundi Aayane Ninnu Vidipinchunu
Bhaaramaina Nee Baadhalanu Aayane Ika Tholaginchunu (2)
Ae Thegulu Nee Illu Dari Cheradu (2)
Aayane Rakshinchunu           ||Randee O||

Banda Cheelchi Neellanu Icchi Ishraayeleeyulanu Kaachenu
Ningi Nunchi Mannaanu Pampi Vaari Praanamu Rakshinchenu (2)
Shathruvula Chera Nunchi Vidipinchenu (2)
Thodundi Nadipinchenu          ||Randee O||

Mana Virodhi Chethilo Nundi Aayane Mananu Thappinchunu
Kashta Kaala Aapadalanni Aayane Ika Kada Therchunu (2)
Vedanalu Shodhanalu Edirinchagaa (2)
Shakthini Manakichchunu         ||Randee O||

Kanna Vaaru Aapthula Kante Orpugaa Mananu Preminchunu
Bhoomi Kante Visthaaramugaa Prematho Mananu Deevinchunu (2)
Aa Prabhuvu Rakshakudu Thodundagaa (2)
Digule Manakenduku          ||Randee O||

స్తుతియించి కీర్తించి / Sthuthiyinchi Keerthinchi

స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2)
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
నీవే నా జీవిత మకరందమయ్యా        ||స్తుతియించి||

గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన మార్గము చూపించినావా (2)
అనుదినము మన్నాను పంపి
ప్రజలను పోషించినావా (2)
నీ ప్రజలను పోషించినావా           ||స్తుతియించి||

అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు
సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2)
ప్రతి క్షణము నీవు తోడుగా నుండి
ప్రజలను రక్షించినావు (2)
నీ ప్రజలను రక్షించినావు           ||స్తుతియించి||

పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే (2)
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించు దేవా (2)
మము పరముకు నడిపించు దేవా         ||స్తుతియించి||

Sthuthiyinchi Keerthinchi Ghanaparathunu Naa Yesayyaa (2)
Neeve Naa Aaraadhana Yesayyaa
Neeve Naa Sthuthi Paathrudaa Naa Yesayyaa
Neeve Naa Aathmalo Aanandamayyaa
Neeve Naa Jeevitha Makarandamayyaa         ||Sthuthiyinchi||

Gaadaandhakaaramulona Velugai Nadipinchinaavaa
Agaadha Jalamulalona Maargamu Choopinchinaavaa (2)
Anudinamu Mannaanu Pampi
Prajalanu Poshinchinaavaa (2)
Nee Prajalanu Poshinchinaavaa          ||Sthuthiyinchi||

Agni Gundamu Nundi Neevu Vidipinchinaavu
Simhapu Noti Nundi Maranamu Thappinchinaavu (2)
Prathi Kshanamu Neevu Thoduga Nundi
Prajalanu Rakshinchinaavu (2)
Nee Prajalanu Rakshinchinaavu         ||Sthuthiyinchi||

Paapamulo Unna Maakai Rakthamu Chindinchinaave
Maranamulo Unna Maakai Siluvalo Maraninchinaave (2)
Anudinamu Maatho Neevundi
Mammu Nadipinchu Devaa (2)
Mamu Paramuku Nadipinchu Devaa           ||Sthuthiyinchi||